Wednesday, 24 October 2012

TIRUMALA - ALIPIRI


శ్రీనివాస గోవిందా | శ్రీ వెంకటేశా గోవిందా | భక్త వత్సల గోవిందా | భాగవతా ప్రియ గోవిందా | నిత్య నిర్మల గోవిందా | నీలమేఘ శ్యామ గోవిందా | గోవిందా హరి గోవిందా గోకుల నందన గోవిందా

 అలిపిరి నుంచి తిరులమల నడక మార్గం  ( 20-10-12)



ఈ పోస్ట్  తిరుమల మొట్టమొదటి సారిగా అలిపిరి నుంచి మెట్లమర్గమున నడిచి వెళ్ళే వాళ్ళకోసం .
అలిపిరి చేరుకోవడం :
తిరుపతి రైల్వే స్టేషన్ / బస్  స్టాండ్  నుండి అలిపిరి కి బస్సు లు ఉన్నాయ్ . లోకల్ సిటీ బస్సు లు కూడా నడుపుతున్నారు ( టికెట్ 8/- )


మీతో పాటు తీస్కుని వచ్చిన లాగేజ్  ని అలిపిరి వద్ద ఉన్న  లగ్గేజ్ రూమ్ వద్ద  మీరు ఇచ్చినట్లైతే  మీరు కొండపైకి చేరుకున్న తరువాత మీ లగేజ్ ని కొండపైన ఉన్న లగ్గేజ్ రూమ్ వద్ద మీరు తిస్కోవచ్చును .
మీరు మీ బాగ్ లకు తాళాలు వేయకపోతే వాళ్ళు తిస్కోరు . తాళాలు బయటే అమ్ముతారు ( 15/- ) .
చాల తక్కువ బరువున్న సామాన్లు మాత్రమే మీతో తీస్కుని వెళ్ళండి . 

తిరుమల నడకదారి ప్రారంభం .. అందరు ఒక్కసారి గోవిందా .. గోవిందా అని ప్రారంభించండి 
 


శ్రీ వారి పాదాల మండపం
నారాయణాద్రి  , తిరుమల
మీరు కొండపైకి ఎక్కుతున్నప్పుడు  స్వామి యొక్క అవతారాలు   మీరు చూడవచ్చు 

 మత్స్యావతారము 

  • నెమ్మదిగా నడవండి, పరుగెత్తవద్దు, పరుగెత్తితే తొందరగా అలసిపోతారు.
  • సాధ్యమైనంతవరకూ మొదటి గంట ఎక్కడా కూర్చోవద్దు, కూర్చోకుండా నెమ్మదిగా నడిస్తే మొదటి గంటలో మెట్లన్నీ అయిపోయి మామూలు రోడ్డులాంటి దారికి వెళ్తారు, ఇక అక్కడి నుండి మోకాళ్ళ మంటపము వరకూ మెట్లు ఉండవు, ఉన్నా ఒకటీ అరా ఉంటాయి.
  • మెట్లకి ఇరువైపులా ఉన్న అంగళ్లలో పానీయాలు, తినుబండారాలు తక్కువ తీసుకోండి. సాధ్యమైనంతవరకు గ్లూకోసు, నీళ్లు - వీటిపై ఆధారపడండి, ముఖ్యంగా కూల్ డ్రింకులు(కోక్,పెప్సీ మొ.) ఏ విధంగానూ మన నడకకు సహకరించవు.
  • నామాల కొండ వద్ద తొందరగా దైవదర్శనం అయ్యేందుకు ఇస్తున్న రశీదు తీసుకోవడం మరచిపోవద్దు. ఆ తరువాత కొంత దూరం నడిచినాక మళ్ళీ ఆ రశీదు మీద ముద్ర వేయించుకోవడం మరచిపోవద్దు.
  • లగేజీలో విలువైన వస్తువులు లేకుండా చూసుకోండి, లగేజిని కింద ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానముల ఉచిత రవాణా సేవలో పైకి పంపించండి.


గాలి గోపురం వద్ద బయోమెట్రిక్ ద్వారా వెలి ముద్రలు ఇచ్చి టోకెన్ తీస్కోండి
ఆ టోకెన్ ద్వారా మాధవ నిలయం వసతి సముదయలల్లో  ఉచిత వసతి , భోజనం అందుకోండి .
తలనీలాల సమర్పణ కూడా ఉచితం . 


తలయేరుగుండు

 కొండ ఎక్కేవారు తలయేరు గుండుకు తలతో మోకాలితో తాకి నమస్కరిస్తే నొప్పులు వుండవని భక్తుల నమ్మకం. శతాబ్దాల తరబడి భక్తులు ఈ గుండుకి భక్తితో తమ తలను, మోకాళ్లను తాకించి నందున ఆ గుండుకు చాల గుంటలు ఏర్పడ్డాయి. చిత్రంలో వాటిని చాల స్పష్టంగా చూడవచ్చు. 


