Showing posts with label సుబ్రహ్మణ్యుడు. Show all posts
Showing posts with label సుబ్రహ్మణ్యుడు. Show all posts

Thursday, 12 December 2013

Kukke Subramanya Temple Information

 కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య  - కర్ణాటక | KUKKE SUBRAMANYA TEMPLE INFORMATION 


శ్రీ మోహన్ గార్కి కృతజ్ఞతలు తెలియచేస్తూ .. ఆయన రాసిన పోస్ట్ ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను .. 


మా ఇలవేల్పు వల్లీదేవసేనాసమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహం వలన, పూజ్య గురువు గారి ఆశీస్సుల వలన, మేము సకుటుంబముగా కర్నాటకలోని కొన్ని ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలను దర్శించి, అమ్మ, అయ్యవార్ల మరియు జగద్గురువుల దర్శన, అనుగ్రహం పొంది వచ్చాము. ఈ సంతోషం అందరితో పంచుకోవాలని మరియు అమ్మవారు మాకు చూపించిన మేరకు ఈ క్షేత్రాల గురించి వ్రాస్తే మరెవరికైనా ఈ పుణ్యక్షేత్రాలు దర్శించేటప్పుడు ఉపయోగపడగలదని ఈ టపా వ్రాస్తున్నాను.

మొదటగా మేము బెంగళూరు నుండీ బయలుదేరి దర్శించిన క్షేత్రాలు వరుసగా....
౧. కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య
౨. ఉడిపి శ్రీ కృష్ణ మఠం
౩. కొల్లూరు మూకాంబికా క్షేత్రం
౪. శృంగేరీ శారదా మఠం
౫. హోర్నాడు శ్రీ అన్నపూర్ణేశ్వరీ క్షేత్రం
మొదటగా మేము కుక్కే శ్రీసుబ్రహ్మణ్య క్షేత్రం చేరుకున్నాము. ఆ ఊరు పేరే సుబ్రహ్మణ్య. ఈ క్షేత్రం బెంగళూరుకి సుమారు మూడు వందల కిలోమీటర్ల దూరంలో, దక్షిణకన్నడ జిల్లాలో ఉంది. తమిళనాడులో ఆరు సుబ్రహ్మహ్మణ్య క్షేత్రాలను కలిపి ఆరుపడైవీడు అని వ్యవహరిస్తారు, ఆ ఆరు క్షేత్రాలను స్వామి వారి ఆరు ముఖాలుగా చెప్తారు. అలాగే కర్ణాటకలో మూడు ప్రసిద్ధ సుబ్రహ్మణ క్షేత్రాలను విశేషంగా కొలుస్తారు.

మొదటిది ఆది సుబ్రహ్మణ్య - కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య
రెండవది మధ్య సుబ్రహ్మణ్య - ఘాటి సుబ్రహ్మణ్య (బెంగళూరుకి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది).
మూడవది అంత్య సుబ్రహ్మణ్య - నాగలమడక సుబ్రహ్మణ్య (ఇది అనంతపురం నుంచి డబ్భై కిలోమేటర్ల దూరం, కర్ణాటకలోకే వస్తుంది.)

ఈ మూడు క్షేత్రాలు, స్వామిని సర్ప రూపంలో చూస్తే ఆది, మధ్య, అంత్యములుగా చెప్తారు. చాలా చాలా శక్తివంతమైన క్షేత్రాలు.

