Thursday, 27 February 2014

Varanasi temple information


Varanasi temple information in telugu


కాశీ ఈ పేరు పలికితే చాలు శరీరం లో మనకు తెలియకుండానే ఒక రకమైన ప్రశాంతతా , ఆధ్యాత్మిక భావం కలుగుతుంది . ఆ ముక్కంటి దర్శనం మానసికంగా చేస్తాము . అన్ని బంధాలను వదలి ఈశ్వర నివే దిక్కు , పుట్టినప్పటి నుంచి పెరిగి ఇంతటి వాడినైతి రోజురోజుకి ఏవేవో కోరికలు సంసార పరమైన బాధ్యతలు .. ఒకటి తీరితే మరోకటి ఆపైన ఇంకోటి అవసరాలు పుడుతూనే ఉన్నాయ్ . ఎక్కడని ఆపాను , నా తరమా స్వామి నీవే దిక్కు ఈ శరీరం కట్టిలో కాల్చబడి మట్టిలో కలిసిపోక ముందే, మనసారా..  నా కళ్ళార నీ దర్శన భాగ్యం ప్రసాదించవయ్య ఈశ్వర , నా తండ్రి శివ వస్తున్నాను నీ పైనే భారం వేసి బయలుదేరుతున్నా తండ్రి తండ్రి అనుకుంటూ పూర్వపు రోజుల్లో కాశీ యాత్ర చేసేవారు . ఆ రోజుల్లో కాశి యాత్ర అంటే కాటికి వెళ్ళడమే . రవాణ సౌకర్యాలు ఏమి లేని ఆ రోజుల్లో భగవంతునిపై భారం వేసి వెళ్ళేవారు .


కాశీ పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రదేశం . సాక్షాత్తు కైలాసవాసి స్వయంగా వారణాశి లో కోలువై యున్నాడు .  వరుణ, అసి అనే రెండు నదులు ఈ నగరం వద్ద గంగానదిలో కలుస్తాయి. అంచేత, ఈ క్షేత్రానికి వారణాసి (వారణాసి అని అంటుంటారు) అని కూడా నామాంతరం కలదు. కాశ్యాన్తు మరణాన్ ముక్తి: - "కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది" అని మనవాళ్ళు నమ్ముతారు . మరణించిన వార్కి పరమశివుడే తారక మంత్రం చెప్తున్నాడు అని శ్రీ రామకృష్ణ పరమహంస ధ్యానం లోంచి చూసి మరీ చెప్పారు . 

కాశీ క్షేత్రం లో ఉన్న విశ్వేశ్వర లింగం  ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి . కాశీ లో గంగ స్నానం కాశీ యాత్ర లో ముఖ్యమైనది . శివుని తలను తాకిన శివగంగ ఇక్కడ ఉత్తరముఖంగా పయనిస్తుంది . కాశీ క్షేత్రం ఎప్పుడు భక్తులతో కిటకిట లాడుతూ నిత్యం శివః నమః తో మరోమోగుతుంది .


గంగానదికి, వారాణసికి హిందూ మతంలో ఉన్న ప్రాముఖ్యత వలన ఈ రెండింటికి అవినాభావమైన సంబంధం ఉంది. ప్రధానమైన విశ్వేశ్వరాలయం, మరెన్నో ఆలయాలు గంగానది వడ్డున ఉన్నాయి. అనేక స్నాన ఘట్టాలు గంగానది వడ్డున ఉన్నాయి

వారణాశిలోని గంగా తీరం అంతా స్నానఘట్టాలతో నిండి ఉన్నాయి. స్నాఘట్టాలలో రాతిపలకతో నిర్మించబడిన మెట్లు ఉంటాయి. యాత్రీకులు స్నానం ఆచరించడానికి, సంప్రదాయక ఆచారాలను అనుష్ఠించడానికి అనువైన ఏర్పాట్లు చేయబడి ఉన్నాయి. వారాణసిలో షుమారు 84 ఘాట్‌లు ఉన్నాయి.



ఈ స్నానఘట్టాలు పురాణ ఘట్టాలతో ముడివడి ఉన్నాయి. వీటిలో దశాశ్వమేధఘట్టం, పనచగంగ ఘట్టం మరియు ధహనసంస్కారాలు జరిపించే మణికర్ణికా, హరిశ్చంద్రా ఘాట్లు ప్రత్యేకమైనవి. ఉదయం బోటులో స్నానఘట్టాలను దర్శించడం యాత్రీకులను ఎక్కువగా ఆకర్షించే విషయాలలో ఒకటి. స్నానఘట్టాలలో అనేక ఆలయాలు కూడా ఉంటాయి.

అష్టాదశ శక్తి పీఠాలలో కాశీ కూడా ఒకటి. దక్షయాగంలో ఆత్మార్పణం చేసిన సతీదేవి చెవిపోగు పడిన చోట ఇప్పుడు విశాలాక్షి మందిరం ఉన్నదంటారు. గంగమ్మ తల్లియే శక్తి స్వరూపిణి కూడాను. కనుక శాక్తేయులకు కాశీ పరమ పవిత్ర క్షేత్రం. ఆదిశంకరుడు తన బ్రహ్మసూత్ర భాష్యాన్ని, భజ గోవింద స్తోత్రాన్ని కాశీలో రచించాడంటారు.

వారణాసి ఆలయాలకు నెలవు. చరిత్రలో వివిద కాలాల్లో నిర్మించబడ్డ పెద్ద పెద్ద ఆలయాలు ఉన్నాయి. ఇంకా ప్రతీ వీధిలోనూ ఒక ఆలయాన్ని దర్శించవచ్చు. చిన్న ఆలయాల్లో కూడా దైనందిన ప్రార్థనలు, కార్యక్రమాలు జరుగుతుంటాయి. వారణాశిలో అనేక (దాదాపు 23,000) ఆలయాలు ఉన్నాయి. అయినప్పటికీ అత్యధికంగా ఆరాధించబడే ఆలయం విశ్వనాధ మంధిరం, హనుమాన్ మందిరం మరియు దుర్గా మందిరం ( ఈ మందిర సమీపంలో నివసిస్తున్న అనేక ఉన్న కోతుల కారణంగా ఈ మందిరం కోతుల ఆలయంగా కూడా పిలువబడుతుంది).

