నేను కాకినాడ లో ఉద్యోగం చేస్తున్నప్పుడు మొట్టమొదటి సరిగా సర్పవరం దగ్గర ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి గుడికి వెళ్లాను స్వామి వార్ని చూసిన తరువాత స్వామి ని చూడ్డం దేవుణ్ణి మొదటసారిగా చూసినట్లు అనిపించింది. చిన్నప్పటి నుంచి తిరుపతికి మొక్కుకోవడం అంటే భయం నాకు ..తిరుపతి వేల్లగలనో లేదో అనే భయం అది . దేవుడు పై భక్తీ శ్రద్దలు అలాంటివి ఏమి లేవు ... నచ్చినప్పుడు గుడికి వెళ్ళడం . చాల రోజులు అయింది దేవుణ్ణి చూసి అనిపించినప్పుడు ఒకసారి దేవుణ్ణి చూసి రావడం అంతే. నిజానికి దేవుణ్ణి నేను నా చిన్నపుడే చూసాను .. ఏప్పుడు అనుకుంటున్నారా ..
నా చిన్నప్పుడే నేను శ్రీరామచంద్రుల పాదముద్రను చూసే అదృష్టం కలిగింది . నేను ఆరవ తరగతిలో ఉండగా జరిగిన శ్రీరామా నవమి నాటి మరోసటి రోజు ఆలయం లో నవమి రాత్రి రాముల వారి దగ్గర ఏర్పాటుచేసిన ఏర్పాట్లు ( ఏమని పిలుస్తారో తెలియదు) . ఒక వస్త్రం పై (మైదాపిండే అనుకుంటా ) పిండి మొత్తం చక్కగా సర్దారు . మరోక వస్త్రం రాముల వారని , సీతమ్మ తల్లిని కొద్దిగా దూరంగా ఎదురేదురగా ఉంచారు . మరోసటి రోజు ఉదయానికి ఒక వస్త్రం పై మన మోచెయ్యి అంత శ్రీ రాముల వారి పాదం ఉంది . మరొక వస్త్రం పై రాములు వారు సీతమ్మ ఆడుకున్నట్టు చిన్న గుర్తులు కనిపించాయి . నేను అనుమంతో నిజంగా రాముల వారి పదమేనా అనే డౌట్ గా కొలిచి మరిచుసాను.. బాబోయ్ ఇంత పాదం ఎవరకి ఉండదు . నిజంగా మా రాముల వారిదే ఇది అని అప్పుడే నమ్మాను . ఎప్పుడన్నా దేవుడు లేడు అని ఆలోచన వచ్చినప్పుడు ఆ రోజు దేవుడి పాదాలను చూసావ్ కదరా అని గుర్తుకు తెచ్చుకుంటాను . ఆరోజుల్లో ఇంత మీడియా లేకపోవడం తో కనీసం ఫోటో కూడా తెయలేకపోయారు మావాళ్ళు. కాని ఆలాంటి గుడి ఇప్పుడు 100 స||వ || పూర్తీ చేస్కుని రామదాసు కోసం ఎదురుస్తూ ఉంది :( ..
మా అమ్మగారు నేను 10 వ తరగతిలో ఉండగా నీకు ఉద్యోగం వచ్చిన తరువాత మనం తిరుపతి వెళ్దాం అనేవారు ..గత సంవత్సరం స్వామి వార్ని దర్శనం చేస్కున్నాం . నిజంగా చాల అదృష్టవంతున్ని 2011 లోనే స్వామి వార్ని 6 సార్లు దర్శనం చేస్కున్నాను. ఏమిటో అప్పుడే జూలై కూడా పూర్తీ కావస్తుంది . ఈ సారి స్వామి ఇంకా నాపై దయతల్చలేదు . నేను స్వామి వారి కొండపైకి వెళ్లి వచ్చిన తరువాత నా తరహాలో ఒక పోస్ట్ రాస్తాను . స్వామి వార్కి వినతిపత్రం లాగ ఈ పోస్ట్ ని పోస్ట్ చేస్తున్నా..
