Monday 30 July 2012

Tirumala తిరుమల


నేను కాకినాడ లో ఉద్యోగం చేస్తున్నప్పుడు  మొట్టమొదటి సరిగా సర్పవరం దగ్గర ఉన్న శ్రీ  వేంకటేశ్వర స్వామి గుడికి వెళ్లాను  స్వామి వార్ని చూసిన తరువాత  స్వామి ని చూడ్డం దేవుణ్ణి మొదటసారిగా చూసినట్లు అనిపించింది.  చిన్నప్పటి నుంచి తిరుపతికి మొక్కుకోవడం అంటే భయం నాకు ..తిరుపతి వేల్లగలనో లేదో అనే భయం అది .  దేవుడు పై భక్తీ శ్రద్దలు అలాంటివి ఏమి లేవు ... నచ్చినప్పుడు గుడికి వెళ్ళడం . చాల రోజులు అయింది దేవుణ్ణి చూసి అనిపించినప్పుడు ఒకసారి దేవుణ్ణి చూసి రావడం అంతే.  నిజానికి దేవుణ్ణి నేను నా చిన్నపుడే చూసాను .. ఏప్పుడు అనుకుంటున్నారా .. 



నా చిన్నప్పుడే నేను శ్రీరామచంద్రుల పాదముద్రను చూసే అదృష్టం కలిగింది . నేను ఆరవ తరగతిలో ఉండగా జరిగిన శ్రీరామా నవమి నాటి మరోసటి రోజు ఆలయం లో నవమి రాత్రి రాముల వారి దగ్గర ఏర్పాటుచేసిన ఏర్పాట్లు ( ఏమని పిలుస్తారో తెలియదు) . ఒక వస్త్రం పై (మైదాపిండే అనుకుంటా ) పిండి మొత్తం చక్కగా సర్దారు . మరోక  వస్త్రం  రాముల వారని , సీతమ్మ తల్లిని   కొద్దిగా దూరంగా ఎదురేదురగా ఉంచారు .
మరోసటి రోజు ఉదయానికి ఒక వస్త్రం పై మన మోచెయ్యి అంత శ్రీ రాముల వారి పాదం ఉంది . మరొక వస్త్రం పై రాములు వారు సీతమ్మ ఆడుకున్నట్టు చిన్న గుర్తులు కనిపించాయి . నేను అనుమంతో నిజంగా రాముల వారి పదమేనా అనే డౌట్ గా కొలిచి మరిచుసాను.. బాబోయ్ ఇంత పాదం ఎవరకి ఉండదు . నిజంగా మా రాముల వారిదే ఇది అని అప్పుడే నమ్మాను . ఎప్పుడన్నా దేవుడు లేడు అని ఆలోచన వచ్చినప్పుడు ఆ రోజు దేవుడి పాదాలను చూసావ్ కదరా అని గుర్తుకు తెచ్చుకుంటాను . ఆరోజుల్లో ఇంత మీడియా లేకపోవడం తో కనీసం ఫోటో కూడా తెయలేకపోయారు మావాళ్ళు. కాని ఆలాంటి గుడి ఇప్పుడు 100 స||వ || పూర్తీ చేస్కుని రామదాసు కోసం ఎదురుస్తూ ఉంది :( .. 





మా అమ్మగారు నేను 10 వ తరగతిలో ఉండగా నీకు ఉద్యోగం వచ్చిన తరువాత మనం తిరుపతి వెళ్దాం అనేవారు ..గత సంవత్సరం స్వామి వార్ని దర్శనం చేస్కున్నాం .  నిజంగా చాల అదృష్టవంతున్ని 2011  లోనే స్వామి వార్ని 6 సార్లు దర్శనం చేస్కున్నాను. ఏమిటో అప్పుడే జూలై కూడా పూర్తీ కావస్తుంది . ఈ సారి స్వామి  ఇంకా నాపై దయతల్చలేదు . నేను స్వామి వారి కొండపైకి వెళ్లి వచ్చిన తరువాత నా తరహాలో ఒక పోస్ట్ రాస్తాను .  స్వామి వార్కి వినతిపత్రం లాగ ఈ పోస్ట్ ని పోస్ట్ చేస్తున్నా.. 


