Wednesday, 30 October 2013

Arunachalam Giripradikshana

Arunachalam Giripradakshana - 2 
 ----------------------------

 మనం అరుణాచలం లో గిరిప్రదిక్షణ చేస్తున్నాం కదా .. ఇప్పుడివరకు విశ్రాంతి తిస్కున్నారు కదా .. శివనామం చెప్తూ .. కదులుదాం పదండి . 


 ఆది అన్నామలై మనకి ఇప్పడివరకూ కనిపించినా దేవాలయాల్ల కాకుండా కొంచెం లోపలికి ఉంటుంది ..మీరు చూసారా ఈ బోర్డు ని ..  తమిళం లో ఉన్నా ఆది అన్నామలై 

 మీరు అలావెళ్తే .. చూడ్డానికి మనం ఒక స్ట్రీట్ లో కి వెళ్లినట్టు ఉంటుంది .. డైరెక్ట్ గా వెళ్లి కుడివైపుకి తీరగానే .. టెంపుల్ ఇలా కనిపిస్తుంది .. 

 ఆది అన్నామలై గోపురం 

అమ్మవారి ఆలయం



 ఆలయం లోంచి బయటకు వచ్చిన తరువాత .. మీరు తిరిగి రోడ్ పైకి వస్తే ... మనం శివ నామం చెబుతూ ... 

 గణపతి దేవాలయం 

 మనం అలా నడుస్తూ ఉంటే  .. మనకి వాయు లింగం కనిపిస్తుంది 




 దర్శనం అయ్యాక మనం తిరిగి ... అరుణాచల శివ .. అరుణాచల శివా అంటూ నడక ప్రారంభించాలి .. 

 చంద్ర లింగం .. 


 చంద్ర లింగం నుంచి చూస్తే  ..



 కుబేర లింగం 


 మనం బయటకు వచ్చి .. నడుస్తున్నప్పుడు .. మనకి పంచముఖ దర్శనం కనిపిస్తుంది .. ఇక్కడ నుంచి చూస్తే ఐదు కొండ శిఖరాలు కనిపిస్తాయి .. . 


 ఈశాన్య లింగం కూడా మనకి బయటకు కనిపించదు .. అంటే మనం నడుచుకుంటూ ఊరిలోకి వచేస్తాం . 

 మీరు డైరెక్ట్ గా నడుకుంటూ వచ్చేస్తే .. సిటి లోకి వచ్చేస్తారు .. మీరు గుర్తుపెట్టుకోండి పంచక ముఖదర్శనం అయ్యాక .. రోడ్ మెయిన్ రోడ్ తో కలుస్తుంది .. అప్పుడు మీరు కుడివైపుకి తిరిగి నడిచిన తరువాత ... కొద్ది దూరం వెళ్ళాక .. అక్కడ బస్సు స్టాప్ కూడా కనిపిస్తుంది.. .. అల నడుచుకుంటూ వస్తే .. ఎడమ వైపుకి రోడ్ ఉంటుంది .  అలా నడుచుకుంటూ వస్తే .. మనకి ఈశాన్య లింగం కూడా కనిపిస్తుంది .. 


 ఈశాన్య లింగం 


 ఈ ఆలయం లో నుంచి బయటకు వచ్చి .. మళ్ళి వెనక్కు వెళ్ళకుండా .. అదేదారిలో నడిస్తే మెయిన్ రోడ్ మీదకు వస్తారు ..  ఇక్కడ వరకు వచ్చేస్తే టెంపుల్ దగ్గరకు వచ్చేసినట్లే ... 

 విష్ణు దేవాలయం .. ఈ ఆలయం పక్కనుంచి నడిస్తే .. వెనకాలే దేవాలయం .. 

 రెండు కళ్ళు చాలడం లేదు కదా ... స్వామి వారి దర్శనం .. అమ్మవారి దర్శనం అయ్యాక .. మీరు ఆలయం వెనక్కి నడుచుకుంటూ సుమారు 2 కి మీ నడిస్తే రోడ్ కి కుడివైపున అగ్ని లింగం కనిపిస్తుంది ... 

