Wednesday, 11 July 2012

Tiruttani తిరుత్తణి

మురుగపెరుమాళ్ళు-తిరుత్తణి | Subramanya Swami Temple - Tiruttani

  
తిరుత్తణి - Tiruttani

 సుబ్రహ్మణ్యేశ్వరుడికి ‘మురుగన్’ అనే పేరుంది. తమిళ ప్రజలు ‘మురుగన్’ పేరుతోనే స్వామిని ఇక్కడ పిలుచుకుని పూజిస్తారు. మురుగన్ అంటే మేనల్లుడు అని అర్ధం , విష్ణువుకి మేనల్లుడు కనుక మురుగన్ అని పిలుస్తారు .  

  • షణ్ముఖుడు - ఆరు ముఖాలు (పంచ భూతాలను + ఆత్మను ) గలవాడు
  • స్కందుడు - పార్వతి పిలచిన పదాన్ని బట్టి
  • కార్తికేయుడు - కృత్తికా నక్షత్ర సమయంలో అవతరించాడు
  • వేలాయుధుడు - శూలము ఆయుధంగా గలవాడు
  • శరవణభవుడు - శరములో అవతరించినవాడు
  • గాంగేయుడు - గంగలోనుండి వచ్చినవాడు
  • సేనాపతి - దేవతల సేనానాయకుడు
  • స్వామినాధుడు - శివునకు ప్రణవ మంత్రము అర్ధాన్ని చెప్పినవాడు
  • సుబ్రహ్మణ్యుడు - బ్రహ్మజ్ఙానము తెలిపినవాడు.
తమిళనాడులోని ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలు  (అఱుపడై వీడుగళ్) ఉన్నాయి . మనం చూడబోయే తిరుత్తణి ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ఒకటి .   అవి వరుసగా 
తమిళనాడులోని ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలు  (అఱుపడై వీడుగళ్) ఉన్నాయి ..
The Arupadaiveedu (six abodes) are the most important shrines for the devotees of Murugan in Tamil Nadu, India.
They are:

    Palani Murugan Temple (100 km south east of Coimbatore)
    Swamimalai (Near Kumbakonam)
    Thiruthani (84 km from Chennai)
    Pazhamudircholai (10 km north of Madurai)
    Thiruchendur (40 km south of Thoothukudi or Tuticorin)
    Thiruparamkunram (10 km south of Madurai).

 

1. తిరుచెందూర్ : Thiruchendur


ఈ క్షేత్రం తమిళనాడు లో తిరునెల్వేలి నుండి అరవై కిలోమీటర్ల దూరములో సముద్ర తీరములో ఉన్న అద్భుతమైన ఆలయం. కుమారస్వామి ఇక్కడ బాలుని రూపంలో దర్శనమిస్తారు . సాధారణంగా సుబ్రహ్మణ్య ఆలయాలు అన్నీ కొండ శిఖరములపై ఉంటాయి. కాని ఈ తిరుచెందూర్లో ఒక్కచోటే స్వామి సముద్ర తీరము నందు కొలువై ఉన్నాడు. 