శ్రీ మహావిష్ణువు శయనించిన ఆదిశేషుడి ఏడుపడగలే తిరుపతిలో శ్రీనివాసుడు కొలువైన సప్తగిరులని పురాణ ప్రతీతి. ఆ ఏడు శిఖరాలూ శేషాద్రి,
నీలాద్రి,
గరుడాద్రి,
అంజనాద్రి,
వృషభాద్రి,
నారాయణాద్రి,
వేంకటాద్రి.
స్వామి వారి దర్శనం ఏల చేయాలో తెలియలేదు ఇప్పడివరకూ నాకు ..
మనం తలనీలాలు ఇస్తున్నాం కదా .. అసలు ఎందుకు ఇస్తున్నాం ?
స్వామి వారు అప్పు చేసారు అనడం లో ఉద్దేశ్యం ఏమిటి ? ఎవరి కోసం స్వామి వారు అప్పు చేసారు ?
వేంకటేశ్వర స్వామి ఎంతకాలం భులోకాలం ఉంటారు
ఈ వీడియొ మీకోసం
మీరు తిరుపతి వెళ్లేముందు / వెళ్ళినతరువాత : ఇప్పడికి చాలామందికి తెలియనది తిరుమలలో రూం బుక్ చేస్కోవడం .
*నాకు తెలిసి తిరుమల దేవస్థానం వారు ప్రతి జిల్లా లోను (e-darshan) సెంటర్ ను ఏర్పాటు చేసారు . మీరు తిరుమల వెళ్ళే ముందుగ ఇక్కడ కు వెళ్లి మీరు ఏ రోజుకు తిరుమల వేల్లదలుచుకున్నారో ఆ రోజు రూమ్స్ / దర్శనం టికెట్స్ ఇన్ఫర్మేషన్ అడగండి . రూమ్స్ కలిగా ఉన్నాయా లేదా వాళ్ళు మీకు చెబుతారు .
*రూమ్స్ / దర్శనం టికెట్ బుక్ చేస్కోవడానికి వెళ్ళేటప్పుడు మీ ఐడి ప్రూఫ్ తప్పనిసరిగా తీస్కుని వెళ్ళండి .
*రూమ్స్ / దర్శనం టికెట్ ధర ఎంత అంటారా అది మీ పరిదిలోనే ఉంటుంది . తక్కువలో ఐతే 50/- కి కూడా రూం ఉంటుంది .
*దూరం నుంచి వచ్చేవాలు ఐతే ట్రైన్ టికెట్స్ కూడా ఒకసారి చూడండి .. అందరు చెప్పేదే ఎక్కువ లగేజి తీస్కుని వెళ్ళకండి .. అలాగని అసలు తీస్కుని వెళ్ళడం మానకండి .
*పెద్దలు ముఖ్యంగా ఆరోగ్య సమస్య ఉన్నవాళ్లు మందులు మరిచిపోకండి .
*సరే తిరుమల చేరుకున్నాం . ఇప్పుడు మీరు C.R.O దగ్గరకు వెళ్తే మీకు రూం ని కేటాయిస్తారు . ( C.R.O అని అడిగితే అక్కడ చెబుతారు )
*తిరుమలలో ఇన్ఫర్మేషన్ ఎవరిని పడితే వార్ని అడగకండి . పోలీస్ వాళ్లనో లేదా అక్కడ పనిచేసే వల్లనో అడగండి . తిరుమలలో అన్ని చోట్ల ఇన్ఫర్మేషన్ సెంటర్స్ ఉంటాయి మీరు అక్కడకు వెళ్లి అడిగితె వారు మీకు కావాల్సిన సమాచారం తెలియచేస్తారు .