 అగ్ని లింగం దర్శనం అయ్యాక ... బయటకి వచ్చి నడుస్తూ ఉంటె .. కంగారు పడకండి .. వచ్చేసాం మనం ...

 దక్షిణ  మూర్తిదేవాలయం 

అమ్మవారి దేవాలయం


 శ్రీ శేషాద్రి స్వామి వారి ఆశ్రమం 


 శ్రీ శేషాద్రి స్వామి వారి ఆశ్రమం నుంచి బయటకు వచ్చి .. కొద్ది దూరం నడవ గానే శ్రీ రమణాశ్రమం కనిపిస్తుంది .. 



ఇక్కడితో గిరిప్రదక్షణం పూర్తైంది ... ఓం నమః శివాయ .. అరుణాచల శివ .. అరుణాచల శివ ... 


మీ కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తేలియచేయండి

Monday, 28 October 2013

Tiruvannamalai Girivalam

Girivalam - Arunachalam - 1
--------------------------------------------------------
ఈ అరుణాచలం(Arunachalam) పరమేశ్వరుని జ్యోతిర్లంగ స్వరూపమే కావటంవలన దీనిని చుట్టి ప్రదక్షిణం చేయటం సాక్ష్తాత్తు శివునికి ప్రదక్షిణము అని భక్తుల విశ్వాసం. 


శ్రీరమణులు(Sri Ramanulu) దీని ప్రాముఖ్యాన్ని పదేపదే ఊద్ఘోషించి ఉన్నారు, పాదచారులై శివస్మరణగవావిస్తూ ప్రదక్షిణ చేసేవార్కి మహాపుణ్య సిద్దిస్తుందని మహత్లుల వచనం. అందుచేత నిత్యమూ , అన్నివేళలా ఎంతోమంది గిరిప్రదక్షిణం చేస్తూ ఉంటారు.   గిరిపైన గల మహౌషధీ ప్రభావం వల్ల శరీరమునకు, శివస్మరణవల్ల మనస్సుకూ, శివనుగ్రహం వల్ల ఆధ్యాత్మిక జీవనానికి స్వస్ధత చేకూరుతుంది .

  గిరిప్రదక్షణం చేస్తున్నప్పుడు మనకి అష్ట లింగములు కనిపిస్తాయి.  అవి 

 అగ్ని లింగం రమణాశ్రమానికి (Ramana ashramam)వేళ్ళే దారిలో కనిపిస్తుంది..
గిరిప్రదక్షణం చాల వరకు తారు రోడ్డు పైనే జరుగుతుంది. ఈ మధ్య కాలం లొ గిరిప్రదక్షణం చెయనికి వీలుగా రోడ్డు పక్కన పూట్ పాత్ కూడ వేసారు. ఎక్కువ మంది ఉయదయం సూర్యతాపన్ని తట్టుకోవడం  కష్టం కనుక రాత్రి పూట / తెల్లవారుజామున చెస్తారు .
* గిరిప్రదక్షణం  చెప్పులు లేకుండా చేయాలి.
*బరువు ఎక్కువగాఉన్నావాటిని మీ కూడ తీసుకువెళ్ళకండి (సంచులు అలాంటివి)
*గిరిప్రదక్షణం 14కి.మి దూరం ఉంటుంది. 
*ఉదయం పూట గిరిప్రదక్షణం చేయడం చాలా కష్టం .. 9 లోపు ముగించడం  మంచిది .
*గిరి ప్రదక్షణం పౌర్ణమి రోజు ఎక్కువ మంది చేస్తారు .
 
పౌర్ణమి రోజు / ప్రసిద్దమైన రోజున మాత్రం రాత్రిపూట అందరకి దర్శనం అయ్యేలా చూస్తారు .
* మీరు చిల్లర తిసుకువేళ్ళడం మరిచిపొవద్దు .
* గిరిప్రదక్షణం లో "నేర శివాలయం" అని ఉంది కద లిస్ట్ లో దానికర్ధం  శిఖరానికి ఏదురుగ ఉన్న శివాలయం అని.
* గిరిప్రదక్షణం ప్రతిరోజూ చేస్తారు .
 ---------------------------------------------------------------------------
తెల్సుకున్నారా ? ఎలా చేయాలో ? ఏమి చూడాలో ?
రండి మనం ఇప్పుడు గిరిప్రదిక్షణం చేద్దాం .. ఓం నమః శివాయ
రమణ మహర్షి ఆశ్రమం ..
 ఒక్కసారి శివుణ్ణి స్మరించి .. గిరిని చూస్తూ నడక ప్రారంభిద్దాం ..