అన్నపూర్ణామందిరం
కాశీ విశ్వనాథాలయానికి సమీపంలో అన్నపూర్ణాదేవి ఉంది. విశ్వనాథుని దర్శించుకున్న తరువాత భక్తులు అన్నపూర్ణాదేవిని దర్శించడం ఆచారం.
శాంక్తా మందిరం
సింధియా ఘాట్ వద్ద శాంక్త మందిరం ఉంది. శాంక్తామందిరంలో పెద్ద సింహంశిల ఉంది. అలాగే ఈ ఆలయంలో నగ్రహాలు ప్రతిష్ఠితమై ఉన్నాయి.
దుర్గా మందిరం
వారణాశిలో రెండు దుర్గామందిరాలు ఉన్నాయి. 500 సంవత్సరాలకు ముందు నిర్మించిన దుర్గామందిరం ఒకటి. రెండవది "కోతుల గుడి" గా కూడా ప్రసిద్ధమైన దుర్గా మందిరం 18వ శతాబ్దంలో ఒక బెంగాలీ రాణిచే నిర్మింపబడింది. ఇక్కడ చాలా కోతులు ఉండడంవల్ల కోతుల గుడి అని కూడా అంటుంటారు. ఇక్కడ అమ్మవారు స్వయంభూమూర్తి అని భక్తుల నమ్మకం. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఆలయం గోపురం ఉత్తర భారత " నాగర"శైలిలో నిర్మింపబడింది. గుడి దగ్గరున్న కోనేరును "దుర్గా కుండ్" అంటారు. ఈ కోనేరు ఇదివరకు నదితో సొరంగమార్గం ద్వారా కలపబడి ఉండేది కాని ఆ సొరంగాన్ని తరువాత మూసివేశారు. నాగపంచమి నాడు ఇక్కడ విష్ణువు శేషశాయిగా ఉండే దృశ్యాన్ని ప్రదర్శిస్తారు
సంకట మోచన్ హనుమాన్ మందిరం, తులసీ మానస మందిరం, భారతమాత ఆలయం, బిర్లా మందిరం , కాలభైరవ మందిరం, కవళీ మాత  మందిరం తప్పక దర్శించవాల్సినవి .



వారాణసిలో ఉన్న కొన్ని ముఖ్యమైన శివ లింగాల స్థలాలు 
  • విశ్వేశ్వరుడు - గంగానది ఒడ్డున దశాశ్వమేధ ఘాట్ వద్ద
  • మంగళేశ్వరుడు - శంక్తా ఘాట్
  • ఆత్మ విశ్వేశ్వరుడు - శంక్తా ఘాట్
  • కుక్కుటేశ్వరుడు - దుర్గా కుండ్
  • త్రి పరమేశ్వరుడు - దుర్గా కుండ్
  • కాల మాధవుడు - కథ్ కీ హవేలీ
  • ప్రయాగేశ్వరుడు - దశాశ్వమేధ ఘాట్
  • అంగారకేశ్వరుడు - గణేష్ ఘాట్
  • ఆంగనేశ్వరుడు - గణేష్ ఘాట్
  • ఉపస్థానేశ్వరుడు - గణేష్ ఘాట్
  • పరమేశ్వరుడు - శంక్తా ఘాట్
  • హరిశ్చంద్రేశ్వరుడు - శంక్తా జీ
  • వశిష్టేశ్వరుడు - శంక్తా జీ
  • కేదారేశ్వరుడు - కేదార్ ఘాట్
  • నీల కంఠేశ్వరుడు - నీల కంఠా
  • ఓంకారేశ్వరుడు - చిట్టన్ పురా
  • కాశేశ్వరుడు - త్రిలోచన్
  • శ్రీ మహా మృత్యుంజయుడు - మైదాగిన్
  • శుక్రేశ్వరుడు - కాళికా గలీ

 గంగా హారతి. గంగామాతకు నదీతీరక్షేత్రాలలో నిర్వహించే ఈ హారతి పవిత్ర కాశీలో కూడా ఘనంగా ప్రతిరోజూ నిర్వహిస్తుంటారు. ఈ హారతి దృశ్యాలను పతిరోజూ వేలాది మంది తిలకిస్తుంటారు. వీరిలో విదేశీయులు అధికంగా ఉండడం ఒక ప్రత్యేకత. ఈ హారతులను దశాశ్వమేధ్ ఘాటులో నిర్వహిస్తారు కనుక యాత్రీకులు దశాశ్వమేధ ఘాటుకు చేరుకోవడం అవసరం.




* కాశీ  ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోవుంది
కాశీ లో వసతి కోసం ఇబ్బంది పడవల్సిన అవసరం లేదు . చాల సత్రాలు , లాడ్జ్  , హోటల్స్ ఉన్నాయి . రోజుకి 600/- వరకు అద్దె వసూలు చేస్తారు . 
* గంగ తీరం చేరుకంటే పడవలు చాలానే ఉంటాయి . వాళ్ళు అన్ని ఘట్టలాను చూపించి తీస్కుని వస్తారు .  అన్ని దేవాలయాలు దగ్గరగానే ఉంటాయి . తెలుగు తెల్సినవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మీరు కంగారు పడనవసరం లేదు . 
* కాశీ వరకు వెళ్ళడానికి అన్ని ప్రధాన రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్స్ ఉన్నాయి .
పేస్ బుక్ లో కామెంట్ ద్వార యాత్రచేసి వచ్చినవాళ్ళ అభిప్రాయాలూ :

" నేను కాశి లో 3 రోజులు వున్నాను. అక్కడ ఆంధ్ర ఆశ్రమమలో room తీసుకుని వున్నాం ఆంధ్ర ఆశ్రమం గంగకి చాల దగ్గర. గుడికి కూడా. ఒక సరి కాhశిలో అడుగు పెడితే తిరిగి రావాలనిపించదు. అడుగడుగునా శివ నామమే " - Charla Rajarajeshwari
" Nenu Kasi ki rendu sarlu vellanu. Akkada lodge lo unnamu. Akkada lodge lone Telugu matlade Guidelu room daggare dorukutaru. Munduga Ganga nadilo snanam chesi akkada mukhyamaina Ghat lu ante snana ghattalanu padavalo tippi chupadu. Vatillo mukhyamainavi Dashaswameda Ghat, daniki pakkane unde Manikarnika ghat inka padavalo velli Harishchandra ghat. Chudavalasina placelu... Shri Kasi Visweswara temple, Sankatmochan mandir, Mahalaxmi temple at 5 pm onwards ante akkadi aarati chala baguntundi inka Tulasi manada mandir... Sri Visweswara temple in Banaras Hindu University (BHU). Akkada sayantra samayamlo chese Ganga Aarati chala baguntundi...kaani rendu sarlu poyina chudaleka poyanu...inka cheppalante chala undi kaani time leka intatito mugistunnanu.." - Veera Brahmam Naidu

