Wednesday, 21 August 2013

Annavaram Temple Information

శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి దేవాలయం 
( అన్నవరం ) - Annavaram Temple Information
 

తూర్పు గోదావరి జిల్లా శంఖవరం మండలో అన్నవరం  ఉంది . అన్నవరం కలకత్తా - మద్రాసు జాతీయ రహదారి పై రాజమండ్రి నుండి దాదాపుగా 70 కి.మీ, కాకినాడ కి 45 కి.మి. దూరంలో ఉంది. ఈ గ్రామంలోని అన్నవరం రైల్వే స్టేషన్ విశాఖపట్టణం-విజయవాడ రైలుమార్గంలో వస్తుంది.

బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురూ కొలువైన త్రిమూర్తి నిలయం అన్నవరం. ఈ ఆలయం రెండు అంతస్థులలో నిర్మింపబడింది. క్రింది భాగంలో యంత్రం, పై అంతస్థులో స్వామి విగ్రహాలు ఉన్నాయి. స్వామి విగ్రహం 4 మీటర్ల ఎత్తు ఉంది. క్రింద గర్భగుడి ఉన్న భాగాన్ని విష్ణు మూర్తి గా అర్చిస్తారు, మధ్యభాగంలో ఉన్నదానిని శివునిగా పూజిస్తారు. మూలవిరాట్టు అంతా ఏక విగ్రహంగా ఉండి త్రిమూర్తులుగా పూజింప బడడం ఇక్కడి విశేషం. త్రిపాద విభూతి నారాయణ ఉపనిషత్తులో వర్ణింపబడిన యంత్రం ఇక్కడ ఉన్నది. అలా త్రిమూర్తులు వెలసిన ఈ అరుదైన ఆలయానికి యుగాల చరిత్ర ఉందంటారు భక్తులు.







 శ్రీ సత్యనారాయణ స్వామివారిని ఈ క్రింది విధంగా స్తుతిస్తారు.

మూలతో బ్రహ్మరూపాయ
మధ్యతశ్చ మహేశ్వరం
అధతో విష్ణురూపాయ
త్ర్త్యెక్య రూపాయతేనమః



స్థలపురాణం:

పర్వతశ్రేష్ఠులలో ఒకడైన మేరు పర్వతం ఆయన భార్య మేనక శ్రీమహావిష్ణువు గురించి తపం ఆచరించి విష్ణువు అనుగ్రహంతో ఇద్దరు కొడుకులను పర్వతాలుగా పొందారు. వారు రత్నాకరుడు, భద్రుడు. వీరు పరమ విష్ణు భక్తులు. వారు హరిని తమ శిరస్సున దాల్చాలన్న కోరికతో తపస్సు చేసారు. వారి కోరిక మేరకు నారాయణుడు భద్రుని శిరస్సుపై (భద్రాచలం) వైకుంఠ రాముడిగానూ, రత్నాకరుడి (రత్న గిరి)పై సత్యనారాయణుడి గానూ అవతరించారు.








 దేవాలయ ప్రాశస్తి:

తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురంకి సమీపంలో గోరస గ్రామ ప్రభువు (గోర్సా, కిర్లంపూడి ఎస్టేట్స్) శ్రీ రాజా ఇనుగంటి వేంకటరామానారాయణం బహద్దరు రాజా ఐ.వి.రామనారాయణం వారి ఏలుబడిలో అరికెంపూడి దగ్గర అన్నవరం అనే గ్రామం ఉంది. అక్కడ ఈరంకి ప్రకాశరావు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన మహా భక్తుడు. ఒకనాడు శ్రీమహావిష్ణువు వీరికీ, శ్రీ రాజా ఇనుగంటి వేంకటరామానారాయణిం బహద్దరు వారికీ ఏక కాలంలో కలలో కనపడి "రాబోవు శ్రావణ శుక్ల విదియా మఖా నక్షత్రములో గురువారము నాడు రత్నగిరిపై వెలుయుచున్నాను. నీవు నన్ను శాస్త్రనియమానుసారము ప్రతిష్టించి సేవించుము" అని చెప్పి మాయమయ్యారు.