"ఈ ఆలయంలో చెప్పుకోదగినది శిల్పుల నైపుణ్యం. భక్తులను కట్టిపడేసే అపురూప శిల్ప సమన్విత ఆలయంగా ఇది పేర్గాంచింది. తొమ్మిది అంతస్తుల రాజగోపురం పడమట ద్వారంనుంచి మరపురాని సరిహద్దు కట్టడంగా విరాజిల్లుతోంది. రాజగోపుర నిర్మాణానికి సంబంధించి ఆసక్తికరమైన ఓ కథ ప్రచారంలో ఉంది. మూడువందల సంవత్సరాలకు పూర్వం, తిరువాయదురై మఠపు మహా సన్నిదానపు దేశికామూర్తికి స్వామి కలలో కనిపించి, ఆలయ గోపురం కట్టమని ఆదేశించాడట. అయితే అతడు పేదవాడు కావడంవల్ల, గోపుర నిర్మాణానికై వచ్చిన కూలీలకు కూలీ డబ్బులకు బదులుగా స్వామివారి విభూతిని ఇచ్చాడట. కూలీలు ఆ విభూతినే మహాద్భాగ్యంగా భావించి, వెళుతుండగా మార్గంమధ్యలో ఆ విభూతి బంగారు నాణేలుగా మారాయట. ఇలా ప్రతిరోజూ జరుగుతూ, రాజగోపుర నిర్మాణం ఆరు అంతస్థుల వరకూ పూర్తయిందట.
సరిగ్గా ఆరవ అంతస్థు పూర్తికాగానే ఈ అద్భుతం జరగడం ఆగిపోయిందట. అనంతరం స్వామి దేశికాచార్యుని కలలో కనిపించి, మిగిలిన నిర్మాణానికి సీతాపతి మరైక్కార్ అనే భక్తుని దగ్గరకు వెళ్ళి, ఒక బుట్ట ఉప్పును తీసుకురమ్మనమని ఆదేశించాడట. దేశికామూర్తి స్వామి ఆదేశంమేరకు, సీతాపతి మరైక్కార్ దగ్గర ఓ బుట్ట ఉప్పు తీసకుని వస్తుండగా, మార్గం మధ్యలో ఆ ఉప్పు కాస్తా బంగారంగా మారిపోయిందట. ఆ బంగారు నాణేలతో దేశికామూర్తి మిగిలిన రాజగోపురాన్ని నిర్మించాడు.  "

2. తిరుప్పరంకుండ్రం : Tirupparankundram

ఈ క్షేత్రములో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఇంద్రుని కుమార్తె అయిన దేవయాని (దేవసేనా) అమ్మతో కళ్యాణం జరిగింది. ఈ క్షేత్రం తమిళనాడులో ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అయిన మధురై కి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. 
ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఒక్క క్షేత్రంలోనే సుబ్రహ్మణ్య స్వామి వారు కూర్చుని దర్శనమిస్తారు. మిగతా అన్నిచోట్ల స్వామి నిలబడిన మూర్తినే చూస్తాం.
3. పళముదిర్చొళై : Palamudircholai



ఈ క్షేత్రం మధురై సమీపంలో ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో కొండ మీద ఉంది. ఈ క్షేత్రములో సుబ్రహ్మణ్య స్వామి వారు చిన్నతనంలో ఆడుకొనే వారని చెప్తారు. ఇక్కడే వల్లీ మాత కూడా ఉండేదని చెప్తారు.
4. పళని :  Palani


ఈ క్షేత్రం తమిళనాడు లోని దిండిగల్ జిల్లాలో, మధురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రాలలో చాలా ప్రఖ్యాతి గాంచిన మహా మహిమాన్వితమైన దివ్య క్షేత్రం పళని. ఇక్కడ స్వామి వారు కేవలం కౌపీనంతో కనబడడంలో అంతరార్ధం “నన్ను చేరుకోవాలంటే అన్నీ వదిలేసి నన్ను చేరుకో” -  అని మనకి సందేశము ఇస్తున్నారు అని అర్ధం. అంటే ఈ పళని క్షేత్రము జ్ఞానము ఇచ్చే క్షేత్రము. అంతే కాదు ప్రఖ్యాత కావిడి ఉత్సవము మొదలయిన క్షేత్రము పళని.
5. స్వామిమలై : SwamiMalai
ఈ క్షేత్రం తమిళనాడు లోని తంజావూర్ జిల్లాలో కుంభకోణం సమీపంలో ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంది. స్వామిమలై అపారమైన జ్ఞానం. ఇక్కడ ప్రణవ రహస్యాన్ని పరమిశివుడికి చెప్పాడు సుబ్రహ్మణ్యుడు.
6.   తిరుత్తణి : Tiruttani
  

మనం అందరం ఇప్పుడు తిరువళ్లూర్ జిల్లాలో అరక్కోణం సమీపంలో   ఉన్న   ఆరు పడై వీడు ” లో మకుటాయమానమైన  తిరుత్తణి క్షేత్రాన్ని దర్శించుకుని  వద్దాం . 
ఈ దివ్య క్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వల్లీ దేవసేన అమ్మవార్ల సహితంగా కొలువయ్యారు. తమిళనాడులోని సుబ్రహ్మణ్య క్షేత్రాలలో విశిష్టమైనదిగా పేర్గాంచిన ఈ క్షేత్రం తమిళులందరికీ ఆరాధ్య క్షేత్రం. తమిళుల ఇష్టదైవంగా, ఇలవేల్పుగా పూజలందుకుంటున్న సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఇక్కడ మురుగపెరుమాళ్ళుగా పూజలందుకుంటున్నాడు. శ్రీవారు వెలసి ఉన్న కొండకు ఇరుపక్కలందూ పర్వత శ్రేణులు వ్యాపించి ఉన్నాయి. 



