Wednesday 6 July 2011

Rameswaram Temple Information

రామనాథ స్వామి దేవాలయం - రామేశ్వరము |Ramanathaswamy Temple - Rameswaram

రామేశ్వరము(Rameswaram) తమిళనాడు రాష్ట్రములొని రామనాథపురం జిల్లా లోని ఒక పట్టణం.ఈ పట్టణములొ ద్వాదశ జోత్యిర్లింగాలలొ ఒకటైన రామనాథ స్వామి దేవాలయం ఉన్నది.తమిళనాడు రాజధాని చెన్నై కి 572 కి.మి దురములొ ఉన్న ఈ పట్టణం ప్రధాన భూభాగం నుండి పంబన్ కాలువ ద్వారా వేరు చేయబడింది.

హిందు ఇతిహాసాల ప్రకారం ఇక్కడే శ్రీ రాముడు సేతువు నిర్మించి లంకాధీనేతైన రావణాసురుడు పరిపాలించిన లంక కు చేరాడు. ఇక్కడ రాముడు నిర్మించిన సేతువు ని రామసేతువు అని పిలుస్తారు.





రావణాసురిడిని నిహతుడిని చేశాక తనకి అంటిన బ్రహ్మ హత్యాపాతకం నిర్మూలించుకోవడం కొరకు రామేశ్వరము లొ రామనాథేశ్వర స్వామి ప్రతిష్ఠించాడు. రామేశ్వరము శైవులకు, వైష్ణవులకు అత్యంత పవిత్ర స్థలము .



సముద్ర స్నానం దగ్గర ఫోటో ఇది. అసలు మనకి సముద్రం లాగా కనిపించదు మన గోదావరి లో అలలే కొద్దిగా ఉరకలు వేస్తూ ఉంటే .. రాముడు చెప్పాడు అని కాబోలు నాకేం తెలియదు అన్నట్టుగా మౌనంగా  ప్రశాంతంగా ఉంటుంది. మీరు స్టే చేయడానికి Hotels , Lodge లు గుడికి దగ్గరలోనే కలవు. టిఫిన్ చేయడకి భోజనానికి కూడా గుడికి దగ్గరలోనే హోటల్స్ ఉన్నాయి





  ఈ ఫోటో లో చూసారా సముద్రం లో చాల దూరం వెళ్లి స్నానం చేస్తున్నారు .. ఇక్కడ లోతు చాలాతక్కువ .

మీరు ముందుగా సముద్ర స్నానం చేసిన తరువాత గుడి లో ఉన్న 22  బావుల్లో స్నానం చేయాలి .. స్నానం చేయడానికి ఒక్కొక్కరికి టికెట్ 25 /- చెల్లించవలసి ఉంటుంది. కాని "Q" చాల పెద్దదిగా ఉంటుంది. ఈ ఫోటో లో చూస్తున్నారు గా మనకోసం బకెట్ లతో వీళ్ళు రెడీ గా ఉంటారు .
మనం వీర్కి ఒక్కొక్కరికి 100 - 150 /- చెల్లించవలసి ఉంటుంది. ఇది మీరు బేరమాడే సామర్ద్యం మీద ఆధారపడి ఉంటుంది. చెప్పడం మరిచాను మీరు వాటర్ ఇంటికి తీసుకువెళ్ళడానికి కావలిసిన వాటర్ డబ్బాలు అక్కడ లభిస్తాయి.

 మీకు నేను చెప్పను కదా 22  బావుల్లో స్నానం చెయ్యాలని ఆ బావుల పేర్లు ఇవిగో ....
మహాలక్ష్మి తీర్థం, సావిత్రి తీర్థం,గాయత్రి తీర్థము,సరస్వతీ తీర్థము,సేతుమాధవ తీర్థము,నల తీర్థము,నీల తీర్థము,గవయ తీర్థము,కవచ తీర్థము,గందమాదన తీర్థము,చక్ర తీర్థము,శంఖ తీర్థము,బ్రహ్మహత్యాపాతక విమోచన తీర్థము,సూర్య తీర్థము,చంద్ర తీర్థము,గంగా తీర్థము,యమునా తీర్థము,శివ తీర్థము,సర్వ తీర్థము,కోటి తీర్థము ,సత్యామృత తీర్థము,గయా తీర్థము.
 మీరు వెళ్ళినప్పుడు మాత్రం బొట్టింగ్ కి తప్పనిసరిగా వెళ్ళండి . చాల బాగుంటుంది, 50 /- టికెట్ 


.