శ్రీ మహావిష్ణువు శయనించిన ఆదిశేషుడి ఏడుపడగలే తిరుపతిలో శ్రీనివాసుడు కొలువైన సప్తగిరులని పురాణ ప్రతీతి. ఆ ఏడు శిఖరాలూ 
శేషాద్రి

నీలాద్రి

గరుడాద్రి

అంజనాద్రి,

వృషభాద్రి

నారాయణాద్రి

వేంకటాద్రి.



స్వామి వారి దర్శనం ఏల చేయాలో తెలియలేదు ఇప్పడివరకూ నాకు .. 


 
మనం తలనీలాలు ఇస్తున్నాం కదా .. అసలు ఎందుకు ఇస్తున్నాం ?







స్వామి వారు అప్పు  చేసారు అనడం లో ఉద్దేశ్యం ఏమిటి ?  ఎవరి కోసం స్వామి వారు అప్పు చేసారు ?


వేంకటేశ్వర స్వామి ఎంతకాలం భులోకాలం ఉంటారు 
 

 
ఈ వీడియొ మీకోసం 









మీరు తిరుపతి వెళ్లేముందు / వెళ్ళినతరువాత :
ఇప్పడికి చాలామందికి తెలియనది తిరుమలలో రూం బుక్ చేస్కోవడం .

*నాకు తెలిసి తిరుమల దేవస్థానం వారు ప్రతి జిల్లా లోను (e-darshan) సెంటర్ ను ఏర్పాటు చేసారు . మీరు తిరుమల వెళ్ళే ముందుగ ఇక్కడ కు వెళ్లి మీరు ఏ రోజుకు తిరుమల వేల్లదలుచుకున్నారో ఆ రోజు రూమ్స్ / దర్శనం టికెట్స్ ఇన్ఫర్మేషన్ అడగండి . రూమ్స్ కలిగా ఉన్నాయా లేదా వాళ్ళు మీకు చెబుతారు . 

*90 రోజులు ముందు నుంచి రూమ్స్ బుక్ చేస్కోవచ్చు .

*ఈ ఇన్ఫర్మేషన్ తెల్సుకోవడానికి ఒక్కరే వెళ్ళండి .. రూమ్స్ / టికెట్స్ ఉన్నాయ్ అనుకుంటే తరువాత అందర్నీ తీస్కుని వెళ్ళవచ్చు .

*రూమ్స్ / దర్శనం టికెట్ బుక్ చేస్కోవడానికి వెళ్ళేటప్పుడు మీ ఐడి ప్రూఫ్ తప్పనిసరిగా తీస్కుని వెళ్ళండి .

*రూమ్స్ / దర్శనం టికెట్ ధర ఎంత అంటారా అది మీ పరిదిలోనే ఉంటుంది . తక్కువలో ఐతే 50/- కి కూడా రూం ఉంటుంది .

*దూరం నుంచి వచ్చేవాలు ఐతే ట్రైన్ టికెట్స్ కూడా ఒకసారి చూడండి ..
అందరు చెప్పేదే ఎక్కువ లగేజి తీస్కుని వెళ్ళకండి .. అలాగని అసలు తీస్కుని వెళ్ళడం మానకండి .

*పెద్దలు ముఖ్యంగా ఆరోగ్య సమస్య ఉన్నవాళ్లు మందులు మరిచిపోకండి .

*సరే తిరుమల చేరుకున్నాం . ఇప్పుడు మీరు C.R.O దగ్గరకు వెళ్తే మీకు రూం ని కేటాయిస్తారు . ( C.R.O అని అడిగితే అక్కడ చెబుతారు )

*తిరుమలలో ఇన్ఫర్మేషన్ ఎవరిని పడితే వార్ని అడగకండి . పోలీస్ వాళ్లనో లేదా అక్కడ పనిచేసే వల్లనో అడగండి . తిరుమలలో అన్ని చోట్ల ఇన్ఫర్మేషన్ సెంటర్స్ ఉంటాయి మీరు అక్కడకు వెళ్లి అడిగితె వారు మీకు కావాల్సిన సమాచారం తెలియచేస్తారు .