ఉత్తరాన గల పర్వతం కొంచెం తెల్లగా ఉండడంవల్ల దీనిని ‘బియ్యపుకొండ’ అని పిలుస్తారు. దక్షిణం వైపునగల కొండ కొంచెం నల్లగా ఉండడంవల్ల దానిని ‘గానుగ పిండి కొండ’ అని పిల్వడం జరుగుతోంది. సుబ్రహ్మణ్యేశ్వస్వామి దేవతలు, మునుల బాధలు పోగొట్టడానికి శూరపద్మునితో యుద్ధం చేసిన అనంతరం, వల్లీదేవిని వివాహం చేసుకోవడానికి బోయకుల రాజులతో చేసి చిన్నపోరు ముగిసిన అనంతరం శాంతించి, ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువయ్యాడని ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. స్వామి శాంతించి ఇక్కడ కొలువయ్యాడు కనుక ఈ క్షేత్రానికి ‘తణిగై’ లేదా ‘శాంతిపురి’ అనే పేరొచ్చింది. అలాగే ‘తణిగ’ అనే పదానికి మన్నించుట, లేదా ఓదార్చుట అని అర్థం చెబుతారు. స్వామి భక్తుల తప్పులను, పాపాలను మన్నించి, కటాక్షిస్తాడు కనుక ఈ క్షేత్రానికి తిరుత్తణి అని పేరు వచ్చింది.  ట్రైన్ లో తిరుత్తణి వెళ్తే రైల్వే స్టేషన్ బయటకి వస్తే రోడ్ కనిపిస్తుంది . అక్కడ నుంచి ఎడమ వైపుకి నడిస్తే బస్సు స్టాండ్ ని చేరుకుంటాం . బస్సు స్టాండ్ నుంచి కొండ పైకి బస్సు లు ఆటో లు ఉంటాయ్ .. లేదా మెట్ల మార్గం కూడా ఉంటుంది.  సరే ఇప్పుడు మనం మెట్ల మార్గం ద్వారా కొండపైకి వెళ్దాం .



ఇక్కడ మనకి  కొండ క్రిందనే కల్యాణకట్ట  (పైన కూడా ఉంది అనుకుంటా) ఉంటుంది .  ఇక్కడ ఎవరైనా తలనీలాలు సమర్పించు భక్తులు ఉంటె వెళ్ళండి .. 



 వెళ్ళే ముందు తలనీలాలు ఎందుకు సమర్పిస్తున్నామో తెలుసుకుని ఆ పని చేయండి.



సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఇక్కడ తన తండ్రి అయిన పరమేశ్వరుని పూజించ తలచి తిరుత్తణి కొండపై తన నివాసానికి ఈశాన్య భాగాన శివలింగ ప్రతిష్టచేసి సేవించాడట. కుమారస్వామి పితృభక్తికి మెచ్చిన సాంబశివుడు సంతోషించి కుమారస్వామికి ‘జ్ఞానశక్తి’ అనే ‘ఈటె’ను అనుగ్రహించాడట. ఆ కారణాన ఈ స్వామికి ‘జ్ఞానశక్తి ధరుడు’ అనే పేరొచ్చింది.

 ఇక్కడ కుమారస్వామి స్థాపించిన లింగానికి కుమారేశ్వరుడనే పేరొచ్చింది.
 ఇక్కడ కనిపిస్తుంది చూసారా కోనేరు ..


 కుమారస్వామి, శివుని అర్చించడానికి సృష్టించిన తీర్థమే కుమారతీర్థము. దీనిని శరవణ తీర్థమని కూడా పిలుస్తారు. 

మనం కొండపైకి వెళ్తున్నపుడు దారిపొడవునా మనకి దుకాణాలు కనిపిస్తూనే ఉంటాయ్ .. 