 బొట్టింగ్ చేస్తున్నప్పుడు తీసిన ఫోటో ఇది .



ధనుష్కోడి  దగ్గర  సముద్రం ఇది . మనం ఎక్కడ ఇంత అందమైన సముద్రాన్ని చూసి ఉండం.

వాటర్ చాల క్లీన్ గా ఉంటుంది . బహుశా మన అందరికి దూరంగా ఉన్నందుకు అంత క్లీన్ గా ఉందేమో .



రామేశ్వరము నుండి ధనుష్కోడి వరకూ ఉన్న రైల్వే లైను 1964లో సంభవించిన పెనుతుఫానులో, ప్రయాణీకులతో సహా కొట్టుకు పోయినది. ఆ తరువాత రైల్వే లైనును పునరుద్ధరించినా, ఆరు పెద్ద ఇసుకతిన్నెలు పట్టాలను కప్పివేయగా దాన్ని ఉపయోగించడం నిలిపివేశారు. ప్రస్తుతం ధనుష్కోడికి సముద్రతీరము వెంట కాలినడకన లేదా ఇసుకతిన్నెలపై జీపు ద్వారా చేరుకోవచ్చు.


ధనుష్కోడి కి వెళ్ళాలంటే ఇదొగో  ఇలానే వెళ్ళాలి . మీరు వెళ్ళినప్పుడు మాత్రం ట్రాక్ పైన కుర్చోడానికే చూడండి. ఆ ఎంజాయ్ ఏ వేరు .



పూర్వము కాశీ తీర్ధయాత్ర, రామేశ్వరములో పూజచేసి, ధనుష్కోడి వద్ద మహోదధి (బంగాళాఖాతము) మరియు రత్నాకర (హిందూ మహాసముద్రము)ల సంగమస్థలంలో పవిత్రస్నానం చేయనిదే పూర్తికాదని భావించేవారు. సేతు ధనుష్కోడి నుండే ప్రారంభమవుతుంది. సంస్కృతములో సేతు అనగా వంతెన. ఇప్పుడు సేతు అనగా రామాయణములో రాముడు లంకను చేరుటకు నిర్మించాడని భావిస్తున్న వారధి అనే ప్రత్యేకార్ధము కూడా వచ్చినది.
 చాల కస్టపడి బయటకి లాక్కున వచ్చాను .. :)




ఈ ప్లేస్ దగ్గరే బంగాళా ఖాతం , హిందూమహాసముద్రం కలుస్తాయి .
హిందూ మహాసముద్రం కెరటాలతో ఉరకలు వేస్తుంటే .. బంగాళా ఖాతం మాత్రం చాల ప్రశాంతంగా ఉంటుంది .



ఈ ఫోటో లూ  మాత్రం ఆ రోజుల్లో జరిగిన విషాదానికి గుర్తులు . ధనుష్కోడి తన వైభవాన్ని కొలిపోయి .అప్పటి జ్ఞాపకాలను తన వైభవాన్ని మనకు చూపిస్తుంది . 
 సూర్యుడు కూడా ఫోటో లు తీయడానికి ఇష్టం లేనట్టు.. చీకటిని పంపుతూ ఉండగా తీయడం వాళ్ళ ఇలా వచ్చాయ్








మార్నింగ్ మళ్లి మేము మిగిలిన ప్లేస్ లు చూడటానికి బయలుదేరాం.మీరు గుడిదగ్గర ఉన్న ఆటో వాళ్ళకు 200 /- ఇస్తే వాళ్ళు శ్రీ రాముడి పాదాలు,ఆంజనేయ స్వామి గుడి, రామ తీర్దం, సీతమ్మ వారి తీర్దం , లక్ష్మణ తీర్దం , కలాం గారి హౌస్ .... చూపిస్తారు .. ఇవాన్ని 2 గంటల సమయం లోపే సరిపోతుంది. మీరు 9 a.m తరవాత వెళ్ళడానికి ప్రయత్నించండి .





ఈ గుడి దగ్గర శ్రీ రాముడు పాదాలు ఉన్నాయి . మనకు గుడిల కనబడుతున్న.. ఇది పర్వతం అంట



మన ఆంజనేయుడు ఈ ప్లేస్ లోనే రాముల వారికీ సీతమ్మ తల్లి గుర్తులను ఇచ్చాడు .


శ్రీ రాముల వారి గుడి,రామ తీర్దం, సీతమ్మ వారి తీర్దం , లక్ష్మణ తీర్దం





 ఆంజనేయ తీర్దం ..
 సీత తీర్దం ఇక్కడే ఇస్తారు ...




