Showing posts with label పంచభూతలింగక్షేత్రములు. Show all posts
Showing posts with label పంచభూతలింగక్షేత్రములు. Show all posts

Saturday, 18 January 2014

Sri Kalahasti Templeinformation

శ్రీ కాళహస్తి   - | Srikalahasti ( Vayulingam) - Andrapradesh
శ్రీ కాళహస్తి

కాకినాడ నుంచి తిరుమల వెళ్ళే భక్తులకు నా సలహా ఏమిటంటే .. తిరుమల వెళ్ళే శేషాద్రి exp . శ్రీ కాళహస్తి లో 4.30 -5. 00 ఆ టైం లో ఆగుతుంది మీరు అక్కడే దిగండి . రైల్వే స్టేషన్ లో స్నానం చేయడానికి ఏర్పాట్లు బాగానే ఉన్నాయ్ .. అక్కడ నుంచి టెంపుల్ కూడా దగ్గరే బయట ఆలయం వాళ్ళు ఏర్పాటుచేసిన ఉచిత బస్సు  మరియు షేర్ ఆటో లో కూడా ఉన్నాయి  .. శ్రీ కాళహస్తి లో ఉన్న  శివలింగం పంచభూతలింగాల్లో  ఒకటైన వాయు లింగం . మీరు దర్శనం చేస్కునేప్పుడు గమనిస్తే లింగానికి ఎదురుగ ఉన్న దీపం స్వామి వారి నుంచి వస్తున్నా గాలికి దీపం ఊగుతూ కనిపిస్తుంది . అక్కడ ఉన్న పూజారులు మీకు చెబుతారు .. మరో విషయం ఏమిటంటే మనం అక్కడ ఇతర కోరికలు ఏమి కోరకూడదు అని పెద్దలు చెబుతారు .. ఈ ఆలయం లో స్వామి వారి కంటే ముందే అమ్మవార్కి  ఉదయాన్నే పూజలు ప్రారంభిస్తారు .. భక్తుడైన కనప్ప కొండపైన దేవుడు కొండ క్రింద ఉన్న పుణ్యక్షేత్రం శ్రీ కాళహస్తి . ముందుగా భక్త కన్నప్పను దర్శించుకుని తరువాత స్వామి వారని దర్శనం చేస్కోవాలి అని స్థలపురాణం .. స్వామి వారి ఆలయం నుంచి బయటకి వచ్చేటప్పుడు కుడివైపుకి వైపు కి మీరు వెళ్తే అక్కడ చోట నుంచి చూస్తే  .. భక్తకన్నప్ప గుడి , అమ్మవారి గుడి , ఆలయ ద్వజస్థంబం కనిపిస్తాయి . అక్కడ ఉన్నవాళ్ళని అడగండి వాళ్ళు చూపిస్తారు . ఇక్కడ నుంచి తిరుపతికి రెగ్యులర్ గ బస్సు లు ఉంటాయి . ఆలయం బయట నిలబడితే అక్కడికే వచ్చి ఆగుతాయి సుమారు 1గం ॥ సమయం పడుతుంది . 
 










 
చారిత్మాక ప్రాశస్త్యం
క్రీస్తు పూర్వం ఒకటి రెండు శతాబ్దంలో వ్రాయబడిన తమిళ గ్రంధములో శ్రీ కాళహస్తిని దక్షిణ కైలాసముగా పేర్కొనబడినది.రెండు మూడోవ శతాబ్దంలో అరవైముగ్గురు శైవనాయన్మారులను శివ భక్తులలో ముఖ్యులైన అప్పర్ సుందరర్,సంభంధర్,మణిక్యవాచగర్ అనువారలు ఈ క్షేత్రమును సందర్శించి కీర్తించారు.మూడోవ శతాబ్దంలో సట్కిరర్ అను ప్రసిద్ధ తమిళ కవీశ్వరుడు రత్నముల వంటి నూరు తమిళ అందాదిలో శ్రీ కాళహస్తిశ్వరుని సోత్రరుపంగా కీర్తించాడు.జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ఆదిశంకరులు వారి ఈ క్షేత్రమును సందర్శించి అమ్మవారి ఎదుట శ్రీ చక్ర ప్రతిస్థాపన గావించియున్నారు.వారె స్పటికలింగము నొకటి నెలకోల్పినారు.పల్లవ,చోళ ,విజయనగర రాజుల కాలపు శిల్ప కళ వైపుణ్యం ఈ క్షేత్రమును వెలసినవి.క్రి.శ. 1516 లో శ్రీ కృష్ణదేవరాయలు పెద్ద గాలిగోపురమును , నూరు కాళ్ళ మండపమును (రాయల మండపము) నిర్మించినారు

శ్రీకాళహస్తిశ్వరస్వామి మహత్యం

శ్రీకాళహస్తిశ్వరస్వామి స్వయంభువు,శ్రీ అనగా సాలె పురుగు,కళా అనగా పాము,హస్తి అనగా ఏనుగు,ఈ మూడు జంతువులు శివభక్తి వలన సాయుజ్యం పొంది శివునిలో గలసిపోయినవి.అందువలన ఇచ్చట స్వామి వారికీ శ్రీ కాళహస్తిశ్వరుడు అని ఈ పురముకు శ్రీ కాళహస్తి అనియు పేరు వచ్చెను

సాలె పురుగు- శివ సాయుజ్యం
కృతయుగంలో చెలది పురుగు తన శరీరం నుంచి వచ్చు సన్నని దారంతో కొండఫైనున్న శివునికి గుళ్ళ గోపురాలు ప్రాకారములు కట్టి శివుని పూజించుచుండెను.ఒకనాడు శివుడు పరిక్షింపదలచి అక్కడ మండుచున్న దేపములో తగిలి సాలీడు రచించిన గుడి గోపురములను తగులబడిపొవుచున్నట్లు చేసిను. ఇది చుసిన సాలీడు దీపమును మ్రింగుటకు పోగా శివుడు ప్రతక్ష్యమై దాని భక్తికి మెచ్చి వరము కోరుకోమనెను.అపుడు సాలీడును మరల తనకు జన్మ లేకుండా చేయమని కోరుకొనెను.అందుకు శివుడు సమ్మతించి సాలిడుని తనలో ఐఖ్యమైనపోవునట్లు చేసిను.ఈ విధముగా సాలీడు శివసాయుజ్జ్యము పొంది తరించింది