"stayed in kasi, varanasi in 2013 during dasara festival times for navaratris for 9 days, for accomadation contact in advance either at Gaudiya Mutt, or Kariveni vari satram or in Annapoorna Temple accomodation factilities costing approx rs.600/- per room per day, three persons allowed for maximum 9 days, advance booking required. for food many telugu hotels available, but kariveni vari staram is the best, food is free, but you can donate at you will, need to register one day before or atleast in the the morning, afternoon food is served at the satram, for night you may have collect tiffin. andhra satram is near by. sankara mutt is also in the same lane." - Raghunath Vajjha

" kasi ki trains : varanasi or mughal sarai lo digali, varanasi chala daggara. mughal sarai 22 kms. kasi lo andhra ashramam, cycle ashramam enka chala telugu vari satramulu unnai. station nunchi rikshalone vellali. kasi streets chala chinnavi.
andhra ashramam pandey haveli ani chepitey riksha vallu teesukuveltaru. 100 to 250 rent per day. tiphen /meels kuda free . but munduga members enta mandi ani cheppali.
andhra ashram nunchi kasi visweswarudi mandir nadichi povachhu. 3 kms max, convinent. ganga kuda 100 meters away.." -   Puttamaraju Srinivas
   

కాశీ -  రామేశ్వరం యాత్ర ? :
కాశీ రామేశ్వరం యాత్ర చేసినట్లైతే అన్నీతీర్ధ  యాత్రలు చేసినట్టే అని చేబుతారు . ముందుగా కాశీ విశ్వనాథుని దర్శించుకుని అక్కడ గంగ ను తీస్కుని వెళ్లి రామేశ్వరం లోనే శివలింగానికి అభిషేకం చేయాలి . తరువాత రామేశ్వరం లోని సముద్రపు ఇసుకను తీస్కునివచ్చి కాశీ లోని గంగ నదిలో కలిపితే కాశీ రామేశ్వరం యాత్ర పరిపూర్ణం అయినట్లు . ఈ యాత్ర చేసేముందు యాత్రలో గల పరమార్ధం తేల్సుకుని భక్తి శ్రద్ధలతో చేయ్యాలి .  ఆ యాత్ర చేయాలంటే ఆ భగవంతుని అనుగ్రహం ఉండాలిగా . 



Shri Kashi Vishwanath Mandir Rituals

The Temple opens daily at 2:30 A.M. In Mangala Aarti 3 to 4 A.M. ticket holders are permitted to join.
From 4 to 11 AM general Darshan is allowed. 11.30 to 12 AM mid day Bhog Aarti is done. Again 12 Noon to 7 PM devotees are free to have Darshan.
From 7 to 8.30 PM evening Sapta Rishi Aarti is done after which darshan is again possible up till 9.00 PM, when Sringar/Bhog Aarti starts.
After 9.00 PM Darshan from outside only is possible.
Shayan Aarti starts at 10.30 PM. The Temple closes at 11 PM






Accomodation

GOVT. ACCOMODATION

Railway Retiring Rooms,
varanasi Cantt.Railway Station, 1st Floor, Booking: Matron-in-charge.
Government Tourist Bunglow, Parade Kothi,Cantt.Tel:343413
Near Railway Station
GOVT. TOURISM OFFICE
U.P.Government Tourism Office
Parabe Kothi,cantt Tel:2208413,2208545
Open 10 am - 5 pm
Close: Sunday's and government Holidays.

U.P.Government Tourist Information Counter
Varanasi Cantt.Railway Station
Near Enquiry Office, Main Hall
Open daily 7 am - 8 pm

U.P. Government Tourist Office, Sarnath Tel:2386965

Government of India Tourist Office
158 The Mall, cantt. Tel:2343744
Open 10 am - 5 pm. closed Sunday and Government holidays

Bihar State Tourist Office
Englishiya market,Sher shah Suri Marg, Cantt Tel: 343821
Open daily 8 am - 8 pm





మరిన్ని విరములకు : http://te.wikipedia.org/wiki/%E0%B0%95%E0%B0%BE%E0%B0%B6%E0%B1%80

Monday, 17 February 2014

Srirangam Temple Information

శ్రీరంగం - తమిళనాడు   | Srirangam Temple Information



శ్రీరంగం (Srirangam ) ఉభయ కావేరీ నదుల మధ్యనున్న పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రదేశం . ప్రత్యేకంగా చెప్పాలా ? ఒకసారి పైన ఉన్న ఈ ఫోటో చూస్తుంటేనే ఎక్కడో ఉందో తేల్సుకుని .. శ్రీరంగం ఎంత త్వరగా కుదిరితే ( స్వామి ఎంత త్వరగా పిలుస్తే ) అంత త్వరగ చూడలనీపిస్తూంది కదా ! .. మనకేమిటి శ్రీరంగ నాధుడికే అనిపిస్తే అలా ... 


స్థలపురాణం తరువాత చెప్పుకుంద్దాం .. ఎలా వేళ్ళలో చెప్పితే మీరు ఎలా రావాలో మీకో ఐడియా వస్తుంది .
తమిళనాడులోని తిరుచినాపల్లి (తిరుచ్చి) ( Trichy - Tiruchirappalli )కి10 కిమీ దూరం లో ఉంది . తిరుచినాపల్లి ఎక్కడుంది అనేగా చెన్నై నుంచి 330 కిమీ దూరం . శ్రీరంగం లో రైల్వేస్టేషన్ ఉంది . IRCTC కోడ్  SRGM .  చెన్నై నుంచి  వెళ్తే శ్రీరంగం స్టేషనే ముందు వస్తుంది తరువాతే తిరుచినాపల్లి.
తిరుచినాపల్లి నుంచి మీరు శ్రీరంగం వెళ్తుంటే చూస్తున్నారుగా ఈ బ్రిడ్జి మీదే వెళ్ళాలి ..


