Tuesday, 30 September 2014

Tamilnadu Tour Part 1

 Tamilnadu Temple Information Part 1 

నమస్కారం ,
ఈ పోస్ట్ లో తమిళనాడు లో ఉన్న ప్రధాన దేవాలయాలన్నీ ఒక వరుసలో చూసి రావాలంటే ఎలా వెళ్ళాలి .. వాటికోసం చెప్పండి అంటూ చాలామంది అడుగుతున్నారు . ఇప్పడివరకూ చేసిన పోస్ట్ ల్లో ఆ చుట్టుప్రక్కలూన్న దేవాలయాల వివరములు కూడా చెప్పడం జరిగింది .
ఈ వివరములు తెల్సుకోవడానికి సుమారు 3 సంవత్సరాల సమయం పట్టింది . మీరు మరో 15 నిమిషాల్లో అన్ని విషియలు తెల్సుకోబోతున్నారో . ఎంతైనా మీరు అదృష్టవంతుల కదా !
మనం యాత్ర చేయబోతున్నట్టే లెక్క ఇప్పుడు .. ముందుగానే చెప్పేది ఏమిటంటే మీరు భోజనాలు, వసతి కోసం కంగారు పడనవసరం లేదు . ప్రతి దేవాలయం దగ్గర తిండికి వసతికి లోటు ఉండదు . ఈ పోస్ట్ మధ్యలో వాటికి ప్రస్తావిస్తుంటాను .
అక్కడక్కడా అక్షర దోషాలు దోర్లితే మరోసారి చదువుకుని .. అర్ధం చేస్కోగలరు .
అర్ధం అయింది సోది ఆపి .. ఆ పుణ్యక్షేత్రాల కోసం చెప్పెమనేగా ..
చివరిగా ఒక్కవిషయం ఈ పోస్ట్ లో అన్ని వివరములు రాయడం వీలుపడదు . అంటే స్థలపురాణం ,ఇతర విశేషాలు రాయడం కష్టం . మీరు ఆ టెంపుల్ ఇమేజ్ పైన క్లిక్ చేస్తే మీరు ఆ టెంపుల్ విశేషాలు తెల్సుకోవచ్చును .
ఒక్కసారి గట్టిగా జై గణేశా .. గోవింద .. గోవింద .. అమ్మ కామాక్షి .. మధుర మీనాక్షి .. ఓం నమః శివాయ ..

ఇప్పుడు మనం చెన్నై రైల్వే స్టేషన్ లో ఉన్నాం ..  చెన్నై లో సెంట్రల్ దగ్గర ఉన్న లోకల్ స్టేషన్ దగ్గరకు వెళ్ళాలి . . 
అయ్యో మొదట్లోనే అక్కడకి .. ఇక్కడకి .. వేల్లమంటున్నావ్ ఏమిటి ? .. మకాసాలే చెన్నై కొత్త . పైగా తమిళం కూడా రాదు . అనుకుంటున్నారా ? 
నేను ముందే చెప్పగా మీకు తెలియనప్పుడు ఆ ఫోటో పైన క్లిక్ చేయండి డీటెయిల్స్ మొత్తం వస్తాయని . అప్పుడే మర్చిపోతే ఎలా :) 

chennai information

వచ్చారా అందరు ?
ఇప్పుడు మనం తిరుత్తణి కి ట్రైన్ టికెట్ తీస్కోవాలి . ఓ మొదట మనం  తిరుత్తణి వేల్లబోతున్నాం అనుకుంటున్నారా ? కాదు మనం తిరువళ్లూర్ వేల్లబోతున్నాం .. సెంట్రల్ నుంచి సుమారు 1.30 గం సమయం పడుతుంది .  
చాలు కూర్చున్నది ఇంక .. త్వరగా ట్రైన్ దిగండి . తిరువళ్లూర్ వచ్చేసాం .  టెంపుల్స్ విశేషాలు తెల్సుకోవాలంటే చెప్పానుగా .. 
 1. TIRUVALLUR 

veera raghavaswamy

108 దివ్య తిరుపతులలో ఒకటైన ‘తిరువళ్ళూరు- Tiruvallur’లో శ్రీ మహావిష్ణువు ‘శ్రీ వీర రాఘవస్వామి’ పేరుతో శయనరూపం నయన మనోహరంగా కొలువుతీరి పూజలందుకుంటున్నాడు.

veera raghava swamy


 రండి .. ఇప్పుడు తిరుత్తణి వెళ్దాం ..  ఇక్కడ నుంచి సుమారు 1 గం సమయం పడుతుంది . 

