కోటప్పకొండ గుంటూరు జిల్లా, నరసరావుపేట దగ్గర ఉన్న త్రికూటేశ్వరుని సన్నిధి.
శ్రీ చాగంటి కోటేశ్వరావు గారు చెప్తున్నా కోటప్పకొండ విశేషాలను వింటూ కోటప్పకొండ దర్శనం చేయండి
ఆంధ్రప్రదేశ్ లోని పుణ్యస్థలాలలో కోటప్పకొండ ఒకటి. గుంటూరు జిల్లాలోని నరసరావుపేట పట్టణానికి 13 కి.మీ. దూరంలోగల ఈ క్షేత్రానికి ఏ ప్రాంతం నుండైనా సులభంగా చేరవచ్చు. రైలు మార్గంలో అయితే గుంటూరు - గుంతకల్లు మార్గంలోని పిడుగురాళ్ళలో దిగి అక్కడనుండి గంట ప్రయాణంతో నరసరావుపేటకు చేరి ఈ ఆలయాన్ని దర్శించవచ్చు. నరసరావుపేట నుండి ఈ క్షేత్రానికి బస్సు సౌకర్యం, ప్రైవేటువాహన సౌకర్యం వున్నాయి.
క్షేత్ర వైభవం :
చతుర్దశ భువనాలు శివమయ సంధానాలు, మంగళకరమగు శివ శబ్దము సకల చరాచర జీవకోటికి ఆధారము. పరమేశ్వరుడు ఆది అంతాలు లేని సర్వవ్యాపనమైన చైతన్య శక్తి. అట్టి శక్తికి గుర్తు గుండ్రని రూపం. అందుకే శివుడిని లింగాకారంగా అర్చన చేస్తున్నాం. ఆ లింగమే త్రికోటేశ్వరుడు. ఆయనే కోటప్ప. అంతటి మహొత్కృష్టమైన క్షేత్రమే త్రికూటాచలం. అదియే కోటప్పకొండ. పవిత్రమైన చారిత్రక క్షేత్రాలలో కోటప్పకొండ ప్రసిద్ధమైన అతి ప్రాచీన శైవక్షేత్రం.
కృత, త్రేతా, ద్వాపరయుగాల నుండి పుణ్యభూమిగా పరిగణింపబడుచున్న భారతదేశంలోని దక్షిణ భాగంలో అపర కైలాస క్షేత్రంగా పేరొందిన త్రికోటేశ్వరస్వామికి నిలయమైన దివ్యభక్తపధము కోటప్పకొండ. పిలిచిన పలికే ప్రసన్న కోటేశ్వరునిగా, భక్తుల కోర్కెలు తీర్చే ఎల్లమంద కోటేశ్వరునిగ కష్టాల నుండి కడదేర్చే కావూరు త్రికోటేశ్వరునిగ, ఆపదలలో ఆదుకునే చేదుకో కోటయ్యగా, సంతతిలేనివారికి సంతానాన్ని కలుగచేసే సంతాన కోటేశ్వరునిగా యుగయుగాల నుండి నేటి వరకు భక్తుల ఆరాధ్యంగా విరాజమానమగుచూ కోరిన వారికి కొంగు బంగారంగా నిత్యార్చనాభిషేకాదుల నందుకుంటూ కోటి ప్రభలు విరజిమ్ముతూ సుఖము, శాంతి, ఆరోగ్యము, ఐశ్వర్యము, రక్షణ, శుభము, విజయము అవలీలగా అనుస్యూతంగా ప్రసాదించే శ్రీమత్త్రికోటేశ్వర సన్నిధానం కోటప్పకొండ మహాక్షేత్రం.