ఇక్కడ నుంచి చూస్తుంటేనే అబ్బ బలే ఉంది ప్లేస్ అని పిస్తుంది కదా !


 ఇప్పుడు మనం శ్రీరంగం రైల్వే స్టేషన్ లో ఉన్నాం . ..


 ఇక్కడ చూసారా వీళ్ళు .. రైల్వే స్టేషన్ దగ్గరే మనకు శ్రీరంగ నాధున్ని దర్శనం చేయిస్తున్నారు ..


 మనం బయటకు రాగానే .. ఆటో లో కాస్త ఏదురుగా ATM కూడా ఉంది . ఇప్పుడు ATM కదా అవసరం ..

ఓకే అర్ధం అయింది .. రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్ ఎంత దూరం అనేగా .. ఇక్కడ నుంచి సుమారుగా 1 కిమీ దూరం ఉంటుంది . ఆటో లో వెళ్తారో నడిచి వెళ్తారో మీ ఇష్టం .
 నడిచే వెళ్తాం అనేవాళ్ళు .. చూస్తున్నారుగా రైల్వే స్టేషన్ నుంచి నడుచుకుంటూ వస్తే .. మీకు రోడ్ కనిపిస్తుంది అక్కడ ఎడమవైపుకి తిరిగి నలుగు అడుగులు వేయగానే ..  కుడివైపు మరో రోడ్ వచ్చి ... ఈ బోర్డు కనిపిస్తుంది . ఈ బోర్డు కనిపించగానే మనకి కాస్త దైర్యం వస్తుంది :)



అక్కడ నుంచి నడుస్తూ కొద్ది దూరం రాగానే .. మెయిన్ రోడ్ వస్తుంది ... ఎలా వెళ్ళాలి ... ఎటువైపుకి వెళ్లాలి అనుకుని అటు ఇటు చూస్తుంటే .. మనకు శ్రీరంగ దేవాలయం యొక్క గోపురం కనిపిస్తుంది . అప్పుడు కలిగే ఆనందం బలే ఉంటుంది . ఇంకా ఎవరిని ఏమి అడగనవసరం లేదు అమ్మయ్య .. స్వామి వచ్చేసాను .. వస్తున్నాను అనుకుంటూ .. నడక సాగించడమే ..

నడుస్తూంటే .. గోపురం ఇంకా ఇంకా దూరం జరుగుతునట్లు అనిపిస్తుంది .





 ఆ గోపురం చూస్తుంటేనే .. మనకు తెలియకుండా .. ఆనందం తో ఒళ్ళు పులకరిస్తుంది .. అబ్బ మనవాళ్ళు ఏమి కట్టారు .. ఎంత అదృష్టం చేస్కున్నాను ఈ దేశం లో పుట్టి .. మనవాళ్ళు చాల గోప్పుల్లు అనుకుంటూ .. ముందుకు కదులుతాం ..




 ఫోటో దగ్గర నుంచి తీయడానికి కెమెరా కు పడితే కదా ... :)  మనం తల బాగా పైకి ఎత్తి చుడవాల్సిందే ..




 దీని ఎత్తు 236 అడుగులు (72 మీటర్లు) - ఆసియాలో అతిపెద్ద గోపురం.

 దేవాలయం వారి వెబ్‌సైటు ప్రకారం ఈ ఆలయం ప్రదేశ వైశాల్యం 6,31,000 చదరపు మీటర్లు (156 ఎకరాలు). ప్రాకారం పొడవు. 4 కిలోమీటర్లు (10,710 అడుగులు).



 ఇక్కడ నుంచి మనం ఒక్కో గోపురం దాటు కుంటూ .. ముందుకి నడుస్తూ వెళ్ళాలి ... 



ఈ గోపురాలు కూడా చిన్నవి గా ఉండావ్ ..



 చుట్టూ షాప్ లతో రద్దీగా ఉంటుంది ..

గుడినుంచి వచ్చేటప్పుడు కొనుక్కోవచ్చు .. పదండి పదండి ..  :)




 కొబ్బరి కాయ దేవాలయం లో కొట్టరు .. పువ్వులు మాత్రమే తీస్కుంటారు ..



 మనం నడుస్తూనే ఉంటాం .. గోపురాలు వస్తూనే ఉంటాయ్ ..


 అందరు ఒక్కసారి గోవింద గోవిందా .. అని గట్టిగ అనండి .. గోవింద గోవిందా



 సామాన్లు పెట్టుకోవడానికి  .. చెప్పులు పెట్టుకోవడానికి ఆలయం వారు ఏర్పాట్లు చేసారు .. మీరు కంగారు పడి బయటే వదలనాసరం లేదు .


 టికెట్స్ లోపల తీస్కొవచ్చు .. రండి








 మన అదృష్టం కొద్ది ఇంగ్లీష్ లో కూడా బోర్డు లు పెట్టారు .. :)





ఈ ఆలయం లో ఎక్కడ చూసిన గోపురాలు మండపాలు .. కనిపిస్తూనే ఉంటాయ్ ..
 మీరు ఎలా వేళ్ళలో బోర్డు లు చూస్తున్నారుగా .. ఏమేమి చూడాలో ..



ఎలాగో ఆలయం లో కి వచ్చేసాం కదా .. తరువాతి పోస్ట్ లో స్థలపురాణం .. లోపల చుడవాల్సిన వాటికోసం .. చుట్టుప్రక్కల చూడవల్సిన ప్రదేశాల కోసం వివరిస్తాను .

మీ సలహాలను .. మీకు తెల్సిన ఇతర విశేషాలను కామెంట్ చేయండి ...
గోవింద గోవిందా ..

Friday, 14 February 2014

Kollur Mookambika

మూకాంబిక క్షేత్రం - కొల్లూర్ - | Kollur Mookambika Temple Information
 శ్రీ మోహన్ గార్కి కృతజ్ఞతలు తెలియచేస్తూ .. ఆయన రాసిన పోస్ట్ ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను ..


