Wednesday, 23 October 2013

Palani Temple Information

పళని - తమిళనాడు   | Palani  Temple Information
 16-12-2012
తమిళనాడులోని ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలు  (అఱుపడై వీడుగళ్) ఉన్నాయి.
1. తిరుచెందూర్ : Thiruchendur
2. తిరుప్పరంకుండ్రం : Tirupparankundram
3. పళముదిర్చొళై :
Pazhamudircholai
4. పళని :  Palani
5. స్వామిమలై : SwamiMalai
6. తిరుత్తణి : Tiruttani

 మదురై రైల్వే స్టేషన్ నుంచి ఆరుపడైవీడు బస్సు స్టాండ్ కి బస్సు ఎక్కాలి .. రైల్వే స్టేషన్ నుంచి బస్సు లు ఉన్నాయి ..  
Palani Temple Information :
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో నాలుగవది పళని. ఈ క్షేత్రం తమిళనాడు లోని దిండిగల్ జిల్లాలో, మధురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రాలలో చాలా ప్రఖ్యాతి గాంచిన మహా మహిమాన్వితమైన దివ్య క్షేత్రం పళని. 

 

బస్సు స్టాండ్ లో దిగిన తరువాత స్వామి వారి కొండ దగ్గరకు 2కిమీ లు ఉంటుంది .. నాకు ఆ రోజు సరిగ తెలియలేదు ఎంత ఉంటుందో .. బస్సు స్టాండ్ లో దిగిన తరువాత కొండవైపుకి నడుచుకుంటూ వెళ్ళాను ..

 మనం బస్సు స్టాండ్ నుంచి కొండదగ్గరకు వెళ్ళే లోపు ఇక్కడ చాలానే టిఫిన్ సెంటర్స్ మనకు కనిపిస్తాయ్ .. మీరు గమనించినట్లైతే నేను టెంపుల్ కోసం రాసిన భోజనాలు కోసం రాయను . ఎందుకంటే ప్రతి టెంపుల్ చుట్టూ హోటల్స్ .. చాలానే ఉంటున్నాయ్ . 

మనం ఈ రోడ్ పై నడుచుకుంటూ ..పళని స్వామి వారి కొండను చూస్తూ .. వస్తున్నాం స్వామి అంటూ ముందుకు కదులుతాం .. 

ఈ ఫోటో చూడగానే ఎందుకు పోస్ట్ చేసానో అర్ధం అయింది కదా ...


 స్వామి వారి కొండపైకి మెట్లమార్గం కాకుండా .. కొండపైకి ట్రైన్ , రోప్ సౌకర్యం కూడా ఉంది .. సరే రోప్ కార్ ఎప్పుడు ఎక్కలేదు కదా అని నేను కూడా నడుచుకుంటూ వెళ్ళాను .... రండి మీరు కుడా .. :)
బోర్డు లను చూస్కుంటూ .....
ఎలా వెళ్ళాలి బాబు .. అని అడుగుతూ ... ఇదే రోడ్ అలానే వెళ్ళండి అని చెబుతూ ఉంటె .. నడుచుకుంటూ ..
 వీటిని చూడగానే సగం అలసట తీరింది .. బలే ఉన్నాయ్ అనుకున్నాను ...  మీకోసం ఫొటోస్ పెద్దవి మరీ చేశాను .. 
 ఎవరేవరికి ఏమి కావాలో తీస్కోండి ..  

 పిల్లలు పండగ చేస్కొండి .... 

అమ్మయ్య .. చాల దూరం నడిచి వచ్చాం కద.. అల పైన చూడండి .. వచ్చేసాం .. . ఇంకా కొద్ది దూరం నడిస్తే చాలు ..

 ఏం జరిగింది అంటే ... నేను వెళ్ళిన రోజు చాల జనం / భక్తులు ఉండటం చేతా .. భక్తులు 2 గంటలు వెయిట్ చేయాలి అని చెప్పారు .. నిజమేలే అంత దూరం నుంచి వచ్చి మెట్లు ఎక్కకుండా ఎలా రోప్ ల మీద స్వామి ని దర్శించడం ఏమిటి అని .. అంతా నా మంచికే అనుకుని వెనక్కి నడుచుకుంటూ ... 

 చూసారు గా బోర్డు మీ బ్యాగ్ లను ఇక్కడ వదలాలి అనుకుంటే వదిలేయండి .... లేదంటే తీస్కుని రండి .. 
స్వామి వారి మెట్లమార్గం దగ్గరకు మనం చేరుకున్నాం ...

చాల ఆనందంగా ఉంది కదా ..
స్వామి వారి వాహనానికి నమస్కారించి ..


మొదటి మెట్టుకు నమస్కరించి నడక ప్రారంభిద్దాం ...  కార్తికేయా .. స్వామినాధా .. 
రండి స్వామి వారని తలుచుకుంటూ .. మెట్లు ఎక్కుదాం ..
ఇంతకాలానికి నీ దయవల్ల వచ్చాం తండ్రి అంటూ ఎక్కుదాం .. 