*మరో ముఖ్యమైన విషయం మీతో పాటు చిన్నపిల్లలు / పెద్దవాళ్ళు ఉంటే వాళ్లతో కూడా మీకు రూం ఎక్కడ వచ్చిందో మీరు ఇప్పుడు ఏ రూం లో ఉన్నారో వాళ్ళకి అడ్రస్ చెప్పండి ఒక వేల దారి తప్పిన వాళ్ళకు తెలుస్తుంది . *చాల సార్లు దర్శన టైం లో తప్పిపోవడం జరుగుతుంది . లేదా వారు వేరే లైన్ లో వెళ్ళిపోవడం జరుగుతుంది అలాంటప్పుడు కంగారు పడకండి . దర్శనం అయ్యాక అందరు ఒకేచోటుకు వస్తారు( గుడి బయట ) . అక్కడ వెయిట్ చేయమని ముందే చెప్పండి .
*గుడి బయటకు వచ్చాక కూడా ఎవరు కనబడకపోతే / రూం అడ్రస్ తెలియకపొతే మాత్రం ఎక్కువ దూరం వెళ్ళకుండా గుడికి దగ్గరలోనే ఉండమని చెప్పండి.
*గుడికి ఎదురుగా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది . ఆ ప్రక్కన సమాచార కేంద్రం ( చిన్న రూం లా ఉంది ) అక్కడే ఇలా తప్పిపోయిన వాళ్ళ సమాచారం తెలియచేస్తారు . ఎప్పుడైనా తెలియనప్పుడు కంగారు పడకుండా పోలీస్ వార్కి చెప్తే వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు .
సుబ్రహ్మణ్యేశ్వరుడికి ‘మురుగన్’ అనే పేరుంది. తమిళ ప్రజలు ‘మురుగన్’ పేరుతోనే స్వామిని ఇక్కడ పిలుచుకుని పూజిస్తారు. మురుగన్ అంటే మేనల్లుడు అని అర్ధం , విష్ణువుకి మేనల్లుడు కనుక మురుగన్ అని పిలుస్తారు .
షణ్ముఖుడు - ఆరు ముఖాలు (పంచ భూతాలను + ఆత్మను ) గలవాడు
తమిళనాడులోని ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలు (అఱుపడై వీడుగళ్) ఉన్నాయి . మనం చూడబోయే తిరుత్తణి ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ఒకటి . అవి వరుసగా తమిళనాడులోని ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలు (అఱుపడై వీడుగళ్) ఉన్నాయి .. The Arupadaiveedu (six abodes) are the most important shrines for the devotees of Murugan in Tamil Nadu, India. They are:
Palani Murugan Temple (100 km south east of Coimbatore) Swamimalai (Near Kumbakonam) Thiruthani (84 km from Chennai) Pazhamudircholai (10 km north of Madurai) Thiruchendur (40 km south of Thoothukudi or Tuticorin) Thiruparamkunram (10 km south of Madurai).
1.తిరుచెందూర్ : Thiruchendur
ఈ క్షేత్రం తమిళనాడు లో తిరునెల్వేలి నుండి అరవై కిలోమీటర్ల దూరములో సముద్ర తీరములో ఉన్న అద్భుతమైన ఆలయం. కుమారస్వామి ఇక్కడ బాలుని రూపంలో దర్శనమిస్తారు . సాధారణంగా సుబ్రహ్మణ్య ఆలయాలు అన్నీ కొండ శిఖరములపై ఉంటాయి. కాని ఈ తిరుచెందూర్లో ఒక్కచోటే స్వామి సముద్ర తీరము నందు కొలువై ఉన్నాడు. "ఈ ఆలయంలో చెప్పుకోదగినది శిల్పుల నైపుణ్యం. భక్తులను కట్టిపడేసే అపురూప శిల్ప సమన్విత ఆలయంగా ఇది పేర్గాంచింది. తొమ్మిది అంతస్తుల రాజగోపురం పడమట ద్వారంనుంచి మరపురాని సరిహద్దు కట్టడంగా