ఫోటో చుసిన వెంటనే అర్ధం అయింది అనుకుంట .. కలాం గారి హౌస్ ఇదే ...




ఉదయాన్నే సముద్ర తీరం వద్ద ..




చెన్నై నుంచి రామేశ్వరం వెళ్ళడానికి Egmore Railway Station  నుంచి ట్రైన్స్ ఉన్నాయ్ అండి.


 
****మీ కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తేలియచేయండి ****

36 comments:

  1. చాలా బాగా చెప్పారండీ.. ఇన్ఫో బాగుంది..

    ReplyDelete
  2. thanks andi..(venteswara rao & raj).

    ReplyDelete
  3. చాలా బాగుందండి .

    ReplyDelete
  4. బ్లాగ్ చాలా బాగుంది రాజా..

    ReplyDelete
  5. Thank U andi .. Sanjana garu

    ReplyDelete
  6. chala chala baga unnaya photos i am ramana

    ReplyDelete
  7. velu ithe enko sari vella vacchu kudirethe enkosari padava ekka vacchu.bye raja nice trip.

    ReplyDelete
  8. Thanks a lot man,we need not to visit this place becoz u have presented the tour very well...!

    ReplyDelete
  9. nijanga rameswaram vellivachina feel kaligindi,good job

    ReplyDelete
  10. nice. accommodation, food gurinchi raayandi

    ReplyDelete
    Replies
    1. miku temple daggaralone.. hotels unnay andi.. sekhar garu

      Delete
  11. raja garu,

    mee blog chaala bagundi.yatralu chesina taruvatha mee viseshalu kuda ento upayoga padatai.

    pls update any new things.

    Thanks.
    krishnaveni
    hyderabad

    ReplyDelete
  12. Very Nice Raja Garu
    All are Beautiful

    ReplyDelete
  13. మొట్టమొదటి తెలుగు బ్లాగ్స్ ఆన్ తిరుమల శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి,కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి, శ్రీకాళహస్తిశ్వర స్వామి గురించి,తెలుగు సంస్కృతి సంప్రదాయాలు,మన దేవుళ్ళ ప్రసాదములు గురించి తెలుగు లో బ్లాగ్స్
    http://tirumaladarshini.blogspot.in
    http://thesrikalahasthitemple.blogspot.com
    http://tirupatigamgamma.blogspot.in
    http://manadevatalaprasadamulu.blogspot.in
    http://theteluguculture.blogspot.in
    http://kanipakamtemple.blogspot.in
    http://thesrikalahasti.blogspot.in

    ReplyDelete
    Replies
    1. mi blogs anni bagunnay andi.. manchi samacharam istunnaru

      Delete
  14. hi raja garu...

    maku rameswaram lo jarige naaga prathista gurinchina information kavali. meru provide cheyagalara? please.

    chandrika

    ReplyDelete
  15. ma id :- sai_chandrikav@yahoo.com

    ReplyDelete
  16. sree rama krishna sharma gudipaty15 February 2013 at 06:23

    Dear Rajachandra Garu,
    Hats off. Really you are doing a good job with good content about the places and temples you visited. May Lord Rama bless you to visit many more temples, places of tourist importance and bring them to notice of the public.
    wishing all the best
    Sharma GSRK

    ReplyDelete
  17. nice chala information undhi. nanu rameswaram vaillanu kani meru chupena places chala miss ayanu. marala vaillale ane undhi

    ReplyDelete
  18. ee sari vellinappudu miss avvakunda chusina randi.. sekhar garu..

    thank you

    ReplyDelete
  19. Thank you brother u did gud job once again thanks alot....

    ReplyDelete
  20. You have given good account of Rameshwaram. Thanks

    ReplyDelete
  21. good post raaja chandra garu maa andariki teliyani enno vishayalu choopistunnaru entho punyam chesukuntunnaru aa devathalandaru mimmalni challaga chudalani korukuntunnanu

    ReplyDelete
  22. Very valuable information. Thanks for sharing

    ReplyDelete
  23. chala bagundi me blog nenu kuda yatralu tiriganu kani elanti vivaralu vrayaleka poyanu chala thanks

    ReplyDelete
  24. Namaste sir,Your are giving a very useful information to us we r very thankful to u.Sir we not able to select the information to take print,can u suggest us.We r getting ful prints not selection is not done why

    ReplyDelete
    Replies
    1. select ayyela chesanu.. ippudu maro sari select cheyandi

      Delete