ఇక్కడ మెట్లక్కడం సులువు గానే ఉంటుంది .. చూసారా మెట్ల మద్య దూరం ఎలా ఉందో  ..
కొండ క్రింద ప్లేస్ .... ఎలా ఉందొ .. రండి ఇంకా పైకి ఎక్కకా మల్లి చూద్దాం  ..

చెప్పాకదా  నడక ఈజీ గానే ఉంటుంది అని ..

స్వామి వస్తున్నాం స్వామి ...

మరొక ఫోటో ...
నడుస్తున్నారా కదా ..


వచ్చేసాం అప్పుడే పైకి .. ఇవే చివరి మెట్లు ...

సుబ్రహ్మణ్య .. తండ్రి .. శరవణభవ ... వచ్చేసాం తండ్రి .. లేదు లేదు నువ్వే రప్పించుకున్నావ్ .. తండ్రి . 




 నేను వెళ్ళిన రోజు సుబ్రమణ్య షష్టి ..  భక్తులు చాల ఎక్కువ మంది ఉన్నారు .. 
చూసారా లైన్ ఎంత పెద్దది ఉన్నదో ..

 మనకి తిరుమల లడ్డు ఎలా ప్రసిద్దో .. ఇక్కడ పళని పంచామృతం అలా అన్నమాట .. ఇక్కడ పంచామృతం ఎన్ని రోజులైనా చెడిపోదు .. మీరు నిల్వ ఉంటుందా లేదా అని ఆలోచించకుండా .. మీ బందువులకి .. స్నేహితులకి తీస్కుని వెళ్ళండి .. ప్రసాదం అనే మనం ఒక్కరు తినడానికి కాదు కదా ... ! 


 ఈ కొండపై నుంచి చూస్తే  .. మీకు కనిపిస్తుందా అక్కడ మరో టెంపుల్ ఏదో ఉన్నది అనుకుంటా .. అక్కడకు జనం ఎవరు వెళ్లినట్టు కనిపించలేదు నాకు .. 


ఇక్కడ స్వామి వారిని దండాయుధపాణి అనే నామంతో కొలుస్తారు. తమిళం వాళ్ళు ఈయనను “పళని మురుగా” అని కీర్తిస్తారు. ఈ క్షేత్రం చాలా పురాతనమైనది. స్వామి చేతిలో ఒక దండం పట్టుకుని, కౌపీన ధారియై, వ్యుప్త కేశుడై నిలబడి, చిరునవ్వులొలికిస్తూ ఉంటారు. అదే స్వరూపం భగవాన్ శ్రీ రమణ మహర్షిది. భగవాన్ రమణులు సుబ్రహ్మణ్య అవతారము అని పెద్దలు చెప్తారు. ఇక్కడ స్వామి వారు కేవలం కౌపీనంతో కనబడడంలో అంతరార్ధం “నన్ను చేరుకోవాలంటే అన్నీ వదిలేసి నన్ను చేరుకో” -  అని మనకి సందేశము ఇస్తున్నారు అని అర్ధం. అంటే ఈ పళని క్షేత్రము జ్ఞానము ఇచ్చే క్షేత్రము. అంతే కాదు ప్రఖ్యాత కావిడి ఉత్సవము మొదలయిన క్షేత్రము పళని. 

షణ్ముఖుడు,  స్కందుడు,  కార్తికేయుడు, వేలాయుధుడు, శరవణభవుడు, గాంగేయుడు, సేనాపతి, స్వామినాధుడు, సుబ్రహ్మణ్యుడు


 ఇక్కడ పళని మందిరంలోని గర్భ గుడిలోని స్వామి వారి మూర్తి నవపాషాణములతో చేయబడినది. ఇటువంటి స్వరూపం ప్రపంచములో మరెక్కడా లేదు. ఈ మూర్తిని సిద్ధ భోగార్ అనే మహర్షి చేశారు. తొమ్మిది రకాల విషపూరిత పదార్ధాలతో (వీటిని నవపాషాణములు అంటారు) చేశారు.
ఇప్పుడు ఉన్న మందిరం క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో కేరళ రాజు అయిన చీమన్ పెరుమాళ్ నిర్మించారు. ఆ తరువాత పాండ్యుల కాలంలో ఈ మందిరం ఇంకా అభివృద్ధి చేయబడింది. 



 దర్శనం చాల బాగా జరిగింది కదా .. రండి క్రిందకు దిగుదాం .. కొండ దిగి సమయం లో మనకు ఇవి కనిపిస్తాయి .. 

రాత్రి సమయం లో పళని ..



మరీంత సమాచారం కొరకు ఈ బ్లాగ్ చూడండి  : http://shaktiputram.blogspot.in/2011/09/blog-post_17.html
మీ కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తేలియచేయండి

1 comment:

  1. it is a cutom to see idumba temple at first then dandayuthapani koil. panchamrutham 1/2 kg 25RS.

    ReplyDelete