కుక్కేలో స్వామి మొదట ఒక పుట్టగా మాత్రమే వెలిశారు. దానినే ఆది సుబ్రహ్మణ్య అని పిలుస్తారు. ఇక్కడ సర్పదోష నివారణ పూజలు చాలా అద్భుతంగా చేస్తారు. ఈ సర్పదోష నివారణ పూజ చేయించిన వారికి, కాలసర్పదోషము, ఇతఃపూర్వం పాములను చంపిన దోషము, నవగ్రహ దోషాలు శమింపబడి, స్వామి వారి కారుణ్యంతో సంతానము లేనివారికి సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఇక్కడ ఇచ్చే మూల ప్రసాదం (పుట్టమన్ను) చాలా చాలా శక్తివంతమైనది. ఇది నియమముతో నలభైరోజులు, రాత్రి పడుకునే ముందు, పాలతో మూలప్రసాదం తీసుకుంటే, ఎటువంటి దోషాలు లేకుండా, చక్కని చిన్ని సుబ్రహ్మణ్యుడో, చిన్ని కృష్ణుడో, బుజ్జి రుక్మిణి అమ్మో, సీతమ్మో సంతానంగా పుడతారు. ఇది నేను స్వయంగా పొందిన అనుభవం.
కుక్కేలో ఉన్న ప్రథాన ఆలయాలు -
౧. ఆది సుబ్రహ్మణ్య  - ఇక్కడ పుట్ట రూపములో ఉంటారు.
౨. కుక్కేసుబ్రహ్మణ్య - ఇక్కడ గర్భగుడిలో వాసుకి, ఆపైనా ఆదిశేషుడూ, ఆపైన సుబ్రహ్మణ్య స్వామి వారు కొలువై ఉంటారు. వాసుకిని రక్షించడం కోసం స్వామి ఇక్కడ వెలిశారు. వాసుకి, ఆదిశేష, సుబ్రహ్మణ్యులను కలిసి ఒకేసారి చూడడం పరమ అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవం. ఈ క్షేత్రంలో మరొక ప్రత్యేకత ఏమిటంటే, ఆలయానికి పశ్చిమాన ఉన్న ద్వారం నుండి ప్రవేశిస్తాము. ఆపైన ప్రదక్షిణ చేస్తూ తూర్పుద్వారం గుండా గర్భాలయంలోకి ప్రవేశిస్తాము. అక్కడ స్వామి వారి ఎదురుగా ఉన్న ధ్వజస్థంభాన్ని గరుడ స్థంభం అని పిలుస్తారు. అది వెండితో చేయబడి ఉంటుంది. ఈ స్థంభం యొక్క విశిష్టత ఏమిటంటే, వాసుకి, ఆదిశేషుల నుంచి వచ్చే శ్వాస వలన, భక్తులను రక్షించడం కొరకు ఈ ఈ గరుడ స్థంభం.  ఇదే ఆలయ ప్రాంగణములో ఉమామహేశ్వరులు (పరమశివుని వామాంకముపై కూర్చుని ఉన్న అమ్మవారు..), కుక్కేలింగము, కాలభైరవ స్వామి వారు, ప్రథాన గర్భాలయము ప్రక్కగా నరసింహస్వామి వారు కొలువై ఉంటారు. ఇదేక్షేత్రములో తూర్పుద్వారానికి పక్కగా, నాగప్రతిష్ట చేసే నాగేంద్ర స్వామి వారి సన్నిధి, దాని ప్రక్కనే శృంగేరీ పీఠం వారి అన్నదానం చేసే హాలు, ఇంకా ప్రదక్షిణదిశలో ముందుకి వెడితే, దక్షిణద్వారం దగ్గర కుక్కే సుబ్రహ్మణ్య గ్రామ దేవత "హోసలిగమ్మ" వారు కొలువై ఉంటారు.