నాగు పాము-ఏనుగు-శివారాధన చేసి తరించుట
ఏనుగు పాముల కథ త్రేతాయుగమున జరిగినది.ఒక పాము పాతాళము నుండి పెద్ద పెద్ద మణులను తెచ్చి ప్రతి దినము శివలింగమునకు పూజ చేసి పోవుచుండెను.త్రేతాయుగం ముగిసి,ద్వాపరయుగం వచ్చినది.అప్పుడు ఏనుగు శివలింగమునకు పూజచేసి పోవుచుండెను.త్రేతాయుగం ముగిసి ద్వాపరయుగం వచ్చినది.అప్పుడు ఏనుగు శివలింగమును సేవింపజొచ్చెను.అది స్వర్ణముఖి నదిలో స్నానమాచరించి తొండముతో నీరు,పుష్పములు,బిల్వదళములు తెచ్చి,పాము సమర్పించిన మణులను త్రోసివేసి,తాను తెచ్చిన నీటితో అభిషేకం చేసి పుష్పములతో అలంకరించి పూజించి వెడలి పోవుచుండెను.మరునాడు ఉదయం పాము వచ్చి చూచి తాను పెట్టి వెళ్ళిన మణులను గానక వానికి బదులు బిల్వములు,పుష్పములు పెట్టియుండుట గాంచెను.అప్పడు పాము మనస్సున చాలా బాధపడి వాడుక ప్రకారం ఏనుగు ఉంచి వెళ్ళిన పువ్వులను త్రోసివేసి,తాను ఇట్లు కొంత కాలము వరకు పాము ఉంచిన మణులను ఏనుగు ,ఏనుగు ఉంచిన పుష్పదులను పాము శుబ్రపరచి తమ తమ ఇష్టనుసరముగా పూజచేసి ఈశ్వరుని సేవించుచు వచ్చినవి..ఒక రోజు పాము విసుగెత్తి తన మణుల త్రోయబడి ఉండుటకు కోపం చెంది.ఈ విషయమునకు కారణము తెలుసుకొన గోరి ప్రక్కనే యున్నా పొదలో దాగి పొంచి యుండెను.అది గమనించిన పాము కోపముతో తన శత్రువుఅయిన ఏనుగు తొండములో దూరి కుంభస్టలమున నిలిచి డానికి ఉపిరి ఆడకుండా చేసిను.ఈ భాధకు ఏనుగు తాళ్ళజాలక ఈశ్వర ధ్యానంతోతొండముతో శివలింగము తాకి శిరస్సును గట్టిగా రాతికిమోది తుదకు మరణించెను.ఆ శిలాఘతమునకు ఏనుగు కుంభస్టలమున నుండిన పాము గూడా చచ్చి బయటబడినది.ఇట్లు ఇద్దరు తమ తమ నిజ స్వరూపంతో రుద్ర గణములుగా మరి స్వామి ఐఖ్యమొందిరి.

ఈ స్మృతి చిహ్నంగా కాళము పంచ ముఖ ఫణాకారముగా శిరోపరిభాగమునకు ఏనుగు సూచకముగా రెండు దంతములను,సాలె పురుగు అడుగు భాగంలోనూ,తన లింగాకృతిలో నైక్యమొనరించుకొని శివుడు శ్రీ కాళహస్తిశ్వరుడుగా ఇచ్చట దర్సనం ఇచ్చుచున్నాడు.ఆనాటి నుండి ఈ పుణ్యక్షేత్రంకు `శ్రీ -కళా-హస్తి అని పేరు వచ్చింది
 శ్రీ కాళహస్తి లోని గాలి గోపురం. శ్రీకాళహస్తికే మారుపేరుగా వుండిన ఈ రాయల గోపురము కూలి పోయింది.

సువర్ణముఖీ నదీ తీరమున వెలసిన ఈ స్వామి శ్రీకాళహస్తీశ్వరుడు. స్వయంభువు లింగము, లింగమున కెదురుగా వున్న దీపము లింగము నుండి వచ్చు గాలికి రెపరెపలాడును. శ్రీకాళహస్తిని 'దక్షిణ కాశీ ' అని అంటారు. శ్రీ కాళ హస్తి తిరుపతికి సుమరు నలబై కిలోమీటర్ల దూరంలో వున్నది. అన్ని విదాల రవాణ సౌకర్యాలున్నవి.

ఇక్కడి అమ్మవారు జ్ఞానప్రసూనాంబ , అంబాత్రయములలో ఒకరు. శివలింగము ఇక్కడ వర్తులాకారము వలె గాక చతురస్రముగ వుంటుంది. స్థల పురాణాల ప్రకారం ఇది బ్రహ్మకు జ్ఞానమును ప్రసాదించిన ప్రదేశం. వశిష్టుడు, సాలెపురుగు, పాము, ఏనుగు, బోయడు అయిన తిన్నడు (కన్నప్ప), వేశ్య కన్యలు, యాదవ రాజు, శ్రీ కాళహస్తీశ్వర మాహాత్మం వ్రాసిన దూర్జటి) వంటి వారి కధలు ఈ క్షేత్ర మహాత్మ్యంతో పెనవేసుకొని ఉన్నాయి.