రెండవ రోజు ఉడిపిలో ప్రాతఃకాల నిర్మాల్య పూజ చూసిన తర్వాత అదే రోజు మధ్యాహ్నం బయలుదేరి కొల్లూర్ మూకాంబికా క్షేత్రానికి వెళ్ళాము. కొల్లూరు చేరేసరికి సాయంత్రం నాలుగు అయ్యింది. అయితే అక్కడికి వెళ్ళాక మాకు దేవస్థానం వారి కాటేజీలలో కానీ, ప్రైవేట్ హోటళ్ళలలో కానీ ఎక్కడా బస దొరకలేదు, కారణం అప్పటికే పది రోజుల క్రితం నుంచీ అక్కడ వార్షిక ఉత్సవాలు జరుగుతున్నాయి, మాకు ఈ విషయం ముందుగా తెలియదు. మేము ఆ ఊరు చేరుకునేసరికే చాలా మంది వందలలో కాదు వేలలో ఉన్నారేమో జనాలు ఉన్నారు. అదృష్టవశాత్తు మేము ఇన్నోవాలో వెళ్ళాము, కాబట్టి ఇంక బస దొరకకపోయినా పర్వాలేదులే, ముందు అమ్మవారి దర్శనం చేసుకుని బయలుదేరదాము అనుకుని దర్శనానికి వెళ్ళిపోయాము.
Inline image 1

ఇక కొల్లూరు మూకాంబికా అమ్మవారి క్షేత్రం చాలా చాలా శక్తివంతమైనది. ఇక్కడ అమ్మవారు శివలింగ రూపములో దర్శనమిస్తారు. ఇక్కడ ఉన్న అమ్మ ముగురమ్మ మూలపుటమ్మకి ప్రతీక. ఈ మూకాంబికా అమ్మవారిని ఆదిశంకరాచార్యుల వారు ప్రతిష్టించారు. మేము వెళ్ళిన రోజున ఆలయం ఎదురుగా చాలా పెద్ద రథోత్సవం ప్రారంభం కానుంది. అంత పెద్ద రథం లాగడం నేను ఎప్పుడూ చూడలేదు. కాకపోతే, ఓ ప్రక్క మాకు కొల్లూరు లో ఉండడానికి బస దొరకకపోవడం, మరో ప్రక్క, అక్కడ చాలా మంది భక్తులు ఉండడంతో, మా చి.శ్రీవల్లి (మూడో నెల జరుగుతోంది..) మరీ చంటి తల్లి కదా.... ఏమైనా ఇబ్బంది పడుతుందేమో అని చాలా త్వరగా దర్శనం చేసుకుని వచ్చేశాము. తీరికగా కాస్సేపు కూర్చుని ఓ స్తోత్రం చదవడమో లేక ధ్యానం చేయడమో కూడా వీలుపడలేదు. ఆ విధంగా అమ్మవారి దర్శనం చేసుకుని, వెంటనే అదే కారులో మేము శృంగేరీ వెళ్ళాము. ఇలా జరగడం వల్ల, మేము శృంగేరీలో మూడు రోజులు ఉందామనుకున్నది, మొత్తం నాలుగు రోజులు ఉండే అవకాశం లభించింది. పోనీలే.. ఈ విధంగా కొల్లూరులో ఉన్న మూకాంబికయే, శృంగేరీలో ఉన్న శారదా అమ్మ దగ్గర, జగద్గురువుల సన్నిధాల దగ్గర ఎక్కువ సేపు గడపమని హడావిడిగా పంపించేసింది అనుకున్నాము.

కొల్లూరు మూకాంబికా క్షేత్రం యొక్క వైభవం - అంతర్జాలంలో సేకరించినదిః

కొల్లూరు కర్నాటకలోని కుందాపూర్ తాలూకాలో ఒక చిన్న కుగ్రామం. యాత్రికులకు ఈ స్ధలం ఎంతో ప్రత్యేకమైనది.  నిరంతరం గల గల పారే సౌపర్నికా నది  ఒడ్డున పడమటి కనుమల నేపధ్యంలో చక్కటి ప్రకృతి అందాలతో అలరించే ప్రదేశం కొల్లూరు. అక్కడి దేవాలయం ఆ ప్రదేశానికి మరింత పవిత్రతను, ప్రాముఖ్యతను సంతరించి పెట్టింది. మహర్షి పరశురాముడు ప్రఖ్యాత మూకాంబిక దేవాలయాన్ని సృష్టించాడని పౌరాణిక గాధలు చెపుతాయి.

మూకాంబికా దేవాలయం, దేశంలో పేరొందిన మత పర కేంద్రాలలో  ఒకటిగా విలసిల్లుతోంది. శక్తి దేవస్ధానంగా పూజించబడుతోంది. మాత పార్వతీ దేవి మూకాసురుడనే రాక్షసుడిని ఇక్కడ వధించిందని, అందుకుగాను ఈ ప్రదేశానికి మూకాంబిక అనే పేరు వచ్చిందని చెపుతారు. దేవాలయంలో  జ్యోతిర్లింగం ప్రధానంగా ఉంటుంది. ఈ జ్యోతిర్లింగానికి బంగారు గీత అంటే స్వర్ణ రేఖ మధ్యగా ఉంటుంది. లింగానని రెండు  భాగాలుగా చేస్తుంది. చిన్న భాగం బ్రహ్మ, విష్ణు, శివ త్రిమూర్తుల శక్తిగాను, పెద్ద భాగం  శక్తి దేవతలైన సరస్వతి, పార్వతి, లక్ష్మీ లను చిహ్నంగా చూపుతుంది.
అందమైన దేవి మూకాంబిక లోహ విగ్ర హం జ్యోతిర్లింగ వెనుక భాగంలో శ్రీ ఆది శంకరులవారు ప్రతిష్టించారు. ఆ దేవి ఆయనకు సాక్షాత్కరించిందని, ఆయనతో కలసి కేరళ రాష్ట్రానికి వెళ్లేటందుకు సిద్ధపడిందని అయితే ఆ దేవత తాను ఆయనను అనుసరించేముందు ఆయన వెనక్కు తిరిగి చూడరాదని షరతు పెట్టిందని, చెపుతారు.
దేవి మూకాంబిక శంకరాచార్యుల వారితో కలసి ప్రయాణించి ఆ స్ధలం వరకు చేరే సరికి శంకరాచార్యుల వారు ఆమె వస్తోందా లేదా అని వెనక్కు తిరిగి చూసే సరికి  ఆమె కాలి గజ్జెల శబ్దం ఆగిపోయిందని, షరతు మేరకు ఆమె   రావటానికి తిరస్కరించి అక్కడే ఉండిపోయిందని చెపుతారు. ఇక ఆపై శంకరాచార్యుల వారు కొల్లూరు దేవాలయంలో దేవి లోహ విగ్రహాన్ని జ్యోతిర్లింగం వెనుక భాగంలో  ప్రతిష్ట చేశారు.  
ఈ ప్రాంత సందర్శనలో మహిమాన్విత కొల్లూరు దేవాలయమే కాక, అడవిలోగల అరిశన గుండి జలపాతాలను కూడా చూడవచ్చు. జలపాత ధారలపై పడే సూర్య రశ్మి బంగారు వన్నె రంగులో ఆకర్షణీయంగా ఉంటుంది.  కన్నడ భాషలో అరిశెన అంటే పసుపు పొడి   అని చెపుతారు.
కొడచాద్రి పర్వత శ్రేణులుదీని సమీపంలోనే శ్రీ ఆది శంకరాచార్యులవారు తపస్సు చేసి దేవి సాక్షాత్కారాన్ని పొందిన కొడచాద్రి కొండ శ్రేణులు కూడా కలవు. ట్రెక్కింగ్ అభిలాషులు తరచుగా దర్శిస్తారు. ఈ పట్టణాన్ని సాధారణంగా నవరాత్రి లేదా దసరాలలో భక్తులు అధిక సంఖ్యలో సందర్శిస్తారు.  కొల్లూరు ప్రాంతం, వైల్డ్ లైఫ్ రిజర్వులో ఒక భాగం. మూకాంబిక వైల్డ్ లైఫ్ శాంక్చువరి సహజ రక్షిత అడవులలో ఒకటి. దీనికి వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ కూడా సహాయం చేస్తుంది. ఈ ప్రాంతంలో అబ్బురపరచే ఎన్నో లోయలు, కొండలు, జలపాతాలు ఉంటాయి.సశేషం .....