 సింహ తీర్ధం ...

 మనం నడవబోయేది మొత్తం ఈ రోడ్డు మీదే ..

 శ్రీ పరాశక్తి అమ్మవారి ఆలయం ..


 యమ లింగం ..

 దర్శనం అయ్యాక .. ఓం నమః శివాయ ... అరుణాచల శివ అంటూ ..


మనం గుర్తుపేట్టు కోవాల్సిన ముఖ్య విషయం .. ఈ ఫోటో చూడండి రోడ్ మలుపు తిరిగింది .. ఎలా ఎప్పుడు కనిపించినా.. కొండవైపుకు తిరగాలి .. లేదా కుడివైపు వెళ్ళాలి ..
 
 వినాయకుడి దేవాలయం ..
 మీరు స్వామి వారి టెంపుల్ నుంచి కొండవైపుకి చూస్తే  మీకు ..

అక్కడ మీరు కొండను చూస్తే మీకు నంది ( తల) కనిపిస్తుంది .  
ఈ రోడ్ లో మనకి ట్రాఫిక్ కాస్త తగ్గుతుంది .. రోడ్ ఇరువైపులా చెట్లతో ప్రశాంతంగా ఉంటుంది ..

ఎం బయపడకండి .. మన జోలికి రావవి ..


 దుర్వాసో మహర్షి   వారి ఆలయం

 ఒక్కో దేవాలయాన్ని దర్శిస్తూ .. ముందుకు కదలాలి..

 చూసారా నెమలిని .. దారిలో అప్పుడప్పుడు మనకి కోతులతో పాటు నెమల్లు కూడా ఇలా కనిపిస్తూ ఉంటాయ్ ..

 నైరుతి లింగం

 నైరుతి దగ్గర కోనేరు ..

 నవ లింగం - నవ శక్తి .. ఈ దేవాలయం లో మనం చూడవచ్చు ..



 కొండకి ఎదురుగా ఉన్న దేవాలయం ...

 పక్కనే అమ్మవారి ఆలయం కూడా ఉంది ... మనం లోపాలకి వెళ్లి దర్శనం చేయవచ్చు ..
 వెనకాల కోనేరు .. 
ఆంజనేయ స్వామి వారి దేవాలయం ..



 శ్రీ రాఘవేంద్ర స్వామి వారి దేవాలయం ...



 శ్రీ గౌతమ మహర్షి వారి ఆశ్రమం .. 

 నడుస్తున్నార ? ఆగిపోయరా .. చెప్పగా దేవాలయాల్ని చూస్కుంటూ ... భగవాన్ నామం చెప్పుకుంటూ .. ముందుకు కదలాలని .. :)

 సూర్య లింగం .. ఇక్కడ మీరు కొండని చూస్తే .. మీకు కనిపించే శిఖరం కాకుండా వెనకాల ఉన్న శిఖరం .. వినాయకుడి తొండం లా కనిపిస్తుంది ... మరీచి పోకండి .. 

 విష్ణు పాదాలు ... 
వరుణ లింగం





కాసేపు విశ్రాంతి తీస్కోండి .. తరువాత మనం ఆది అన్నామలై టెంపుల్ .. కుబేర లింగం .చంద్ర లింగం . ఈశాన్య లింగం .. అరుణాచలేశ్వర టెంపుల్ .. అగ్ని లింగం .. దక్షిణ మూర్తి దేవాలయం .. శేషాద్రి ఆశ్రమం చూస్తే ప్రదిక్షణ పూర్తైనట్లే . తరువాతి పోస్ట్ లో ఆ వివరములు తెలియచేస్తాను . 
మీ కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తేలియచేయండి