Showing posts with label 108 దివ్య తిరుపతులు. Show all posts
Showing posts with label 108 దివ్య తిరుపతులు. Show all posts

Sunday, 20 October 2013

Alagar Koyil Temple Information

15-12-2012
Alagar Temple Information - అళగర్ కొయిల్
మనం మధురై లో ఉన్నాం కదా ! .. మధురై అమ్మవార్ని దర్శనం చేస్కున్నాక మనం చుడవాల్సిన టెంపుల్స్ ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రములైన “ ఆరు పడై వీడు ” లో పళముదిర్చోళై , తిరుప్పరంకుండ్రం ,పళని ఈ మూడు క్షేత్రాలను మనం చూడబోతున్నాం . పళని మదురై నుంచి 120km అందుకనే మనం ముందుగా  పళముదిర్చోళై ,తిరుప్పరంకుండ్రం చూస్కుని తరువాత పళని బయలుదేరుతాం .


 మీకు గుర్తుందా అమ్మవారి టెంపుల్ కి ఎలా వచ్చామో .. రైల్వే స్టేషన్ లో దిగి కుడివైపు కి నడుకుంటూ వచ్చి . ఎడమవైపుకి తిరిగి డైరెక్ట్ గా వెళ్తే అమ్మవారి గుడికి వెళ్ళాం కదా .. ఇప్పుడు రైల్వే స్టేషన్ నుంచి కుడివైపుకి వెళ్తే డైరెక్ట్ గా మనం బస్సు స్టాండ్ కి వెళ్తాం . ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే .



మీకు నేను మనం రెండు క్షేత్రాలు చూద్దామని చెప్పను కదా ! పళని ముడొవది పళముదిర్చోళై , తిరుప్పరంకుండ్రం చూడబోతున్నాం అన్నాను కదా అప్పుడే మర్చిపోతే ఎలా ? అక్కడ రెండు బస్సు స్టాండ్ లు ఉంటాయ్ . ఒకటే పళముదిర్చోళై వెళ్ళేది రెండవది తిరుప్పరంకుండ్రంవైపు వెళ్ళేది రెండు ప్రక్కపక్కనే . ఇప్పుడు మనం పళముదిర్చోళై వేల్లబోతున్నాం . 

 టికెట్ తీస్కునే టప్పుడు 50/- టికెట్ తీస్కోండి . ఒక రోజు మెత్తం బస్సు టికెట్ తిస్కోవాల్సిన అవసరం ఉండదు . రెండు క్షేత్రాలను 50/- తో చూసిరావచ్చు . పళముదిర్చోళై లో సుబ్రహ్మణ్య స్వామి కొండపైన ఉంటారు .

ఇక్కడ మనం కొండ క్రింద  శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో దివ్యదేశములు అని పిలువబడే 108 పవిత్ర క్షేత్రములలో ఒకటైన అలగర్ టెంపుల్ ని చూడబోతున్నాం . నాకు తెలుసు మీరు బస్సు దిగడం దూరంనుంచి టెంపుల్ చూడ్డం కూడా జరిగింది అని .
స్వామి వార్ని చూసారా ? నా అజ్ఞా లేకుండా నా దర్శనం చేయగలరా అన్నట్టు ఎలా చూస్తున్నారో . 


 ఇక్కడ టెంపుల్ లో మనం ఎక్కడ చూడనటువంటి విధంగా స్వామివారు మనకు దర్శనం ఇస్తారు . స్వామి వారు నడుము దగ్గర ఒక కత్తి ఉంటుంది .

 రండి అక్కడే ఉండిపోయరేం టెంపుల్ చూడండి .. టెంపుల్ చాల పెద్దది .

 మనం కనిపిస్తుంది కదా ఆ లోపాలకి వెళ్ళాలి .. 



 చెప్పా కదా టెంపుల్ పెద్దది అని .. స్వామి టెంపుల్ తో పాటు ఉప ఆలయాలు కూడా ఉన్నాయ్ ..


