Tuesday 3 April 2012

Chennai Information


ఏవిషయమైన తెలియకపోతే అది ఏదో బ్రహ్మ విద్యలాగే కనిపిస్తుంది . ఎందుకు అంటున్నాను అంటే . మొదటిసారిగా చెన్నై వచ్చేవాళ్ల పరిస్థితి అలాగే ఉంటుంది. ముందుగా చెన్నై లో ఎవరైన తెలిసినవారు ఉన్నారేమో అని ఆలోచించి , వారితో మాటలు కలిపి మన అవసరం వివరిస్తాం .. వాళ్ళు స్టేషన్ కి వస్తే సరే సరి .. మేము దూరంగా ఉంటున్నాం .. మీరు పళాన స్టేషన్ కి వచ్చి మాకు రింగ్ ఇవండీ అంటే .. కధ మొదటికి వచ్చినట్టే .




చెన్నై లో ఉన్న రైల్వే స్టేషన్ లు రెండు అవి . 1 . సెంట్రల్ రైల్వే స్టేషన్ (Central Railway Station)  2 . ఎగ్మూరు రైల్వే స్టేషన్ (Egmore Railway Station). ఇవే కాకుండా లోకల్ రైల్వే స్టేషన్ లు చాలానే ఉన్నాయ్ . లోకల్ రైల్వే స్టేషన్ లు అవి ఎక్కడ నుంచి ఎక్కడి వెళ్తాయి అన్ని చెప్తే ఠాగూర్ సినిమాలో చిరంజీవి చెప్పినట్టు చెప్పాలేమో (నిజానికి నాకు తెలియదు).


సెంట్రల్ రైల్వే స్టేషన్ (Central Railway Station)

సరే మీరు  సెంట్రల్ రైల్వే స్టేషన్ లో దిగారు అనుకుందాం.   మీకు  Cloakroom   కావాలంటే  10th platform కి వెళ్తే కనిపిస్తుంది, మరొక విధంగా చెప్పాలంటే మీరు సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి లోకల్ స్టేషన్ కి వెళ్ళేదారిలో ఉంటుంది . సెంట్రల్ రైల్వే స్టేషన్ కి మెయిన్ ఎంట్రన్సు నుంచే కాకుండా లోకల్ స్టేషన్ నుంచి అడ్డుదారి కూడా ఉంది . మీరు డైరెక్ట్ గా 10th platform  కి చేరుకోవచ్చు.


సరే మీరు బయటకి వచ్చేసారు అనుకుందాం . సెంట్రల్ రైల్వే స్టేషన్ కి దగ్గరలో మూడు లోకల్ స్టేషన్ లు ఉన్నాయ్ . అవి సెంట్రల్ లోకల్ స్టేషన్, పార్క్ స్టేషన్, పార్క్ టౌన్ స్టేషన్.

సెంట్రల్ లోకల్ స్టేషన్ (Central Local Station):


సెంట్రల్ రైల్వే స్టేషన్ కుడివైపునే సెంట్రల్ లోకల్ స్టేషన్ ఉంటుంది . మనకి బయట నుంచి చూస్తే రైల్వే స్టేషన్ లాగ కనిపించదు. ఈ స్టేషన్ కోసం మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మీరు తిరిగి సెంట్రల్ నుంచే తిరుగు ప్రయాణం చేయాల్సివస్తే,మీరు  టికెట్ తిస్కోవల్సివస్తే మీరు సెంట్రల్ లోకల్ స్టేషన్ లోనే తీస్కోవాలి .   అర్ధం అయింది కద.. ఇప్పుడు మీరు లోకల్ స్టేషన్ నుంచి కుడివైపుకు వెళ్తే మీరు అక్కడ షాపింగ్ చేయవచ్చు ..

ఇక్కడ లోకల్ టికెట్స్ మాత్రమే ఇస్తారు .

చూస్తునరుగా  ఇక్కడ   మాత్రమే మీరు టికెట్స్ తీస్కోవాలి .. 
*ఇక్కడో మీకు ఒక విషయం చెప్పాలి .. నేను ఫోటో తీస్తుంటే పోలీసు వారు నన్ను మందలించడం కూడా జరిగింది . ఇక్కడ ఫోటో లు తీయాలంటే అనుమతి తిస్కోవాలంట.. 