ఫొటోస్ & ఇన్ఫర్మేషన్ ఈ క్రింది బ్లాగ్ / వెబ్సైటు నుంచి తీస్కున్నాను . http://www.telugudanam.co.in/ http://ideechadavamdi.blogspot.in/2012/09/blog-post.html http://nrtfriends.blogspot.in/2011/03/blog-post.html
పంచారామాల్లో అమరారామం ఒకటి. పాలకొల్లు క్షీర రామలింగేశ్వరస్వామి దేవాలయం, అమరావతి అమరలింగేశ్వర ఆలయం, ద్రాక్షారామం భీమేశ్వరాలయం, సామర్లకోట కుమార భీమేశ్వరస్వామి ఆలయం, భీమవరం సోమేశ్వర స్వామి దేవాలయం - ఈ ఐదింటినీ పంచారామాలు అంటారు.
కుమారస్వామిచే ఖండితమైన తారకాసురుని మెడలోని అమృతలింగపు ప్రథమ దివ్యశకలం (అమరేశ్వర లింగం) పడినట్టి దివ్వ పుణ్యధామం, పంచారామాలలో సుప్రసిద్ధమైనట్టి దివ్యక్షేత్రం ‘అమరారామం’. దేవేంద్రునిచే ప్రతిష్టించబడిన ‘అమరలింగేశ్వరుడు’ బాలచాముండికాదేవి సమేతంగా కొలువై వున్న పుణ్యధామమే అమరారామం. ఈ అమరలింగేశ్వరుడు పరమేశ్వరుని అఘోర ముఖరూపమై ప్రకాశించుచున్నాడు. దేవేంద్రునిచే ప్రతిష్టించబడిన ఈ శివలింగం పేరు అమ రేశ్వరుడు. ఈ శివలిం గం సుమారు 15 అడుగుల ఎత్తు కలిగి ఉండి తెల్లని కాంతులతతో ప్ర కాశించుచు న్నది. ఆ స్వామికి రెండవ అంతస్తు పై నుండి అభిషేకాలు జరుపట విశేషము. ఈ స్వామి కొలువైన మండపములో పశ్చిమంగా బాలచాముండేశ్వరీ అమ్మవారు కొలువై ఉన్నది.
అమరావతి కోసం శ్రీ చాగంటి కోటేశ్వరావు గారు చేసిన ప్రవచనం ( 7min Audio)
శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు మహాభారతం విరాట్ పర్వం లో ఉత్తర అభిమన్యుడి వివాహం గురించి చెప్తూ . ప్రస్తుతం మనం చేస్తున్న వివాహాలలో లోపాలను వివరిస్తూ .. వాటిని సవరించారు .ఆ ప్రవచనాన్ని మీకోసం ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను .
వేదములు ఎంతో సనాతనమైనవి. ఈ విషయం అందరికీ తెలిసినదే..కానీ కొద్ది మంది అవైదిక సాంప్రదాయముల వాళ్ళు, ఇక్కడే మన దేశంలోనే పుట్టీ, ఇక్కడ గాలీ, నీరూ ఆహారం సేవించి కూడా, మన దగ్గరేముంది? ఇప్పుడు మనకి కబడుతున్న వైజ్ఞానిక ప్రగతి అంతా తెల్లవాడి భిక్ష అని అజ్ఞానంతో కొట్టుమిట్టాడే వారికి, ఒక కనువిప్పు కలిగించే అద్భుతమైన వీడియో ఇక్కడ జతచేస్తున్నాను. బహుశా ఇది చాలా మంది చూసే ఉండవచ్చు.
ఉదాహరణకి, ప్రస్తుత సమాజానికి తెలిసి, అణు బాంబు, ఈ మధ్యన కనిపెట్టబడినది అనుకుంటారు. ఈ వీడియో చూస్తే అర్ధం అవుతుంది, అణు బాంబు కనిపెట్టిన శాస్త్రవేత్తని మొదటిసారి ఆ బాంబు పేల్చాక, వెళ్ళి ఇదే మొదటి సారి కదా అని అడిగితే.... ఈ తరంలో ఇదే మొదటి సారి అన్నాడుట. మహాభారత యుధ్ధంలో అణు బాంబుల ప్రయోగం జరిగిందని విన్నాను... దానినే బ్రహ్మాస్త్రం అంటారేమో..