మరునాడు ఇరువురు కలసి, తమకు వచ్చిన కలను చెప్పుకొని, ఖరనామ సంవత్సర శ్రావణ శుక్ల పాడ్యమి నాటికే అందరు అన్నవరం చేరుకున్నారు. అక్కడ స్వామివారి కొరకు వెదుకుతుండగా ఒక అంకుడు చెట్టు కింద పొదలో స్వామి వారి పాదముల మీద సూర్యకిరణములు పడ్డాయి. వెంటనే వారు ఆ పొదను తొలగించి, స్వామి విగ్రహాన్ని రత్నగిరి కొండ పైకి తీసుకొని పోయి, కాశీ నుండి తెచ్చిన శ్రీమత్రిపాద్విభూతి మహావైకుంఠనారాయణ యంత్రాన్ని విష్ణుపంచాయతన పూర్వకంగా సాధారణ శకం 1891, ఆగష్టు 6 వ తేదీన (శాలివాహన శకం 1813) ప్రతిష్టించారు.

ప్రధాన ఆలయం రథాకారంలో ఉండి, నాలుగు దిక్కులలో నాలుగు చక్రాలతో ఉంటుంది. ప్రధాన ఆలయానికి ఎదురుగా కళ్యాణ మండపం ఉంటుంది. ఈ కళ్యాణ మండపం ఆధునిక నిర్మాణ చాతుర్యానికి ఒక మచ్చుతునక. వనదుర్గ ఆలయం, రామాలయాలు ప్రక్కన కనిపిస్తూ ఉంటాయి. ఆలయ రూపం, అగ్ని పురాణంలో చెప్పబడినట్లు, ప్రకృతిని తలపిస్తూ ఉండాలి.

పంచాయతనం ఉండటం చేత దానికి ప్రతీకగా ముందు గణపతి, శంకరుల చిహ్నములు గలవి, శూల శిఖరములతో ఉన్నవి అయిన రెండు చిన్న విమాన గోపురాలు, మధ్యగా ప్రధాన విమాన గోపురం, వెనుకగా ఆదిత్య దేవతా, అంబికా దేవతా ప్రతీకలగు చక్రశిఖరములు ఉన్న మరి రెండు విమాన గోపురాలూ ఉన్నాయి. ఒకే చోట ఇన్ని విధములైన భిన్న దేవతా చిహ్నాలు ఉండటం అపురూపం.

పంపా నది ఒడ్డున ఉన్న రత్నగిరి మీద ఈ ఆలయం సముద్ర మట్టానికి 300 అడుగుల ఎత్తులో ఉన్నది. ఈ గుడికి పాదచారులు చేరు కోవడానికి 460 మెట్లు ఉన్నాయి.

ప్రతీ ఏటా పదిలక్షల మంది భక్తులు అన్నవరంలో వ్రతమాచరిస్తారని అంచనా.











వీరత్వానికీ, సత్యానికీ ప్రతీకగా భావించే మీసాలరాముడి కల్యాణోత్సవాలను ఏటా వైశాఖ శుద్ధ ఏకాదశి నుంచి బహుళ పాడ్యమి వరకూ అంగరంగ వైభవంగా జరుపుతారు భక్తులు.

ఇక్కడి ఇంకో విశేషం ప్రసాదం. గోధుమరవ్వతో ఆలయ ప్రసాదశాలలో తయారయ్యే ప్రసాదానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. బయటి వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఆ రుచి మాత్రం రాదు.