తిరుమల మెట్ల మార్గం 


కూర్మావతారం 





వరాహావతారం



శ్రీ నరసింహావతారం


కొండపైనుంచి తిరుపతి 

 శ్రీ వామనావతారం

గాలిగోపురం


దివ్య దర్శన్ టోకెన్ కౌంటర్ కు దారి
 ఇక్కడే టోకెన్ తీస్కోవాలి



ఈవిధంగా ఉంటుంది  . జాగ్రత్తగా ఉంచండి. దారి మధ్యలో  ఒక చోట స్టాంప్ వేస్తారు 


కొండ క్రిందనుంచి .. కొండపైకి వెళ్ళే దారిలో చాల చోట్ల ఉచిత మరుగుదొడ్లు కలవు .




 ఇప్పడివరకూ నడివచ్చరుగా కొద్దిసేపు విశ్రాంతి తీస్కోండి  :) 


 ఇక్కడ నుంచి మెట్లు తక్కువగ  ఉంటాయి .. చూస్తున్నారుగా ఎలాఉందో దారి .




శ్రీ పరశురామావతారం



అంజనాద్రి 

 ఈ విధంగానే ఉంటుంది మార్గం ..
 నేను చెప్పింది మొత్తం మెట్లు ఉండవ్ అని కాదు .... :)
 గోవిందా ... 2300 మెట్ల వరకు వచ్చాం 
శ్రీ రామావతారం


 శ్రీ బలరామావతారం 
జింకలపార్క్ 










శ్రీ కృష్ణావతారం 



ఎవరు పెట్టారో ఇలా


 నడక మార్గం ( 6 కి.మీ.)
 బస్సు రూట్
మన యూత్  :)

శ్రీ కల్కి అవతారం 



జై హనుమాన్
 శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామి




అమ్మ, నాన్న , అవ్వ 





గోవిందనామలు 



నేను చెప్పానుగా .. స్టాంప్ వేస్తారు అని .. అది ఇక్కడే .. లైన్ లైన్.. లైన్ లో వెళ్ళండి :)
శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయం 







ఎప్పుడన్నా వర్షం ( తూపాన్ ) పడే సమయం లో కొండ ఎక్కడానికి ప్రయత్నించండి ... 






 మంచి కెమెరా  ఐతే ఫోటోలు వేరేల వచ్చిఉండేవి 



మోకాల  పర్వతం దగ్గరలోనే  ఉంది నడవండి 





 అదిగో వచ్చేసాం .... మళ్ళి  అందరు ఒకసారి గట్టిగ గోవిందా.. గోవిందా .. అనండి 






 ఇక్కడ చాల మంది మోకాళ్లమీద నడవడానికి ప్రయత్నిస్తారు .. అల ఎందుకు నడుస్తారు నాకైతే తెలియదు
విజయమోహన్ గారు ఇలా చెప్పారు  
 "మోకాళ్ళతో ఎందుకు ఎక్కుతారంటే"
అక్కడంతా సాలగ్రామశిలామయమని భగవద్రామానుజులు మోకాళ్ళతో ఎక్కారంట అందుకని భక్తులు కొంతమంది అలా ఎక్కుతూ ఉంటారు.




గోవిందా .. గోవిందా






నారాయణాద్రి - శేషాద్రి


పోగయ్  అళ్ళారు




చెప్పానుగా నడవడం ఇంకా సులభంగా ఉంటుంది అని






గోవిందా .. గోవిందా
తిరుమంగై అళ్ళారు


ఇదే చివరి మెట్టు
 నెంబర్ ఎంత ?
పెరియ అళ్ళారు




మీరు క్రింద ఇచ్చిన లగేజి ని ఇక్కడ తిస్కోవచ్చు


సమాచార కేంద్రం






మాధవ నిలయం 



తిరుమల తిరుపతి దేవస్థానం :
1. కేవలం ఒక వ్యక్తికీ గది కేటాయించబడదు
2. గదుల కేటాయింపు 24 గంటల మాత్రమే
3. గది లోపల పర్నిచర్ ఉండదు
4. నీరు గదుల వెలుపల ఉన్న కామన్ టాప్  ద్వారా పట్టుకొనవలెను

స్వామి వారి దర్శనం కోసం వేసి ఉన్న భక్తులు .


స్వామి పుష్కరిణి లో స్నానం చేసి .. వరాహ స్వామిని దర్శించుకుని .. గోవిందుడిని దర్శించండి .