*మరో ముఖ్యమైన విషయం మీతో పాటు చిన్నపిల్లలు / పెద్దవాళ్ళు ఉంటే వాళ్లతో కూడా మీకు రూం ఎక్కడ వచ్చిందో మీరు ఇప్పుడు ఏ రూం లో ఉన్నారో వాళ్ళకి అడ్రస్ చెప్పండి ఒక వేల దారి తప్పిన వాళ్ళకు తెలుస్తుంది .
*చాల సార్లు దర్శన టైం లో తప్పిపోవడం జరుగుతుంది . లేదా వారు వేరే లైన్ లో వెళ్ళిపోవడం జరుగుతుంది అలాంటప్పుడు కంగారు పడకండి . దర్శనం అయ్యాక అందరు ఒకేచోటుకు వస్తారు( గుడి బయట ) . అక్కడ వెయిట్ చేయమని ముందే చెప్పండి .

*గుడి బయటకు వచ్చాక కూడా ఎవరు కనబడకపోతే / రూం అడ్రస్ తెలియకపొతే మాత్రం ఎక్కువ దూరం వెళ్ళకుండా గుడికి దగ్గరలోనే ఉండమని చెప్పండి.

*గుడికి ఎదురుగా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది . ఆ ప్రక్కన సమాచార కేంద్రం ( చిన్న రూం లా ఉంది ) అక్కడే ఇలా తప్పిపోయిన వాళ్ళ సమాచారం తెలియచేస్తారు . ఎప్పుడైనా తెలియనప్పుడు కంగారు పడకుండా పోలీస్ వార్కి చెప్తే వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు .

21 comments:

  1. Rajachandra garu....tirumala viseshalu ippude visit chesanu...mee sankalpam..varnanateetam.technology valla youth padavtunna ee rojullo...inta constructive ga danni use chestunnanduku...I really can't stop myself appreciating..u...mee tallitandrulu adrustavantulu...aa daiva krupa mee paina eppatiki vuntundi..aa krupa ni meru tappaka nilabettukuntaranukuntunnanu....once again thank u so much...

    ReplyDelete
    Replies
    1. Madhura devi garu thank you andi

      Delete
    2. Dharmavarapu srinivasarao, hyderabad6 May 2013 at 21:42

      తమ్ముడు లేదు నిజమైన భక్తుడా చాలా చాలా సంతొషం. మేము భక్తి తొ మాత్రమె తిరుపతి చూసాం. కాని నీవు ఙ్జానంతొ చూసావు. దన్యుడవు.

      Delete
  2. hai raja garu ela unarandi .. meru me alochanalu chela goppavi vatini etharulaki theliyacheyadam chela manchi alochana andi deeni elage continue cheyandi meeee sagar

    ReplyDelete
  3. Great work and God bless you.


    Abhinava

    ReplyDelete
  4. hello andi very nice blog
    but a small suggestion
    it was really hard to read the details with this background(colour and deseign)
    can you please change the bacgroud
    hope this sugession improves the usage of your site

    ReplyDelete
  5. చాలబాగుంది

    ReplyDelete
  6. sir meeru cheppina gudi a urilo undi sir

    ReplyDelete
    Replies
    1. maa ure andi..
      Nadividhi ramayalam - virava- pithapuram (M.D) - East Godvari

      Delete
  7. meeru pedda padam chusina gudi ekkada undi sir

    ReplyDelete
    Replies
    1. Nadividhi ramayalam - virava- pithapuram (M.D) - East Godvari

      Delete
  8. అయ్యా మీరు ఆందిస్తున్న సమాచారం చాలా బాగుంది. దన్యవాదములు.

    ReplyDelete
  9. Tirumalesuni goorchchi enta smacharam cheppina malliktte

    ReplyDelete
  10. CAN YOU PLEASE PROVIDE TAMIL TRANSLATION

    ReplyDelete
  11. raja nizamga nuvvu ento punyam chesukunnavu intamandi ninnu pogudutu rastunnaru naku kuda chala anandamga undi ekkuva pogadakudadu antaru nakenduku anukokunda inta samacharam inni temples sekaristunnavu nizam ga chala great thank u very much venkanna video bagundi very good once again thanku

    ReplyDelete
  12. chala bagundi sir..

    ReplyDelete