Contact Information
For any information related to Annavaram devasthanam, please contact:
Phone Numbers of Different Sections
Sl. No.Name of the SectionPhone Number
1.Main Temple239104
2.Nitya Pooja239108
3.Varthams Section239111
4.Information Centre(PRO)239119
5.E Os Peshi 239130
6.Engineering Section Office 239136
7.Annadanam 239137
8.Central Reservation Office 239173
9.E.O.s Office239214
10.Executive Engineer Office 239260
11.AEO (Temple) 239311
12.Reception 239335
13.Free Dispensary (Down Hills) 239338
14.Toll Gate 239339
15.Assistant Executive Officer
Temples
239318
16.Assistant Executive Officer
Vrathams
239111
17.Assistant Executive Officer
Accommodations
239173
18.Assistant Executive Officer
Annadanam
239137
19.Executive Engineer
For Cottage Donation Scheme
238395
20.Superintendent
For V.I.P Reception (Guest Houses)
238163
21.Superintendent
For Central Reservation Office (Accommodation )
The Executive Officer
Sri.V.V.S.S. Devasthanam
Annavaram - 533406.
East Godavari District
Andhra Pradesh.
Phone : 08868-238121,238125,238163
Fax :08868-238124
E-mail :E-mail :eoannavaram@yahoo.co.in

How To Teach
By Road
  • There are frequent Express buses from Visakhapatnam ,Rajahmundry and Kakinada.

  • Devasthanam is running buses from Down hill to Up Hill

  • APSRTC BusesA.P.S.R.T.C runs Buses for every Half An Hour Via Annavaram from Rajahmundry to Visakhapatnam and vice versa.

    For Every 15 mintus buses are available from Tuni to Kakinada via Annavaram and surrounding Villages and vice versa.
Sri Satyanarayana swamivari Devasthanam is maintaining two different types of Darshan methods for the convenance of the piligrams to witness the deity.

  •   Sarva Darshanam                
  •   Seegradarshanam

Sarvadarshanam means 'Darshan for all'. Sarva darshanam is free and allowed between 6:00AM to 12:30PM and 1:00PM to 9:00PM.

Seegradarshanam means 'Darshan with less waiting time'. Piligrams who want to avail seegradarhan, have to purchase a ticket costing Rs. 25/- per head. One packet (100Gms) of bhogam prasadam will be provided for Seegradarshanam ticket. Timings for the seegradarshan is same as sarvadarshanam but allowed through a different queue.



Sri Swamivari / Ammavari Sevas
S.No Name of Seva Cost in Rs. Seva Time
1.Sri Swamy Suprabatha SevaRs.116/-03:30 AM
2.Sri Swamivari VrathamRs.125/-6:00 AM to 6:00 PM
3.Sri Swamivari Special VrathamRs.200/-6:00 AM to 6:00 PM
4.Sri Swamivari Vratham at DwajasthambhamRs.500/-6:00 AM to 6:00 PM
5.Sri Swamivari Visishta VrathamRs.1,116/-6:00 AM to 6:00 PM
6.Sri Swamivari Nitya KalyanamRs.750/-9:30 AM
7.Sri Swamivari Vratham After 'Pooja' prasadam send by postRs.150/-
8.Sri Sitaramula (Kshethra Palakulu) Pattabhishekam on the lunar star day of Punarvasu in Sri Swamivari TempleRs.116/-On Full Moon Day
9.Sri Swamivari Pavalimpu sevaRs.50/-02:00PM
10.Sri Swamivari Laksha Patri PoojaRs.2,500/-08:00AM
11.Sri Ammavari Laksha KunkumarchanaRs.2,500/-08:00AM
12.Sri Swamivari Abhishekam on the lunar star day of MakhaRs.1,116/-One Day Only




Sri Swami Vari Nitya Kalyanam
Seva Description Persons Allowed Prasadam / Gifts Ticket Cost
Kalyanam 2 Prasadam 1kg, Bangi Prasadam 300gms,Pulihora 400gms, Dovathy,Khanduva,Saree,Blouse Rs.750.00
మీ కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తేలియచేయండి

Wednesday, 14 August 2013

Kotilingeshwara Temple Information

 Kotilingeshwara Temple -
kolar district, kammasandra village








Kotilingala kshetram
Location:kolar district, kammasandra village
Karnataka








About the place:

ikkada koti lingalu pratishtancha paddai
Andulo modati lingam manjunatha swamy lingam..
Ikkada adi pedda lingam undi
108 feet..dani edurugu pedda nandi..madyalo aneka lingalu..chudadaniki 1000 kallu saripov..
Manjunatha swamy ni darsinchukodaaniki munde manam brahma vishnu maheswarulanu darsinchukuntam..brahma devudiki gudi undadu ganaka vani devi darsanam istaru
Atarvata srimaha vishnuvu parvati parameswarulu darsanam istaru
Ikkada annapurna devi kuda chala famous. .prati roju annapurna devi vachi biyyam to abhishekam chestaru..inkaa pancha mukhi vinayakudu, pancha mukhi anjanya swamy varu, santhoshi mata kuda darsanam istaru..