 నేను మీకు చెప్పాకదా .. స్వామి వారి నడుం కి కత్తి ఉంటుంది అని .. ఇక్కడ వారు దానికి పూజలు చేస్తూ ఉంటారు .

 స్థలపురాణం తెలిస్తే బాగున్నాను .. మీకు తెలిస్తే చెప్పండి ..


రాములవారి గుడి





ఇప్పుడు మనం బస్సు ఎక్కి కొండపైకి వెళ్ళాలి .. బస్సు వచ్చేవరకు వెయిట్ చేయండి ..  ఈ లోపు తిరుత్తణ్ణి చూసిరండి .
http://rajachandraphotos.blogspot.in/2012/07/tiruttani.html

మీ కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తేలియచేయండి

Friday, 12 April 2013

TIRUMALA - SRIVARI METTU

7-4-2013


శ్రీనివాస గోవిందా | శ్రీ వెంకటేశా గోవిందా | భక్త వత్సల గోవిందా | భాగవతా ప్రియ గోవిందా | నిత్య నిర్మల గోవిందా | నీలమేఘ శ్యామ గోవిందా | గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా


తిరుమల   శ్రీవారి మెట్టు మార్గం ( SRIVARI METTU TIRUMALA)



తిరుమల కొండపైకి రెండు మార్గాలున్నాయి. అలిపిరి నుండి వేళ్ళే దారి అందరికీ పరిచయమైనది. ఈ దారిలో వేగంగా నడిస్తే నాలుగు గంటల సమయం పడుతుంది. తిరుమల చేరుకోవడానికి రెండవ కాలిబాట '''శ్రీవారి మెట్టు''' నుండి ఉంది. ఈ మార్గంలో ప్రయాణం ఒక గంట మాత్రమే పడుతుంది.


తిరుమల బస్సు స్టాండ్ నుంచి శ్రీ వారి మెట్టుకు ఉచిత బస్సు కలవు . అలిపిరిలో ఉన్నట్లు గానే ఇక్కడకూడా ఉచిత లగేజి కౌంటర్ ఉంది .




 మెట్ల మార్గం గుండా నడిచేవెళ్ళే వాళ్ళు తమ బాగ్ లను ఇక్కడ ఉంచితె.. దేవస్థానం వాళ్ళు కొండపైకి తీస్కుని వెళ్తారు . ఇక్కడ నుంచి మెట్ల మార్గం 6 km ఉంటుంది . మీరు బస్సు దిగి మీ బాగ్ లను వీర్కి ఇచ్చేలోపే .. బస్సు వాడు మీకోసం వెయిట్ చేయకుండా వెళ్ళిపోతాడు .


 మరో బస్సు కోసం వెయిట్ చేసే లోపు (30 min ) మీరు కనిపిస్తున్నాయ్ గా ఈ ఆటో లో మెట్లదగ్గరకు చేరుకోవచ్చు . ఆటో లో ఫ్రీ కాదండోయ్ షేర్ ఆటో ఐతే 15/- ( ఒక్కరికి ).. మీ ఒక్కరికే ఐతే 60 /- [ఈ ధరలు మారుతూ ఉంటాయ్  :) ]
నేను ఆటో నే ఎక్కాను .. ఈ 6 km రూట్ ఎలా ఉందో చూడండి ..


 చూసారా ఆటో ఎంత స్పీడ్ గా వచ్చేసిందో అప్పుడే  6km వచ్చేసాం .
 ఏడూ కొండలు ఎక్కకుండానే స్వామి వారు కొండక్రిందనే  (టెంపుల్ ఉంది  ) దర్శనం ఇస్తారు .


స్వామి వారి పదాలు ..

నడక ప్రారంభించే ముందు . స్వామి వారి ప్రసాదం తీస్కోండి


శ్రీ వారి మెట్టు ద్వారా నడక మార్గమున తిరుమలకు వెళ్ళు భక్తులను ఉదయం 6 గం ॥ల నుండి  సాయంత్రం 6  గం ॥ల వరకు అనుమతించబడును .