కన్నప్ప అనే వేటగాడు నిత్యం స్వామిని కొలుస్తుండేవాడు . అతని భక్తిని పరీక్షించడానికి స్వామి ఒకరోజు తన కంటినుండి నెత్తురు కార్చేడట. వెంటనే కన్నప్ప తన కన్ను పీకి స్వామి వారికి అమర్చాడట. అప్పుడు స్వామి రెండవకంటి నుండి కూడ నెత్తురు కారటం మొదలయింది. భక్తుడైన కన్నప్ప సందేహించకుండా తన రెండవకన్ను కూడా పీకి స్వామికి అమర్చాడు. స్వామి ప్రత్యక్షమై భక్తుడైన కన్నప్పని కరుణించి ముక్తి ప్రసాదించాడు. ఈ దేవాలయము చాలా పెద్దది, పై కప్పుపై రంగులతో చిత్రించిన అనేకము లయిన చిత్రములు వున్నాయి. " మణికుండేశ్వరాఖ్య " అనే మందిరమువున్నది. కాశీ క్షేత్రములో వలె ఇక్కడ చనిపొయే వారికి పరమశివుడు ఓంకార మంత్రమును, తారక మంత్రమును ఉపదేశించి మోక్షము ఇచ్చునని భక్తుల నమ్మకము. దేవాలయ ప్రాంతములోనే పాతాళ విఘ్నేశ్వరాలయము కలదు. దేవాలయమునకు సమీపములో గల కొండపై భక్త కన్నప్పకి చిన్న ఆలయము నిర్మించారు. శ్రీకాళహస్తీశ్వరాలయము రాజగోపురము యొక్క సింహద్వారము దక్షిణాభిముఖము. స్వామి వారు ఉత్తరాభిముఖులై వుంటారు. ఆదిశంకరులు ఇక్కడ శ్రీ చక్రము స్థాపించారు. ఈ క్షేత్రమునకు గల ఇతర నామములు దక్షిణకైలాస మనియు, సత్య మహా భాస్కరక్షేత్ర మనియు , సద్యోముక్తి క్షేత్రమనియు, శివానందైక నిలయమనియు పేర్కొనటం జరిగింది. మహా శివరాత్రినాడు ఇక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది. ఆలయానికి ఆనుకుని ఉన్న కొండ రాళ్ళపై పల్లవుల శైలిలో చెక్కబడిన శిల్పాలను గమనించవచ్చు. తరువాత చోళులు పదకొండవ శతాబ్దంలో పల్లవులు నిర్మించిన పాత దేవాలయాన్ని మెరుగు పరచడం జరిగింది. ఒకటవ కులోత్తుంగ చోళుడు ప్రవేశ ద్వారం వద్దగల దక్షిణ గాలి గోపురాన్ని నిర్మించాడు. మూడవ కులోత్తుంగ చోళుడు ఇతర ఆలయాల్ని నిర్మించాడు. క్రీస్తుశకం 12వ శతాబ్దానికి చెందిన వీరనరసింహ యాదవరాయ అనే రాజు ప్రస్తుతం ఉన్న ప్రాకారాలను మరియు నాలుగు ద్వారాలను కలిపే గోపురాలను నిర్మించాడు. క్రీస్తుశకం 1516 విజయనగర సామ్రాజ్యాధీశుడైన శ్రీకృష్ణదేవరాయల రాతిపై చెక్కించిన రచనల ఆధారంగా ఆయన వంద స్థంభాలు కలిగిన మంటపం మరియు అన్నింటికన్నా తూర్పు పడమర దిక్కుల వైపుకు ఉన్న ఎత్తైన గాలిగోపురం నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ గోపురాన్ని 1516 వ సంవత్సరంలో గజపతులపై విజయానికి సూచనగా నిర్మించినట్లు తెలియజేస్తుంది. ఈ గోపురం మే 26, 2010 న కూలిపోయింది.

క్రీస్తుశకం 1529 అచ్యుతరాయలు తన పట్టాభిషేక మహోత్సవాన్ని ముందు ఇక్కడ జరుపుకొని తరువాత తన రాజధానిలో జరుపు కొన్నాడు. 1912లో దేవకోట్టై కి చెందిన నాటుకోట్టై చెట్టియార్లు తొమ్మిది లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం ద్వారా దేవాలయానికి తుది రూపునిచ్చారు. ఈ దేవాలయం దేశంలోని అతి పెద్ద దేవాలయాలలో ఒకటి. ఆలయం లోపల అమ్మవారి సన్నిధికి సమీపంలో ఒక ప్రదేశం నుంచి భక్తులు బయట వున్న కొన్ని ప్రధాన గోపురాలను సందర్శించవచ్చు. ఇలాంటి సదుపాయం భారతదేశంలో కేవలం కొన్ని ఆలయాలకు మాత్రమే ఉంది. రాహు కేతు సర్ప దోష నివారణ పూజలు ఈ ఆలయంలో విశేషంగా జరుగుతాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ తమ దోష నివృత్తి కావించుకుంటారు. ఇంకా రుద్రాభిషేకం, పాలాభిషేకం, పచ్చ కర్పూరాభిషేకం మొదలైన పూజలు కూడా జరుగుతాయి.
శ్రీ కాళహస్తి ఆలయ ప్రాంగణము

* నాలుగు దిక్కుల దేవుళ్ళు

శ్రీకాళహస్తీశ్వర ఆలయం నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వినాయకుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు, దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు అభిముఖులై ఉన్నారు. ఆలయ దర్శనం ద్వారా చతుర్విధ పురుషార్ధ సిద్ధి లభిస్తుందనడానికి ఇది సూచన అని భక్తుల విశ్వాసం. పాతాళ గణపతి ఉత్తరాభిముఖుని గాను, జ్ఞాన ప్రసూనాంబ తూర్పు ముఖంగాను, కాళ హస్తీశ్వరుడు పశ్చిమ ముఖంగాను దక్షిణామూర్తి దక్షిణ ముఖం (మహా ద్వారం ఎదురు)గాను ఉన్నారు. కాళహస్తిలోని శివలింగం పంచ లింగాలలో వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. (కంచి ఏకాంబరేశ్వరుడు పృథ్వీలింగము, శ్రీరంగం వద్ద జంబుకేశ్వరుడు జలలింగము, అరుణాచలంలో తేజోలింగము, చిదంబరంలో ఆకాశలింగము). స్వామి వాయుతత్వరూపానికి నిదర్శనంగా గర్భగుడిలోని కుడివైపున ఉన్న రెండు దీపాలు ఎప్పుడూ చలిస్తూ ఉంటాయని చెబుతారు.
శ్రీకాళహస్తి ఆలయ రథము. దీనిపై స్వామివారిని ఉత్సవ సమయంలో ఊరేగిస్తారు

* గోపురాలు
ఆలయానికి నాలుగు దిక్కులా నాలుగు గోపురాలు, మరియు 120 అడుగుల ఎత్తుగల రాజగోపురం (కృష్ణదేరాయలు కట్టించినది) ఉన్నాయి. స్వామి గ్రామోత్సవం ఈ గోపురంనుండే మొదలవుతుంది. ఆలయానికి చేరుకోవడానికి ముందుగా "తేరు వీధి"కి ఎదురుగా ఉన్న భిక్షాల గోపురంనుండి వస్తాడు. జంగమ రూపుడైన శివుని సేవించి తరించిన దేవదాసి "బిచ్చాలు" దీనిని కట్టించిందట. ఈ గోపుర నిర్మాణం యాదవ నరసింహరాయల కాలంలో జరిగిందని అంటున్నారు. తూర్ప గోపురాన్ని "బాల జ్ఞానాంబి గోపురం" అని, ఉత్తరం గోపురాన్ని "శివయ్య గోపురం" అని, పశ్చిమ దిక్కు గోపురాన్ని "తిరుమంజన గోపురం" అని అంటారు. తిరుమంజన గోపురానికి కుడినైపున "సూర్య పుష్కరిణి", ఎడమవైపున "చంద్ర పుష్కరిణి" ఉన్నాయి. స్వామి అభిషేకానికి, వంటకు నీటిని సూర్యపుష్కరిణి నుండి తీసుకెళతారు. ఈ గోపురంనుండి సువర్ణముఖి నదికి వెళ్ళవచ్చును. దక్షిణం గోపురంనుండి భక్త కన్నప్ప గుడికి, బ్రహ్మ గుడికి వెళ్ళవచ్చును.