అలాగే, విమాన శాస్త్రం, టెలిఫోన్ కమ్యూనికేషన్స్, గణిత శాస్త్రం (పైథాగరస్ సిధ్ధాంతం వాడు కనిపెట్టడానికి కొన్ని వేల సంవత్సరాల పూర్వమే మన ఋషులకు తెలుసునని...) అనేక సాక్ష్యాలు దొరికాయి అని ఈ వీడియోలో చెప్పబడినది.
అంతేకాదు, అసలు ఆర్యులు ఇక్కడి వాళ్ళు కాదనీ, వాళ్ళు ఎక్కడి నుంచో మన దేశానికి వచ్చి మనకి సంస్కృతి నేర్పారనీ ఓ అబధ్ధపు సిధ్ధాంతం ఒకటి తెల్లవాడు ప్రాచుర్యం చేశాడు.. అది పచ్చి అబధ్ధమనీ, అసలు ప్రపంచం మొత్తానికి విద్యా,వైద్య, వైజ్ఞానిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక విలువలను బోధించినది మన భారతీయులేననీ, వైజ్ఞానికంగా నిరూపించబడినది అని తేల్చిచెప్పాడు ఈ వీడియోలో. ఇప్పుడు ఎవరైతే యూరపు వాళ్ళు సాంకేతిక పరిజ్ఞానంలో ముందు ఉన్నారో, వాళ్ళు మన వేదాలని, పురాణేతిహాసాలనూ తీసుకువెళ్ళి, అధ్యయనం చేసి, వాటిని ఆధారంగానే వైజ్ఞానిక ప్రగతి సాధించారనీ చెప్పాడు.
మన వేద మంత్రాలు ఎంత పవిత్రమైనవో, మంత్ర జపం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో... అది కూడా సాంకేతికముగా నిరూపించారు. ఇప్పుడు మన గూగుల్ సెర్చ్ ఇంజన్ లో ఏది కావాలంటే అది వెతుక్కోవడం అనే దానికోసం వాళ్ళు ఉపయోగించే అల్గోరిథమ్ మన ఋగ్వేదంలో చెప్పబడినది అని, మన ఊహకి అందని గణిత శాస్త్ర రహస్యాలు మన వేదాలలో దాగి ఉన్నాయి అని, ఇలా అనేక విషయాలు చెప్పారు.. చాలా బాగుంది అందరూ ఒకసారి చూడగలరు.
ఇక రెండవ వీడియోలో, మన సంకల్పములో చెప్పే భరత వర్షే, భరత ఖండే, మేరోః దక్షిణ దిక్భాగే అని చెప్పబడే విషయాన్ని, అందమైన గ్రాఫిక్స్ లో చూపించారు.. అసలు ఈ సకల విశ్వంలో మన భూమి ఎంత చిన్నదో, సూర్యుడి గమనాలు ఎలా ఉంటాయో, మనకి ఉత్తరాయణం, దక్షిణాయనం ఎలా వస్తాయో, సూర్య భగవానుడు ఏక చక్ర రథంపై ఎలా పయనిస్తాడో, అద్భుతంగా చిత్రీకరించారు.. ఇప్పుడు మనవాళ్ళు కనిపెట్టిన GPS (Global Positioning System) అవీ ఏమీ లేనప్పుడు కూడా, మనవాళ్ళు నక్షత్ర మండలాలనూ, పాలపుంతలనూ, ఈ విశ్వం ఎక్కడి వరకూ వ్యాపించి ఉండవచ్చూ, గ్రహముల కదలిక బట్టి మన జీవితం ఎలా ప్రభావితం అవుతున్నదీ,, యథా తథంగా లెక్కకట్టారు మన ఋషులు. అసలు ఇక్కడ భూమి మీద కూర్చుని, సూర్య భగవానుడి పయనం గురించి, ఆయన ఏక చక్ర రథంతో నడుస్తాడనీ, అంగారకుడు లేక కుజ గ్రహం ఎలా ఉంటుందీ, అన్నిటికంటే పెద్ద గ్రహం కాబట్టి బృహస్పతి అనీ ఇలా నామకరణం కూడా ఎలా చేయగలిగారో, "సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగులం" అని పురుష సూక్తం లో చెప్పినట్లుగా, భూమి గుండ్రముగా ఉంటుంది అనీ.... ఎన్నో విషయాలు మన ఋషులు ఇక్కడ కూర్చుని యోగ మార్గములో దర్శించి, మనకి ఏది మంచిదో, ఎలా బ్రతకాలో చెప్పారు....