కుక్కేశ్రీసుబ్రహ్మణ్య క్షేత్రములో ఉన్న మరొక ప్రథానమైనది, కుమారధార నది (తీర్థం). ఈ తీర్థం పరమపవిత్రమైనది. కుక్కేలోపలికి వెళ్ళేటప్పుడు మొదటగా ఈ కుమారధార దాటి వెడతాము. మేము కుక్కే చేరుకునే సరికి రాత్రి పది దాటిపోవడం వల్ల, ఆ మరుసటిరోజు ఉదయాన్నే మేము ఈ తీర్థ స్నానం చేశాము. చాలా ప్రశాంతముగా, స్వఛ్చముగా ఉంటుంది ఈ తీర్థం. లోతు అంతగా ఉండదు. ఇవి కాక, ఈ కుక్కేసుబ్రహ్మణ్యా గ్రామంలోకి వెళ్ళేటప్పుడు, కుమారధార దాటిన తర్వాత మొదట దర్శనమయ్యేది "అభయగణపతి స్వామి వారు". ఈ గణపతి ఈ క్షేత్రపాలకుడు. స్వామి చాలా చాలా బృహత్ స్వరూపంలో ఉంటారు. అభయగణపతి ఆలయం ప్రక్కనే వనదుర్గా అమ్మవారి సన్నిధి ఉంటుంది. ఇంకాస్త ముడుకి వెడితే, బస్టాండుకి దగ్గరలో కాశికట్టె గణపతి స్వామి వారి ఆలయం ఉంటుంది. ఈ స్వామి చాలా చిన్నగా ముద్దుగా ఉంటారు. ఈ కాశికట్టె గణపతిని నారాద మహర్షి ప్రతిష్ఠించారు. ఇదే ఆలయంలో "ముఖ్యప్రాణ దేవారు" సన్నిధి కూడా ఉంటుంది. ముఖ్యప్రాణ దేవారు అంటే ఎవరో అనుకున్నారా... సాక్షాత్తు పవనసుతుడు మన స్వామి శ్రీరామదూత, హనుమయే. స్వామిని కర్ణాటక క్షేత్రాలన్నిటిలోనూ అలా ముఖ్యప్రాణదేవారు అని వ్యవహరిస్తారు.
ఇక ఈ కుక్కే సుబ్రహ్మణ్యక్షేత్రంలో ఉండడానికి దేవస్థానం వారి కాటేజీలు ఉన్నాయి కానీ, అవి అంతగా బాగోలేదు. బయట అనేక ప్రైవేట్ హోటళ్ళు ఉన్నాయి. మేము SLR Residency  అనే హోటల్ లో ఉన్నాము. చాలా చక్కగా ఉంది. అది ప్రైవేట్ హోటలే అయినా ఎటువంటి అవైదిక వాతావరణమూ లేదు. రోజుకి 1000/- అద్దె.
ఇక భోజనం కొరకు, ఇక్కడ బ్రాహ్మణుల కోసం మధ్యాహ్నం పూట శృంగేరి వారి అన్నదాన సత్రం ఆలయం లోపలే ఉంది. ఇది గాక, అందరికీ ఆలయం ఎదురుగా మరొక అన్నదాన సత్రం ఉన్నది. ఇది దేవస్థానం వారిదే. కాకపోతే ఇక్కడ మధ్యాహ్నం, రాత్రి మాత్రమే ఉంటుంది. పొద్దున్న ఏ టిఫినో తినాలి అంటే, బయట దుకాణాలపై ఆధారపదవలసినదే.
ఈ క్షేత్రంలో సంతానం కోసం చేసే ప్రథానమైన సేవలు... సర్ప సంస్కార పూజ (అంటే సర్ప దోష నివారణ), నాగప్రతిష్ఠ, ఆశ్లేషబలి... పిల్లలు పుట్టాక అంగప్రదక్షిణ, తులాభారం.