* రాహు కేతు క్షేత్రము
ఇది రాహు కేతు క్షేత్రమని ప్రసిద్ధి పొందింది. పుత్ర శోకానికి గరైన వశిష్ట మహర్షికి పరమేశ్వరుడు పంచముఖ నాగలింగేశ్వరునిగా దర్శనమిచ్చాడట. ఈ నాగరూపమునే బ్రహ్మదేవుడు కూడా అర్చించాడట. ఈ నాగరూపం కారణంగా ఈ క్షేత్రానికి "రాహు కేతు క్షేత్రము" అని పేరు వచ్చింది. సర్ప దోషము, రాహు కేతు గ్రహ దోషాలనుండి నివారణ కోసం ఈ స్వామిని పూజిస్తారు. స్వామి కవచము నవగ్రహ కవచమునకు అలంకారములు చేస్తారు.

* దక్షిణామూర్తి
దక్షిణాభిముఖంగా ఉన్న ఆలయ ప్రవేశ ద్వారంనుండి లోనికి ప్రవేశించగానే ఉత్తరముఖంగా కొలువైయున్న దక్షిణామూర్తిని దర్శించవచ్చును. దక్షిణామూర్తి పూజలందు కొనడం కారణంగా ఇది జ్ఞాన ప్రధానమైన క్షేత్రం అయ్యింది. ఈ విధమైన దక్షిణామూర్తి విగ్రహం వేరెక్కడా కనుపించదు. ఇక్కడ వైదిక సంప్రదాయానికి ప్రముఖస్థానం ఉంది.

ఆలయంలో జరిగే కొన్ని సేవలు - కర్పూర హారతి, అష్టోత్తర అర్చన, సహస్ర నామార్చన, త్రిశతి అర్చన, పాలాభిషేకము, పచ్చ కర్పూరాభిషేకము, కాశీ గంగాభిషేకము, రుద్రాభిషేకము, నిత్యదిట్ట అభిషేకము, శ్రీ శనేశ్వరస్వామి అభిషేకము, శుక్రవారం అమ్మవారి ఊంజలి సేవ, వివాహ కట్నం, పంచామృతాభిషేకము, అఖండ దీపారాధన కట్నం, నిత్యోత్సవం (ఉదయం), ప్రదోష నంది సేవ, ఏకాంత సేవ, వాహన పూజ, సుప్రభాత సేవ, శని నివారణ జ్యోతిదీప కట్నం, తళిగ కట్నం, సర్పదోష (రాహు కేతు) పూజ, పౌర్ణమినాడు ఊంజల్ సేవ, నంది సేవ, పెద్ద వెండి సింహ వాహనము

* తీర్ధాలు
ఆలయం పరిసరాలలో 36 తీర్ధాలున్నాయట. సహస్ర లింగాల తీర్ధము, హరిహర తీర్ధము, భరద్వాజ తీర్ధము, మార్కండేయ తీర్ధము, మూక తీర్ధము, సూర్య చంద్ర పుష్కరిణులు వాటిలో ముఖ్యమైనవి. దేవాలయంలోని "పాతాళ గంగ" లేదా "మూక తీర్థము"లోని తీర్థాన్ని సేవిస్తే నత్తి, మూగ లోపాలు పోయి వాక్చాతుర్యం కలుగుతుందటారు.

* ఇతర విశేషాలు
ధర్మ కర్తల మండలి పరిపాలనలో, దేవాదాయ శాఖ అధ్వర్యంలోఆలయ నిర్వహణ జరుగుతుంది. యాత్రికుల కొరకు శ్రీకాళహస్తీశ్వరస్వామి వసతి గృహం, జ్ఞానప్రసూనాంబ వసతి గృహం, బాలజ్ఞానాంబ సత్రము, శంకరముని వసతిగృహము, త్రినేత్రనటరాజ వసతిగృహము, తిరుమల తిరుపతి దేవస్థానం వసతిగృహము ఉన్నాయి. పట్టణంలో ప్రైవేటు వసతిగృహాలున్నాయి.

Wednesday, 7 March 2012

Kanchipuram Temple Information- కంచి

నేను కాంచీపురం 5 సార్లు వెళ్ళిన అన్ని దేవాలయాన్ని చూడలేకపోయాను . మొదటిసారి వేల్లినప్పుడైతే ఏకామ్రేశ్వర స్వామి ని కూడా చూడలేదు . మనవాళ్ళు ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారికి వస్తారు కొందరికి ఐతే అదికూడా వీలుపడదు . మరి వారు అన్ని దేవాలయాలను దర్శనం చేస్కునే వెళ్తున్నారా ? కొంచెం పెద్ద పోస్ట్ అయిన పర్వాలేదు నాకు తెల్సిన ఆలయాల కోసం రాద్దామని ఈ చిన్నప్రయత్నం చేశాను . ఈ పోస్ట్ చదివి కంచి వెళ్ళినప్పుడు అన్ని దేవాలయాలను దర్శించుకుని క్షేమంగారండి .. 
Kanchipuram Temple Information

అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా | పురీద్వారవతీ చైవ సప్తైతే మోక్ష దాయకాః | |


కంచి (kanchi)మన వాళ్ళందరికి సుపరిచితమే, తిరుపతి వచ్చిన వాళ్ళు కంచి కూడా వచ్చి కామాక్షి అమ్మవార్ని దర్శించుకుంటారు . మనం బస్సు దిగినవెంటనే ఆటో వాళ్ళు ఆలయాల లిస్ట్ చేతపట్టుకుని మనకి స్వాగతం పలుకుతారు . వార్కొ 150 ఇస్తే కంచి లో ఉన్న కామక్షి ఆలయం(kamakshi temple) ,  ఏకామ్రేశ్వర  ఆలయం , వామన మూర్తి ఆలయం , వరద రాజ స్వామి ఆలయం (బంగారు బల్లి )చూపిస్తారు . అక్కడితో  మన కంచి యాత్ర మిగిసినట్టే . 