విరాజిల్లుతోంది. రాజగోపుర నిర్మాణానికి సంబంధించి ఆసక్తికరమైన ఓ కథ ప్రచారంలో ఉంది. మూడువందల సంవత్సరాలకు పూర్వం, తిరువాయదురై మఠపు మహా సన్నిదానపు దేశికామూర్తికి స్వామి కలలో కనిపించి, ఆలయ గోపురం కట్టమని ఆదేశించాడట. అయితే అతడు పేదవాడు కావడంవల్ల, గోపుర నిర్మాణానికై వచ్చిన కూలీలకు కూలీ డబ్బులకు బదులుగా స్వామివారి విభూతిని ఇచ్చాడట. కూలీలు ఆ విభూతినే మహాద్భాగ్యంగా భావించి, వెళుతుండగా మార్గంమధ్యలో ఆ విభూతి బంగారు నాణేలుగా మారాయట. ఇలా ప్రతిరోజూ జరుగుతూ, రాజగోపుర నిర్మాణం ఆరు అంతస్థుల వరకూ పూర్తయిందట. సరిగ్గా ఆరవ అంతస్థు పూర్తికాగానే ఈ అద్భుతం జరగడం ఆగిపోయిందట. అనంతరం స్వామి దేశికాచార్యుని కలలో కనిపించి, మిగిలిన నిర్మాణానికి సీతాపతి మరైక్కార్ అనే భక్తుని దగ్గరకు వెళ్ళి, ఒక బుట్ట ఉప్పును తీసుకురమ్మనమని ఆదేశించాడట. దేశికామూర్తి స్వామి ఆదేశంమేరకు, సీతాపతి మరైక్కార్ దగ్గర ఓ బుట్ట ఉప్పు తీసకుని వస్తుండగా, మార్గం మధ్యలో ఆ ఉప్పు కాస్తా బంగారంగా మారిపోయిందట. ఆ బంగారు నాణేలతో దేశికామూర్తి మిగిలిన రాజగోపురాన్ని నిర్మించాడు. "
2.తిరుప్పరంకుండ్రం : Tirupparankundram
ఈ క్షేత్రములో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఇంద్రుని కుమార్తె అయిన దేవయాని (దేవసేనా) అమ్మతో కళ్యాణం జరిగింది. ఈ క్షేత్రం తమిళనాడులో ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అయిన మధురై కి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఒక్క క్షేత్రంలోనే సుబ్రహ్మణ్య స్వామి వారు కూర్చుని దర్శనమిస్తారు. మిగతా అన్నిచోట్ల స్వామి నిలబడిన మూర్తినే చూస్తాం.
3.పళముదిర్చొళై : Palamudircholai
ఈ క్షేత్రం మధురై సమీపంలో ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో కొండ మీద ఉంది. ఈ క్షేత్రములో సుబ్రహ్మణ్య స్వామి వారు చిన్నతనంలో ఆడుకొనే వారని చెప్తారు. ఇక్కడే వల్లీ మాత కూడా ఉండేదని చెప్తారు.
4.పళని : Palani
ఈ క్షేత్రం తమిళనాడు లోని దిండిగల్ జిల్లాలో, మధురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రాలలో చాలా ప్రఖ్యాతి గాంచిన మహా మహిమాన్వితమైన దివ్య క్షేత్రం పళని. ఇక్కడ స్వామి వారు కేవలం కౌపీనంతో కనబడడంలో అంతరార్ధం “నన్ను చేరుకోవాలంటే అన్నీ వదిలేసి నన్ను చేరుకో” - అని మనకి సందేశము ఇస్తున్నారు అని అర్ధం. అంటే ఈ పళని క్షేత్రము జ్ఞానము ఇచ్చే క్షేత్రము. అంతే కాదు ప్రఖ్యాత కావిడి ఉత్సవము మొదలయిన క్షేత్రము పళని.
5.స్వామిమలై : SwamiMalai
ఈ క్షేత్రం తమిళనాడు లోని తంజావూర్ జిల్లాలో కుంభకోణం సమీపంలో ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది. స్వామిమలై అపారమైన జ్ఞానం. ఇక్కడ ప్రణవ రహస్యాన్ని పరమిశివుడికి చెప్పాడు సుబ్రహ్మణ్యుడు.