సర్వం శ్రీసుబ్రహ్మణ్యార్పణమస్తు.

How to reach Mookambika Temple - Kollur

By Road 3 hrs Approx
Mangalore city is only 50 km away from Udupi. Express buses ply between Mangalore to Udupi at regular intervals.From udupi we can reach Mookambika Temple - Kollur by bus from Udupi.
By Train
The railway station at Udupi falls on the Konkan Railway network and there are trains to most major cities of the state.From Udupi we can reach mookambika temple by bus or by taxi easily.
By Air
The nearest airport is the Mangalore airport located at Bajpe, 60 km away from Udupi. There are 2 flights daily from Mumbai,Bangalore and from other parts of India.From their we can reach Kollur Mookambika Temple by car.

Sri Mookambika Temple
Kollur - 5762200
Udupi District
Karnataka State
India
(08254) 258488, 258328, 258521, 258221

Monday, 10 February 2014

AHOBILAM

                          నంద్యాల (కర్నూలు) :


పుణ్య క్షేత్రాలు -మహానంది, అహోబిలం, యాగంటి, బెలూం గుహలు, మహానంది పుణ్యక్షేత్రం ఇక్కడ చూడదగిన ప్రదేశాలలో ముఖ్యమైనది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువుదీరిన పవిత్రాలయం నంద్యాల పట్టణంలో నెలకొని ఉంది. 2004 వ సంవత్సరం నృసింహజయంతి నాడు ఈ ఆలయ ప్రారంభోత్సవం జరిగిన నాటినుండి, దినదిన ప్రవర్ధమానమై అశేష భక్త జనాన్నీ విశేషంగా ఆకర్షించుచున్నది.
నంద్యాల చేరుకొను విధము : రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు 300 కి.మీ దూరమున ఉన్నది.
ఇక్కడ దేశంలోనే రెండవ జగజ్జనని ఆలయం ఉన్నది.

నంద్యాల పట్టణానికి రైలు మరియు బస్సు సౌకర్యం రెండూ ఉన్నాయి. విశాఖపట్టణం -బెంగుళూరు మద్డ్య నదిచే ప్రశాంతి ఎక్స్ప్రెస్ మరియు గోవా-విజయవాడ మద్డ్య నడిచే అమరావతి ఎక్స్ ప్రెస్ రైల్లు నంద్యాల మీదుగా ప్రయాణిస్తాయి.

నంద్యాల పట్టణములో కూడళ్ళలో గాంధీచౌకు,నూనెపళ్ళి మరియు బొమ్మలసత్రం ముఖ్యమైనవి. బొమ్మల సత్రం 18వ నంబరు జాతీయరహదారిని ఆనుకొని ఉంది. కర్నూలు వైపు నుండి నంద్యాల పట్టణములో ప్రవేశించేవారికి బొమ్మలసత్రం ముఖద్వారం. బొమ్మల సత్రము పక్కనే కుందేరు నది ప్రవహిస్తూ ఉన్నది.

ప్రతి రోజూ నంద్యాల నుండి హైదెరాబాద్ కు రాత్రి ప్రైవేటు రవాణా సంస్థలు బస్సులను నడుపుతాయి.

అహోబిలం


అహోబిలం హిందూ యాత్రికులకే కాక, పర్యాటక కేంద్రంగా, కొండలు, నదులు, ప్రకృతి అలంకారాలకు నైసర్గిక స్వరూపాలు. ఇది ముఖ్యంగా వైష్ణవ యాత్రికులకు పవిత్ర పుణ్యక్షేత్రం. పురాణ ప్రసిద్ధిగాంచిన అహోబిలంను అహోబలం అని కూడా వ్యవహరిస్తారు. నరసింహుడి బలాన్ని, శక్తిని దేవతలు ప్రశంశించడం వల్ల అహోబలమైనది. ఎగువ మహోబలం నందు ప్రహ్లాదుని తపస్సుకు మెచ్చి స్వయంభువుగా బిలం నందు వెలిసినాడు కావున అహోబిలం అని కూడా పిలుస్తారు. 

నరహరి తన అవతారాన్ని భక్తుల కోసం తొమ్మిది ప్రదేశాలలో ప్రకటించినాడు కావున నవనారసింహక్షేత్రం అని అంటారు. నవనారసింహులలో దిగువ అహోబిలంలో పేర్కొనబడలేదు. కాని ఈ ఆలయప్రాశస్తం అమోఘమైనది. ఇక్కడికి వచ్చిన భక్తులు ఎగువ దిగువ అహోబిల పుణ్యక్షేత్రాలను సందర్శించి తరిస్తారు. ఈ క్షేత్రం కర్నూలు జిల్లాలోని నంద్యాల రైల్వేస్టేషన్ కు 68 కిలోమీటర్ల దూరంలోని ఆళ్ళగడ్డకు 24 కిలోమీటర్ల దూరములో కలదు. అన్ని ప్రధాన క్షేత్రముల నుండి అహోబిలం చేరడానికి మార్గాలు, రవాణా సౌకర్యములున్నవి. ఈ క్షేత్రం సముద్రమట్టమునకు 2800 అడుగుల ఎత్తులో ఉంది. అహోబలం లో ప్రదానమయినది భవనాశిని నది. లక్ష్మినరసింహుని పద సరసజములు కడిగే పాద్యంగా గగన గంగ భువికి దిగి వచ్చింది. ఈ దివ్య తీర్ధంలో స్వయంభువుగా వెలసిన దేవదేవుడు ఉగ్రనరసింహస్వామి. పరప భాగవతుడయిన ప్రహ్లాదుని రక్షించడం కోసం హిరణ్యకశిపుణి వధించడం కోసం హరి నరహరిగా ఆవిర్భవించాడు. ఆ అవతార కథ సాగిన ప్రదేశమే ఈ అహోబలక్షేత్రం. దిగువ అహోబలం నందు వెలసిన ప్రహ్లదవరదుని సన్నిధానం లక్ష్మీనరసింహస్వామి విశిష్ట అద్వైతాలకు కార్యకలాపాలకు కేంద్రం. వేద ఘోషలతో దివ్యప్రబంధ సూక్తులతో అర్చకుల ఆరగింపులతో కోలాహలంగా ఉంటుంది. శ్రీ కార్యపరుల పరమ భక్తుల ఏకాంత భక్తికి అమృతవల్లి సమేత నరసింహుడు పరవసించి సేవింపవచ్చిన వారికి కోరకనే వరాలు అనుగ్రహిస్తాడు. ప్రహ్లాద వరదుడు లక్ష్మీ సమేతుడై సుందరంగా శేషపీఠం మీద అవతరించాడు. వీరి సహితంగా అమృతవల్లి సన్నిధి అండాల్ సన్నిధి కలవు. ఇక్కడ వైష్ణవ ఆచార్యులకు, అళ్వారులకు ప్రత్యేక సన్నిధాలున్నవి. వేంకటేశ్వరునకు పద్మావతి వివాహ సమయమున శ్రీ నరసింహస్వామిని ప్రతిష్టించి ఆరాధించినాడు కావున ఈ ఐదిక్యానికి గుర్తుగా వెంకటేశ్వరుని సన్నిధి, కళ్యాణ మంటపం కలదు. ప్రహ్లాద వరదుడు ఉభయనాంచారులయిన శ్రీదేవి, భూదేవి విగ్రహాలు స్వర్ణ కవచాలతో మూలమూర్తులకు దివ్యాభిషేకాలతో, దివ్య ఆభరణములతో నేత్ర పర్వంగా నిలిచింది. ఈ క్షేత్రం 108 దివ్య క్షేత్రములలో ప్రముఖమైనది. వైష్ణవ ఆళ్వారులు దర్శించి స్తుతించిన క్షేత్రమును మాత్రమే దివ్యక్షేత్రములు అంటారు. 

 ఈ క్షేత్రం నల్లమల అడవులలో ఉంది. ఆదిశేషుడు పర్వతాకృతి పొందినాడని పౌరాణిక విశ్వసం ఈ పర్వత ప్రకృతి సౌందర్యానికి మురిసిపోయిన ఆదిశేషుడు వయ్యారంగా పవళించారు. ఆ పడగలపై శ్రీనివాసుడు, నడుముపై నారసింహుడు, తోకపై మల్లిఖార్జునుడు ఆవిర్భవించారు. వీరు నల్లమల మగసిరులుగా మలచినారు. తిరుమల, అహోబిలం, శ్రీశైలం స్వయం వ్యక్త క్షేత్రాలు. అహోబిలక్షేత్ర ప్రసిద్ధికి, అభివృద్ధికి ఎందురో రాజులు, రాజన్యులు, ఎన్నో సేవలందించారు. పల్లవులు, చోళులు, విద్యానగరరాజులు, చాళుక్యులు, కాకతీయులు, విజయనగరరాజులు, రెడ్డిరాజులు అభివృద్ధికి వికాసానికి తోడ్పడినారు. 15వ శతాబ్దంలో తురుష్కుల దండయాత్రలో అహోబిలక్షేత్రం పడి నలిగిపోయింది.

రంగరాయల ప్రభువు తురుష్కుల మీద విజయం సాధించి జీయరుగారికి అహోబిలక్షేత్రాన్ని అప్పగించి, జయానికి గుర్తుగా ఉన్నతోన్నత మయిన జయస్తంభాన్ని దేవాలయ చివరి ప్రాకారమందు స్థాపించాడు. ఇది ఇప్పటికి మనం చూడవచ్చు. పరమశివ భక్తుడయిన ప్రతాప రుద్రమహారాజు దినచర్య ప్రకారం శివలింగం పోతపోయగా నృసింహాకృతి వచ్చినందుకు ఆ విగ్రహాన్ని మొదటి అహోబిల పీఠాధిపతి వారికి అప్పగించి, జీవితాంతం నరసింహుని సేవించి పూజించాడు. 
 


ఈ క్షేత్రానికి నగరి, నిధి, తక్ష్యాద్రి, గరుడాద్రి, శింగవేళ్ కుండ్రం, ఎగువ తిరుపతి, పెద అహోబిలం, భార్గవతీర్ధం, నవనారసింహ క్షేత్రం అనే పేర్లు కూడా కలవని పురాణములు చెప్పుచున్నవి. తురుష్కుల దండయాత్రలో విచ్ఛిన్నమయిన అహోబల్ క్షేత్రానికి 43వ పీఠాధిపతి పంచసంస్కారాలలో 44వ పీఠాధిపతి ఆశీస్సులతో మధురాంతకం నుండి అహోబలం మేనేజర్ గా నియమితులయిన ఆర్. లక్ష్మినారాయణ కాలమునుండి పూర్వవైభవాన్ని సంతరించుకుంటూ వస్తున్నది. 