మరిన్ని వివరాలకు ఈ క్రింది వెబ్ సైట్ చూడగలరు.
http://www.kukketemple.com/


సంగ్రహంగా కుక్కే శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్ర వివరాలు వ్రాశాను. మిగతా క్షేత్రాల గురించి వేరే టపాలో వ్రాయగలను.
సశేషం...
సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యార్పణమస్తు.

Temple Address
Kukke Shree Subrahmanya Temple
Subrahmanya
Sullia Taluk
Dakshina Kannada District
Pin -574 238
Phone: 
91-8257-281224
91-8257- 281423
91-8257-281700 (E.O)
91-8257-281300 (Sarpa Samskara Section)
Fax No:91-8257-281800


మీ కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తేలియచేయండి

Sunday, 1 December 2013

Biccavolu Temple Information

 శ్రీ గోలింగేశ్వర స్వామి ఆలయం - బిక్కవోలు | SRI GOLINGESWARA TEMPLE INFORMATION - EAST GODAVARI
ఈ గ్రామంలో తూర్పు చాళుక్యుల కాలానికి చెందిన అనేక మందిరాలున్నాయి. క్రీ.శ.849 - 892 మాద్యకాలంలో తూర్పు చాళుక్య రాజు 3వ గుణగ విజయాదిత్యుని పేరు మీద ఈ వూరికి ఆ పేరు వచ్చింది. వారి కాలంలో కట్టబడిన అనేక ఆలయాలలో శ్రీరాజరాజేశ్వరి ఆలయం మరియు శ్రీ చంద్రశేఖరస్వామి ఆలయం ముఖ్యమైనవి. ఇవి చక్కని శిల్పకళతో ఆలరారుతున్నవి.
సామర్లకోటకు 17కిలో మీటర్ల దూరంలో ఈ బిక్కవోలు గ్రామం ఉంది
 
భక్తుల కొంగుబంగారంగా ,ఆరాధ్య దైవంగా విశేష పూజలందుకుంటున్న బిక్కవోలు శ్రీ కుమార సుబ్రహ్మణ్యశ్వర స్వామి ఆలయాన్ని భక్తులు విశేష సంఖ్యలో దర్శించుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ది గాంచిన బిక్కవోలు ఆలయ చరిత్రపై కధనం. క్రీ.శ.8వ శతాబ్దంలో తూర్పు చాళుక్యులు పాలించిన రోజులలో గోదావరి తీరంలో అనేక దేవాలయాలు నిర్మించారు. చాళుక్యులలో గొప్పవాడైన విజయాదిత్యుని తండ్రి నరేంద్ర మృగరాజు 108 యుద్దాలు చేసి శత్రు, సైన్యాలను హతమార్చాడు.
యుద్దాలలో అనేక మందిని చంపడంతో పాపభీతితో 108 శివాలయాలను మృగరాజు నిర్మించాడు. బిక్కవోలు పరిసర ప్రాంతాలలో నిర్మించిన 108 శివాలయాల్లో కొన్ని తురుష్కుల దాడిలో ధ్వంసం కాగా మరికొన్ని శిధిలం అయ్యి నేలమట్టం అయ్యాయి. బిక్కవోలులో పురాతన దేవాలయాలు చాళుక్యుల చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచాయి. మూడు పురాతన దేవాలయాలు గ్రామ పరిసరాలలో వుండగా గ్రామ నడిబొడ్డులో కుమార సుబ్రహ్మణ్యశ్వర స్వామి, గోలింగేశ్వర స్వామి, చంద్రశేఖర స్వామి ఆలయాలు వున్నాయి.
గోలింగేశ్వర స్వామి ఆలయంలో గోలింగేశ్వరస్వామితో పాటు పార్వతీదేవి, సహజ సిద్దమైన పుట్టతో సుబ్రహ్మణ్యశ్వరుడు, వినాయకుడు, వీరభద్ర సహిత భద్రకాళి అమ్మవార్లతో మొత్తం శైవకుటుంబం అంతా ఒకేచోట కొలువై వున్నారు. ఆలయానికి సమీపంలో క్షేత్రపాలకుడైన విష్ణుమూర్తి, లక్ష్మీదేవిల ఆలయం కూడా ఉంది. తూర్పు చాళుక్యుల అనంతరం బిక్కవోలు పెద్దాపురం మహారాజుల అధీనంలోకి వచ్చింది. పెద్దాపురం మహారాజు శ్రీ సూర్యనారాయణ తిమ్మ గజపతి పాలనలో బిక్కవోలు ప్రాంతంలో గోవులు సహజ సిద్దమైన పుట్టలపై పాలు విడిచేవట.