తమిళనాడులోని ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలు  (అఱుపడై వీడుగళ్) ఉన్నాయి . మనం చూడబోయే తిరుత్తణి ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ఒకటి .  
2. TIRUTTANI 
 

arupadaiveedu

చెన్నై నుండి 84 Km, తిరుపతి నుండి 68 Km, అరక్కోణం ( కాణిపాకం )నుండి 13 Km దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఈ ప్రదేశాలు అన్నిటి నుంచి బస్సు సౌకర్యం ఉంది. 
చెప్పలేదు కదా .. ట్రైన్ టికెట్ 20 - 25/- వరకు ఉంటుంది .
ఇక్కడ నుంచి మనం కాంచీపురం వేల్లబోతున్నాం .. 

3.KANCHIPURAM

భారతదేశంలో గల సప్తమోక్షపురులలో శ్రీ కాంచీక్షేత్రం ఒకటి. కంచి మోక్షవిద్యకు మూలపీఠం,అద్వైతవిద్యకు ఆధారస్ధానం . ఆదిశంకరులు అధిష్ఠించిన కామకోటి పీఠవైభవంతో కంచి నగశోభ మరింత దేదీప్యమానమయింది. కాంచి అనగా మొలనూలు. వడ్డణాం. మొత్తం భారతభూమికి ఇది నాభిస్థానం . అతి ప్రధానమైన శక్తిక్షేత్రం, పరమ పూజ్యులైన ఆదిశంకర భగవత్పాదులు విదేహాముక్తి నందిన పుణ్యస్ధలం.

కాంచీపురం లో తప్పకుండ దర్శించవలసిన టెంపుల్స్ కోసం కాంచీపురం పోస్ట్ లో రాసాను . ఇక్కడ ఆ దేవాలయాల ఫోటో లు పెడుతున్నాను చూడండి . కాంచీపురం కోసం తెల్సుకోవాలంటే ఇమేజ్ పైన క్లిక్ చేస్తే మీరు తెల్సుకోనవచ్చును . 
శ్రీ కామాక్షి అమ్మవారిదేవాలయం (Kamakshi Temple) :
మీరు చూస్తున్న ఆలయం .. కాంచీపురం లోని కామాక్షి అమ్మవారి ఆలయం .. 

kamakshi amman temple

 

ఏకామ్రేశ్వర దేవాలయం:Ekamreswara Temple

పంచభూతలింగక్షేత్రము లలో  కంచి లో పృధ్వీ లింగం  ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నఆలయం   ఏకామ్రేశ్వర దేవాలయం . ఈ ఆలయం లోనే  పృధ్వీ లింగం ఉంది .


ekamranadha temple

శ్రీ వరదరాజస్వామి  ఆలయము - Varadaraja Swamy Temple


వాడుకలో కోయిల్  - తిరుమల - పెరుమాళ్ కోయిల్ అని పిలబడు 108 వైష్ణవ దివ్య క్షేత్రములలో  మూడవ స్థానమును ఈ వరదరాజస్వామి వారిదే . కోయిల్ అంటే శ్రీ రంగం శ్రీ రంగనాధ ఆలయము , తిరుమల అంటే నేను చేప్పాల ? పెరుమాళ్ కోయిల్ అంటే వరదరాజస్వామి వారి ఆలయము .


Bangaru Balli

శ్రీ కచ్ఛపేశ్వరుని ఆలయము - Kachchapeswara Temple

శ్రీ కుమారస్వామి ఆలయమునుకు దగ్గరలోనే శ్రీ కచ్ఛపేశ్వరుని ఆలయము  ఉంది . మీరు గుడి బయటకు వచ్చిన తరువాత కుడివైపుకు నడిస్తే ఈ ఆలయ గోపురం కనిపిస్తుంది . ఈ ఆలయం గుడి ఆటో వాళ్ళు చూపించారు . చాల పెద్ద ఆలయం ఇది . బహుశా అందుకే ఈ ఆలయం ఆటో వాళ్ళ లిస్టు లో కనిపించదు మనకు .


Kacchapeswara Temple

శ్రీ కైలాస నాధుని ఆలయము - Kailasanadha Temple 

శ్రీ కచ్ఛపేశ్వరుని ఆలయము నుంచి సుమారు 2km దూరం లో కైలాస నాధుని ఆలయము ఉంది . ఆలయం పక్కనుంచే దారి ఉంది .. నారదుడు శివలింగాన్ని ప్రతిష్ఠించడాని చేప్తారు.. ఈ ఆలయం చాల పురాతనమైనది మనకు కనిపిస్తుంది. ఆలయం బయట పార్క్  లాగ కనిపిస్తుంది. చాలా ప్రశాంతంగ ఉంటుంది. శివును చుట్టు ప్రదిక్షణం చెస్తే జన్మరాహిత్యము కలుగుతుందని భక్తుల నమ్మకము .  