మెట్లక్కేడం స్టార్ట్ చేయబోయే ముందు ఎవరికైనా వాటర్  బాటిల్ కావాలంటే కొనుక్కోండి  :)

 ఇంకా మెట్లు స్టార్ట్ అవబోతున్నాయ్ .. మీ చెప్పులను ఈ షాప్ లా వద్ద వదిలి రండి

ఇక్కడ  మొత్తం 365 మెట్లున్నాయి. ఈ మెట్లను సంవత్సరంలోని 365 రోజులకు ప్రతీకలుగా చెబుతారు. 365  అనగానే కంగారు పడకండి.  ఒకసారి ఇలా చూడండి మొట్ట మొదటి మెట్టు ఇదే 


 గమనించార మెట్ల మధ్య ఎంత దూరం ఉందో.. ఇక్కడ మెట్ల పైన మన తెలుగు పేర్లు కూడా కనిపిస్తాయ్ మనకి . తిరుపతి లాగే ఇక్కడ కూడా మెట్లకు  పసుపు ,కుంకుమ రాయడం . కర్పూరం వెలిగించడం చేస్తారు . అందుకే చెప్పులతో నడవకోడదు అని చెప్పేది.

 ఈ ఫోటోని జాగ్రత్తగా చూడండి .. నేను చెప్పింది నిజమే కాదో


 ఇక్కడ ఎవరైనా టోపీలు కొనుక్కుందాం అనుకుంటున్నారా ?


 చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటె వార్కి కావాల్సిన  అన్ని దొరుకుతాయ్ .. దిగే తప్పుడు కొందాం అనుకుంటే మీ ఇష్టం మరీ






శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి ఆలయం అతి పురాతనమైనది. 1600 సంవత్సరాలకు పూర్వంనుంచే ఇక్కడ ఈ ఆలయం ఉన్నట్లు శాసనాల ద్వారా అవగతమవుతోంది. క్రీ.శ.875-893లో అపరాజిత వర్మ అనే రాజు శాసనమందు, క్రీ.శ.907-953లో మొదటి పరాంతక చోళుడి శాసనంలో ఈ క్షేత్రం గురించి ప్రస్తావించబడటంవల్ల 1600 సంవత్సరాలకు పూర్వమే పల్లవ, చోళ రాజుల చేత ఈ క్షేత్రం కీర్తింపబడిందని అవగతమవుతోంది.




ఇక మెట్లు అయిపోవచ్చాయ్ .. ఆదిగో చూడండి .. అవిఎక్కేస్తే అయిపోయినట్లే 

క్షేత్ర స్థల పురాణము ప్రకారం
త్రేతా యుగములో శ్రీ రామచంద్ర ప్రభువు రావణ సంహారము చేసిన తర్వాత రామేశ్వరం లో ఈశ్వరుడిని ఆరాధిస్తారు. అక్కడ, ఈశ్వరుడి ఆనతి మేరకు, శ్రీ రాముడు ఈ తిరుత్తణి క్షేత్రము దర్శించినారు. ఆ తర్వాతనే శ్రీరామచంద్రునికి పూర్తి మనశ్శాంతి కలిగింది.

ద్వాపర యుగములో, మహా వీరుడైన అర్జునుడు దక్షిణ దేశ తీర్థ యాత్రలు చేస్తూ, ఇక్కడ తనికేశన్ స్వామి వారిని కొలిచినారు. శ్రీ మహా విష్ణువు ఈ క్షేత్రములోనే సుబ్రహ్మణ్యుడి పూజ చేసి ఆయన పోగొట్టుకున్న శంఖు, చక్రములను తిరిగి పొందినారు. (అంతకు పూర్వం వాటిని తారకాసురుడు శ్రీ మహా విష్ణువు నుండి చేజిక్కించుకుంటాడు).
భక్తులు అందరు ఇలా వచ్చి హుండిలో మీ కానుకలను వేయండి . 


గర్బగుడిలో స్వామి వార్కి సాష్టాంగ నమస్కారం చేయడం కుదరదు కాబట్టి భక్తులు ఇక్కడే  సాష్టాంగ నమస్కారం  చేస్తారు .

ఇక్కడ ఉప్పు మిరియాలు కలిపినవి అల పోసి నమస్కరిస్తారు  


ఖర్పురం వేలిగించి స్వామి వార్కి నమస్కారం చేస్తారు 



మనం మొన్న తిరువళ్లూర్ కూడా  చూసాం కాదా !
మీదగ్గర మిరియాలు తో కలిపినా ఉప్పు లేదు  అంటారా ? తెలియక తెచ్చుకోలేదా? ఏం పర్వాలేదు .. ఆ పక్కనే అమ్మతారు . సో మీరు కంగారు పడనవాసరం లేదన్నమాట :)


ఇక్కడ ఎవరైనా చిన్నపిల్లలు కలవారు ఉన్నారా? 


 రండి ఇప్పడికే ఆ ఆలస్యం అయింది దర్శనానికి వెళ్దాం .. 


ఉచిత దర్శనం తో పాటు .. 25/-, 50/- , 100/- ప్రత్యేక దర్శనం కూడా కలవు 
.
ఇక్కడ అందరు తెలుగు మాట్లాడతారు .. 


ఏవరు తోస్కోకుండా చూడండి స్వామి వార్ని 



ఇక్కడ ప్రసాదం అమ్ముతారు అన్న విషయం నేను చెప్పకుండానే తెల్సింది కదా :)



 మన గుళ్ళకి  ఇక్కడకి  తేడ ఏమిటంటే .. ఇదే . అర్ధం అయింది కదా



ఆలయ నమూనా



తిరుత్తణి  క్షేత్రాన్ని చేరుకోవడానికి తిరుపతివరకూ వెళ్ళి అక్కడనుంచి ఏదైనా వాహనంలోగాని బస్సులోగాని, రైలులో గాని ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. ఈ క్షేత్రంలో బసచేయడానికి భక్తులకు కావాల్సిన అన్ని వసతులూ ఉన్నాయి.

చెన్నై నుండి 84 Km, తిరుపతి నుండి 68 Km, అరక్కోణం ( కాణిపాకం )నుండి 13 Km దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఈ ప్రదేశాలు అన్నిటి నుంచి బస్సు సౌకర్యం ఉంది.
నిజానికి ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీ మోహన్ కిషోర్ గారి బ్లాగ్ చూడండి అంటే సరిపోయేది . ఈ విధంగానైనా  కార్తికేయుడు పేరు స్మరిద్దాం కదా అని రాసాను అంతే . చాలావరకు  ఆ బ్లాగ్ లోంచే రాసాను .  చాల చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మోహన్ గార్కి ధన్యవాదములు తెలియచేస్తున్నాను .
http://shaktiputram.blogspot.in/2011/09/blog-post_19.html
****మీ కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తేలియచేయడం మరిచిపోకండి****

Thursday, 31 May 2012

Pardha Saradhi Temple - Triplicane

పార్థ సారథి దేవాలయం -ట్రిప్లికేను,చెన్నై | Pardha Saradhi Temple - Triplicane



పార్థ సారథి దేవాలయం చెన్నైలోని  ట్రిప్లికేనులో కలదు.  సంస్కృత భాషలో పార్థసారధి అంటే పార్థుడు = అర్జునుడు యొక్క సారథి = రథాన్ని నడిపినవాడు అని అర్థం అంటే శ్రీ కృష్ణుడు.





బీచ్ కి దగ్గరలోనే కలదు .Triplicane రైల్ స్టేషన్ లో దిగితే చాల దగ్గర . లేదా బస్సు లో ఐతే క్రికెట్ స్టేడియం దాటినా తరువాత 2వ స్టాప్ .. అక్కడ దిగితే మీకు ఈ ఎంట్రన్సు కనిపిస్తుంది  .