The Lord Kotilingeshwara Temple is situated in Kammasandra Village in Kolar district, Karnataka State. The temple is about 6 km from Kolar Gold Fields also known as KGF. The main deity of this temple is Lord Kotilingeshwara. This Temple was constructed by Swamy Sambha Shiva Murthy which is open to public from early morning till 9.30 p.m.




 Kotilingeshwara Temple Route Map :
;
@ Deepthi avasarala
మీ కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తేలియచేయండి

Thursday, 8 August 2013

Ghati Subramanya Temple Information

Ghati Subramanya Swamy temple

Bangalore నుంచి dodballpur వెళ్తే  అక్కడ నుంచి 8 KM దూరం ఉంటుంది .


ఇక్కడ విశేషం ఏమిటంటే సుబ్రహ్మణ్య స్వామి కి 10 తలలు ఉంటాయి . 


సుబ్రహ్మణ్య స్వామి వీపుపై నరసింహ స్వామి ఉంటారు .  
  
సుబ్రహ్మణ్య స్వామి వీపు మనకు కనిపించదు కాబట్టి . మనకు నరసింహ స్వామి దర్శనం అయ్యే విధంగా సుబ్రహ్మణ్య స్వామి వీపు వెనకాల పెద్ద అద్దం ఉంచుతారు . స్వామి వారు మనకు  అద్దం లోంచి దర్శనం ఇస్తారు . 



ఈ ప్రదేశం లో భక్తులు ప్రతిరోజూ తమ మొక్కుబడులను తీర్చుకుంటారు . సాయంత్ర సమయం లో రోజు స్వామి వారు వస్తారు అని చెప్తారు 

-- దీప్తి అవసరాల  
మీ కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తేలియచేయండి

Saturday, 3 August 2013

Kapila Theertham Temple Information



శ్రీనివాస గోవిందా | శ్రీ వెంకటేశా గోవిందా | భక్త వత్సల గోవిందా | భాగవతా ప్రియ గోవిందా | నిత్య నిర్మల గోవిందా | నీలమేఘ శ్యామ గోవిందా | గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

కపిల తీర్థం:
7-4-2013 


తిరుమల కొండల్లోని ఔషధ వృక్షాల నడుమ ప్రవహిస్తూ వచ్చి కపిల తీర్థం దగ్గర కొండ మీద నుంచి పుష్కరిణిలోకి జాలువారుతుంది నీరు. ఈ నీటిలో స్నానాలు చేస్తే సర్వరోగాలు నశిస్తాయని నమ్మకం .

స్థలపురాణం:

వెంకటాచలం క్షేత్రంలో సుమారు 15 పుణ్యక్షేత్రాలున్నాయి. ఇందులో ప్రధానమైనది కపిల తీర్థం. ఇక్కడ శివలింగం పాతాళం నుంచి పెరుగుతూ భూమిని చీల్చుకుని పైకి వచ్చింది. దీనిని గుర్తించిన మునీశ్వరులు ఇక్కడ తపస్సు చేశారు. మహావిష్ణువు దానిని పెరగకుండా నిరోధించాడు. కపిల మహర్షి ఈ శివలింగాన్ని తొలిగా పూజించాడు. మహాలింగంతోపాటు పాతాళలోకంలోని భోగవతి గంగ కూడా భూమి మీదకు ఉబికింది. పుష్కరిణిగా మారింది. అదే కపిల తీర్థం.




ఎలా వెళ్ళాలి ?

తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి మూడు కిలోమీటర్లు ఉంటుంది. బస్టాండ్ నుంచి మూడున్నర కిలోమీటర్లు. అన్ని రోజుల్లోనూ ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఏడు వరకు అనుమతిస్తారు. కార్తీకమాసం, ముఖ్యంగా పౌర్ణమి రోజు భక్తులు ఎక్కువగా వస్తారు.