6.తిరుత్తణి : Tiruttani
మనం అందరం ఇప్పుడు తిరువళ్లూర్ జిల్లాలోఅరక్కోణం సమీపంలో ఉన్న “ ఆరు పడై వీడు ” లో మకుటాయమానమైన తిరుత్తణి క్షేత్రాన్ని దర్శించుకుని వద్దాం .
ఈ దివ్య క్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వల్లీ దేవసేన అమ్మవార్ల సహితంగా కొలువయ్యారు. తమిళనాడులోని సుబ్రహ్మణ్య క్షేత్రాలలో విశిష్టమైనదిగా పేర్గాంచిన ఈ క్షేత్రం తమిళులందరికీ ఆరాధ్య క్షేత్రం. తమిళుల ఇష్టదైవంగా, ఇలవేల్పుగా పూజలందుకుంటున్న సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఇక్కడ మురుగపెరుమాళ్ళుగా పూజలందుకుంటున్నాడు. శ్రీవారు వెలసి ఉన్న కొండకు ఇరుపక్కలందూ పర్వత శ్రేణులు వ్యాపించి ఉన్నాయి.
ఉత్తరాన గల పర్వతం కొంచెం తెల్లగా ఉండడంవల్ల దీనిని ‘బియ్యపుకొండ’ అని పిలుస్తారు. దక్షిణం వైపునగల కొండ కొంచెం నల్లగా ఉండడంవల్ల దానిని ‘గానుగ పిండి కొండ’ అని పిల్వడం జరుగుతోంది. సుబ్రహ్మణ్యేశ్వస్వామి దేవతలు, మునుల బాధలు పోగొట్టడానికి శూరపద్మునితో యుద్ధం చేసిన అనంతరం, వల్లీదేవిని వివాహం చేసుకోవడానికి బోయకుల రాజులతో చేసి చిన్నపోరు ముగిసిన అనంతరం శాంతించి, ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువయ్యాడని ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. స్వామి శాంతించి ఇక్కడ కొలువయ్యాడు కనుక ఈ క్షేత్రానికి ‘తణిగై’ లేదా ‘శాంతిపురి’ అనే పేరొచ్చింది. అలాగే ‘తణిగ’ అనే పదానికి మన్నించుట, లేదా ఓదార్చుట అని అర్థం చెబుతారు. స్వామి భక్తుల తప్పులను, పాపాలను మన్నించి, కటాక్షిస్తాడు కనుక ఈ క్షేత్రానికి తిరుత్తణి అని పేరు వచ్చింది. ట్రైన్ లో తిరుత్తణి వెళ్తే రైల్వే స్టేషన్ బయటకి వస్తే రోడ్ కనిపిస్తుంది . అక్కడ నుంచి ఎడమ వైపుకి నడిస్తే బస్సు స్టాండ్ ని చేరుకుంటాం . బస్సు స్టాండ్ నుంచి కొండ పైకి బస్సు లు ఆటో లు ఉంటాయ్ .. లేదా మెట్ల మార్గం కూడా ఉంటుంది. సరే ఇప్పుడు మనం మెట్ల మార్గం ద్వారా కొండపైకి వెళ్దాం .
ఇక్కడ మనకి కొండ క్రిందనే కల్యాణకట్ట (పైన కూడా ఉంది అనుకుంటా) ఉంటుంది . ఇక్కడ ఎవరైనా తలనీలాలు సమర్పించు భక్తులు ఉంటె వెళ్ళండి ..
వెళ్ళే ముందు తలనీలాలు ఎందుకు సమర్పిస్తున్నామో తెలుసుకుని ఆ పని చేయండి.
సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఇక్కడ తన తండ్రి అయిన పరమేశ్వరుని పూజించ తలచి తిరుత్తణి కొండపై తన నివాసానికి ఈశాన్య భాగాన శివలింగ ప్రతిష్టచేసి సేవించాడట. కుమారస్వామి పితృభక్తికి మెచ్చిన సాంబశివుడు సంతోషించి కుమారస్వామికి ‘జ్ఞానశక్తి’ అనే ‘ఈటె’ను అనుగ్రహించాడట. ఆ కారణాన ఈ స్వామికి ‘జ్ఞానశక్తి ధరుడు’ అనే పేరొచ్చింది.
ఇక్కడ కుమారస్వామి స్థాపించిన లింగానికి కుమారేశ్వరుడనే పేరొచ్చింది.
ఇక్కడ కనిపిస్తుంది చూసారా కోనేరు ..
కుమారస్వామి, శివుని అర్చించడానికి సృష్టించిన తీర్థమే కుమారతీర్థము. దీనిని శరవణ తీర్థమని కూడా పిలుస్తారు.
మనం కొండపైకి వెళ్తున్నపుడు దారిపొడవునా మనకి దుకాణాలు కనిపిస్తూనే ఉంటాయ్ ..
మెట్లక్కేడం స్టార్ట్ చేయబోయే ముందు ఎవరికైనా వాటర్ బాటిల్ కావాలంటే కొనుక్కోండి :)
ఇంకా మెట్లు స్టార్ట్ అవబోతున్నాయ్ .. మీ చెప్పులను ఈ షాప్ లా వద్ద వదిలి రండి
ఇక్కడ మొత్తం 365 మెట్లున్నాయి. ఈ మెట్లను సంవత్సరంలోని 365 రోజులకు ప్రతీకలుగా చెబుతారు. 365 అనగానే కంగారు పడకండి. ఒకసారి ఇలా చూడండి మొట్ట మొదటి మెట్టు ఇదే
గమనించార మెట్ల మధ్య ఎంత దూరం ఉందో.. ఇక్కడ మెట్ల పైన మన తెలుగు పేర్లు కూడా కనిపిస్తాయ్ మనకి . తిరుపతి లాగే ఇక్కడ కూడా మెట్లకు పసుపు ,కుంకుమ రాయడం . కర్పూరం వెలిగించడం చేస్తారు . అందుకే చెప్పులతో నడవకోడదు అని చెప్పేది.
ఈ ఫోటోని జాగ్రత్తగా చూడండి .. నేను చెప్పింది నిజమే కాదో
ఇక్కడ ఎవరైనా టోపీలు కొనుక్కుందాం అనుకుంటున్నారా ?
చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటె వార్కి కావాల్సిన అన్ని దొరుకుతాయ్ .. దిగే తప్పుడు కొందాం అనుకుంటే మీ ఇష్టం మరీ
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి ఆలయం అతి పురాతనమైనది. 1600 సంవత్సరాలకు పూర్వంనుంచే ఇక్కడ ఈ ఆలయం ఉన్నట్లు శాసనాల ద్వారా అవగతమవుతోంది. క్రీ.శ.875-893లో అపరాజిత వర్మ అనే రాజు శాసనమందు, క్రీ.శ.907-953లో మొదటి పరాంతక చోళుడి శాసనంలో ఈ క్షేత్రం గురించి ప్రస్తావించబడటంవల్ల 1600 సంవత్సరాలకు పూర్వమే పల్లవ, చోళ రాజుల చేత ఈ క్షేత్రం కీర్తింపబడిందని అవగతమవుతోంది.
ఇక మెట్లు అయిపోవచ్చాయ్ .. ఆదిగో చూడండి .. అవిఎక్కేస్తే అయిపోయినట్లే
ఈ క్షేత్ర స్థల పురాణము ప్రకారం
త్రేతా యుగములో శ్రీ రామచంద్ర ప్రభువు రావణ సంహారము చేసిన తర్వాత రామేశ్వరం లో ఈశ్వరుడిని ఆరాధిస్తారు. అక్కడ, ఈశ్వరుడి ఆనతి మేరకు, శ్రీ రాముడు ఈ తిరుత్తణి క్షేత్రము దర్శించినారు. ఆ తర్వాతనే శ్రీరామచంద్రునికి పూర్తి మనశ్శాంతి కలిగింది.
ద్వాపర యుగములో, మహా వీరుడైన అర్జునుడు దక్షిణ దేశ తీర్థ యాత్రలు చేస్తూ, ఇక్కడ తనికేశన్ స్వామి వారిని కొలిచినారు. శ్రీ మహా విష్ణువు ఈ క్షేత్రములోనే సుబ్రహ్మణ్యుడి పూజ చేసి ఆయన పోగొట్టుకున్న శంఖు, చక్రములను తిరిగి పొందినారు. (అంతకు పూర్వం వాటిని తారకాసురుడు శ్రీ మహా విష్ణువు నుండి చేజిక్కించుకుంటాడు).
భక్తులు అందరు ఇలా వచ్చి హుండిలో మీ కానుకలను వేయండి .
గర్బగుడిలో స్వామి వార్కి సాష్టాంగ నమస్కారం చేయడం కుదరదు కాబట్టి భక్తులు ఇక్కడే సాష్టాంగ నమస్కారం చేస్తారు .
ఇక్కడ ఉప్పు మిరియాలు కలిపినవి అల పోసి నమస్కరిస్తారు
ఖర్పురం వేలిగించి స్వామి వార్కి నమస్కారం చేస్తారు
మనం మొన్న తిరువళ్లూర్ కూడా చూసాం కాదా !
మీదగ్గర మిరియాలు తో కలిపినా ఉప్పు లేదు అంటారా ? తెలియక తెచ్చుకోలేదా? ఏం పర్వాలేదు .. ఆ పక్కనే అమ్మతారు . సో మీరు కంగారు పడనవాసరం లేదన్నమాట :)
ఇక్కడ ఎవరైనా చిన్నపిల్లలు కలవారు ఉన్నారా?
రండి ఇప్పడికే ఆ ఆలస్యం అయింది దర్శనానికి వెళ్దాం ..
ఉచిత దర్శనం తో పాటు .. 25/-, 50/- , 100/- ప్రత్యేక దర్శనం కూడా కలవు .
ఇక్కడ అందరు తెలుగు మాట్లాడతారు ..
ఏవరు తోస్కోకుండా చూడండి స్వామి వార్ని
ఇక్కడ ప్రసాదం అమ్ముతారు అన్న విషయం నేను చెప్పకుండానే తెల్సింది కదా :)
మన గుళ్ళకి ఇక్కడకి తేడ ఏమిటంటే .. ఇదే . అర్ధం అయింది కదా
ఆలయ నమూనా
తిరుత్తణి క్షేత్రాన్ని చేరుకోవడానికి తిరుపతివరకూ వెళ్ళి అక్కడనుంచి ఏదైనా వాహనంలోగాని బస్సులోగాని, రైలులో గాని ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. ఈ క్షేత్రంలో బసచేయడానికి భక్తులకు కావాల్సిన అన్ని వసతులూ ఉన్నాయి.
చెన్నై నుండి 84 Km, తిరుపతి నుండి 68 Km, అరక్కోణం ( కాణిపాకం )నుండి 13 Km దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఈ ప్రదేశాలు అన్నిటి నుంచి బస్సు సౌకర్యం ఉంది. నిజానికి ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీ మోహన్ కిషోర్ గారి బ్లాగ్ చూడండి అంటే సరిపోయేది . ఈ విధంగానైనా కార్తికేయుడు పేరు స్మరిద్దాం కదా అని రాసాను అంతే . చాలావరకు ఆ బ్లాగ్ లోంచే రాసాను . చాల చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మోహన్ గార్కి ధన్యవాదములు తెలియచేస్తున్నాను . http://shaktiputram.blogspot.in/2011/09/blog-post_19.html