అందుకే ఇక్కడ శివలింగాన్ని గోలింగేశ్వరస్వామిగా భక్తులు పిలుస్తారు. ఆలయంలో ఇప్పటికీ సహజ సిద్దమైన పుట్ట దర్శనమిస్తుంది. సంతానం లేని తిమ్మ గజపతి సంతానం కోసం సుబ్రహ్మణ్యశ్వరస్వామి ఆలయం నిర్మించి సంతానం పొందారట. అందుకే షష్ఠి రోజున సంతానార్దులైన స్త్రీలు పుట్టపై వుంచిన నాగులచీరను ధరించి ఆలయం వెనుక శయనిస్తారు. ఇలా శయనించడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుందని వారి నమ్మకం. 1100సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయాలైన వాటిపై శిల్పసంపద ఎంతో సుందరంగా ఉంటుంది. బిక్కవోలు ఆలయాల సందర్శనకు ఏడాది పొడువునా భక్తులు వస్తుంటారు. బిక్కవోలు హైస్కూలు వద్ద ఉన్న పురాతన వినాయకుని విగ్రహం ప్రత్యేక ఆకర్షణ. ఈ విగ్రహం 10 అడుగుల పొడవు, 6అడుగుల వెడల్పుతో ఎంతో సుందరంగా భక్తులను కనువిందు చేస్తుంది.
నేటికీ చెక్కు చెదరని చాళుక్యుల శిల్పకళా వైభవం
1100 ఏళ్ళ నాటి బిక్కవోలు ఆలయాలపై ఉన్న శిల్ప సంపద నేటికీ చెక్కు చెదరకుండా చాళుక్యుల శిల్పకళావైభవానికి సాక్ష్యాలుగా నిలిచాయి. గ్రామ పరిసరాలలో ఉన్న వీరభద్రుని గుడి, కంచర గుడి, నక్కల గుడులపై అప్పటి శిల్పులు ఎంతో నేర్పుతో శిల్పాలు చెక్కి నిర్మించారు. ఈ ఆలయాల నిర్మాణాలకు సిమ్మెంటు, ఇసుక వాడకుండా రాళ్ళను ఒకదానిపై ఒకటి పేర్చి నిర్మించడం విశేషం. తురుష్కుల దాడిలో చాలా ఆలయాలు ధ్వంసం నేలమట్టమయ్యాయి. అయితే గ్రామంలో అప్పడప్పుడు వీటి అవశేషాలు బయల్పడుతుంటాయి.
ఇటీవల ఒక శివలింగం, వర్దమాన వీరుని చిత్రంతో వున్న ఒక శిల బయల్పడ్డాయి.





శ్రీ లక్ష్మీగణపతి దేవాలయానికి సమీపంలోనే గోలింగేశ్వర స్వామి ఆలయం వుంది. ఇందులో శ్రీ సుబ్రహ్మన్యేశ్వర ఆలయంలో పుట్ట వున్నది. ఆ పుట్ట మన్నును భక్తులు మహిమగలదని స్వీకరిస్తారు.ఈ దేవాలయ ప్రాంతంలో పెద్ద సొరంగ మార్గం వుండేదనీ ఆ మార్గాన్ని అప్పటి బ్రిటిష్ పాలకులు "బిగ్ హోల్" అని పిలిచేవారనీ, ఆ ఆంగ్ల పదాన్ని స్థానిక ప్రజలు బిక్కవోల్ అని పలికేవారనీ , అప్పటి నుండి ఆ ప్రాంతం బిక్కవోలుగా పిలవబడుతున్నదనీ కొందరు చెబుతారు.
 
మీ కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తేలియచేయండి
http://www.prabhanews.com/
 

Tuesday, 26 November 2013

Thiruparankundram Temple Information

తిరుప్పరంకుండ్రం - ఆరుపడైవీడు - | Tiruparakundarm -  Arupadai Veedu - Subramanya Swamy Temple Information

Thiruparankundram - తిరుప్పరంకుండ్రం

 


శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు (ఆరుపడైవీడు) ప్రఖ్యాత క్షేత్రములలో రెండవది తిరుప్పరంకుండ్రం. ఈ క్షేత్రములో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఇంద్రుని కుమార్తె అయిన దేవయాని (దేవసేనా) అమ్మతో కళ్యాణం జరిగింది. ఈ క్షేత్రం తమిళనాడులో ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అయిన మధురై కి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఒక్క క్షేత్రంలోనే సుబ్రహ్మణ్య స్వామి వారు కూర్చుని దర్శనమిస్తారు. మిగతా అన్నిచోట్ల స్వామి నిలబడిన మూర్తినే చూస్తాం.