దేవస్ఠానం  వారి ఉచిత బస్ శ్రీనివాసం, కపిల తీర్థం, అలిపిరి మరియు శ్రీనివాస మంగాపురం మీదగ శ్రీవారి మెట్టు వెళ్తుంది.    కపిల తీర్థం    మరియు శ్రీనివాస మంగాపురం వెళ్ళి దర్సనం చేసుకొందాం అనుకొంటే బస్ దిగి దర్సనం చేసుకొని తర్వాత వచ్చే బస్ లో    శ్రీవారి మెట్టు వెళ్ళవచ్చు. 




www.templeinformation.in
తిరుమల లో అంగప్రదిక్షణ :
వేంకటేశ్వరునికి సుప్రబాత సేవ అయిన తరువాత భక్తులను అంగప్రదిక్షణకు అనుమతినిస్తారు .స్వామి వారి సన్నిదిలో అంగప్రదిక్షణ చేయడం అంటే మాటలా .. అనుభూతిని ఎలా వర్ణిస్తాం .
1. తిరుమల కొండపైన (తిరుమల అంటేనే స్వామి వారి కొండ .. తిరుపతి అంటే క్రింద ఉన్న ఉరు ) ఉన్న C.R.O ఆఫీసు కు ఎదురుగా ఉన్న బిల్డింగ్ లో మధ్యాహ్నం 2 గంటల నుంచి అంగప్రదిక్షణ టికెట్స్ ఇస్తారు .
2. అంగప్రదిక్షణ టికెట్స్ ముందుగ వచ్చిన 700 మందికి మాత్రమే ఇస్తారు . అంగప్రదిక్షణ స్త్రీలు , పురుషులు ఇద్దరు చేయవచ్చు . మరీ చిన్నపిల్లలకి టికెట్స్ ఇవ్వరనుకుంట .
3. 1.30 లోపు సుఫదం దగ్గరకు మీరు రవాలని మీకు ఇచ్చిన టికెట్ మీద ఉంటుంది . మీరు 1am లోపే అక్కడ ఉండండి .
4. స్వామి వారి పుష్కరిణి లో స్నానం చేసి తడిబట్టలతోనే సుపధం దగ్గరకు వెళ్ళాలి ( సుపధం అంటే స్వామి వారి గుడి కుడివైపు న ఉంటుంది . అక్కడ ఎవరైనా చెబుతారు .
5. అంగప్రదిక్షణ టికెట్స్ ఉచితంగానే ఇస్తారు . మీరు టికట్ కి మధ్యాహ్నం 12 గంటలకు నిలబడితే మీకు టికెట్ దొరికే ఛాన్స్ ఉంది .
6. అంగప్రదిక్షణ చేసినవాళ్ళకి ఒక లడ్డు ఇస్తారు ( 10/-) . మీరు డబ్బులు కూడా తీస్కుని వెళ్ళండి .
7. దర్శనం చాల త్వరగా అవుతుంది . అంగప్రదిక్షణ అయినతరువాత మీకు స్వామి వారి దర్శనం కూడా ఉంటుంది .
8. అంగప్రదిక్షణ చేసేటప్పుడు సాంప్రదాయ దుస్తులు ఉంటే మంచిది . మామోలు ప్యాంట్ కూడా అనుమతినిస్తున్నారు . బనియన్ ఉంచుకోకూడదు . ముందుగా స్త్రీలను తరువాత పురుషులను అంగప్రదిక్షణ చేయిస్తారు .
9.స్వామి వారి దర్శనం అయ్యాక మనం బంగారు బావి దగ్గరకు వస్తాం కదా అక్కడనుంచి స్వామి వారి హుండీ వరకు అంగప్రదిక్షణ చేస్తాం .
మీ కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తేలియచేయండి

Thursday, 1 August 2013

Bhadrachalam Temple Information

 భద్రాచలం ( శ్రీరామ దివ్యక్షేత్రం)
 భద్రాచలం - ఖమ్మం జిల్లా - ఆంధ్ర ప్రదేశ్ Bhadrachalam - Andhrapradesh
 