 

.గుర్రం బండి వాళ్ళు  కూడా ఉంటారు  (80 /-).. నిజానికి  వరద రాజ స్వామి ఆలయం తప్ప మిగిలినవి 1కి.మి. లోపు దూరంలోనే  ఉంటాయ్ . ఆసక్తి ఉన్నవాళ్ళు మిగిలిన  నేను రాసేవి  చదవండి .  ఫొటొ లు చూసి వేళ్ళే ఆలవాటు ఉన్నవాళ్ళు ఆపనిలో ఉండండి :)


కాంచీపురం(kanchipuram), కంచి(kanchi), లేదా కాంజీపురం:
అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా |
పురీద్వారవతీ చైవ సప్తైతే మోక్ష దాయకాః | |
 భారతదేశంలో గల సప్తమోక్షపురులలో శ్రీ కాంచీక్షేత్రం ఒకటి. కంచి మోక్షవిద్యకు మూలపీఠం,అద్వైతవిద్యకు ఆధారస్ధానం . ఆదిశంకరులు అధిష్ఠించిన కామకోటి పీఠవైభవంతో కంచి నగశోభ మరింత దేదీప్యమానమయింది. కాంచి అనగా మొలనూలు. వడ్డణాం. మొత్తం భారతభూమికి ఇది నాభిస్థానం . అతి ప్రధానమైన శక్తిక్షేత్రం, పరమ పూజ్యులైన ఆదిశంకర భగవత్పాదులు విదేహాముక్తి నందిన పుణ్యస్ధలం.


శ్రీ కామాక్షి అమ్మవారిగుడి (Kamakshi Temple) :
కంచి లో అమ్మవారి గుడి బస్సు స్టాండ్ కి దగ్గరలోనే కలదు . అక్కడ ఉన్న ఎవరిని అడిగిన చెప్తారు. ఒక్కోసారి బస్సు అమ్మవారి గుడికి దగ్గరలోనే ఆపుతాడు. "కా" అంటే "లక్ష్మి",  "మా" అంటే "సరస్వతి", "అక్షి"   అంటే "కన్ను".   కామాక్షి దేవి  అంటే లక్ష్మి దేవి మరియు సరస్వతి దేవి ని కన్నులుగా కలది. ఈ దేవాలయంలో  శ్రీకామాక్షిదేవి గాయత్రి మండపంలో పద్మాసనంలో కొలువుదీరి ఉన్నారు.

అమ్మవారి గుడిలోకి అడుగు పేట్టిన  వేంటనే మనకి సాదారణంగ  ఏనుగు స్వాగతం పలుకుతుంది.
 ఆలయ ప్రవేశానికి టికెట్ ఏమి లేదు.  మీరు ఆలయంలోకి వేళ్ళేముందు అమ్మవారి వాహనన్ని ఒకసారి చూసి వేళ్ళండి . ఒక కాలు పైకి ఎత్తి యుద్దానికి సిద్దంగా ఉన్నాను అని అమ్మవార్కి చెప్తున్నట్టు కనిపిస్తుంది .


అమ్మవారి గుడి లోపల తీసిన ఫోటో ఇది .. మీరు  లైన్ లో దర్శనం కోసం వెళ్తున్న వార్ని చూసారా ? 

అమ్మవారి గర్బగుడి దగ్గరవుతున్న సమయం లో వరుస రెండుగా విడిపొతుంది . మీరు లోపలి వరసలోకి వెళ్ళడానికి ప్రయత్నించండి. అక్కడ ఉన్న వాళ్ళని  బ్రతిమిలాడితే అనుమతి  ఇస్తారు .. ఖాళీగ ఉంటే  ఎ సమస్య లేదు . మీరు అమ్మవారి దర్శనం అయిన తరువాత వెనక్కి వచ్చి మేట్లు ఏక్కితే మీరు అమ్మవారి ఉత్సావ ముర్తులు ఉన్నచోటికి వస్తారు  ,.. ఆక్కడ నుంచి అమ్మవారు చాల చక్కగ కనిపిస్తారు .. మీరు ఎంతసేపైన  చూడవచ్చు . ఆక్కడ మీరు కాసేపు కుర్చునే వీలు ఉంటుంది ..మీరు క్రిందకు దిగిన వేంటనే ఆదిశంకరుల దర్శనం  చేస్కోనవచ్చును . మీరు కాస్త గమనిస్తే ఆదిశంకరుల ఆలయం పక్కన (మీకు కుడిచేతివైపు అరుగు మీద - కాస్త పైకి ఏక్కితె) ఆది శంకరుల చరిత్ర బొమ్మలతో వివరించి ఉంటుంది . మీరు గుడిలో కాశి విశాలాక్షి అమ్మవార్ని కూడా చూడవచ్చు .





బయటకి వచ్చిన తరువాత  వేనకవైపు ఉన్న కోనేరు -వేపచెట్టు - అమ్మవారి గుడి - పెద్ద మండపం  చూడవచ్చు.
శ్రీ వామనమూర్తి దేవాలయము : (ఉలగళందప్పెరుమాళ్)   ( Vamanamurthy Temple )               


కంచి లో అమ్మవారి ఆలయం కి అతి సమిపంలోనే వామనమూర్తి గుడి ఉంది (ఆలయానికి ఎదురుగ నడిచి కుడిచేతివైపుకు తిరగాలి.) . ఆలయంలో లోపల  చికటిగ ఉంటుంది. మనం జాగ్రత్త చూడలి వామనముర్తి ఆకాశం  వైపు ఒకకాలు పేట్టి మరోకాలితో బలిచక్రవర్తి తలపై వేసిన వామన మూర్తిని మనం దర్శించవచ్చు.దర్శనానికి టికెట్ ఏమిలేదు.
 ఆదిశేషునికి ప్రత్యేకమైన సన్నిధి కలదు.
రామనాధ స్వామి ఆలయం : Ramanadha Swamy Temple
తిరిగి అమ్మవారి ఆలయనికి చేరుకుని అమ్మవారి ఆలయానికి కుడిచేతివైపు  నడిస్తె మనకి మైన్ రొడ్డు వస్తుంది .
...మళ్ళి మనం ఏడమచేతివైపు కి నడిస్తే   శంకర మఠం  దాటిన తరువాత  ఏకాంబరేశ్వర దేవాలయం కనిపిస్తుంది . ఏకాంబరేశ్వర దేవాలయం ఎదురుగ రామనాధ స్వామి ఆలయం కనిపిస్తుంది.   రామేశ్వరం  వేళ్ళకుండానే   ఇక్కడే మీరు శివయ్య గార్ని దర్శించుకోవచ్చు  .


ఏకామ్రేశ్వర దేవాలయం:Ekamreswara Temple
ఇక్కడ మీకు కనిపిస్తున్న గాలిగోపురం ఎత్తు 192 అడుగులు 

పంచభూతలింగక్షేత్రము లలో  కంచి లో పృధ్వీ లింగం  ఉంది. ఈ పంచభూత లింగములు వరుసగా 

1. అన్నామలైశ్వరుడు - అరుణాచలము(Arunachalam): అగ్ని లింగం
2. జంబుకేశ్వరుడు- తిరువనైకావల్ లేదా జంబుకేశ్వరం(Jambukeswaram): జల లింగం
3. చిదంబరేశ్వరుడు(నటరాజ)- చిదంబరం(Chidambaram): ఆకాశ లింగం
4. ఏకాంబరేశ్వరుడు - కంచి(Kanchipuram): పృధ్వీ లింగం
5. కాళహస్తేశ్వరుడు - శ్రీకాళహస్తి(Sri kalahasti): వాయు లింగం 

మీకు అరుణాచలం పోస్ట్ లో కూడా చేప్పాను..


