7-4-2013
తిరుమల శ్రీవారి మెట్టు మార్గం ( SRIVARI METTU TIRUMALA)
తిరుమల బస్సు స్టాండ్ నుంచి శ్రీ వారి మెట్టుకు ఉచిత బస్సు కలవు . అలిపిరిలో ఉన్నట్లు గానే ఇక్కడకూడా ఉచిత లగేజి కౌంటర్ ఉంది .
మెట్ల మార్గం గుండా నడిచేవెళ్ళే వాళ్ళు తమ బాగ్ లను ఇక్కడ ఉంచితె.. దేవస్థానం వాళ్ళు కొండపైకి తీస్కుని వెళ్తారు . ఇక్కడ నుంచి మెట్ల మార్గం 6 km ఉంటుంది . మీరు బస్సు దిగి మీ బాగ్ లను వీర్కి ఇచ్చేలోపే .. బస్సు వాడు మీకోసం వెయిట్ చేయకుండా వెళ్ళిపోతాడు .
మరో బస్సు కోసం వెయిట్ చేసే లోపు (30 min ) మీరు కనిపిస్తున్నాయ్ గా ఈ ఆటో లో మెట్లదగ్గరకు చేరుకోవచ్చు . ఆటో లో ఫ్రీ కాదండోయ్ షేర్ ఆటో ఐతే 15/- ( ఒక్కరికి ).. మీ ఒక్కరికే ఐతే 60 /- [ఈ ధరలు మారుతూ ఉంటాయ్ :) ]
నేను ఆటో నే ఎక్కాను .. ఈ 6 km రూట్ ఎలా ఉందో చూడండి ..
చూసారా ఆటో ఎంత స్పీడ్ గా వచ్చేసిందో అప్పుడే 6km వచ్చేసాం .
ఏడూ కొండలు ఎక్కకుండానే స్వామి వారు కొండక్రిందనే (టెంపుల్ ఉంది ) దర్శనం ఇస్తారు .
స్వామి వారి పదాలు ..
శ్రీ వారి మెట్టు ద్వారా నడక మార్గమున తిరుమలకు వెళ్ళు భక్తులను ఉదయం 6 గం ॥ల నుండి సాయంత్రం 6 గం ॥ల వరకు అనుమతించబడును .
SRIVARI METTU FOOT PATH WILL BE OPENED FROM 6.AM TO 6.00 PM ONLY.
అల్లిపిరిలో తిరుమల నడిచి వచ్చే వాళ్ళకు టోకెన్ లు ఇచ్చినట్టే ఇక్కడ కూడా ఇస్తారు . ఎందుకంటే మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మీకు ఆలస్యం ఐతే టోకెన్ ఇవ్వరు .
ప్రతి రోజు శ్రీ వారి మెట్టు 3750 టోకెన్లు మరియు అలిపిరి 11,250 టోకెన్లు నడక మార్గం ద్వారా నడిచి వచ్చే భక్తులకు 15,000 టోకెన్లు లేదా సాయంత్రం 5.00 గం ॥ల వరకు మాత్రమే జారిచేయబడును
. టోకెన్లు కోటా పూర్తీ అయిన లేదా సమయం ముగిసిన యెడల కౌంటర్లు ముసివేయబడును . కావున భక్తులు సహకరించ ప్రార్ధన .
నడక ప్రారంభించ బోతున్నాం .. ఒక్కసారి గట్టిగ గోవింద .. గోవింద
సుమారు 300 -400 మెట్లు వరకు చాల సులభంగ ఎక్కవచ్చు ..
చూస్తున్నారుగా మెట్లు మధ్య దూరం ఎంత ఉందో
గోవింద నామాలు చదువుకుంటూ .. గోపాలుడుని స్మరించుకుంటూ .. నడక సాగించండి
దివ్య దర్శనం టోకెన్ టికెట్ మరో 900 మెట్ల దూరం లో ఉంది .. గోవింద గోవింద
300 మెట్లు అప్పుడే పూర్తియినవి
అప్పుడే మనం టోకెన్ తీస్కునే చోటకి వెచ్చేసాం
టోకెన్ జాగ్రత్తగా ఉంచుకున్నారు కదా .. ఇక్కడే తనికి చేస్తారు ..
2100 మెట్లు వరకు వచ్చేసాం అండి . అప్పుడే చాల త్వరగా ఎక్కేస్తున్నాం కదా
మొదట్లోనే చెప్పాకదా .. 400 మెట్లవరకు బాగానే ఉంటుంది .. తరువాత మెట్లు ఇలా దగ్గర దగ్గరికి ఉంటాయ్
శ్రీ వారి మెట్టు కాలినడక వచ్చు భక్తులు లగేజి కౌంటర్ M. P.C కి ఎదురుగ ఉన్న బిల్డింగ్ లో తీస్కోవచ్చు .
వచ్చేసాం అండి .. ఆఖరి మెట్టు ఇదే .. గోవింద గోవింద
మీరు వెళ్లి మీ బ్యాగ్ లను తీస్కుండి
ఒక్కోసారి బ్యాగ్ లు రావడం లేట్ అవుతుంది ..బ్యాగ్ లు వచ్చే లోపు .. స్వామి వారి అన్నదాన ప్రసాదం స్వికరించండి . ఇక్కడకి దగ్గరలోనే S.V.అన్నదాన భోజనశాల ఉంది
స్వామి వారి దర్శనం ఎలా చెయ్యాలో ఈ లింక్ క్లిక్ చేసి తెల్సుకోండి .
అలిపిరి నుంచి తిరుమల వెళ్ళాలి అనుకునే వారు ఈ లింక్ క్లిక్ చేయండి
శ్రీవారు మొట్టమొదటిసారిగా తిరుమల చేరుకున్న అతి పవిత్ర మార్గమిది .
శ్రీనివాసుడు పద్మావతిని పరిణయమాడిన తరువాత వారు ఈ దారిగుండానే తిరుమల చేరుకున్నారు .
తిరుమలకు ఇది అతి పురాతన నడకదారి.
ఒకప్పుడు చంద్రగిరి నుండి తిరుమలకు రాకపోకలన్నీ ఈదారి గుండానే జరిగేవి . శ్రీ కృష్ణ దేవరాయలు , అన్నమయ్య తదీతర మహా భక్తులు ఎందరో ఈ దారి గుండానే తిరుమలకు వెళ్లి స్వామి వార్ని దర్శించుకున్నారని ప్రతీతి.
--19-10-2013
Good information
ReplyDeleteఈ సారి ఈ మార్గంలో కొండ ఎక్కలి...సమాచారం చాలా బాగుంది..
ReplyDeletePratap garu.. ee sari velli swamy varni darshanam cheskuni randi..
Deletethank you ..
మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు...................
ReplyDeleteeesaari sri vaari mettu gundaane naaprayanam. govinda govinda.
ReplyDeleteuseful information
ReplyDeleteu can publish in english also
చాలా వివరంగా చక్కగా చిత్రాలతో చూపించారు మీకు నా ధన్యవాదాలు
ReplyDeletegood information vry great andi
ReplyDeletegood information vry great andi
ReplyDeleteఈ మార్గంగుండా నీను ఒకసారి వెళ్ళేను చాల బాగుంటుంది
ReplyDelete