భద్రాచలం ( శ్రీరామ దివ్యక్షేత్రం) ఆంధ్ర ప్రదేశ్, ఖమ్మం జిల్లాలో, గోదావరి నది దక్షిణ తీరమున ఉన్న ఒక పట్టణం

దేవాలయ ప్రత్యేకతలు
• శ్రీరాముని దేవాలయాలలో ఉండే శ్రీరాముని విగ్రహం రెండు చేతులతో మానవుని రూపం పోలి ఉంటుంది. కాని భద్రాచలం దేవాలయంలో ఉండే శ్రీరాముని విగ్రహం నాలుగు చేతులతో శ్రీరామునిలా కుడి చేతిలో బాణంను ఎడమ చేతిలో విల్లును ధరించి అలాగే విష్ణువు మాదిరిగా కుడిచేతిలో శంఖును ఎడమచేతిలో చక్రంను ధరించి ఉంటుంది.
• ఇతర దేవాలయములలో సీతమ్మవారు రాముని ప్రక్కన నిల్చుని ఉంటుంది. కాని ఈ దేవాలయములో స్వామి ఎడమ తొడపై ఆసీనయై ఉంటుంది. మిగిలిన దేవాలయాలలో ఇరువురకూ రెండు పీఠాలు ఉంటాయి ఇక్కడ ఒకే పీఠం ఉంటుంది.
• అన్ని దేవాలయాలలో లక్ష్మణుడు రామునికి కుడివైపున ఉంటాడు కాని ఇక్కడ మాత్రం ఎడమపైపున ఉంటాడు.






రవాణా సౌకర్యాలు

మండలకేంద్రమైన భద్రాచలం ప్రముఖ యాత్రాస్థలం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో రోడ్డు రవాణా సౌకర్యం బాగా ఉంది. హైదరాబాదు నుండి ఖమ్మం, కొత్తగూడెం మీదుగా, విజయవాడ నుండి కొత్తగూడెం మీదుగా, రాజమండ్రి నుండి మోతుగూడెం మీదుగా, విశాఖపట్నం నుండి సీలేరు, చింతపల్లి మీదుగా, వరంగల్లు నుండి ఏటూరు నాగారం మీదుగా రోడ్డు మార్గాలు, బస్సు సౌకర్యాలు ఉన్నాయి.

గోదావరి నది పక్కనే భద్రాచలం ఉండడంతో రాజమండ్రి నుండి ప్రతిరోజూ లాంచీ ద్వారా రాకపోకలు సాగుతూ ఉంటాయి. ఈ మార్గంలోనే పాపికొండలు కానవస్తాయి. భద్రాచలం కేంద్రంగా జరిగే విహారయాత్రల్లో ఈ జలమార్గం ప్రముఖమైనది.

వృద్ధులు, వికలాంగులు, నడవలేని వారు భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి ఆలయం చేరటానికి లిఫ్ట్‌ సౌకర్యం కలదు దక్షిణం వైపు మెట్ల నుంచి ఈ లిఫ్ట్‌ ఆలయ గాలిగోపురం ముందుకు చేరుస్తుంది.
వసతి కావాలనుకొంటే CRO కార్యాలయంలో సంప్రదించవచ్చు. CRO కార్యాలయంలో ఆలయం ప్రవేశ మార్గం నుంచి ఆలయానికి  వెళ్ళే దారిలో వస్తుంది. ఉచిత వసతి సదుపాయం కూడా CRO కార్యాలయంలో లోపల ఉంది. లాకర్ సౌకర్యం కూడా యిక్కడే ఉంది.లాకర్ సౌకర్యం ఉపయోగించుకోవటానికి 5/- రూపాయలు చెల్లించాలి. 200/- రూపాయలు కాషన్ డిపాజిట్ చెల్లించాలి. ఒకసారి లాకర్ తీసుకొంటే 12 గంటలు ఉపయోగించుకోవచ్చు. 
గోదావరిలో స్నానం  ఆచరించటానికి స్నాఘట్టాలు ఉన్నాయి.
 