ఇవన్నీ తలచుకుంటే, నాకు ఏదో లోకంలో ఉన్నట్లుగా ఉంది, ఏమి మన సనాతన ధర్మము, ఏమి మన ఋషులు,ఏమి మన వేదాలు, ఏమి మన వాగ్మయం...... ఏ పనీ చేయకుండా కూర్చుని చదివినా, ఈ జన్మ ఒక్కటి చాలదు.. అన్ని ఉన్నాయి మన శాస్త్రాలు, వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు. ఇక చదివేది ఎప్పుడూ, ఎప్పుడు ధ్యానం చేసేది, ఎప్పుడు మన ఋషులు చెప్పిన అద్భుతమైన విషయాలు దర్శించేదీ......... ఏమో ఎప్పటికి ఎన్ని జన్మలకి దర్శించగలమో అలా........
పెద్దలు మరిన్ని విషయాలు తెలిసినవి పంచుకోగలరని మనవి చేస్తున్నాను..
చివరిగా ఒక గమనిక, మన వేదాల గురించి, అంటే ఇవన్నీ ఎవడో పాశ్చాత్యుడు వచ్చి నిరూపిస్తేనే కానీ నమ్మవా, మనకి ఆ మాత్రం నమ్మకం లేదా !!..... అని అడిగితే ....ప్రస్తుతం మన జీవితం మనకి ఇష్టం ఉన్నా, లేకున్నా పాశ్చాత్యులు కనిపెట్టిన అనేక వస్తువులతో ముడి పడి ఉన్నది, ఉదాహరణకి, ఒక కొడుకో కూతురో అనుకున్న సమయానికి ఎంతసేపటికీ ఇంటికి రాకపోతే, ఒక వేళ ఆ కూతురు తనతో మొబైల్ ఫోన్ తీసుకువెళ్ళడం మరిచి పోతే, "ఏమీ కాదు, కూతురు క్షేమంగా వచ్చేస్
తుంది, నేను నమ్మిన ఈశ్వరుడు ఉన్నాడు" అని నిబ్బరంగా ఉండే వాళ్ళ కంటే, అదే మొబైల్ ఫొన్ కూతురు చేతిలో ఉండి, ఒక ఫోన్ చేసి కనుక్కున్నాక, ప్రశాంతంగా ఉండే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.. అంటే ఎన్ని తెలిసినా, చదివినా.... పూర్తి జ్ఞాన స్థాయిలోకి వెళ్ళడానికి సమయం పడుతుంది కదా.... అప్పటి వరకు మనకి మంచి విషయం ఎవరు చెప్పినా స్వీకరించాలి.
పొద్దున్న లేచిన దగ్గర నుంచి అనేక సనాతన ధర్మమునకు సంబంధించి వింటున్నాము, అనుష్టిస్తున్నాము, కానీ కొన్ని విషయాలు మనకి (ఇప్పటి తరంలో నాబోటి వాడికి), పాశ్చాత్యులలో ఉన్న కొద్ది మంది గొప్ప వ్యక్తులు మన వేదాల గురించి, ధర్మము గురించి చేసిన ప్రరిశోధన, వాళ్ళు చేసిన రీసెర్చ్ గురించి తెలుసుకోవడం కూడా అవసరమే.... ఉదాహరణకి, ఒక సారి బ్రహ్మశ్రీ సామవేదం వారు చిదంబర రహస్యం గురించి ప్రవచనం చెప్తూ అన్నారు, నటరాజ తత్వం గురించి, చిదంబర రహస్యం గురించి ప్రస్తుత తరంలో మనకి తెలుసున్న దాని కంటే, ఆంగ్లేయులు కొంత మంది చేసిన అపూర్వమైన పరిశోధన నుంచి మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయి. నేను కూడా ఆ పుస్తకం చదివి కొన్ని తెలుసుకున్నాను అని చెప్పారు. ఆంగ్లేయులు The Cosmic Dance of Shiva అనే పేరున అనేక పుస్తకాలు వ్రాశారుట.
అప్పుడు, మనకి మన పూర్వీకులు, ఋషులు ఇచ్చిన సంపద ఏమిటో, మన ఎంత విలువైన సాంప్రదాయానికి వారసులమో తెలుసుకుని, మన ధర్మం పైన మరింత పూనిక పెంచుకోవడం కోసమే కానీ, ఏదో శంఖంలో పోస్తేనే తీర్థం అన్నట్లుగా మళ్ళీ మన శాస్త్రాల గురించి కూడా తెల్లవాడు చెప్తేనే నమ్మాలా అని అనకోవద్దు. కాకపోతే ఇలా తెలుసుకోవడం అనేది, ఇక్కడితో ఆగకుండా, మన తరంలో, దీని పైన మరింత దృష్టి సారించి, మరిన్న అద్భుతమైన విషయాలు మన సాధన ద్వారానో, పరిశోధనల ద్వారానో, పెద్దలు, ఋషి తుల్యులు అయిన వారి బోధల ద్వారానో, మనమందరమూ కూడా ఇంకా ఇంకా తెలుసుకుని మన భావి తరాల వారికి మనం ఎటువంటి విద్యకు వారసులమో తెలియజేయాలి... అని నా కోరిక. @ మోహన్ కిషోర్ --- ఈ పోస్ట్ శ్రీ మోహన్ కిషోర్ గారు సత్సంగము గ్రూప్ లో పోస్ట్ చేసారు . ఇంత చక్కటి పోస్ట్ ను మీరు కూడా చూడాలని ఈ బ్లాగ్ లో పోస్ట్ చేశాను . శ్రీ మోహన్ కిషోర్ గార్కి నా హృదయ పూర్వక ధన్యవాదములు . ఆయన బ్లాగ్ మీకు చాల ఉపయోగపడుతుంది. http://shaktiputram.blogspot.in/
నేను కాకినాడ లో ఉద్యోగం చేస్తున్నప్పుడు మొట్టమొదటి సరిగా సర్పవరం దగ్గర ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి గుడికి వెళ్లాను స్వామి వార్ని చూసిన తరువాత స్వామి ని చూడ్డం దేవుణ్ణి మొదటసారిగా చూసినట్లు అనిపించింది. చిన్నప్పటి నుంచి తిరుపతికి మొక్కుకోవడం అంటే భయం నాకు ..తిరుపతి వేల్లగలనో లేదో అనే భయం అది . దేవుడు పై భక్తీ శ్రద్దలు అలాంటివి ఏమి లేవు ... నచ్చినప్పుడు గుడికి వెళ్ళడం . చాల రోజులు అయింది దేవుణ్ణి చూసి అనిపించినప్పుడు ఒకసారి దేవుణ్ణి చూసి రావడం అంతే. నిజానికి దేవుణ్ణి నేను నా చిన్నపుడే చూసాను .. ఏప్పుడు అనుకుంటున్నారా ..