మీకు పార్వతి దేవి శివుని కన్నులు మూయడం , అందువల్ల  జరిగిన పరిణామలు వళ్ళ పర్వతి దేవి తపస్సుకు బయలు దేరడం , ముందుగా కాశి లో తప్పస్సు చేయడం , అక్కడనుంచి కంచి వచ్చి  మామిడ చెట్టు క్రింద సైకిత లింగం చేసి పూజలు చేస్తూ ఉండటం,పరమశివుడు  అమ్మవార్ని పరిక్షింపదలచడం తత్ఫలితంగా  కంపనది పోంగడం పార్వతి దేవి ఇసుకతొ చేసిన లింగ కోట్టుకుని పొకుండా  ఆలింగనం చేస్కోవడం ..  శివుడు సంతొషించి అనుగ్రహించడం అమ్మవారు అక్కడనుంచి అరుణాచలం వెళ్లి అరుణాచలం  లో  ఆర్దనారీశ్వరులుగా ఏకమవడం మీకు తెలుసు కద .

గోపురం వెనకాల నుంచి తీసాను .. చూసారా ఎంత పెద్దది ఉందో.. మనవాళ్ళు గ్రేట్ కదా .. 

మనం  గాలిగోపురం వద్దకు వెళ్ళగానే మనం ఈ చిత్రాన్ని చూడవచ్చు ..


  ఆలయం వేనకవైపు అమ్మవారు తపస్సు చేసిన మామిడ చేట్టు మనం చూడవచ్చు. ఏకాంబరేశ్వరాలయం అని పిలుస్తున్నాం కదా నిజానికి  ఏకాంబరేశ్వరాలయం కాదు  ఏకామ్రేశ్వర దేవాలయం  . ఏకామ్ర .ఆమ్ర=మామిడి ;అంబర=వస్త్రం ,ఆకాశం అని నానార్థాలు.ఏకామ్రేశ్వరస్వామి ఆంటే  మామిడి చెట్టు కింద వెలసిన స్వామి అని అర్థం.ఏకాంబరేశ్వరుడు భూమిని సూచిస్తాడు .
 ఈ దేవాలయంలో ఉన్న 3,500 సంవత్సరాల వయస్సు కల మామిడి వృక్షంలోని నాలుగు కొమ్మలు నాలుగు రకాల రుచిగల పళ్ళు కాస్తాయి. సంతానంలేని దంపతులు ఈ చెట్టు క్రిందపడే పండు పట్టుకొని ఆ పండుని సేవిస్తే సంతానం కలుగుతుందని ఇక్కడి ప్రజల నమ్మకం. అయితే ఇంతటి ప్రాసశ్థ్యం కలిగిన ఈ మామిడి వృక్షం యొక్క కాండం మాత్రమే చూడగలం ప్రస్తుతం . 

ఈ మామిడి వృక్షం యొక్క కాండాన్ని అద్దాల పెట్టెలో ఉంచి దేవాలయంలో భద్రపరిచారు.ఇప్పుడు పురాతన మామిడి వృక్షం స్థానంలో,దేవస్థానం వారు కొత్తగా మరో మామిడి వృక్షం నాటారు.   



మీరు చూస్తున్నారు గా .. ఇక్కడే అమ్మవారు తపస్సు చేసిన ప్రదేశం ఇదే .

 ఈ మామిడి వృక్షం క్రింద పార్వతిపరమేశ్వరులు, పార్వతిదేవి కుమారస్వామిని ఒడిలో కూర్చోపెట్టుకొని వధూవరులుగా దర్శనమిస్తారు. ఇక్కడే మనం తపోకామాక్షిని కూడా దర్శించవచ్చు.

 మీకు కంపనది చూపిస్తాను ఇప్పుడు .. కంపనది అంటే మన గోదారి లా ఉంటుంది అనుకోకండి ...

 వీడు ఫోటో తేడాగా పెట్టాడు అనుకుంటున్నారా ? లేదు నేను అక్కడ వాలని కంపనది ఎక్కడ ఉంది అంటే అదిగో అని చూపించారు .. కోనేరుల ఉంది లోపల .. ఇప్పుడు నీరు ఎం లేదు అక్కడ .. మీరు వెళ్ళినప్పుడు నీరు ఉంటె చూసిరండి .మనం గాలిగోపురం దాటిన తరువాత క్రింద ఫోటో కనిపిస్తుంది చూడండి.. ఈ ఆలయానకి మధ్యలో మనకి కంపనది కనిపిస్తుంది .

ఏకామ్రేశ్వర దేవాలయం

గాలిపురం దాటినా తురువాత ఆలయం కనిపిస్తుంది .. చూసారా ఎంత పెద్ద ఆలయం ఉందో.. మీరు రామేశ్వరం చూసిఉంటే మీకు ఆలయం లోపలకి వెళ్ళిన తరువాత తప్పకుండ రామేశ్వరం గుర్తుకువస్తుంది. పెద్ద కోనేరు కూడా మనం చూడవచ్చు ఇక్కడ 

 

మధ్యాహ్నం భోజనం కుడా (అన్నదానం) ఉంది .. కాకపోతే తక్కువ మంది కి పెడతారు (50).. ఆ టైం లో మీరు అక్కడ ఉంటె ప్రసాదం స్వీకరించి రండి .

 కంచి కామకోటి పీఠం  - Kamakoti pitham

సాక్షాత్తు ఆదిశంకరచార్యుల వారే పిఠాదిపతిగా  ఉన్న పీఠం కంచి పీఠం ..కాంచిపురం లో ఆలయాలు అన్ని తిరిగివచ్చి కంచిమఠం లో పీఠాదిపతులను  దర్శించుకున్న తరువాత  ఒక రేండు గంటల పాటు శంకరేంద్ర సరస్వతి వారి బృందావనం దగ్గర లో గడపడం అంటే నాకు చాల ఇష్ఠం . మీరు మధ్యాహ్నం 12-1  సమయంలో వేల్లితే పీఠాది పతుల  చేసే పూజమీరు చూడవచ్చు .పూజ అయిన తరువాత పీఠదిపతులు మనకి దర్శనం ఇస్తారు .   కంచి మఠం లో మనం పీఠాదిపతుల ఇద్దరిని(Sri Jayendra Saraswati &Sri Sankara Vijayendra Saraswati ) దర్శించవచ్చు.