 
రాజమండ్రి నుండి భధ్రాచలం మామూలు లాంఛీ అయితే Rs.350, AC అయితే Rs.600 దాకా ఉండవచ్చు అంటున్నారు. కాకపోతే శని, ఆదివారాలు మాత్రమే ఉంటాయంట. అదే, భధ్రాచలం నుండి (కూనవరం దగ్గర బయలుదేరతాయి మామూలుగా అయితే, ఇప్పుడు ఇంకా ఎక్కువ దూరం నుండి బయలుదేరతాయి) పాపికొండలు దాకా అయితే రోజూ ఉంటాయి. వర్షాకాలం బాగుంటుంది.
Rama Darshan
The day begins at the temple with "Prabhadhotsavam" or awakening ceremony at 4.30 AM with specially composed songs of Tumu Narasimhadas, poems, Sannai Trupets Naubat etc. Abhishekam will be performed at 7.00 AM to Lord Rama on Sundays and all the remaining days abhishekams will be performed at Badruni Sannithi on the same time.

Note: All saswatha pujas are for a period of 10 years only. For further information, please call Temple Superintendent at +91-08743-232465 or +91-8985-891-929.

Seva Details
Time
Seva description
Price (INR)
6.00 AM to 7.00 A.M Antaralaya Abhishekam (Mulavarulu on Sundays) 500.00
7.00 AM to 8.00 A.M Abhishekam (at Bhadra Temple) Daily 50.00
8.30 A.M to 8.00 P.M Kesavanaamaarchana 60.00
8.30 A.M to 9.30 A.M Sahasranamarchana 100.00
8.30 A.M to 9.30 A.M Suvarna Tulasi Astotharanamarchana (on every Saturday) 350.00
8.30 A.M to 9.30 A.M Suvarna Pushpa Astothara Namarchana (on Every Sunday) 350.00
8.30 AM Sakalbhishtaprada Sree Ramapuja (daily) 116.00
9.30 A.M to 11.00 A.M Nitya Kalyana Ubhayam (Daily, except during Pavitrotsavams,Brahmotsavams and Vykunta Ekadasi) 1000.00
From 6.30 PM Rajata Ratha Seva 1116.00
8.00 PM to 8.30 P.M Alaya Chuttu Seva 250.00
8.00 PM to 8.30 P.M Vahana Seva (Garuda, Hamsa, Hanumantha, Rajadhiraja) 516.00
Saswatha Pujas
Seva Price (INR)
Srimadramayana Parayana (Sarannavaratri Mahotsvam 9 Days) 7500.00
Saswatha Alankarm (Vaikunta Ekadasi Days) each Ubhyam 7500.00
Saswatha Nitya Kalyanam 10000.00
Saswatha Vahana Seva (Garuda, Hamsa, Aswa, Suryaprabha and for each seva) 5100.00
Saswatha Pattabbhishekam (on Pushyami Nakshtram day only) 2500.00
Saswatha Bhogam 1116.00
Saswatha Sahasra Namarchana (Utsavamurthulu) 1000.00
Saswatha Abhishekam (at Bhadra Temple) 500.00
Saswatha Laksha Kumkumarchana on Ekadasi Day 2500.00
Saswatha Alankara ubhayam rusum in Sarannavaratri Mahothsavams (each ubhayam) 7500.00
Saswatha Uchita Prasada Vitarana 1116.00
 
భద్రాచలం ఇన్ఫర్మేషన్ :
Contact Executive Officer:
Sree Seetha Ramachandra Swamy Vaari
Devasthanam,
Bhadrachalam-507 111, Dist. Khammam,
Andhra Pradesh, India

Email: eo_bhadrachalam@yahoo.co.in

Assistant EO Cell: 9866-770-473

General Temple Information:
08743-232465

Accommodation (Central Reception Office):
08743-232467

Annadaanam Information: 8801-650-620

దగ్గరలో ఉన్న పర్యాటక స్థలాలు :

  • కిన్నెరసాని: భద్రాచలం పట్టణం నుండి 32కి.మీ.ల దూరంలోని కిన్నెరసాని నదిపై ఒక డ్యాము, జింకల పార్కు ఉన్నవి
  • పర్ణశాల: వనవాస సమయంలో శ్రీరాముడు ఇక్కడ ఉన్నాడని, ఇక్కడి నుండే సీతను రావణుడు అపహరించాడని స్థానిక కథనం.