నా చిన్నప్పుడే నేను శ్రీరామచంద్రుల పాదముద్రను చూసే అదృష్టం కలిగింది . నేను ఆరవ తరగతిలో ఉండగా జరిగిన శ్రీరామా నవమి నాటి మరోసటి రోజు ఆలయం లో నవమి రాత్రి రాముల వారి దగ్గర ఏర్పాటుచేసిన ఏర్పాట్లు ( ఏమని పిలుస్తారో తెలియదు) . ఒక వస్త్రం పై (మైదాపిండే అనుకుంటా ) పిండి మొత్తం చక్కగా సర్దారు . మరోక వస్త్రం రాముల వారని , సీతమ్మ తల్లిని కొద్దిగా దూరంగా ఎదురేదురగా ఉంచారు . మరోసటి రోజు ఉదయానికి ఒక వస్త్రం పై మన మోచెయ్యి అంత శ్రీ రాముల వారి పాదం ఉంది . మరొక వస్త్రం పై రాములు వారు సీతమ్మ ఆడుకున్నట్టు చిన్న గుర్తులు కనిపించాయి . నేను అనుమంతో నిజంగా రాముల వారి పదమేనా అనే డౌట్ గా కొలిచి మరిచుసాను.. బాబోయ్ ఇంత పాదం ఎవరకి ఉండదు . నిజంగా మా రాముల వారిదే ఇది అని అప్పుడే నమ్మాను . ఎప్పుడన్నా దేవుడు లేడు అని ఆలోచన వచ్చినప్పుడు ఆ రోజు దేవుడి పాదాలను చూసావ్ కదరా అని గుర్తుకు తెచ్చుకుంటాను . ఆరోజుల్లో ఇంత మీడియా లేకపోవడం తో కనీసం ఫోటో కూడా తెయలేకపోయారు మావాళ్ళు. కాని ఆలాంటి గుడి ఇప్పుడు 100 స||వ || పూర్తీ చేస్కుని రామదాసు కోసం ఎదురుస్తూ ఉంది :( ..
మా అమ్మగారు నేను 10 వ తరగతిలో ఉండగా నీకు ఉద్యోగం వచ్చిన తరువాత మనం తిరుపతి వెళ్దాం అనేవారు ..గత సంవత్సరం స్వామి వార్ని దర్శనం చేస్కున్నాం . నిజంగా చాల అదృష్టవంతున్ని 2011 లోనే స్వామి వార్ని 6 సార్లు దర్శనం చేస్కున్నాను. ఏమిటో అప్పుడే జూలై కూడా పూర్తీ కావస్తుంది . ఈ సారి స్వామి ఇంకా నాపై దయతల్చలేదు . నేను స్వామి వారి కొండపైకి వెళ్లి వచ్చిన తరువాత నా తరహాలో ఒక పోస్ట్ రాస్తాను . స్వామి వార్కి వినతిపత్రం లాగ ఈ పోస్ట్ ని పోస్ట్ చేస్తున్నా..
శ్రీ మహావిష్ణువు శయనించిన ఆదిశేషుడి ఏడుపడగలే తిరుపతిలో శ్రీనివాసుడు కొలువైన సప్తగిరులని పురాణ ప్రతీతి. ఆ ఏడు శిఖరాలూ శేషాద్రి,
నీలాద్రి,
గరుడాద్రి,
అంజనాద్రి,
వృషభాద్రి,
నారాయణాద్రి,
వేంకటాద్రి.
స్వామి వారి దర్శనం ఏల చేయాలో తెలియలేదు ఇప్పడివరకూ నాకు ..
మనం తలనీలాలు ఇస్తున్నాం కదా .. అసలు ఎందుకు ఇస్తున్నాం ?
స్వామి వారు అప్పు చేసారు అనడం లో ఉద్దేశ్యం ఏమిటి ? ఎవరి కోసం స్వామి వారు అప్పు చేసారు ?
వేంకటేశ్వర స్వామి ఎంతకాలం భులోకాలం ఉంటారు
ఈ వీడియొ మీకోసం
మీరు తిరుపతి వెళ్లేముందు / వెళ్ళినతరువాత : ఇప్పడికి చాలామందికి తెలియనది తిరుమలలో రూం బుక్ చేస్కోవడం .
