పార్థ సారథి దేవాలయం చెన్నైలోని ట్రిప్లికేనులో కలదు. సంస్కృత భాషలో పార్థసారధి అంటే పార్థుడు = అర్జునుడు యొక్క సారథి = రథాన్ని నడిపినవాడు అని అర్థం అంటే శ్రీ కృష్ణుడు.
బీచ్ కి దగ్గరలోనే కలదు .Triplicane రైల్ స్టేషన్ లో దిగితే చాల దగ్గర . లేదా బస్సు లో ఐతే క్రికెట్ స్టేడియం దాటినా తరువాత 2వ స్టాప్ .. అక్కడ దిగితే మీకు ఈ ఎంట్రన్సు కనిపిస్తుంది .
ఆళ్వారులచేత పాడబడిన 108 దివ్య స్థలములలో " తిరువళ్ళిక్కేణి" కూడా ఒక దివ్య స్థలము . ఈ పుణ్యక్షేత్రాన్ని " బౄహదారణ్య " క్షేత్రం అనే పేరుతో పిలుస్తుండే వారు .ఈ దేవాలయము 1000 సంవత్సరములకు ముందే నిర్మిచబడింది . దేవాలయమందున్న శిలలేఖములవలన ఈ క్షేత్రమును నందివర్మ అనే పల్లవరాజు (779 - 830 ) మరియు విజయనగర రాజైన వేంకటపతి మహారాజు (1586 - 1616 ) మొదలైన మహారాజుల పాలనలో ఉండేదని తెలుస్తుంది . ఈ దివ్య మందిరము యొక్క మూలవిరాట్టు శ్రీ పార్ధ సారధి స్వామి యొక్క నిలువెత్తు విగ్రహము దర్శనం ఇచ్చును . స్వామి వారు ఎడమ భాగము నందు "పాంచజన్య శంఖము " కనిపించును . దక్షిణ భాగమున శ్రీ చక్రము కాకుండా హస్తము పదము వైపు చూపించెను. స్వామి వారు తూర్పు దిక్కున చూస్తున్నట్లు దర్శన మిచ్చును .స్వామి వారి భార్య రుక్మిణి ,అన్న బలరాముడు, తమ్ముడు సత్యకి కుమారుడు ప్రద్యుమ్నుడు , మనుమడు అనిరుద్ధుడు మొదలుగువారి సమేతంగా పార్ధ సారది దర్శన మిచ్చును . ఈయన మరో పేరు " వెంకట కృష్ణ "
ఇక్కడో విషయం చెప్పాలి మీకు .. మీకు తిరుపతి తెలుసా ? ద్వారక తిరుమల కాదండి . మరొక తిరుపతి ఉంది. సామర్లకోట దగ్గర లోనే తిరుపతి (దివిలి నుంచి 2కి.మీ.) ఉంది . అక్కడ కూడా స్వామి వారు . కుడి చేతిలో శంఖము , ఎడమ చేతిలో చక్రము పట్టుకుని మనకు దర్శనము ఇస్తారు . అక్కడ స్థల పురాణం ప్రకారం ధౄవునికి స్వామి వారు అక్కడే దర్శనం ఇచ్చారంట . స్వామి వారు ధౄవున్ని చూస్తూ నవ్విన నవ్వు మనకి చాల స్వష్టంగా కనిపిస్తుంది.
మహాభారత యుద్ధము నందు ధ్రమసంస్తపనము చేయుటకై మహారధి భీష్ముని బాణాలు పార్ధసారధి యొక్క కపాలమున గుచ్చుకున్నవి కనిపించును . ఉత్సవమూర్తి నందు ఈ గుర్తులు కనిపించవు .ఈ ఆలయం లో తెలుగు ఎక్కువగా కనిపించును ..
శ్రీ విష్ణు సవాస్రనామ స్తోత్రము |
పై ఫోటో లో తెలుగు పేర్లు చూసారా ? మీకు క్రింద కనిపిస్తున్నది స్థలపురాణం నేను పైన రాసింది అంత ఈ బోర్డు చూసే
కురుక్షేత్ర సంగ్రామంలో ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేయడం వల్ల మహావిష్ణువు ఆయుధమైన సుదర్శన చక్రం ఉండదు. చేతిలో కేవలం శంఖం మాత్రమే ఉంటుంది
* ఈ దేవాలయ ప్రాంగణములో ఉన్న అనుబంధ గుళ్ళు
* వేదవల్లి గుడి
* రంగనాథ స్వామి గుడి
* శ్రీరాముని గుడి
* వరదరాజస్వామి గుడి
* నరసింహ స్వామి దేవాలయం
* ఆండాళ్ళమ్మ గుడి
* అంజనేయ స్వామి దేవాలయం
* అళ్వార్ల సన్నిధి
* రామానుజాచార్యుల సన్నిధి
* భృగు మహర్షి గుడి
ఆలయం వెలుపల కేనేరు కలదు .. చాల సువిశాలంగా ఉంది .
మీరు ఈ ఆలయం లో వేదవల్లి గుడి,రంగనాథ స్వామి గుడి, శ్రీరాముని గుడి, వరదరాజస్వామి గుడి, నరసింహ స్వామి దేవాలయం, ఆండాళ్ళమ్మ గుడి , అంజనేయ స్వామి దేవాలయం , అళ్వార్ల సన్నిధి, రామానుజాచార్యుల సన్నిధి, భృగు మహర్షి గుడి కలవు .
* అమరనాథ్ యాత్ర విశేషాలు
http://sujathathummapudi.blogspot.in/2012/05/blog-post_30.html
* అమరనాథ్ యాత్ర విశేషాలు
http://sujathathummapudi.blogspot.in/2012/05/blog-post_30.html