 మదురై అమ్మవారి గుడికి దగ్గర్లో బస్సు స్టాండ్ ఉంది . అక్కడ నుంచి బస్సు ద్వారా తిరుప్పరంకుండ్రం చేరుకోవచ్చు .పళముదిర్చోళై కి ఐతే బస్సు స్టాండ్ నుంచి డైరెక్ట్ గా బస్సు ఉంది . తిరుప్పరంకుండ్రం వెళ్ళడానికి డైరెక్ట్ బస్సు ఉన్నప్పటికీ టెంపుల్ దగ్గరకు వెళ్ళదు మీరు దిగి నడుచుకుని టెంపుల్ దగ్గరకు వెళ్ళవలసి ఉంటుంది .

ఇక్కడ నుంచి 1/2 కిమీ లోపే ఉంటుంది .

టెంపుల్ ని దూరం నుంచి చూస్తుంటేనే .. మనల్ని టెంపుల్ లోకి లాక్కుంటుంది .

ఆలయ గోపురం పై చెక్కిన శిల్పాలు అద్బుతంగా ఉంటుంది . 

 

మీరే చూడండి .. ఎంత చక్కగా ఉన్నాయో .. 




 ఈ ఆలయం లో మనకి దుర్గమ్మ వారు కూడా దర్శనం ఇస్తారు .

రండి స్వామి వార్ని దర్శనం చేస్కుందాం .. 





 ఇక్కడ స్వామికి అభిషేకం చేయరు, కేవలం ఆయన శక్తి శూలమునకు మాత్రమే అభిషేకం చేస్తారు.


తమిళనాడులోని ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలు  (అఱుపడై వీడుగళ్) ఉన్నాయి. 

1. తిరుచెందూర్ : Thiruchendur
2. తిరుప్పరంకుండ్రం : Tirupparankundram
3. పళముదిర్చొళై :
Pazhamudircholai
4. పళని :  Palani
5. స్వామిమలై : SwamiMalai

6. తిరుత్తణి : Tiruttani

మీ కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తేలియచేయండి

Wednesday, 23 October 2013

Palani Temple Information

పళని - తమిళనాడు   | Palani  Temple Information
 16-12-2012
తమిళనాడులోని ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలు  (అఱుపడై వీడుగళ్) ఉన్నాయి.
1. తిరుచెందూర్ : Thiruchendur
2. తిరుప్పరంకుండ్రం : Tirupparankundram
3. పళముదిర్చొళై :
Pazhamudircholai
4. పళని :  Palani
5. స్వామిమలై : SwamiMalai
6. తిరుత్తణి : Tiruttani

 మదురై రైల్వే స్టేషన్ నుంచి ఆరుపడైవీడు బస్సు స్టాండ్ కి బస్సు ఎక్కాలి .. రైల్వే స్టేషన్ నుంచి బస్సు లు ఉన్నాయి ..  
Palani Temple Information :
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో నాలుగవది పళని. ఈ క్షేత్రం తమిళనాడు లోని దిండిగల్ జిల్లాలో, మధురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రాలలో చాలా ప్రఖ్యాతి గాంచిన మహా మహిమాన్వితమైన దివ్య క్షేత్రం పళని. 

 

బస్సు స్టాండ్ లో దిగిన తరువాత స్వామి వారి కొండ దగ్గరకు 2కిమీ లు ఉంటుంది .. నాకు ఆ రోజు సరిగ తెలియలేదు ఎంత ఉంటుందో .. బస్సు స్టాండ్ లో దిగిన తరువాత కొండవైపుకి నడుచుకుంటూ వెళ్ళాను ..