పర్ణశాల భద్రాచలం నుండి 32 కి.మీ.లు కలదు. ఈ గ్రామం దుమ్ముగూడెం మండలమ్ కిందకు వస్తుంది. రోడ్ లేదా బోటు లో ఇక్కడకు చేరవచ్చు. తన 14 సంవత్సారాల వనవాస కాలం లో రాముడు తన భార్య సీతా మరియు సోదరుడు లక్ష్మణుడు తో కలిసి ఈ ప్రదేశం లో కొంత కాలం నివసించాడు. ఇక్కడ రాముడు ఒక గుడిసె ని నిర్మించాడు.
ఈ ప్రదేశానికి సమీపంగా ఒక ప్రవాహం కలదు. సీతా మాత ఈ ప్రవాహం లో స్నానాలు చేసి తన దుస్తులు సుభ్ర పరుచుకున్న దని చెపుతారు. ఇప్పటికి ఇక్కడ కొన్ని ఆధారాలు చూపుతారు.

  • పాపి కొండలు: సుందరమైన గోదావరి నది, కొండలు, ఆహ్లాదకరమైన వాతావరణము. భద్రాచలం నుంచి పడవలో ఇక్కడికి వెళ్ళే సౌకర్యం ఉంది
మొదట్లో ఈ పర్వతశ్రేణులను పాపిడి కొండలు అనేవారు, అంటే తెలుగులో విభజన అని అర్ధం. ఈ శ్రేణులు గోదావరి
నదిలో కల్గించే విభజన వలన ఈ పేరును కల్గి ఉన్నాయి. పై నుండి వీటిని చూసినప్పుడు ఒక స్త్రీ తన జుట్టును విభజించే విధంగా ఉండటమే ఈ శ్రేణులకు ఆ పేరు రావడానికి కారణమని కొంత మంది ప్రజలు నమ్ముతారు.



పాపి కొండలు యాత్రకి హైదరాబాద్ నుండి కూడా బుక్ చేసుకో వచ్చు.  మీరు AP Tourism Office Tank Bund/Lumbini Park వద్ద ఉన్నది.    వారిని సంప్రదిస్తే వారు అడ్వాన్సు లాంచీ రిజర్వేషన్ చేస్తారు.  వారి లాంచీ లు చాలా నీట్ గా ఉంటయ్యి.  లాంచీలు బయలు దేరే సమయాలు కూడా వాళ్ళు చెపుతారు.   అవి 8-30am నుండి ఉంటయ్యి




 

Travel-RTC timings
Bhadrachalam is reachable from all major cities in Andhra Pradesh, and other states. Via with (Khammam, Vijayawada, Hyderabad,Hanumakonda, Rajahmundry) regular buses plying in that route.
Transport information:
Departure from Timings Distance in KMS Fare in Rupees (INR)
Tirupathi 14.45 606 242.00
Basara 08.30 472 189.00
Vemulavada 04.15 324 130.00
Srisailam  04.30 472 189.00
Hanumakonda 04.00 onwards every 1 hr. Last bus-22.30 220 088.00
Hyderabad 03.15, 05.00, 06.30, 08.00, 09.00, 10.45, 09.30, 21.00, 22.30, {21.00 from NZB} 316 165.00 for Hitech 126.00 for Express 139.00 for Luxury
Vijayawada 04.00 onwards every 1 hr. Last bus-22.30 184 075.00
Rajahmundry 06.30, 07.30, 08.30, 14.45, 17.45, 20.00 239, 190 (via Kukkunoor) 096.00, 067.00 (via Kukkunoor)
Vishakapatnam (Via Seleru) 05.30, 18.30 370 148.00
Vijayanagaram 08.30, 05.30 422 169.00
Amalapuram 20.00 309 124.00
Rajolu 07.00 327 131.00
Eluru 07.30, 15.00, 22.00 190 086.00
మీ కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తేలియచేయండి