ఇతను వేద, ప్రభంధము, అధ్యయనము, మూర్తులకు అలంకారము చేయడంలో నిష్ణాతులు. ఎన్నో ఉత్సవాలను భక్తుల సహాయంతో పూర్వ వైభవాన్ని సంతరించుకునేటట్లు చేశారు. అదే క్రమంగా పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నది. అహోబిల నృసింహుని సుప్రభాత సుందర సేవలు, ఏకాంత సేవల వరకు సొగసులను నింపుకున్నది. నవరాత్రులు విశేష దినములలో అయ్యవారు, అమ్మవారు, అద్దాల మంటపం నందు వింత వెలుగులు విరజిమ్ముతున్నారు. విజయదశమి, సంక్రాంతి పార్వేట ఉత్సవాలలో స్థానికులు, చెంచుల విన్యాసాలు, విల్లంబుల ప్రయోగాలు గ్రామీణ వాతావరణానికి అద్ధం పడతాయి. ఆలయ విధులలో పూజ పునస్కారములలో తెలిసో తెలియకో జరిగిన శైతిల్యాలకు ప్రాయశ్చిత్తంగా, వర్చస్వంతంగా క్షేత్రం విరాజిల్లడానికి పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఎన్నో నిత్య సేవలు, ఆర్జిత సేవలు, ఉత్సవాలు, అభిషేకాలు, వేదాంత ఘోషలు, ప్రభంధ పారాయణములు, కళ్యాణోత్సవములు, ఆలయపాలకులు అనితరసాధ్యంగా నిర్వహిస్తారు. తీర్థయాత్రలలో ప్రధానమయిన మండపం (తలనీలాలు), స్నానం దర్శనం మొదలయిన వాటికిక్కడ అవకాశమేర్పడింది. దిగువ అహోబిలం చేరుకుని, ప్రహ్లాదవరదుని సేవించుకొని ఇక్కడికి 8 కి.మీ దూరములోనున్న ఎగువ అహోబిలంలోని గుహాంతర్భాగాన నిలిచిన అహోబల నృసింహుని అర్చించుకొని భవనాశిని జలాలతో సేద తీర్చుకొని ఓర్పుతో క్రమంగా నవనారసింహ క్షేత్రాలను దర్శించుకొని ప్రహ్లాద బడిలో బండ మీద నిలిచి భాగవత సుందర జ్ఞాపకాలను పొంది ఉగ్రస్తంభ ప్రదక్షిణలతో పుణీతమై తీర్ధయాత్రను ఫలవంతం చేసుకోవడానికి నేడు చక్కని అవకాశమున్నది.

ఎగువ అహోబిలం గోపురం
ఎగువ అహోబిలము :
ఎగువ అహోబిలం నందు వేంచేసియున్న మూల విరాట్ కు ఉగ్రనరసింహస్వామి అహోబిల, అహోబల, నరసింహస్వామి, ఓబులేసుడు అని పిలుస్తారు. గరుడాద్రి, వేదాద్రి పర్వతముల మధ్యన ఈ ఎగువ అహోబిల ఆలయము కలదు.
దిగువ అహోబిలము:
శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రతిష్టించిన లక్ష్మీనరసింహస్వామి వేంచేసినదే దిగువ అహోబిలం.

వసతి సౌకర్యాలు

అహోబిలంలో వసతి సౌకర్యములు ఇంకా సరిగ్గా లేవు. వసతి కోసం మూడు అవకాశములు ఉన్నవి.
  • తిరుమల తిరుపతి దేవస్థానము వారి అతిధి గృహములో ఉండవచ్చు
  • లేదా అహోబిలం మఠంలో ఉండవచ్చు.
  • దగ్గరలోని పట్టణం, ఆళ్ళగడ్డలో ఉండవచ్చు. అది 30 కి.మీ దూరంలో ఉంది లేదా 70 కి.మీ దూరంలో వున్న నంద్యాలలో వుండవచ్చు.
  • ఇక్కడ ఆంథ్ర ప్రదేశ్ ప్రభుత్వ టూరిజం వారి భోజన హోటల్ కలదు.

చేరుకొను విధము

  • రోడ్డు మార్గము: హైదరాబాదు నుండి అహోబిలం వెళ్ళేందుకు రోడ్డు సౌకర్యం ఉంది.
  • రైలు మార్గము:అహోబిలం దగ్గరలోని రైలు సముదాయము నంద్యాల

నవ నారసింహ గుళ్ళు

అహోబిల క్షేత్రమందు నవనారసింహులు నవవిధ రూపాలలో ఎగువ, దిగువ అహోబిల చుట్టు ప్రక్కల వెలసియున్నారు
   జ్వాలా అహోబిల మాలోల క్రోద కారంజ భార్గవ
   యోగానంద క్షాత్రవత పావన నవ మోర్థ్యః

మాలోల నరసింహస్వామి ఆలయం

నవ నారసింహ ఆలయములకు వెళ్ళు మట్టిదారి
అనగా
  1. జ్వాలా నరసింహ
  2. అహోబిల నరసింహ: గరుత్మంతునికి దర్శనమిచ్చిన నరసింహ స్వామి.
  3. మాలోల నరసింహ: లక్ష్మీదేవికి ప్రియమైన నరసింహస్వామి
  4. క్రోద నరసింహ (వరాహ నారసింహ)
  5. కారంజ నరసింహ
  6. భార్గవ నరసింహ
  7. యోగానంద నరసింహ
  8. క్షాత్రపత నరసింహ (ఛత్రవట నారసింహ)
  9. పావన నరసింహ
అను తొమ్మిది నరసింహ దేవాలయములు ఈ క్షేత్రమున కలవు. ఇప్పుడే కొద్దికొద్దిగా రోడ్డుమార్గములు వేస్తున్నరు అన్నీ నడచిపోవాలంటే మీకు రెండు రోజులు పడుతుంది. జ్వాలా నరసింహస్వామి క్షేత్రము దగ్గర భవనాశని అనే జలపాతము ఉంది. అక్కడ స్నానంచేస్తే సకల పాపాలు పోతాయి అని భక్తుల నమ్మకం.

photos : 
http://maagodavari.blogspot.in/2011/09/blog-post_12.html