తోలి తిరుపతి
ఈ తిరుపతి ఎక్కడుంది అనుకుంటున్నారా? సామర్లకోట కి 13 కి.మీ. దూరం లో ఉంది ( తూ ||గో|| జి). తోలి తిరుపతి అని కూడా పిలుస్తారు . దృవుడు తపస్సు చేసింది ఇక్కడే అని స్థలపురాణం
స్వామి వారు ప్రత్యక్షమైనప్పుడు తపస్సు చేస్తున్నా ఆ చిన్నపిల్లవాడిని చూస్తూ నవ్విన ఆ చిరునవ్వు ఇప్పడికి స్వామి వారి ముఖం లో అలానే కనిపిస్తుంది .మనం చూస్తూనే ఉండిపోతం ఆ నవ్వుని .
స్వామి వారి శంఖు చక్రాలు కూడా మరీ (కుడి ఎడమ - ఎడమ కుడి )ఉంటాయ్ ..
గుడి గోడలపై చెక్కిన శిల్పాలు
భక్తుల రద్దీ ఎక్కువగా ఉండదు... మీరు చక్కగా పూజా చేయించుకుని ప్రశాంతంగా కుర్చుని రావచ్చు .
మీరు ధ్రువ చరిత్ర వినకపోతే ఒకసారి విని వెళ్ళండి ...
మార్గం :
సామర్లకోట నుంచి దివిలి (11 k.m) వచ్చి అక్కడనుంచి తిరుపతి 2 కి.మీ.
పిఠాపురం నుంచి దివిలి (11 k.m) వచ్చి అక్కడనుంచి తిరుపతి 2 కి.మీ.
ఆటోలు కలవు .