శ్రీవారి మెట్టు:

తిరుమల కొండపైకి రెండు మార్గాలున్నాయి .. 1. అలిపిరి 2. శ్రీవారి మెట్టు.
అలిపిరి కాలిబాటకు శ్రీవారి మెట్టు కు ఉన్న ముఖ్యమైన తేడా ఏమిటంటే అలిపిరి కాలిబాట మొత్తం సుమారుగా 9 కిలోమీటర్లు ఉంటే శ్రీవారి మెట్టు కాలిబాట సుమారుగా మూడు కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది.
శ్రీవారి మెట్టు దారిగుండానే వేంకటేశ్వరుడు వివాహానంతరం ఆరు నెలలు కాలం అగస్త్యాశ్రమం లో గడిపి తరువాత తిరుమల చేరుకున్నాడని పురాణ కథ. నడిరేయి ఏ జామునో అలమేలు మంగను చేరడానికి దిగి వచ్చే స్వామి ఒక అడుగు ఈ "శ్రీవారి మెట్టు"పై వేసి రెండవ డుగు అలమేలు మంగాపురంలో వేస్తాడని ప్రతీతి. చంద్రగిరిని వేసవి విడిదిగా చేసుకొన్న విజయనగర చక్రవర్తులు శ్రీవారి మెట్టునుండ ఉన్న మెట్లదారిలో తిరుమలేశుని దర్శనం చేసుకొనేవారు. తన దేవేరులతో కలిసి కృష్ణ దేవరాయలు ఈ మార్గంలో అనేక పర్యాయాలు నడచి స్వామిని దర్శించుకొన్నాడు.
శ్రీనివాస మంగాపురం చేరుకొని అక్కడి నుండి ఆటోలో వెళ్లవచ్చు. శ్రీనివాస మంగాపురం నుండి శ్రీవారి మెట్టు సుమారుగా 6 కిలోమీటర్లు ఉంటుంది.
కపిల తీర్థం:



తిరుమల కొండల్లోని ఔషధ వృక్షాల నడుమ ప్రవహిస్తూ వచ్చి కపిల తీర్థం దగ్గర కొండ మీద నుంచి పుష్కరిణిలోకి జాలువారుతుంది నీరు. ఈ నీటిలో స్నానాలు చేస్తే సర్వరోగాలు నశిస్తాయని నమ్మకం .
స్థలపురాణం:

వెంకటాచలం క్షేత్రంలో సుమారు 15 పుణ్యక్షేత్రాలున్నాయి. ఇందులో ప్రధానమైనది కపిల తీర్థం. ఇక్కడ శివలింగం పాతాళం నుంచి పెరుగుతూ భూమిని చీల్చుకుని పైకి వచ్చింది. దీనిని గుర్తించిన మునీశ్వరులు ఇక్కడ తపస్సు చేశారు. మహావిష్ణువు దానిని పెరగకుండా నిరోధించాడు. కపిల మహర్షి ఈ శివలింగాన్ని తొలిగా పూజించాడు. మహాలింగంతోపాటు పాతాళలోకంలోని భోగవతి గంగ కూడా భూమి మీదకు ఉబికింది. పుష్కరిణిగా మారింది. అదే కపిల తీర్థం.

ఎలా వెళ్ళాలి ?

తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి మూడు కిలోమీటర్లు ఉంటుంది. బస్టాండ్ నుంచి మూడున్నర కిలోమీటర్లు. అన్ని రోజుల్లోనూ ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఏడు వరకు అనుమతిస్తారు. కార్తీకమాసం, ముఖ్యంగా పౌర్ణమి రోజు భక్తులు ఎక్కువగా వస్తారు.
దేవస్ఠానం  వారి ఉచిత బస్ శ్రీనివాసం, కపిల తీర్థం, అలిపిరి మరియు శ్రీనివాస మంగాపురం మీదగ శ్రీవారి మెట్టు వెళ్తుంది.    కపిల తీర్థం    మరియు శ్రీనివాస మంగాపురం వెళ్ళి దర్సనం చేసుకొందాం అనుకొంటే బస్ దిగి దర్సనం చేసుకొని తర్వాత వచ్చే బస్ లో    శ్రీవారి మెట్టు వెళ్ళవచ్చు. 

మీ సలహాలను కూడా పోస్ట్ చేయగలరు 
మీ కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తేలియచేయండి

