ద్రాక్షారామం ( Draksharamam Temple Information )
ఆంధ్ర దేశములో 5 శివక్షేత్రాలు పంచారామాలుగా ప్రసిద్ధము.
సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుని సంహరించినపుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగము ముక్కలై 5 ప్రదేశములలో పడినదని, ఆ 5 క్షేత్రములే పంచారామములని కధనము.
స్కాంద పురాణంలోని తారాకాసుర వధా ఘట్టం ఈ పంచారామాల పుట్టుక గురించి మరొకలా తెలియజేస్తొంది.
హిరణ్యకశ్యపుని కుమారుడు నీముచి. నీముచి కొదుకు తారకాసురుడనే రాక్షసుడు. అతడు పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సు చెసి ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. అంతే కాకుండా ఒక అర్భకుడి (బాలుడి) చెతిలో తప్ప ఇతరులెవ్వరి వల్లా తనకు మరణం లెకుందా ఉండేలా వరం పొందుతాడు. బాలకులు తననేం చేయగలరని ఆ దానవుడి ధీమా! సహజంగానే వరగర్వితుడైన ఆ రాక్షసుడు దేవతల్ని బాధించడమూ, వారతనిని గెలవలేకపొవటము జరిగిన పరిస్థితిలో అమిత పరాక్రమశీలీ , పరమేశ్వర రక్షితుడూ అయిన తారకుడిని సామాన్య బాలకులేవ్వరూ గెలవడం అసాధ్యని గుర్తించి దేవతలు పార్వతీ పరమేశరుల్ని తమకొక అపూర్వ శక్తిమంతుడైన బాలుడ్ని ప్రసాదించమని ప్రార్ధిస్తారు. దేవతల కోరిక నెరవేరింది. శివ బాలుడు - కుమారస్వామి ఉదయించాడు. ఆయన దేవతలకు సేనానిగా నిలిచి తారకాసురుని సంహరించాడు.
శివాత్మజో యదా దేవాః భవిష్యతి మహాద్యుతిః
యుధ్ధే పునస్తారకంచ వధిష్యతి మహబలః
- స్కాందము
తారకాసురుడు నేల కూలడంతో అతనియందున్న ఆత్మలింగం ఐదు ముక్కలైంది. దేవతలు ఆ ఐదింటిని ఐదు చొట్ల ప్రతిష్టించారు. అవే పంచారామ క్షేత్రాలు.
దక్షారామము (ద్రాక్షారామము, తూ||గో|| జిల్లా) - భీమేశ్వరుడు
కుమారారామము (సామర్లకోట, తూ||గో|| జిల్లా) - భీమేశ్వరుడు
క్షీరారామము (పాలకోల్లు, ప||గో|| జిల్లా) - రామలింగేశ్వరుడు
భీమారామము (భీమవరం, ప||గో|| జిల్లా) - సోమేశ్వరుడు
అమరారామము (అమరావతి, గుంటూరు జి||) - అమరేశ్వరుడు
దక్షారామము ( వ్యావహారికంగా ద్రాక్షారామము)
తూర్పుగోదావరి జిల్లాలో, కాకినాడకు ముఫ్పై కిలోమీటర్ల దూరంలో దక్షారామ క్షేత్రం ఉంది.
ఇచ్చట స్వామివారు భీమేశ్వరుడు, అమ్మ వారు మాణిక్యాంబ..క్షేత్రపాలకులు లక్ష్మీనారాయణులు
శివాలయంతో పాటు విష్ణ్వాలయం, శక్తి పీఠం ఉన్న దివ్య క్షేత్రం దక్షారామము. దక్షప్రజాపతి ఇచ్చట యజ్ఞం చేసాడని ప్రసిధ్ది . తారకుని సంహారానంతరం శివలింగ భాగం ఇక్కడ పడి ఉందని తెలుసుకున్న సప్తర్షులు సప్తగోదావరి తీర్థంలో సుప్రభాత సమయంలో భీమేశ్వరునికి అభిషేకం చేయాలకున్నారు. మార్గమధ్యమంలో తుల్యఋషి యజ్ఞం చేస్తున్నాడు. ఋుషులు తెస్తున్న గోదావరులు తన యజ్ఞాన్ని ముంచేస్తాయని ఋుషులను గోదావరులను వారించాడు. వాదోపవాదాల మధ్య తెల్లవారిపోయింది. సూర్యభగవానుడు శివలింగానికి ప్రధమ సుప్రభాత అభిషేకం చేశాడు. నిరాశ చెందిన ఋుషులను వేదవ్యాసుడు ఓదార్చి తాను సప్తగోదావరులను పుష్కరిణితో చేర్చానాని అది సప్తగోదావరి గా పిలువబడుతుందని, ఈ తీర్థంలోనే స్వామికి నిత్యాభిషేకం జరుగుతుందని చెప్పాడు.
నాలుగు ప్రవేశ ద్వారాలతో ఆలయ బాహ్యప్రాకారం ఎత్తైన రాజగోపురాలతో నిర్మితమైంది. బాహ్యప్రాకారంలో కాలభైరవాలయం, త్రికూటాలయం ఉన్నాయి. ధ్వజ స్ధంభం ముందు రావి వేప వృక్షాలు ఉన్నాయి. ఆ చెట్లనీడలో శివలింగం, విష్ణు విగ్రహం ఉన్నాయి. రెంటినీ శంకరనారాయణ స్వాములని పిలుస్తారు.
భీమేశ్వర లింగం 2.5 మీటర్ల ఎత్తులో నలుపు తెలుపు రంగులో ఉంటుంది. ఆలయం రెండో అంతస్తులో ఉందు. అభిషేకాదులు పై అంతస్తులో లింగ భాగానికి చేస్తారు.
ఈ ఆలయం తూర్పు చాళుక్యుల కాలంలో క్రీ.శ. 892-922 మధ్య నిర్మితమైంది. ఆలయ స్థంభాలపై, గోడలపై 800 పైగా శాసనాలు ఉన్నాయి.
దైనందిన కార్యక్రమాలు
ప్రతీరోజు ఉదయం- 5:00 మేలుకొలుపు,సుప్రభాతం,
- 5:30 ప్రాతఃకాలార్చన,తీర్ధపుబిందె,
- 5:45 బాలభోగం,
- 6:00 నుండి 12:00 సర్వదర్శనం,అభిషేకాలు,అర్చనలు,
- 12:00 మధ్యాహ్నకాలార్చన,
- 12:15 రాజభోగం,
- 12:15 -3:00విరామం,
- 3:00 నుండి 8:00 వరకు సర్వదర్శనం,పూజలు,అర్చనలు,
- 7:30 నుండి 7:45 వరకు స్వస్తి ప్రవచనం,
- 7:45 నుండి 8:00 వరకు ప్రదోషకాలార్చన,నీరాజన మంత్రపుష్పాలు,ఆస్థానపూజ-పవళింపుసేవ,
- రాత్రి 8:00 నుండి ఉదయం 5:00 వరకు కవాటబంధం
వసతి
ప్రతీ నిత్యం భక్తులు ఆంధ్ర రాష్ట్రం నుండే గాక ఇతర రాష్ట్రాల నుండి కూడా వచ్చి ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకుని వెళ్తుంటారు. యాత్రీకుల సౌకర్యార్ధము ఇచ్చట పైండా వారిచే నిర్మించబడిన అన్నసత్రం కలదు. దేవస్థానం వారి యాత్రికుల వసతి గృహము ఆలయానికి 1/2 కి.మీ దూరంలో ఆర్.టి.సి బస్టాండుకు దగ్గరలో కోటిపల్లి రోడ్డులో కలదు.Puja | INR |
Laksha Patri Puja | 350.00/- |
Laksha Kumkumarchana | 300.00/- |
Laksha Vattula Nomu | 300.00/- |
Surya Namaskaramulu | 100.00/- |
Ekadasa Rudramu | 100.00/- |
Mahanyasa Purvaka Abhishekamu | 30.00/- |
Sahasra Kumkumarchana | 30.00/- |
Laghu Vyasa Poorvaka Eka Vaara Abhishekam | 20.00/- |
Ashtotthara Kumkumarchana | 20.00/- |
Masa Shivaratri Abhishekam (Every month) | 10.00/- |
Masa Shivaratri Kumkuma Puja (Every month) | 10.00/- |
Abhishekam (Every Monday) | 10.00/- |
Puja (Every Friday) | 10.00/- |
Nomulu / Aksharabhyasam / Annaprasana | 100.00/- |
Special Darshan Ticket (On Festivals) | 5.00/- |
Keshakhandana | 5.00/- |
Upanayanamu | 100.00/- |
Abhishekam Ticket(Monthly) | 300.00/- |
Kumkumarchana Ticket(Monthly) | 300.00/- |
Abhishekam at the time of Dasara Festival(For 10 days) | 100.00/- |
Kumkumarchana at the time of Dasara Festival(For 10 days) | 100.00/- |
Rudra Homam | 100.00/- |
Japam/Tarpanam /Nava Varaarchana | 100.00/- |
Nitya Kalyanam | 500.00/- |
Sthala Puranam | 3.00/- |
Sri Swamy vari Archana | 5.00/- |
Abhishekam/Kumkumarchana through MO | 100.00/- |
Ubhayam at the time of Dasara | 500.00/- |
Sri Bhimeswara Swamy Temple Address:
The Executive Officer,
Sri Bhimeswara Temple,
Ramachandrapuram Mandal,
East Godavari District-533232
Andhra Pradesh, India
No comments:
Post a Comment