SRIVARI METTU FOOT PATH WILL BE OPENED FROM 6.AM TO 6.00 PM ONLY.

 అల్లిపిరిలో తిరుమల నడిచి వచ్చే వాళ్ళకు టోకెన్ లు ఇచ్చినట్టే ఇక్కడ కూడా ఇస్తారు .   ఎందుకంటే మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మీకు ఆలస్యం ఐతే టోకెన్ ఇవ్వరు .


ప్రతి రోజు శ్రీ వారి మెట్టు 3750 టోకెన్లు మరియు అలిపిరి 11,250 టోకెన్లు నడక మార్గం ద్వారా నడిచి వచ్చే భక్తులకు 15,000 టోకెన్లు లేదా సాయంత్రం 5.00 గం ॥ల వరకు మాత్రమే జారిచేయబడును


. టోకెన్లు కోటా పూర్తీ అయిన లేదా సమయం ముగిసిన యెడల కౌంటర్లు ముసివేయబడును . కావున భక్తులు సహకరించ ప్రార్ధన .

నడక  ప్రారంభించ బోతున్నాం .. ఒక్కసారి గట్టిగ గోవింద .. గోవింద


సుమారు 300 -400 మెట్లు వరకు చాల సులభంగ ఎక్కవచ్చు ..


చూస్తున్నారుగా మెట్లు మధ్య దూరం ఎంత ఉందో
గోవింద నామాలు చదువుకుంటూ .. గోపాలుడుని స్మరించుకుంటూ .. నడక సాగించండి








దివ్య దర్శనం టోకెన్ టికెట్ మరో 900 మెట్ల దూరం లో ఉంది .. గోవింద గోవింద


300 మెట్లు అప్పుడే పూర్తియినవి














అప్పుడే మనం టోకెన్ తీస్కునే చోటకి వెచ్చేసాం




టోకెన్ జాగ్రత్తగా ఉంచుకున్నారు కదా .. ఇక్కడే తనికి చేస్తారు ..


2100 మెట్లు వరకు వచ్చేసాం అండి . అప్పుడే చాల త్వరగా ఎక్కేస్తున్నాం కదా





మొదట్లోనే చెప్పాకదా .. 400 మెట్లవరకు బాగానే ఉంటుంది .. తరువాత మెట్లు ఇలా దగ్గర దగ్గరికి ఉంటాయ్





శ్రీ వారి మెట్టు కాలినడక వచ్చు భక్తులు లగేజి కౌంటర్ M. P.C కి ఎదురుగ ఉన్న బిల్డింగ్ లో తీస్కోవచ్చు .




వచ్చేసాం అండి  .. ఆఖరి మెట్టు ఇదే .. గోవింద గోవింద






మీరు వెళ్లి మీ బ్యాగ్  లను తీస్కుండి


ఒక్కోసారి బ్యాగ్ లు రావడం లేట్ అవుతుంది ..బ్యాగ్ లు వచ్చే లోపు .. స్వామి వారి అన్నదాన ప్రసాదం స్వికరించండి . ఇక్కడకి దగ్గరలోనే S.V.అన్నదాన భోజనశాల ఉంది










స్వామి వారి దర్శనం ఎలా చెయ్యాలో ఈ లింక్ క్లిక్ చేసి తెల్సుకోండి . 