Monday, 8 October 2012

ప్రవచన చక్రవర్తి

ప్రవచన చక్రవర్తి 
30-09-2012










శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమః
స్వస్తి శ్రీమదఖిల భూమండలాలంకార త్రయత్రిమ్షకొటిదెవతాసెవిత
శ్రీకామాక్షీదేవిసనాథ  శ్రీమదేకాంబ్రనాథ శ్రీమహాదేవీసనాథ శ్రీహస్తిగిరిసనాథ
సాక్షాత్కారపరామాధిష్టానసత్యవ్రతనామాంకిత కాంచీదివ్యక్షెత్రే శారదామత
సుస్థితానాం  అతులితసుధారసమాధుర్య
కమాలసనకామినీధమిల్లసంఫుల్లమల్లికామాలికానిష్యందమకరందఝరీ
సౌవాస్వితకవాంగినగుంభవిజ్రుంభనానందతుందలితమనీషిమండలానామనవరతాద్వైతవిద్యావినోదర
రసికానాం
నిరంతరాలంక్రుతీక్రుతషాంతిదాంతిభ్రూమాం సకలభువప్రతిష్ఠాపక
శ్రీచక్రప్రతిష్ఠావిఖ్యాతషయోలంక్రుతానాం నిఖిల పాషండషండకంఠకొత్పాటినేన
విషదీక్రుత వేదవేదాంతమార్గ ప్రతిష్ఠాపకాచార్యాణాం శ్రీమదాది
శంకరభగవత్పాదనామధిష్ఠానే సిమ్హాసనాభిషిక్తానాం శ్రీమద్
చంద్రశెఖరసరస్వతీసమ్యమీంద్రాణాం అంతేవాసివర్యైః శ్రీమద్
జయేంద్రసరస్వతిసమ్యమీంద్రైః తదంతేవాసివర్యైః శ్రీమద్
శంకరవిజయేంద్రసరస్వతిసమ్యమీంద్రైష్చ శ్రీ చాగంటి కొటేశ్వరరావ మహాశయస్య
సకలాభీష్ట సిధ్ధయే క్రియతే నారాయణస్మ్రుతిః

పీయూషాభవచొవిలాసనిచయైః ధర్మనయన్ మానవాన్
దివ్యొదంతసుభొధనైః క్రుతయుగం కర్తుం సదా దీక్షితః
విద్యాంబొధిమణిః ప్రభాషణపుష్ట చాగంటికొటేశ్వరః
జీయాచ్చిందిరమౌలివీక్షిణచయైః లబ్ధవైహికాముష్మికం

సూక్తిధారవర్షైః ధర్మస్యోత్రత్రై సతతం ప్రయతమనోస్మాకం ప్రియషిష్యః
ఆత్రెయసగోత్రీయః శ్రీ చాగంటి కోటెశ్వరరావః స్వవాణీవిలాసధారయా
స్త్రీబాలవ్రుధబధుపామరనిర్విషేషం రంజయంధర్మోద్బోధనం విరచయన్ నితారం రారాజతె.
స్వర్గీయ చాగంటి సుందరశివరావ-సుసీలామ్మ దంపత్యొః పుణ్యపుంజరపరిపాకల్లబ్ధజనురయం
ధీరః పౌరాణికకథాలాపైః సధర్మబోధనైస్చ  ప్రేక్షకహ్ర్యుదయాన్యావర్జయన్
ధర్మమార్గాం బోధయంస్చ శ్రీసూతపౌరాణికం స్మారయతీతి నాస్త్యత్యుక్తిః.
అధ్యతనప్రసారమాధ్యమాః అస్య ప్రవచనప్రసారణద్వారాత్మనో ధన్యతాం వితన్వంతీతి
ప్రత్యక్షతయా లక్ష్యతే. శ్రీమద్రామాయణ, భాగవత, మూకపంచశతీ, కామాక్షీవిలాస,
లలితాసహస్రనామాదీతిహాస స్తోత్రాదిషు లబ్ధాపాటవోయం ప్రవచనసుధాధారాభిః
అధర్మదావపసరేణ సర్వదా బధచిత్తొ భవతి. అస్య సామూహితాధ్యాత్మికాసెవాం శ్రీమఠస్య
సెవాంచ పరిలక్షయ ఏనం

                                  ప్రవచన చక్రవర్తి
ఇతి బిరుదేన సంభావ్య శ్రీమహాత్రిపురసుందరీసమెత శ్రీ ఛంద్రమౌళీశ్వర క్రుపయా
అయమేవమేవ ఆధ్యాత్మికప్రవచనైః ధర్మొద్బోధనం వితన్వన్ ఏహికాముష్మికశ్రెయః
 పరంపరాభిః సమేధతామిత్యాషాస్మహే

యాత్రాస్థానం - కాంచీపురం
శ్రీ నందన భాద్రపద పౌర్ణిమ

సర్వం శ్రీ గురుపాదుకార్పణమస్తు 
----
@ ప్రదీప్ కుమార్ శర్మ

Monday, 1 October 2012

Kotappakonda కోటప్పకొండ


కోటప్పకొండ గుంటూరు జిల్లా, నరసరావుపేట దగ్గర ఉన్న త్రికూటేశ్వరుని సన్నిధి.
శ్రీ  చాగంటి కోటేశ్వరావు గారు చెప్తున్నా కోటప్పకొండ విశేషాలను వింటూ కోటప్పకొండ దర్శనం చేయండి 

ఆంధ్రప్రదేశ్ లోని పుణ్యస్థలాలలో కోటప్పకొండ ఒకటి. గుంటూరు జిల్లాలోని నరసరావుపేట పట్టణానికి 13 కి.మీ. దూరంలోగల ఈ క్షేత్రానికి ఏ ప్రాంతం నుండైనా సులభంగా చేరవచ్చు. రైలు మార్గంలో అయితే గుంటూరు - గుంతకల్లు మార్గంలోని పిడుగురాళ్ళలో దిగి అక్కడనుండి గంట ప్రయాణంతో నరసరావుపేటకు చేరి ఈ ఆలయాన్ని దర్శించవచ్చు. నరసరావుపేట నుండి ఈ క్షేత్రానికి బస్సు సౌకర్యం, ప్రైవేటువాహన సౌకర్యం వున్నాయి.



క్షేత్ర వైభవం :
చతుర్దశ భువనాలు శివమయ సంధానాలు, మంగళకరమగు శివ శబ్దము సకల చరాచర జీవకోటికి ఆధారము. పరమేశ్వరుడు ఆది అంతాలు లేని సర్వవ్యాపనమైన చైతన్య శక్తి. అట్టి శక్తికి గుర్తు గుండ్రని రూపం. అందుకే శివుడిని లింగాకారంగా అర్చన చేస్తున్నాం. ఆ లింగమే త్రికోటేశ్వరుడు. ఆయనే కోటప్ప. అంతటి మహొత్కృష్టమైన క్షేత్రమే త్రికూటాచలం. అదియే కోటప్పకొండ. పవిత్రమైన చారిత్రక క్షేత్రాలలో కోటప్పకొండ ప్రసిద్ధమైన అతి ప్రాచీన శైవక్షేత్రం.






కృత, త్రేతా, ద్వాపరయుగాల నుండి పుణ్యభూమిగా పరిగణింపబడుచున్న భారతదేశంలోని దక్షిణ భాగంలో అపర కైలాస క్షేత్రంగా పేరొందిన త్రికోటేశ్వరస్వామికి నిలయమైన దివ్యభక్తపధము కోటప్పకొండ. పిలిచిన పలికే ప్రసన్న కోటేశ్వరునిగా, భక్తుల కోర్కెలు తీర్చే ఎల్లమంద కోటేశ్వరునిగ కష్టాల నుండి కడదేర్చే కావూరు త్రికోటేశ్వరునిగ, ఆపదలలో ఆదుకునే చేదుకో కోటయ్యగా, సంతతిలేనివారికి సంతానాన్ని కలుగచేసే సంతాన కోటేశ్వరునిగా యుగయుగాల నుండి నేటి వరకు భక్తుల ఆరాధ్యంగా విరాజమానమగుచూ కోరిన వారికి కొంగు బంగారంగా నిత్యార్చనాభిషేకాదుల నందుకుంటూ కోటి ప్రభలు విరజిమ్ముతూ సుఖము, శాంతి, ఆరోగ్యము, ఐశ్వర్యము, రక్షణ, శుభము, విజయము అవలీలగా అనుస్యూతంగా ప్రసాదించే శ్రీమత్త్రికోటేశ్వర  సన్నిధానం కోటప్పకొండ మహాక్షేత్రం.











ఫొటోస్ & ఇన్ఫర్మేషన్  ఈ క్రింది బ్లాగ్ / వెబ్సైటు నుంచి తీస్కున్నాను . 
http://www.telugudanam.co.in/
http://ideechadavamdi.blogspot.in/2012/09/blog-post.html
http://nrtfriends.blogspot.in/2011/03/blog-post.html

Monday, 24 September 2012

AMARAVATHI,ANDHRAPRADESH

అమరారామం - Amaravathi Templeinformation

పంచారామాల్లో అమరారామం ఒకటి. పాలకొల్లు క్షీర రామలింగేశ్వరస్వామి దేవాలయం, అమరావతి అమరలింగేశ్వర ఆలయం, ద్రాక్షారామం భీమేశ్వరాలయం, సామర్లకోట కుమార భీమేశ్వరస్వామి ఆలయం, భీమవరం సోమేశ్వర స్వామి దేవాలయం - ఈ ఐదింటినీ పంచారామాలు అంటారు.


కుమారస్వామిచే ఖండితమైన తారకాసురుని మెడలోని అమృతలింగపు ప్రథమ దివ్యశకలం (అమరేశ్వర లింగం) పడినట్టి దివ్వ పుణ్యధామం, పంచారామాలలో సుప్రసిద్ధమైనట్టి దివ్యక్షేత్రం ‘అమరారామం’. దేవేంద్రునిచే ప్రతిష్టించబడిన ‘అమరలింగేశ్వరుడు’ బాలచాముండికాదేవి సమేతంగా కొలువై వున్న పుణ్యధామమే అమరారామం. ఈ అమరలింగేశ్వరుడు పరమేశ్వరుని అఘోర ముఖరూపమై ప్రకాశించుచున్నాడు. దేవేంద్రునిచే ప్రతిష్టించబడిన ఈ శివలింగం పేరు అమ రేశ్వరుడు. ఈ శివలిం గం సుమారు 15 అడుగుల ఎత్తు కలిగి ఉండి తెల్లని కాంతులతతో ప్ర కాశించుచు న్నది. ఆ స్వామికి రెండవ అంతస్తు పై నుండి అభిషేకాలు జరుపట విశేషము. ఈ స్వామి కొలువైన మండపములో పశ్చిమంగా బాలచాముండేశ్వరీ అమ్మవారు కొలువై ఉన్నది. 

అమరావతి కోసం శ్రీ చాగంటి కోటేశ్వరావు గారు చేసిన ప్రవచనం  ( 7min Audio)

 

 


 



 




 



 

Friday, 21 September 2012

Open Heart With RK


Mangalampalli Balamuralikrishna Openheart With RK





Mimicry Venumadhav Open Heart with RK




                               SP Balasubramaniam Open Heart With RK



LOKSATTA JAYAPRAKASH NARAYAN OPEN HEART WITH RK



Yandamuri Veerendhranath Open Heart with RK




Konda Laxman Bapuji Open Heart with RK 

 

Tanikella Bharani Open Heart With RK 

Prajwala Founder Sunitha Krishnan Open Heart With RK

 

Thursday, 13 September 2012

HINDU MARRIAGE


జానక్యాః కమలామలాఞ్జలిపుటే యాః పద్మరాగాయితాః
న్యస్తా రాఘవమస్తకే చ విలసత్కున్దప్రసూనాయితాః
స్రస్తాశ్శ్యామలకాయకాన్తికలితా యా ఇన్ద్రనీలాయితాః
ముక్తాస్తాశ్శుభదా భవన్తు భవతాం శ్రీరామవైవాహికాః

శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు మహాభారతం విరాట్ పర్వం లో  ఉత్తర అభిమన్యుడి వివాహం గురించి చెప్తూ . ప్రస్తుతం మనం చేస్తున్న వివాహాలలో లోపాలను వివరిస్తూ .. వాటిని సవరించారు .ఆ ప్రవచనాన్ని  మీకోసం ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను .
 ప్లే బటన్ క్లిక్ చేసి ప్రవచనం వినండి


dowload : http://www.divshare.com/download/19551027-0b9























 గురువుగారు ( శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ) చెప్పిన వివాహ వైభవము : 

 http://telugu.srichaganti.net/VivahaVaibhavam.aspx

Monday, 6 August 2012

Scientific Verification of Vedic Knowledge


Scientific Verification of Vedic Knowledge


శ్రీ గురుభ్యో నమః

నమస్కారం,

వేదములు ఎంతో సనాతనమైనవి. ఈ విషయం అందరికీ తెలిసినదే..కానీ కొద్ది మంది అవైదిక సాంప్రదాయముల వాళ్ళు, ఇక్కడే మన దేశంలోనే పుట్టీ, ఇక్కడ గాలీ, నీరూ ఆహారం సేవించి కూడా, మన దగ్గరేముంది? ఇప్పుడు మనకి కబడుతున్న వైజ్ఞానిక ప్రగతి అంతా తెల్లవాడి భిక్ష అని అజ్ఞానంతో కొట్టుమిట్టాడే వారికి, ఒక కనువిప్పు కలిగించే అద్భుతమైన వీడియో ఇక్కడ జతచేస్తున్నాను. బహుశా ఇది చాలా మంది చూసే ఉండవచ్చు. 

 

ఉదాహరణకి, ప్రస్తుత సమాజానికి తెలిసి, అణు బాంబు, ఈ మధ్యన కనిపెట్టబడినది అనుకుంటారు. ఈ వీడియో చూస్తే అర్ధం అవుతుంది, అణు బాంబు కనిపెట్టిన శాస్త్రవేత్తని మొదటిసారి ఆ బాంబు పేల్చాక, వెళ్ళి ఇదే మొదటి సారి కదా అని అడిగితే.... ఈ తరంలో ఇదే మొదటి సారి అన్నాడుట. మహాభారత యుధ్ధంలో అణు బాంబుల ప్రయోగం జరిగిందని విన్నాను... దానినే బ్రహ్మాస్త్రం అంటారేమో..

అలాగే, విమాన శాస్త్రం, టెలిఫోన్ కమ్యూనికేషన్స్, గణిత శాస్త్రం (పైథాగరస్ సిధ్ధాంతం వాడు కనిపెట్టడానికి కొన్ని వేల సంవత్సరాల పూర్వమే మన ఋషులకు తెలుసునని...) అనేక సాక్ష్యాలు దొరికాయి అని ఈ వీడియోలో చెప్పబడినది.

అంతేకాదు, అసలు ఆర్యులు ఇక్కడి వాళ్ళు కాదనీ, వాళ్ళు ఎక్కడి నుంచో మన దేశానికి వచ్చి మనకి సంస్కృతి నేర్పారనీ ఓ అబధ్ధపు సిధ్ధాంతం ఒకటి తెల్లవాడు ప్రాచుర్యం చేశాడు.. అది పచ్చి అబధ్ధమనీ, అసలు ప్రపంచం మొత్తానికి విద్యా,వైద్య, వైజ్ఞానిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక విలువలను బోధించినది మన భారతీయులేననీ, వైజ్ఞానికంగా నిరూపించబడినది అని తేల్చిచెప్పాడు ఈ వీడియోలో. ఇప్పుడు ఎవరైతే యూరపు వాళ్ళు సాంకేతిక పరిజ్ఞానంలో ముందు ఉన్నారో, వాళ్ళు మన వేదాలని, పురాణేతిహాసాలనూ తీసుకువెళ్ళి, అధ్యయనం చేసి, వాటిని ఆధారంగానే వైజ్ఞానిక ప్రగతి సాధించారనీ చెప్పాడు. 

మన వేద మంత్రాలు ఎంత పవిత్రమైనవో, మంత్ర జపం వల్ల కలిగే ప్రయోజనాలేమిటో... అది కూడా సాంకేతికముగా నిరూపించారు. ఇప్పుడు మన గూగుల్ సెర్చ్ ఇంజన్ లో ఏది కావాలంటే అది వెతుక్కోవడం అనే దానికోసం వాళ్ళు ఉపయోగించే అల్గోరిథమ్ మన ఋగ్వేదంలో చెప్పబడినది అని, మన ఊహకి అందని గణిత శాస్త్ర రహస్యాలు మన వేదాలలో దాగి ఉన్నాయి అని, ఇలా అనేక విషయాలు చెప్పారు.. చాలా బాగుంది అందరూ ఒకసారి చూడగలరు.






ఇక రెండవ వీడియోలో, మన సంకల్పములో చెప్పే భరత వర్షే, భరత ఖండే, మేరోః దక్షిణ దిక్భాగే అని చెప్పబడే విషయాన్ని, అందమైన గ్రాఫిక్స్ లో చూపించారు.. అసలు ఈ సకల విశ్వంలో మన భూమి ఎంత చిన్నదో, సూర్యుడి గమనాలు ఎలా ఉంటాయో, మనకి ఉత్తరాయణం, దక్షిణాయనం ఎలా వస్తాయో, సూర్య భగవానుడు ఏక చక్ర రథంపై ఎలా పయనిస్తాడో, అద్భుతంగా చిత్రీకరించారు.. ఇప్పుడు మనవాళ్ళు కనిపెట్టిన GPS (Global Positioning System)  అవీ ఏమీ లేనప్పుడు కూడా, మనవాళ్ళు నక్షత్ర మండలాలనూ, పాలపుంతలనూ, ఈ విశ్వం ఎక్కడి వరకూ వ్యాపించి ఉండవచ్చూ, గ్రహముల కదలిక బట్టి మన జీవితం ఎలా ప్రభావితం అవుతున్నదీ,, యథా తథంగా లెక్కకట్టారు మన ఋషులు. అసలు ఇక్కడ భూమి మీద కూర్చుని, సూర్య భగవానుడి పయనం గురించి, ఆయన ఏక చక్ర రథంతో నడుస్తాడనీ, అంగారకుడు లేక కుజ గ్రహం ఎలా ఉంటుందీ, అన్నిటికంటే పెద్ద గ్రహం కాబట్టి బృహస్పతి అనీ ఇలా నామకరణం కూడా ఎలా చేయగలిగారో, "సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాంగులం" అని పురుష సూక్తం లో చెప్పినట్లుగా, భూమి గుండ్రముగా ఉంటుంది అనీ.... ఎన్నో విషయాలు మన ఋషులు ఇక్కడ కూర్చుని యోగ మార్గములో దర్శించి, మనకి ఏది మంచిదో, ఎలా బ్రతకాలో చెప్పారు....


                            

ఇవన్నీ తలచుకుంటే, నాకు ఏదో లోకంలో ఉన్నట్లుగా ఉంది, ఏమి మన సనాతన ధర్మము, ఏమి మన ఋషులు,ఏమి మన వేదాలు, ఏమి మన వాగ్మయం...... ఏ పనీ చేయకుండా కూర్చుని చదివినా, ఈ జన్మ ఒక్కటి చాలదు.. అన్ని ఉన్నాయి మన శాస్త్రాలు, వేదాలు, ఇతిహాసాలు, పురాణాలు. ఇక చదివేది ఎప్పుడూ, ఎప్పుడు ధ్యానం చేసేది, ఎప్పుడు మన ఋషులు చెప్పిన అద్భుతమైన విషయాలు దర్శించేదీ......... ఏమో ఎప్పటికి ఎన్ని జన్మలకి దర్శించగలమో అలా........

పెద్దలు మరిన్ని విషయాలు తెలిసినవి పంచుకోగలరని మనవి చేస్తున్నాను..