 మనం బస్సు స్టాండ్ నుంచి కొండదగ్గరకు వెళ్ళే లోపు ఇక్కడ చాలానే టిఫిన్ సెంటర్స్ మనకు కనిపిస్తాయ్ .. మీరు గమనించినట్లైతే నేను టెంపుల్ కోసం రాసిన భోజనాలు కోసం రాయను . ఎందుకంటే ప్రతి టెంపుల్ చుట్టూ హోటల్స్ .. చాలానే ఉంటున్నాయ్ . 

మనం ఈ రోడ్ పై నడుచుకుంటూ ..పళని స్వామి వారి కొండను చూస్తూ .. వస్తున్నాం స్వామి అంటూ ముందుకు కదులుతాం .. 

ఈ ఫోటో చూడగానే ఎందుకు పోస్ట్ చేసానో అర్ధం అయింది కదా ...


 స్వామి వారి కొండపైకి మెట్లమార్గం కాకుండా .. కొండపైకి ట్రైన్ , రోప్ సౌకర్యం కూడా ఉంది .. సరే రోప్ కార్ ఎప్పుడు ఎక్కలేదు కదా అని నేను కూడా నడుచుకుంటూ వెళ్ళాను .... రండి మీరు కుడా .. :)
బోర్డు లను చూస్కుంటూ .....
ఎలా వెళ్ళాలి బాబు .. అని అడుగుతూ ... ఇదే రోడ్ అలానే వెళ్ళండి అని చెబుతూ ఉంటె .. నడుచుకుంటూ ..
 వీటిని చూడగానే సగం అలసట తీరింది .. బలే ఉన్నాయ్ అనుకున్నాను ...  మీకోసం ఫొటోస్ పెద్దవి మరీ చేశాను .. 
 ఎవరేవరికి ఏమి కావాలో తీస్కోండి ..  

 పిల్లలు పండగ చేస్కొండి .... 

అమ్మయ్య .. చాల దూరం నడిచి వచ్చాం కద.. అల పైన చూడండి .. వచ్చేసాం .. . ఇంకా కొద్ది దూరం నడిస్తే చాలు ..

 ఏం జరిగింది అంటే ... నేను వెళ్ళిన రోజు చాల జనం / భక్తులు ఉండటం చేతా .. భక్తులు 2 గంటలు వెయిట్ చేయాలి అని చెప్పారు .. నిజమేలే అంత దూరం నుంచి వచ్చి మెట్లు ఎక్కకుండా ఎలా రోప్ ల మీద స్వామి ని దర్శించడం ఏమిటి అని .. అంతా నా మంచికే అనుకుని వెనక్కి నడుచుకుంటూ ... 

 చూసారు గా బోర్డు మీ బ్యాగ్ లను ఇక్కడ వదలాలి అనుకుంటే వదిలేయండి .... లేదంటే తీస్కుని రండి .. 
స్వామి వారి మెట్లమార్గం దగ్గరకు మనం చేరుకున్నాం ...

చాల ఆనందంగా ఉంది కదా ..
స్వామి వారి వాహనానికి నమస్కారించి ..


మొదటి మెట్టుకు నమస్కరించి నడక ప్రారంభిద్దాం ...  కార్తికేయా .. స్వామినాధా .. 
రండి స్వామి వారని తలుచుకుంటూ .. మెట్లు ఎక్కుదాం ..
ఇంతకాలానికి నీ దయవల్ల వచ్చాం తండ్రి అంటూ ఎక్కుదాం .. 

ఇక్కడ మెట్లక్కడం సులువు గానే ఉంటుంది .. చూసారా మెట్ల మద్య దూరం ఎలా ఉందో  ..
కొండ క్రింద ప్లేస్ .... ఎలా ఉందొ .. రండి ఇంకా పైకి ఎక్కకా మల్లి చూద్దాం  ..

చెప్పాకదా  నడక ఈజీ గానే ఉంటుంది అని ..

స్వామి వస్తున్నాం స్వామి ...

మరొక ఫోటో ...
నడుస్తున్నారా కదా ..


వచ్చేసాం అప్పుడే పైకి .. ఇవే చివరి మెట్లు ...