 ఆళ్వారులచేత పాడబడిన 108 దివ్య స్థలములలో " తిరువళ్ళిక్కేణి" కూడా ఒక దివ్య స్థలము . ఈ పుణ్యక్షేత్రాన్ని " బౄహదారణ్య " క్షేత్రం అనే పేరుతో పిలుస్తుండే వారు .ఈ  దేవాలయము 1000 సంవత్సరములకు ముందే నిర్మిచబడింది . దేవాలయమందున్న శిలలేఖములవలన ఈ క్షేత్రమును నందివర్మ అనే పల్లవరాజు (779 - 830 ) మరియు విజయనగర రాజైన వేంకటపతి మహారాజు (1586 - 1616 ) మొదలైన మహారాజుల పాలనలో ఉండేదని తెలుస్తుంది . ఈ దివ్య మందిరము యొక్క మూలవిరాట్టు శ్రీ పార్ధ సారధి స్వామి యొక్క నిలువెత్తు విగ్రహము దర్శనం ఇచ్చును . స్వామి వారు ఎడమ భాగము నందు  "పాంచజన్య శంఖము " కనిపించును . దక్షిణ భాగమున శ్రీ చక్రము కాకుండా హస్తము పదము వైపు చూపించెను.  స్వామి వారు తూర్పు దిక్కున చూస్తున్నట్లు దర్శన మిచ్చును .స్వామి వారి భార్య రుక్మిణి ,అన్న బలరాముడు, తమ్ముడు సత్యకి కుమారుడు ప్రద్యుమ్నుడు , మనుమడు అనిరుద్ధుడు మొదలుగువారి సమేతంగా పార్ధ సారది దర్శన మిచ్చును . ఈయన మరో పేరు " వెంకట కృష్ణ



ఇక్కడో విషయం చెప్పాలి మీకు .. మీకు తిరుపతి తెలుసా ? ద్వారక తిరుమల కాదండి . మరొక తిరుపతి ఉంది. సామర్లకోట దగ్గర లోనే తిరుపతి (దివిలి నుంచి 2కి.మీ.)  ఉంది . అక్కడ కూడా స్వామి వారు . కుడి చేతిలో శంఖము , ఎడమ చేతిలో చక్రము పట్టుకుని మనకు దర్శనము ఇస్తారు . అక్కడ స్థల పురాణం ప్రకారం  ధౄవునికి  స్వామి వారు అక్కడే దర్శనం ఇచ్చారంట .  స్వామి వారు  ధౄవున్ని చూస్తూ నవ్విన నవ్వు మనకి చాల  స్వష్టంగా కనిపిస్తుంది.
మహాభారత యుద్ధము నందు ధ్రమసంస్తపనము చేయుటకై మహారధి భీష్ముని బాణాలు పార్ధసారధి యొక్క కపాలమున గుచ్చుకున్నవి కనిపించును . ఉత్సవమూర్తి నందు ఈ గుర్తులు కనిపించవు .


ఈ ఆలయం లో తెలుగు ఎక్కువగా కనిపించును ..

శ్రీ విష్ణు సవాస్రనామ స్తోత్రము 


పై ఫోటో లో తెలుగు పేర్లు చూసారా ? మీకు క్రింద కనిపిస్తున్నది స్థలపురాణం నేను పైన రాసింది అంత ఈ బోర్డు చూసే


కురుక్షేత్ర సంగ్రామంలో ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేయడం వల్ల  మహావిష్ణువు ఆయుధమైన సుదర్శన చక్రం ఉండదు. చేతిలో కేవలం శంఖం మాత్రమే ఉంటుంది







* ఈ దేవాలయ ప్రాంగణములో ఉన్న అనుబంధ గుళ్ళు
* వేదవల్లి గుడి
* రంగనాథ స్వామి గుడి
* శ్రీరాముని గుడి
* వరదరాజస్వామి గుడి
* నరసింహ స్వామి దేవాలయం
* ఆండాళ్ళమ్మ గుడి
* అంజనేయ స్వామి దేవాలయం
* అళ్వార్ల సన్నిధి
* రామానుజాచార్యుల సన్నిధి
* భృగు మహర్షి గుడి







 ఆలయం వెలుపల కేనేరు కలదు .. చాల సువిశాలంగా ఉంది .




మీరు ఈ ఆలయం లో   వేదవల్లి గుడి,రంగనాథ స్వామి గుడి, శ్రీరాముని గుడి, వరదరాజస్వామి గుడి, నరసింహ స్వామి దేవాలయం,  ఆండాళ్ళమ్మ గుడి , అంజనేయ స్వామి దేవాలయం , అళ్వార్ల సన్నిధి, రామానుజాచార్యుల సన్నిధి, భృగు మహర్షి గుడి  కలవు .
* అమరనాథ్ యాత్ర విశేషాలు  
http://sujathathummapudi.blogspot.in/2012/05/blog-post_30.html
****మీ కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తేలియచేయడం మరిచిపోకండి****

Thursday, 3 May 2012

Tiruvallur Temple Information

తిరువళ్ళూరు- శ్రీ వీర రాఘవుల స్వామి | Sri Veeraraghava Swami Temple- Tiruvallur

Tiruvallur Temple Information  :
తిరువళ్ళూరు, తమిళనాడు రాష్ట్రంలోగల సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. తిరువళ్ళూరు జిల్లాకు ప్రధాన పట్టణం. త్రిమూర్తులలో స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు వివిధ రూపాలలో...వివిధ పేర్లతో కొలువుతీరిన అత్యంత మహిమాన్వితమైన దివ్య క్షేత్రాలకు-‘దివ్యతిరుపతులు’,‘దివ్య దేశములు’ అని పేరు. మొత్తం 108 దివ్య తిరుపతులు వున్నాయి. 108 దివ్య తిరుపతులలో ఒకటైన ‘తిరువళ్ళూరు- Tiruvallur’లో శ్రీ మహావిష్ణువు ‘శ్రీ వీర రాఘవస్వామి’ పేరుతో శయనరూపం నయన మనోహరంగా కొలువుతీరి పూజలందుకుంటున్నాడు.


ముందుగా తిరువళ్ళురు ఎక్కడ ఉందో చెప్తాను, చెన్నై నుంచి  అరక్కోణం వెళ్ళేదారిలో ఉంది . చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్  పక్కనే ఉన్న లోకల్ స్టేషన్ నుంచి తిరువళ్ళురు  కి డైరెక్ట్ గా వెళ్లి ట్రైన్స్ ఉన్నాయ్ లేదా అరక్కోణం వెళ్ళే ట్రైన్ ఎక్కినా మీరు తిరువళ్ళురు చేరుకోవచ్చు . సుమారు 1 .30 hrs సమయం పడుతుంది .  తిరువళ్ళురు రైల్వే స్టేషన్ లో దిగిన తరువాత కుడివైపు కు వెళ్ళాలి . రైల్వే స్టేషన్ నుంచి గుడికి సుమారు 4 కి.మీ. దూరం ఉంటుంది . గుడి దగ్గరకు వెళ్ళడానికి  బస్సు లు ,ఆటో లు ఉంటాయి . మీరు బస్సు లో కంటే ఆటో వెళ్ళడమే మంచిది మనిషికి 10 /- తీస్కుంటారు .

పూర్వం తిరువళ్ళూరుకు ‘వీక్షారణ్య క్షేత్రం’ అనే పేరు వుండేది. స్వామివారు పూర్వం ‘ఎవ్వళ్’ (ఎక్కడ) పవళించాలని అడుగగా ఇవ్వళ్ (ఇక్కడే) పవళించమని శాలిహోత్రముని చెప్పిన ప్రాంతం కనుక ఈ క్షేత్రానికి ‘ఇవ్వళ్‌ఊర్’ అనే పేరు ఏర్పడినట్టు కథనం. ‘ఇవ్వళ్‌ఊర్’ అనే పేరు ప్రజల వాడుకలో కాలక్రమంలో మార్పుచెంది ‘తిరువళ్ళూర్’ అయినట్టు చెప్పబడుతూ వుంది.
ఈ ఆలయం లోని అధిష్టాన దైవమైన వీరరాఘవ స్వామి ఈ లోకంలోని సకలజీవరాసులకు అలాగే సకల జీవరాశులకు రక్షణ కలిగించేవాడు. అతడి దివ్యమైన పాదాలు సకల జీవులకు తక్షణ రక్షణ కిలిగించడమే కాక అసక్త నుండి అనారోగ్యం నుండి కూడా ఉపశమనం కలిగిచి అరోగ్యవంతమైన జీవితాన్ని కానుకగా ఇస్తాయి. ఇక్కడ ఉన్న వైద్యవీర రాఘవస్వామి కుటుంబ సమస్యలకు పరిష్కారం, వివాహజీవితంలో చిక్కులు విడదీయడం, ఆస్తులు భూముల సమస్యలను పోగొట్టడం వంటివి కలుగుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. అంతేకాక చాలాకాలంగా సంతాన లేమితో బాధ పడుతున్న దంపతులకు సంతాన భాగ్యాన్ని కలుగజేసాడ్ని విశ్వసిస్తున్నారు. ఇక్కడ శాలిహోత్ర మహర్షికి విష్ణుమూర్తి ప్రత్యక్షమై సంతాన వరాన్ని ఇచ్చాడని స్థల పురాణం చెప్తుంది. తమిళంలో తిరు అంటే పవిత్రమైన అని అర్ధం ఈ వుళ్ అంటే ఇవ్వడం అని అర్ధం. కనుక పవిత్రమైన దైవం సంతాన వరాన్ని ఇచ్చిన క్షేత్రం కనుక ఇది తిరువళ్ళూరు అయింది.





స్థలపురాణం అనుసరించి తై అమావాస్య అంటే సంక్రాంతి తరువాత వచ్చే అమ్మావాస్య రోజున మహర్షి తపసుకు మెచ్చిన శ్రీమన్నారాయణుడు ముసలి వాడి వేషంలో వచ్చి మహర్షి పెట్టిన బియ్యపు పిండిని ఆహారంగా స్వీకరించి ఆయన నేసిన మూడు గజముల వస్త్రమును ధరించి ఆరోజు రాత్రి ఆయన గృహములో నివసించడానికి చోటు చూపమని అడిగాడు. ఆయన చూపిన గదిలో ఆ రాత్రికి విశ్రమించాడు. 

మరునాడు ఉదయం మహర్షి శాలిహోత్రుడు తన నిత్య పూజా కార్యక్రమాలను చేసి ముసలి వాడి వద్దకు వచ్చి చూడగా అక్కడ శేషశైనంలో పవళించి లక్ష్మీ దేవితో నాభికమలంలో బ్రహ్మదేవుడితో సహా శ్రీమన్నారాయణ విగ్రహం కనిపించింది. తరువాత విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకొమ్మని మహర్షితో చెప్పగా ఆయన తన మోక్షం మాత్రమే కావాలని అయినా ఇక్కడకు వచ్చి దర్శించుకునే భక్తులకు ఆరోగ్యాన్ని కలిగిస్తూ శ్రీ వైద్య వీరరాఘవుడిగా ఉండి వారి కోరికలను పూర్తి చేసి వారికి ప్రశాంత జీవితాన్ని ఇచ్చి పోగొట్టుకున్న సంపదలని తిరిగి పొందేలా చేయమని ఎటువంటి కష్టాలైన తొలగించి అరోగ్యాన్ని ఐశ్వైర్యాన్ని అందించాలని కోరుకున్నాడు. 


అమావాస్య రోజు మాత్రం ఆలయం భక్తులతో రద్దీగా ఉంటుంది . శని -ఆదివారం కూడా ఆలయం ఆలయం భక్తులతో రద్దీ బాగానే ఉంటుంది  . దర్శనానికి 1 గంట  లోపే పడుతుంది . మిగత రోజులల్లో ఐతే మీరు అర్చనలు కూడా చేయించుకోవచ్చు .


ఈ ఆలయం లో లక్ష్మి దేవికి ప్రత్యేక సన్నిది కలదు . రాముల వార్కి , శ్రీ కృష్ణు నాకు కూడా ప్రత్యేక సన్నిది కలవు . ఆలయం లో శిల్పకళ ఆకట్టుకుంటుంది



 ఉప్పు మిరియాలు కలిపి ఇలా వేస్తున్నారు ..

శ్రీ వీరరాఘవస్వామి వారిని దర్శించి ఉప్పు, మిరియాలను సమర్పించడంవల్ల వివిధ వ్యాధులు ప్రధానంగా చర్మవ్యాధులు నయమవుతాయని చేపట్టిన పనులు విజయవంతమవుతాయని చెప్తారు.

ఇక్కడ ఉన్న కోనేరు చాల పెద్దది ..


మీ కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తేలియచేయండి మరిచిపోకండి