 

 శ్రీ విజయేంద్ర  సరస్వతి(Sri Sankara Vijayendra Saraswati) వారు ఇక్కడే మనకు దర్శనం ఇస్తారు .. 

 The 7Oth Pontiff His Holiness Sri Sankara Vijayendra Saraswati Swamigal

 మీరు మఠం లో చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి(The 68th Pontiff His Holiness Sri Chandrasekharendra Saraswati Swamigal ) వారి బృందావనం కూడ ఛూడవచ్చు .

 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి తేజస్సు ఇప్పడికి మనం ఇక్కడ  చూడవచ్చు .. మీరు ప్రత్యక్షంగ ఏప్పుడు చూడకపోయిన ఇక్కడ చూస్తే మనకు ఆలోటు తీరుతుంది.

 మీరు అక్కడ ఉన్న స్వామీ వారి ఫోటో లు కూడా చూడవచ్చు .

 

కంచి మఠం వారి అన్నదాన సత్రం :
కంచి మఠం దగ్గరలోనే అన్నదాన సత్రం ఉంది . ఎక్కడ అంటే మీరు ఏకామ్రేశ్వర ఆలయానికి వెళ్లారు కదా .. అక్కడకి దగ్గరలోనే ఉంటుంది . పెట్రోల్ బంక్ పక్కనే అంటే మీకు ఈజీ గా అర్ధం అవుతుంది . కంచి వెళ్లి బయట ఎక్కడో భోజనం చేయడం కంటే ఇక్కడ ప్రసాద్దాన్ని స్వీకరించడం ఉత్తమం అని నా అభిప్రాయం .


చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి ఫోటోలను మీరు ఇక్కడ చూడవచ్చు .

 

మీరు ఈ ఫోటో చూసి లోపలికి వేళ్తరేమో  .. పక్కనే ఒక బుల్డింగ్ కనిపిస్తుంది చూడండి.. అదే సత్రం.. బయట తమిళం లో బోర్డు ఉంటుంది ...
*మీరు పూజ చూసిన తరువాత ఇక్కడికి వచ్చి భోజనం చేసి మఠానికి వెళ్తే మీరు పీఠాదిపతులను దర్శించిన మీరు అక్కడే విశ్రాంతి తిస్కోవచ్చు . ఆ టైం లో ఏ దేవాలయం తెరిచి ఉండదు . మీకు చూపించడానికే కామాక్షి అమ్మవారి ఆలయం దగ్గర ఈ ఫోటో తీసాను.
  

కుమరకోట్టము - శ్రీసుబ్రహ్మణ్యస్వామివారి ఆలయము 

Kumarakottamu ( Murugan Temple)

  ఈ ఆలయం ఆటో వాళ్ళ లిస్టు లో ఉండదు . కంచి మఠం నుంచి దగ్గరలోనే ఉంటుంది . అక్కడ ఉన్న వార్ని కుమరకోట్టము అని అడిగితె వాళ్ళకి అర్ధం అవుతుంది . ఈ  ఆలయ శివాచార్యులు శ్రీ కచ్చియప్ప శివాచార్యులవారిచే తమిళ భాషలో కందపురాణాము రచించారు . ఈ  కందపురాణాము కావ్య ఆవిష్కరణ సమయమున పండితులమధ్య సభామండపంలో శ్రీ కుమారస్వామి బాలకుని రూపంలో ప్రత్యక్షమై కందపురాణాము ఆవిష్కారించడం జరిగింది అంట. 


ఈ ఆలయ గోపురం పక్కనే ఆనాటి జరిగిన సంఘనట చిత్రీకరించి ఉంటుంది . మీరు చూడవచ్చు.  సుబ్రహ్మణ్య ఆలయం లోపల తీసిన ఫోటో ఇది.

శ్రీ కుమారస్వామి బాలకుని రూపంలో ప్రత్యక్షమై కందపురాణాము ఆవిష్కారించిన  మండపం ఇదే 



శ్రీ కచ్ఛపేశ్వరుని ఆలయము - Kachchapeswara Temple

శ్రీ కుమారస్వామి ఆలయమునుకు దగ్గరలోనే శ్రీ కచ్ఛపేశ్వరుని ఆలయము  ఉంది . మీరు గుడి బయటకు వచ్చిన తరువాత కుడివైపుకు నడిస్తే ఈ ఆలయ గోపురం కనిపిస్తుంది . ఈ ఆలయం గుడి ఆటో వాళ్ళు చూపించారు . చాల పెద్ద ఆలయం ఇది . బహుశా అందుకే ఈ ఆలయం ఆటో వాళ్ళ లిస్టు లో కనిపించదు మనకు .

ఈ ఆలయం కోసం చెప్పమంటారా .. ఈ ఆలయం లోనే శ్రీ మహా విష్ణువు పరమశివుణ్ణి తాబేలు రూపంలో పూజించినట్లు పురాణము. అందుచేత  కచ్ఛపేశ్వరుడు అనిపేరువచ్చింది. కచ్చ అంటే తాబేలు అని అర్ధం.

సరే లోపల చూద్దాం రండి :

 రెండు ఫోటో లు తీస్తేనే కాని కవర్ చేయలేకపోయాను ... ముందే చెప్పను కదా చాల పెద్ద ఆలయం అని .

 ఇక్కడ ఉన్న కోనేటిలో స్నానం చేస్తే రోగాలు నివృతి అవుతాయని చెప్తారు . చాల మంది స్నానం చేస్తారు కూడా . ఈ ఆలయం లో మనం శ్రీ సుబ్రహ్మణ్యస్వామి , శక్తి గణపతి , దుర్గా ,సరస్వతి , సూర్యునికి ప్రత్యేక సన్నిది ఉంది .

ఈ ఆలయం లో పెద్ద రావి చెట్టు ఉంది. రావి చెట్టు క్రింద నేను చెప్పడం ఎందుకు మీరే చూడండి.
 చూసారా ? చెప్పాకద చాల పెద్దది అని ... 

  రావి చెట్టు పక్కనే ఒక శివాలయం ఉంది పేరు తెలియదు నాకు .. ఆ ఆలయం పైన దక్షిణామూర్తి ఉంటె క్లిక్ అని పించాను.. మీరే చూడండి ఇప్పుడు .

 

ఇక్కడ నుంచి బస్సు స్టాండ్ దగ్గరగానే ఉంటుంది . మీకు ముందే చెప్పాను కదా.. అమ్మవారి ఆలయానికి అన్ని ఆలయాలు 1 k .m దూరం లోనే ఉంటే అని. సరే రండి ఇప్పుడు కైలాస నాద్ ఆలయానికి వెళ్దాం.