సుబ్రహ్మణ్య .. తండ్రి .. శరవణభవ ... వచ్చేసాం తండ్రి .. లేదు లేదు నువ్వే రప్పించుకున్నావ్ .. తండ్రి . 




 నేను వెళ్ళిన రోజు సుబ్రమణ్య షష్టి ..  భక్తులు చాల ఎక్కువ మంది ఉన్నారు .. 
చూసారా లైన్ ఎంత పెద్దది ఉన్నదో ..

 మనకి తిరుమల లడ్డు ఎలా ప్రసిద్దో .. ఇక్కడ పళని పంచామృతం అలా అన్నమాట .. ఇక్కడ పంచామృతం ఎన్ని రోజులైనా చెడిపోదు .. మీరు నిల్వ ఉంటుందా లేదా అని ఆలోచించకుండా .. మీ బందువులకి .. స్నేహితులకి తీస్కుని వెళ్ళండి .. ప్రసాదం అనే మనం ఒక్కరు తినడానికి కాదు కదా ... ! 


 ఈ కొండపై నుంచి చూస్తే  .. మీకు కనిపిస్తుందా అక్కడ మరో టెంపుల్ ఏదో ఉన్నది అనుకుంటా .. అక్కడకు జనం ఎవరు వెళ్లినట్టు కనిపించలేదు నాకు .. 


ఇక్కడ స్వామి వారిని దండాయుధపాణి అనే నామంతో కొలుస్తారు. తమిళం వాళ్ళు ఈయనను “పళని మురుగా” అని కీర్తిస్తారు. ఈ క్షేత్రం చాలా పురాతనమైనది. స్వామి చేతిలో ఒక దండం పట్టుకుని, కౌపీన ధారియై, వ్యుప్త కేశుడై నిలబడి, చిరునవ్వులొలికిస్తూ ఉంటారు. అదే స్వరూపం భగవాన్ శ్రీ రమణ మహర్షిది. భగవాన్ రమణులు సుబ్రహ్మణ్య అవతారము అని పెద్దలు చెప్తారు. ఇక్కడ స్వామి వారు కేవలం కౌపీనంతో కనబడడంలో అంతరార్ధం “నన్ను చేరుకోవాలంటే అన్నీ వదిలేసి నన్ను చేరుకో” -  అని మనకి సందేశము ఇస్తున్నారు అని అర్ధం. అంటే ఈ పళని క్షేత్రము జ్ఞానము ఇచ్చే క్షేత్రము. అంతే కాదు ప్రఖ్యాత కావిడి ఉత్సవము మొదలయిన క్షేత్రము పళని. 

షణ్ముఖుడు,  స్కందుడు,  కార్తికేయుడు, వేలాయుధుడు, శరవణభవుడు, గాంగేయుడు, సేనాపతి, స్వామినాధుడు, సుబ్రహ్మణ్యుడు


 ఇక్కడ పళని మందిరంలోని గర్భ గుడిలోని స్వామి వారి మూర్తి నవపాషాణములతో చేయబడినది. ఇటువంటి స్వరూపం ప్రపంచములో మరెక్కడా లేదు. ఈ మూర్తిని సిద్ధ భోగార్ అనే మహర్షి చేశారు. తొమ్మిది రకాల విషపూరిత పదార్ధాలతో (వీటిని నవపాషాణములు అంటారు) చేశారు.
ఇప్పుడు ఉన్న మందిరం క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో కేరళ రాజు అయిన చీమన్ పెరుమాళ్ నిర్మించారు. ఆ తరువాత పాండ్యుల కాలంలో ఈ మందిరం ఇంకా అభివృద్ధి చేయబడింది. 



 దర్శనం చాల బాగా జరిగింది కదా .. రండి క్రిందకు దిగుదాం .. కొండ దిగి సమయం లో మనకు ఇవి కనిపిస్తాయి .. 

రాత్రి సమయం లో పళని ..



మరీంత సమాచారం కొరకు ఈ బ్లాగ్ చూడండి  : http://shaktiputram.blogspot.in/2011/09/blog-post_17.html
మీ కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తేలియచేయండి