అలిపిరి నుంచి తిరుమల వెళ్ళాలి అనుకునే వారు ఈ లింక్ క్లిక్ చేయండి 

శ్రీవారు మొట్టమొదటిసారిగా తిరుమల చేరుకున్న అతి పవిత్ర మార్గమిది .
శ్రీనివాసుడు పద్మావతిని పరిణయమాడిన తరువాత వారు ఈ దారిగుండానే తిరుమల చేరుకున్నారు .
తిరుమలకు ఇది అతి పురాతన నడకదారి.
ఒకప్పుడు చంద్రగిరి నుండి తిరుమలకు రాకపోకలన్నీ ఈదారి గుండానే జరిగేవి . 
శ్రీ కృష్ణ దేవరాయలు , అన్నమయ్య తదీతర మహా భక్తులు ఎందరో ఈ దారి గుండానే తిరుమలకు  వెళ్లి స్వామి వార్ని దర్శించుకున్నారని ప్రతీతి.
--19-10-2013
తిరుమల లో అంగప్రదిక్షణ :
వేంకటేశ్వరునికి సుప్రబాత సేవ అయిన తరువాత భక్తులను అంగప్రదిక్షణకు అనుమతినిస్తారు .స్వామి వారి సన్నిదిలో అంగప్రదిక్షణ చేయడం అంటే మాటలా .. అనుభూతిని ఎలా వర్ణిస్తాం .
1. తిరుమల కొండపైన (తిరుమల అంటేనే స్వామి వారి కొండ .. తిరుపతి అంటే క్రింద ఉన్న ఉరు ) ఉన్న C.R.O ఆఫీసు కు ఎదురుగా ఉన్న బిల్డింగ్ లో మధ్యాహ్నం 2 గంటల నుంచి అంగప్రదిక్షణ టికెట్స్ ఇస్తారు .
2. అంగప్రదిక్షణ టికెట్స్ ముందుగ వచ్చిన 700 మందికి మాత్రమే ఇస్తారు . అంగప్రదిక్షణ స్త్రీలు , పురుషులు ఇద్దరు చేయవచ్చు . మరీ చిన్నపిల్లలకి టికెట్స్ ఇవ్వరనుకుంట .
3. 1.30 లోపు సుఫదం దగ్గరకు మీరు రవాలని మీకు ఇచ్చిన టికెట్ మీద ఉంటుంది . మీరు 1am లోపే అక్కడ ఉండండి .
4. స్వామి వారి పుష్కరిణి లో స్నానం చేసి తడిబట్టలతోనే సుపధం దగ్గరకు వెళ్ళాలి ( సుపధం అంటే స్వామి వారి గుడి కుడివైపు న ఉంటుంది . అక్కడ ఎవరైనా చెబుతారు .
5. అంగప్రదిక్షణ టికెట్స్ ఉచితంగానే ఇస్తారు . మీరు టికట్ కి మధ్యాహ్నం 12 గంటలకు నిలబడితే మీకు టికెట్ దొరికే ఛాన్స్ ఉంది .
6. అంగప్రదిక్షణ చేసినవాళ్ళకి ఒక లడ్డు ఇస్తారు ( 10/-) . మీరు డబ్బులు కూడా తీస్కుని వెళ్ళండి .
7. దర్శనం చాల త్వరగా అవుతుంది . అంగప్రదిక్షణ అయినతరువాత మీకు స్వామి వారి దర్శనం కూడా ఉంటుంది .
8. అంగప్రదిక్షణ చేసేటప్పుడు సాంప్రదాయ దుస్తులు ఉంటే మంచిది . మామోలు ప్యాంట్ కూడా అనుమతినిస్తున్నారు . బనియన్ ఉంచుకోకూడదు . ముందుగా స్త్రీలను తరువాత పురుషులను అంగప్రదిక్షణ చేయిస్తారు .
9.స్వామి వారి దర్శనం అయ్యాక మనం బంగారు బావి దగ్గరకు వస్తాం కదా అక్కడనుంచి స్వామి వారి హుండీ వరకు అంగప్రదిక్షణ చేస్తాం .
ఇవి మీ అందర్కి నేను చెప్పాలనే కాబోలు నాకేమి తేలియక పోయిన స్వామి వారు నాచేత అంగప్రదిక్షణ చేయించారు . గోవింద గోవిందా ..
 
మీ కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తేలియచేయండి