*నాకు తెలిసి తిరుమల దేవస్థానం వారు ప్రతి జిల్లా లోను (e-darshan) సెంటర్ ను ఏర్పాటు చేసారు . మీరు తిరుమల వెళ్ళే ముందుగ ఇక్కడ కు వెళ్లి మీరు ఏ రోజుకు తిరుమల వేల్లదలుచుకున్నారో ఆ రోజు రూమ్స్ / దర్శనం టికెట్స్ ఇన్ఫర్మేషన్ అడగండి . రూమ్స్ కలిగా ఉన్నాయా లేదా వాళ్ళు మీకు చెబుతారు .
*రూమ్స్ / దర్శనం టికెట్ బుక్ చేస్కోవడానికి వెళ్ళేటప్పుడు మీ ఐడి ప్రూఫ్ తప్పనిసరిగా తీస్కుని వెళ్ళండి .
*రూమ్స్ / దర్శనం టికెట్ ధర ఎంత అంటారా అది మీ పరిదిలోనే ఉంటుంది . తక్కువలో ఐతే 50/- కి కూడా రూం ఉంటుంది .
*దూరం నుంచి వచ్చేవాలు ఐతే ట్రైన్ టికెట్స్ కూడా ఒకసారి చూడండి .. అందరు చెప్పేదే ఎక్కువ లగేజి తీస్కుని వెళ్ళకండి .. అలాగని అసలు తీస్కుని వెళ్ళడం మానకండి .
*పెద్దలు ముఖ్యంగా ఆరోగ్య సమస్య ఉన్నవాళ్లు మందులు మరిచిపోకండి .
*సరే తిరుమల చేరుకున్నాం . ఇప్పుడు మీరు C.R.O దగ్గరకు వెళ్తే మీకు రూం ని కేటాయిస్తారు . ( C.R.O అని అడిగితే అక్కడ చెబుతారు )
*తిరుమలలో ఇన్ఫర్మేషన్ ఎవరిని పడితే వార్ని అడగకండి . పోలీస్ వాళ్లనో లేదా అక్కడ పనిచేసే వల్లనో అడగండి . తిరుమలలో అన్ని చోట్ల ఇన్ఫర్మేషన్ సెంటర్స్ ఉంటాయి మీరు అక్కడకు వెళ్లి అడిగితె వారు మీకు కావాల్సిన సమాచారం తెలియచేస్తారు .
*మరో ముఖ్యమైన విషయం మీతో పాటు చిన్నపిల్లలు / పెద్దవాళ్ళు ఉంటే వాళ్లతో కూడా మీకు రూం ఎక్కడ వచ్చిందో మీరు ఇప్పుడు ఏ రూం లో ఉన్నారో వాళ్ళకి అడ్రస్ చెప్పండి ఒక వేల దారి తప్పిన వాళ్ళకు తెలుస్తుంది . *చాల సార్లు దర్శన టైం లో తప్పిపోవడం జరుగుతుంది . లేదా వారు వేరే లైన్ లో వెళ్ళిపోవడం జరుగుతుంది అలాంటప్పుడు కంగారు పడకండి . దర్శనం అయ్యాక అందరు ఒకేచోటుకు వస్తారు( గుడి బయట ) . అక్కడ వెయిట్ చేయమని ముందే చెప్పండి .
*గుడి బయటకు వచ్చాక కూడా ఎవరు కనబడకపోతే / రూం అడ్రస్ తెలియకపొతే మాత్రం ఎక్కువ దూరం వెళ్ళకుండా గుడికి దగ్గరలోనే ఉండమని చెప్పండి.
*గుడికి ఎదురుగా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది . ఆ ప్రక్కన సమాచార కేంద్రం ( చిన్న రూం లా ఉంది ) అక్కడే ఇలా తప్పిపోయిన వాళ్ళ సమాచారం తెలియచేస్తారు . ఎప్పుడైనా తెలియనప్పుడు కంగారు పడకుండా పోలీస్ వార్కి చెప్తే వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు .