Showing posts with label తోలి తిరుపతి. Show all posts
Showing posts with label తోలి తిరుపతి. Show all posts

Friday, 1 February 2013

Toli Tirupati


తోలి తిరుపతి
ఈ తిరుపతి ఎక్కడుంది అనుకుంటున్నారా? సామర్లకోట కి 13 కి.మీ. దూరం లో ఉంది ( తూ ||గో|| జి). తోలి తిరుపతి అని కూడా పిలుస్తారు .

ఇక్కడున్నా  స్వామి వారి పేరు శృంగార వల్లభ స్వామి ( విష్ణు మూర్తి ).



దృవుడు తపస్సు చేసింది ఇక్కడే అని స్థలపురాణం 



స్వామి వారు ప్రత్యక్షమైనప్పుడు తపస్సు చేస్తున్నా ఆ చిన్నపిల్లవాడిని చూస్తూ నవ్విన ఆ చిరునవ్వు ఇప్పడికి స్వామి వారి ముఖం లో  అలానే కనిపిస్తుంది .మనం చూస్తూనే ఉండిపోతం ఆ నవ్వుని .


స్వామి వారి శంఖు చక్రాలు కూడా మరీ (కుడి ఎడమ - ఎడమ కుడి )ఉంటాయ్ .. 


చుట్టూ కొబ్బరిచెట్ల మధ్య ప్రశాంతంగా ఉంటుంది గుడి . 

గుడి లో ఉన్న ఒక చోట నుండి స్వామి వారని చూస్తే స్వామి వారు చూసినవారికి సమాన ఎత్తులో ఉంటారు . శ్రీదేవి భూదేవిలను ఇంద్రుడు మరియు  శ్రీ కృష్ణదేవరాయలు ప్రతిష్టించారు .






గుడి గోడలపై చెక్కిన శిల్పాలు





భక్తుల రద్దీ ఎక్కువగా  ఉండదు... మీరు చక్కగా పూజా చేయించుకుని ప్రశాంతంగా కుర్చుని రావచ్చు


మీరు ధ్రువ చరిత్ర వినకపోతే ఒకసారి విని వెళ్ళండి ...



మార్గం :
సామర్లకోట నుంచి దివిలి (11 k.m)  వచ్చి అక్కడనుంచి తిరుపతి 2 కి.మీ.
పిఠాపురం నుంచి దివిలి (11 k.m) వచ్చి అక్కడనుంచి తిరుపతి 2 కి.మీ.
ఆటోలు కలవు .


మీ కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తేలియచేయండి