శ్రీ కైలాస నాధుని ఆలయము - Kailasanadha Temple 

శ్రీ కచ్ఛపేశ్వరుని ఆలయము నుంచి సుమారు 2km దూరం లో కైలాస నాధుని ఆలయము ఉంది . ఆలయం పక్కనుంచే దారి ఉంది .. నారదుడు శివలింగాన్ని ప్రతిష్ఠించడాని చేప్తారు.. ఈ ఆలయం చాల పురాతనమైనది మనకు కనిపిస్తుంది. ఆలయం బయట పార్క్  లాగ కనిపిస్తుంది. చాలా ప్రశాంతంగ ఉంటుంది. శివును చుట్టు ప్రదిక్షణం చెస్తే జన్మరాహిత్యము కలుగుతుందని భక్తుల నమ్మకము .   

 ఫోటోలో చూపించాను చూడండి అల వెళ్తే కైలాసనాధుని ఆలయం దగ్గరకు వెళ్తారు ... 

 ఈ ఫొటోస్ అక్కడ తీసినవే ..


 చూసారా ఆలయాన్ని ... మనకు కంచి అనగానే గుర్తుకు వచ్చేది బంగారు బల్లి కదా ..... వాటిని చూపించలేదు ఏమిటి అనుకుంటున్నారా ? బంగారు బల్లి వెండి బల్లి రెండు వరదరాజ స్వామి గుడిలో ఉంటాయ్ .. మీరు ఇక్కడ నుంచి  కచ్ఛపేశ్వరుని ఆలయము దగ్గరకు వస్తే ఆటో లు ఉంటాయ్.. ఇక్కడనుంచి సుమారుగా3  km ఉంటుంది .. మీరు అక్కడే బంగారు బల్లి ని చూడగలరు .. సరే ఇప్పడికే లేట్ అయింది కదా వెళ్దామా మరి ?

శ్రీ వరదరాజస్వామి  ఆలయము - Varadaraja Swamy Temple

కంచి లో ప్రతి ఆలయ గోపురం ఇలానే ఉంటాయ్ ..అందులో ఏకామ్రేశ్వరస్వామి ఆలయంలో మనం చూసిన గాలిపురం తరువాత ఈ ఆలయ గోపురమే పెద్దది .. వాడుకలో కోయిల్  - తిరుమల - పెరుమాళ్ కోయిల్ అని పిలబడు 108 వైష్ణవ దివ్య క్షేత్రములలో  మూడవ స్థానమును ఈ వరదరాజస్వామి వారిదే . కోయిల్ అంటే శ్రీ రంగం శ్రీ రంగనాధ ఆలయము , తిరుమల అంటే నేను చేప్పాల ? పెరుమాళ్ కోయిల్ అంటే వరదరాజస్వామి వారి ఆలయము .

బ్రహ్మదేవుడు చేసిన యాగంలో యాగ గుండము నుంచి శ్రీ మన్నారాయణుడు శ్రీ వరదరాజ స్వామి రూపంలో అవిర్భావించినట్లు స్థలపురాణము .







అవును మీకు బల్లి కధ తెలుసా ? 
కంచి లో బంగారు వెండి బల్లి  

ఇతిహాసం ప్రకారం ఇక్కడ ఒక ఋషి కుమారున్ని, అతని తండ్రి దేవతార్చనకు నీళ్ళు తీసుకొని రమ్మనగా ఆ కుమారుడు తెలియక తీసుకొని వచ్చిన ఉదకంలో బల్లి కనిపిస్తుంది. తండ్రి దానికి కోపించి కుమారున్ని బల్లిగా మారిపొమ్మని శపిస్తాడు. తరువాత కుమారుడు వేడుకొనగా ఇక్కడ బల్లిగా వెలసి, అతన్ని ముట్టుకొంటే బల్లి ఒంటి మీద పడే పాపం పోయేటట్లు ఆశీర్వదిస్తాడు. 

ఇక్కడ అమ్మవారు పేరు పేరుందేవి ..

మహావిష్ణువు నిజస్వరూపాన్ని చూస్తున్నామ అన్నట్టుగా .. ఈ ఆలయం లో మనకు దర్శనం ఇస్తారు .. అదో గొప్ప అనుభూతు నేను ఇక్కడ మీకు చెప్పడం కష్టం . స్వామివార్ని చుసినతరువాత మనం బల్లి దగ్గరకు వెళ్తాం . బల్లి ని చూడటానికి టికెట్ తీస్కోవాలి ..
ఆలయం లోపలి తీసిన ఫోటో ఇది ..
మీకు ఇక్కడ కోనేరు కనిపిస్తుందా ? దీనిని ఆనంద పుష్కరిణి అంటారు .

 

ఈ ఆనంద పుష్కరిణి లో వరదుని ప్రాచీన మూలవిగ్రహాన్ని 40 సంవత్సరములకు ఒకసారి తీసి వెలుపలకు తీసి 40 రోజులు భక్తుల దర్శనార్ధం ఉంచుతారు . 2019 జూన్ నెలలో మరల స్వామి వార్ని బయటకు తీసుకుని వస్తారంట.. ఎవరెవరు వస్తారో చెప్పండి .. మనం అప్పుడు వరద రాజ స్వామి సన్నిదిలో కలుద్దాం :) 

 శ్రీ వైకుంఠనాధుని ఆలయము 

శ్రీ కాంచీ క్షేత్రము నందలి ప్రాచీన విష్ణు మందిరములలో 108 శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రములలో ముఖ్యమైనది పల్లవుల కాలమునాటి ప్రాచీన దేవాలయము శ్రీ వైకుంఠనాదాలయము . అందమైన శిల్పములతో ఆలయం అంతటా  శిల్పాల మయం.




























కంచి బస్సు స్టాండ్ సమీపంలో ఈ ఆలయం కలదు . వైకుంట పెరుమాళ్ అని అడిగితే  అంటే వాళ్ళకి అర్ధం అవుతుంది  .  అక్కడనుంచి అమ్మవారి గుడి  కూడా దగ్గరే .


* కంచి నుంచి శ్రీపురం(golden temple) వెళ్ళడానికి బస్సు లు కలవు . కంచి నుంచి 2 -3 గంటల ప్రయాణం 

*కంచి నుంచి తిరుపతి 3 -4 గంటల ప్రయాణం.  వెళ్ళడానికి బస్సు లు కలవు,

రూమ్స్ కావల్సినవాళ్లు ఈ నంబర్స్ గుర్తుపెట్టుకోండి  .. అమ్మవారి గుడిపక్కనే ఉంది :

SRI VANCHINATHAN TRUST 
SRI KANCHI KAMAKOTI PEETAM
YATRI NIWAS
044-2723115, 9994346996

****మీ కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తేలియచేయండి మరిచిపోకండి****