Thiruparankundram - తిరుప్పరంకుండ్రం
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు (ఆరుపడైవీడు) ప్రఖ్యాత క్షేత్రములలో రెండవది తిరుప్పరంకుండ్రం. ఈ క్షేత్రములో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఇంద్రుని కుమార్తె అయిన దేవయాని (దేవసేనా) అమ్మతో కళ్యాణం జరిగింది. ఈ క్షేత్రం తమిళనాడులో ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అయిన మధురై కి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఒక్క క్షేత్రంలోనే సుబ్రహ్మణ్య స్వామి వారు కూర్చుని దర్శనమిస్తారు. మిగతా అన్నిచోట్ల స్వామి నిలబడిన మూర్తినే చూస్తాం.
మదురై అమ్మవారి గుడికి దగ్గర్లో బస్సు స్టాండ్ ఉంది . అక్కడ నుంచి బస్సు ద్వారా తిరుప్పరంకుండ్రం చేరుకోవచ్చు .పళముదిర్చోళై కి ఐతే బస్సు స్టాండ్ నుంచి డైరెక్ట్ గా బస్సు ఉంది . తిరుప్పరంకుండ్రం వెళ్ళడానికి డైరెక్ట్ బస్సు ఉన్నప్పటికీ టెంపుల్ దగ్గరకు వెళ్ళదు మీరు దిగి నడుచుకుని టెంపుల్ దగ్గరకు వెళ్ళవలసి ఉంటుంది . ఇక్కడ నుంచి 1/2 కిమీ లోపే ఉంటుంది .
టెంపుల్ ని దూరం నుంచి చూస్తుంటేనే .. మనల్ని టెంపుల్ లోకి లాక్కుంటుంది .ఆలయ గోపురం పై చెక్కిన శిల్పాలు అద్బుతంగా ఉంటుంది .
మీరే చూడండి .. ఎంత చక్కగా ఉన్నాయో ..
ఈ ఆలయం లో మనకి దుర్గమ్మ వారు కూడా దర్శనం ఇస్తారు .
రండి స్వామి వార్ని దర్శనం చేస్కుందాం ..
ఇక్కడ స్వామికి అభిషేకం చేయరు, కేవలం ఆయన శక్తి శూలమునకు మాత్రమే అభిషేకం చేస్తారు.
తమిళనాడులోని ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలు (అఱుపడై వీడుగళ్) ఉన్నాయి.
1. తిరుచెందూర్ : Thiruchendur
2. తిరుప్పరంకుండ్రం : Tirupparankundram
3. పళముదిర్చొళై : Pazhamudircholai
4. పళని : Palani
5. స్వామిమలై : SwamiMalai
6. తిరుత్తణి : Tiruttani
excellent information,we want to know thuthukudi subramanyeshwar temple...if u hv any information plz..................
ReplyDeleteGreat! thanks
ReplyDeletebehind this temple on top that mountain rock cut caves there that u must visit. plz take water bottle with u.
ReplyDelete