Kailasha Nadha Temple

కుమరకోట్టము - శ్రీసుబ్రహ్మణ్యస్వామివారి ఆలయము 

Kumarakottamu ( Murugan Temple)

  ఈ ఆలయం ఆటో వాళ్ళ లిస్టు లో ఉండదు . కంచి మఠం నుంచి దగ్గరలోనే ఉంటుంది . అక్కడ ఉన్న వార్ని కుమరకోట్టము అని అడిగితె వాళ్ళకి అర్ధం అవుతుంది . ఈ  ఆలయ శివాచార్యులు శ్రీ కచ్చియప్ప శివాచార్యులవారిచే తమిళ భాషలో కందపురాణాము రచించారు . ఈ  కందపురాణాము కావ్య ఆవిష్కరణ సమయమున పండితులమధ్య సభామండపంలో శ్రీ కుమారస్వామి బాలకుని రూపంలో ప్రత్యక్షమై కందపురాణాము ఆవిష్కారించడం జరిగింది అంట.


subramanya Temple

 కంచి కామకోటి పీఠం  - Kamakoti pitham


 Kanchi Math

శ్రీ వామనమూర్తి దేవాలయము : (ఉలగళందప్పెరుమాళ్)  
( Vamanamurthy Temple )          
 

vamanadha temple

 108 వైష్ణవ దివ్య క్షేత్రములలో వామనమూర్తి ఆలయం కూడా ఒకటి .. 

శ్రీ వైకుంఠనాధుని ఆలయము

 శ్రీ కాంచీ క్షేత్రము నందలి ప్రాచీన విష్ణు మందిరములలో 108 శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రములలో ముఖ్యమైనది పల్లవుల కాలమునాటి ప్రాచీన దేవాలయము శ్రీ వైకుంఠనాదాలయము . అందమైన శిల్పములతో ఆలయం అంతటా  శిల్పాల మయం.

Vaikunta nadha temple


 కాంచీపురం లో విశ్రాంతి తీస్కోండి ..  
కాంచీపురం నుంచి మనం అరుణాచలం బయలుదేరుదాం .. నేను మీతో తరువాత టెంపుల్ అని చెప్పగానే దాని అర్ధం అక్కడ నుంచి రవాణా సౌకర్యం ఉందనే మీరు భావించాలి . మీమ్మల్ని నేను ఇబ్బంది పెట్టానుకదా .. :) 
4. ARUNACHALAM

అరుణాచలము(Arunachalam) అనగా అరుణ - ఎర్రని, అచలము - కొండ. ఎర్రని కొండ అని తాత్పర్యము. అ-రుణ = పాపములను పరిహరించునది అని అర్ధము. తమిళం లో "తిరువణ్ణామలై" (Tiruvannamalai) అంటారు. తిరు అనగా శ్రీ, అణ్ణామలై అనగా పెద్దకొండ అని విశ్లేషణ.  ఇది చాల గొప్ప పుణ్యక్షేత్రము . స్మరణ మాత్రము చేతనే ముక్తినొసగే క్షేత్రము . కాశీ, చిదంబరము, తిరువారూరుల కంటే మిన్నయని చెప్పుకుంటారు . 

Arunachalam

అరుణాచలం కోసం ఇప్పడివరకూ 4 పోస్ట్ లు చేశాను . వాటిని ఒకసారి చూడండి . ఆ లింక్ లు ఇక్కడే ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారా ? 
సరే అలానే ఇస్తాను .. 
ఈ పోస్ట్ లో అరుణాచలం ఎలా వెళ్ళాలి ? వసతి ? ఆలయ విశేషాలు .. వివరించడం జరిగింది . 

ఈ పోస్ట్లో రమణాశ్రమం కోసం పోస్ట్ చేశాను .. 

అరుణాచలం అనగానే గుర్తుకోచ్చేది గిరిప్రదిక్షణ ..  అరుణాచలం గిరిప్రదిక్షణ కోసం రెండు పోస్ట్ లు చేయడం జరిగింది . 
అరుణాచలం గిరిప్రదిక్షణ - 1 :


అరుణాచలం గిరిప్రదిక్షణ - 2 :

http://www.templeinformation.in/2013/10/tiruvannamalai-girivalam.html

http://www.templeinformation.in/2013/10/tiruvannamalai-girivalam.html

http://www.templeinformation.in/2013/10/tiruvannamalai-girivalam.html

http://www.templeinformation.in/2013/10/tiruvannamalai-girivalam.html

మీరు అరుణాచలం లో అన్నామలైశ్వరుడ్ని దర్శించి .. గిరిప్రదిక్షణ చేసి విశ్రాంతి తీస్కోండి . మనం రేపు అరుణాచలం నుంచి వేరే ప్లేస్ కి వెళ్దాం .. ఎక్కడికో ఇప్పుడే ఎలా చేప్తాను .. రేపే చెప్తాను :)
మీ అభిప్రాన్ని .. సలహాలను కామెంట్ చేయండి .. 
 Tamilandu Tour Part-2 చూడ్డానికి ఈ లింక్ క్లిక్ చేయండి : 
http://rajachandraphotos.blogspot.in/2014/10/tamilandu-temple-information-part-2.html
ఓం నమః శివాయ ..

1 comment: