Tuesday 10 September 2013

బొజ్జ గణపతి


 పిల్లలా  బొజ్జ గణపతి

అన్నయ్య నీకో విషయం చెప్పాలి అని మొహమాటం పడుతూ నన్ను పక్కకు తీస్కుని వెళ్ళాడు 1st క్లాసు చదువుతున్న "చందు"గాడు . హా చెప్పరా ఏమిటి అన్నను . మరేమో మేము వినాయకుడి బొమ్మను తీస్కుని వచ్చి 9 రోజులు పూజ చేద్దాం అనుకుంటున్నాం .



మేమందారం డబ్బులు కూడా వేస్కున్నాం నువ్వు కూడా ఇస్తావా అన్నయ్య ప్లీజ్ ఇవ్వవా అని అమాయకంగా అడుగుతుంటే . నేను షాక్ అయ్యాను చోకాలేట్స్ కొనుక్కోవడానికి డబ్బులు అడుగుతాడు అనుకుంటే విడేమిటి అనుకున్నాను . లోలోపల పొంగిపోయాను . ఎంత ఉన్నాయ్ మీ దగ్గర ఎంతకావాలి అన్నాను . మేమందరం కలిసి 10/- వేస్కున్నాం ఇంకో 10/- ఉంటే 20/- రూపీస్ కి బొమ్మవస్తుంది అన్నాడు సరే ఐతే . అయిన ఇప్పుడు వద్దులేరా నెక్స్ట్ ఇయర్ చేస్కుందురు గాని అన్నాను . వాడిమోహం వాడిపోయింది సరేరా 10/- ఒకే నా అన్నాను సరే అని ఇచ్చాను . వాడు వాడి గ్యాంగ్ తో మంతనాలు చేస్తున్నాడు ..మా చిన్ననాతో మరో 10/- ఇప్పించి నేను బయటకు వెళ్ళిపోయాను .
వినాయకుడి విగ్రహాలు మా ఉరిలో లేవు .. 3కి మీ వెళ్ళి తీస్కునిరావాలి వీళ్ళాకి సాధ్యపడదు చోకాలేట్స్ కొనుక్కుని తింటారులే పిల్లాలు అని వెళ్ళిపోయి 2గంటల తరువాత వచ్చాను .. దూరం నుంచే నన్ను అన్నయ్య అన్నయ్య అంటూ పిలుస్తూ నాకు ప్రసాదం ఇచ్చారు . ఏం జరుగుతుంది అని చూస్తే బొజ్జగణపయ్య పిల్లల సైకిల్ మీద కుర్చీని ఉరేగుతున్నాడు . నాకు కన్నీళ్ళు రావడం ఒకటే తక్కువ .. 


వావ్ ఏమిటి నిజామా  అనుకున్నాను . ఈలోపు మా చెల్లి సత్య పుస్తకం పట్టుకుని వచ్చి చూడు చూడు అన్నయ్య మాకు వచ్చిన చందాలు అంటూ చూపిస్తుంది . తనే లీడర్ ఆ టీం కి 7th క్లాసు చదువుతుంది . అందరు 2/- , 5/- , 10/- ఇచ్చారు .
నేను వెంటనే పిల్లాల్ని రామాలయం లోకి తీస్కుని వెళ్లి .. వినాయకుణ్ణి టెంపుల్ లో ఉంచి . పిల్లల్ని కూర్చోమని చెప్పి వాళ్ళ చేతికి మైక్ ఇవ్వగానే పిల్లలు గణపతి మహారాజ్ కి జై .. అంటూ భజన స్టార్ట్ చేసారు .
సత్య మైక్ ఇచ్చుకుని " నమస్కారం .. పిల్లలు ఏర్పాటుచేస్కున్నా బొజ్జ గణపతికి చందులు ఇచ్చిన వారు అని 2/- , 3/- ,10/- చదువుతుంటే విన్నవాళ్ళంతా ఆశ్చర్య పోయారు . ఎం చేస్తున్నారు ఈ పిల్లలు అని . 2nd క్లాసు  చదువుతున్న మరో అల్లరి పిడుగు మైక్ తీస్కుని ఇప్పుడే అందిన చందా అని చదివి లాస్ట్ లో వారిని వారి కుటుంబాన్ని మా బొజ్జ గణపతి చల్లగా చూడాలని కోరి ప్రాద్దిస్తున్నాం . అంటే నాకు ఏమని అనాలో తెలియలేదు . మావాళ్ళు బాగా ముదిరిపోయారు అని పించింది .
 



 మొత్తానికి 250/- వచ్చాయ్ అన్నయ్య థాంక్ యు అన్నయ్య అన్నారు .
రోజు స్కూల్ కి వెళ్ళే ముందు వచ్చి అందరు దండం పెట్టుకుంటాం . సాయంత్రం కూడా వత్తు వెలిగింది దండం పెట్టుకుంటాం అన్నారు .
అందర్కి చోకలేట్స్ తెప్పించి నోరు తీపిచేసాను .


















మీ కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తేలియచేయండి

1 comment:

  1. same ilanti feeling naku ma apartments lo pettina pillala ganapathi choosi kaligindhi.nenu post vedhdhamu anukunnanu.meeru vesesaaru.ayinaa vraasthaanu .aa
    pillalaku aasheessulu andali kadha.chinnaarulaku aasheessulu :)

    ReplyDelete