చివరిగా ఒక గమనిక, మన వేదాల గురించి, అంటే ఇవన్నీ ఎవడో పాశ్చాత్యుడు వచ్చి నిరూపిస్తేనే కానీ నమ్మవా, మనకి ఆ మాత్రం నమ్మకం లేదా !!..... అని అడిగితే ....ప్రస్తుతం మన జీవితం మనకి ఇష్టం ఉన్నా, లేకున్నా పాశ్చాత్యులు కనిపెట్టిన అనేక వస్తువులతో ముడి పడి ఉన్నది, ఉదాహరణకి, ఒక కొడుకో కూతురో అనుకున్న సమయానికి ఎంతసేపటికీ ఇంటికి రాకపోతే, ఒక వేళ ఆ కూతురు తనతో మొబైల్ ఫోన్ తీసుకువెళ్ళడం మరిచి పోతే, "ఏమీ కాదు, కూతురు క్షేమంగా వచ్చేస్
తుంది, నేను నమ్మిన ఈశ్వరుడు ఉన్నాడు" అని నిబ్బరంగా ఉండే వాళ్ళ కంటే, అదే మొబైల్ ఫొన్ కూతురు చేతిలో ఉండి, ఒక ఫోన్ చేసి కనుక్కున్నాక, ప్రశాంతంగా ఉండే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది.. అంటే ఎన్ని తెలిసినా, చదివినా.... పూర్తి జ్ఞాన స్థాయిలోకి వెళ్ళడానికి సమయం పడుతుంది కదా.... అప్పటి వరకు మనకి మంచి విషయం ఎవరు చెప్పినా స్వీకరించాలి.

పొద్దున్న లేచిన దగ్గర నుంచి అనేక సనాతన ధర్మమునకు సంబంధించి వింటున్నాము, అనుష్టిస్తున్నాము, కానీ కొన్ని విషయాలు మనకి (ఇప్పటి తరంలో నాబోటి వాడికి), పాశ్చాత్యులలో ఉన్న కొద్ది మంది గొప్ప వ్యక్తులు మన వేదాల గురించి, ధర్మము గురించి చేసిన ప్రరిశోధన, వాళ్ళు చేసిన రీసెర్చ్ గురించి తెలుసుకోవడం కూడా అవసరమే.... ఉదాహరణకి, ఒక సారి బ్రహ్మశ్రీ సామవేదం వారు చిదంబర రహస్యం గురించి ప్రవచనం చెప్తూ అన్నారు, నటరాజ తత్వం గురించి, చిదంబర రహస్యం గురించి ప్రస్తుత తరంలో మనకి తెలుసున్న దాని కంటే, ఆంగ్లేయులు కొంత మంది చేసిన అపూర్వమైన పరిశోధన నుంచి మనకి ఎన్నో విషయాలు తెలుస్తాయి. నేను కూడా ఆ పుస్తకం చదివి కొన్ని తెలుసుకున్నాను అని చెప్పారు. ఆంగ్లేయులు The Cosmic Dance of Shiva  అనే పేరున అనేక పుస్తకాలు వ్రాశారుట.

 అప్పుడు, మనకి మన పూర్వీకులు, ఋషులు ఇచ్చిన సంపద ఏమిటో, మన ఎంత విలువైన సాంప్రదాయానికి వారసులమో తెలుసుకుని, మన ధర్మం పైన మరింత పూనిక పెంచుకోవడం కోసమే కానీ, ఏదో శంఖంలో పోస్తేనే తీర్థం అన్నట్లుగా మళ్ళీ మన శాస్త్రాల గురించి కూడా తెల్లవాడు చెప్తేనే నమ్మాలా అని అనకోవద్దు. కాకపోతే ఇలా తెలుసుకోవడం అనేది, ఇక్కడితో ఆగకుండా, మన తరంలో, దీని పైన మరింత దృష్టి సారించి, మరిన్న అద్భుతమైన విషయాలు మన సాధన ద్వారానో, పరిశోధనల ద్వారానో, పెద్దలు, ఋషి తుల్యులు అయిన వారి బోధల ద్వారానో, మనమందరమూ కూడా ఇంకా ఇంకా తెలుసుకుని మన భావి తరాల వారికి మనం ఎటువంటి విద్యకు వారసులమో తెలియజేయాలి... అని నా కోరిక.

మోహన్ కిషోర్ 
---
ఈ పోస్ట్ శ్రీ మోహన్ కిషోర్ గారు సత్సంగము గ్రూప్ లో పోస్ట్ చేసారు . ఇంత చక్కటి పోస్ట్ ను మీరు కూడా చూడాలని ఈ బ్లాగ్ లో పోస్ట్ చేశాను .  శ్రీ మోహన్ కిషోర్ గార్కి నా హృదయ పూర్వక ధన్యవాదములు . ఆయన బ్లాగ్ మీకు చాల ఉపయోగపడుతుంది.  http://shaktiputram.blogspot.in/