లోకల్ స్టేషన్ &  సెంట్రల్ రైల్వే స్టేషన్ రెండు దగ్గరగా ఉంటాయి అని చెప్పడానికి ఈ ఫోటో తీసాను . రెండు కనిపిస్తున్నాయిగా   మీకు ..

పార్క్ రైల్వే  స్టేషన్ (Park Railway Station



సెంట్రల్ లోకల్ స్టేషన్ కి ఎదురుగా పార్క్ స్టేషన్ ఉంటుంది . అక్కడ చాల మంది పార్క్ స్టేషన్ కి లోకల్ స్టేషన్ నుండి వెళ్తూ ఉంటారు .. పార్క్ స్టేషన్ నుంచి మీరు ఎగ్మూరు స్టేషన్ కి బీచ్ కి కూడా వెళ్ళవచ్చు . పార్క్ స్టేషన్ నుంచి ఎగ్మూరు స్టేషన్ చాల దగ్గర 5 నిమషాలు కూడా పట్టదు . ఎగ్మూరు స్టేషన్ కి వెళ్ళాలంటే 3rd platform కి వెళ్ళండి .  పార్క్ స్టేషన్ నుంచి తరువాత స్టాప్  ఎగ్మూరు  స్టేషన్ . బీచ్ కి వెళ్ళాలంటే 1st platform . మీరు "టి నగర్ " వెళ్ళాలన్న పార్క్ స్టేషన్ నుంచి వెళ్ళాలి . 

 ఈ ఫోటో ఒక్కసారి చూడండి... మీకు ఎదురుగ లోకల్ స్టేషన్ కనిపిస్తుంది కదా .. ఎడమచేతివైపు సబ్-వే ద్వారా జనం వెళ్తున్నారు గమనించార .. మీరు కూడా పార్క్ స్టేషన్ కి వెళ్ళాలంటే అలాగే వెళ్ళాలి ..

పార్క్ టౌన్ స్టేషన్:(Park Town Station)

 సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి ఎదురుగా పార్క్ టౌన్ స్టేషన్ ఉంటుంది . ఇంకా బాగా చెప్పాలంటే సెంట్రల్ రైల్వే స్టేషన్ ఎదురుగా బ్రిడ్జి ఉంటుంది .. ఆ బ్రిడ్జి క్రిందనే పార్క్ టౌన్ స్టేషన్ ఉంటుంది .
 ఈ ఫోటో లో మీకు సెంట్రల్ రైల్వే స్టేషన్ కి ఎదురుగ బస్సు కనిపించిస్తుంది చూసారా ? అదే బ్రిడ్జి మీరు అలానే వెళ్తే పార్క్ టౌన్ స్టేషన్ కి వెళ్తారు .. లేదంటే పార్క్ స్టేషన్ నుంచి కూడా వెళ్ళవచ్చు  .. దానికంటే కూడా మీకు ఇదే ఈజీ ..

లోకల్ మార్కెట్: (Local Market)

అవును మీకు లోకల్ మార్కెట్ చూపించలేదు కదు  రండి. మనం   అలా ఒక రౌండ్ వేసివద్దాం..  వచ్చాక ఎగ్మూరు స్టేషన్ కి తీస్కూని  వెళ్తాను . నిజం చెప్పాలంటే ఫోటో లు తీయడానికి భయం వేసింది నాకు
ఈ బిల్డింగ్ చూసారా ?  ఈ బిల్డింగ్ నిండా పుస్తకాలే ఉంటాయ్..  మీకు కావాల్సిన పుస్తకాలూ అన్ని దొరుకుతాయ్


దీని చుట్టూ ఉన్న చిన్న షాప్ లలో కూడా దొరుకుతాయ్ . ఈ బిల్డింగ్ ని ఫోటో తియడానికే భయపడ్డావా  అని అడగబోతున్నారా ? ఈ ఫోటో చూడండి
అక్కడ సిమ్ కార్డు లు అమ్మడం లేదు .. సెల్ ఫోనో లు అమ్ముతున్నారు . కొత్తవి.. పాతవి .. కొట్టుకొచ్చినవి .. అన్ని అమ్మతారు. దొరకని ఫోన్ ఉండదు అక్కడ . నాకు మమోలుగానే భయం .. ఆ ఫోన్ లు మాత్రం నేను కొనలేదు . మీరు కొనపోయిన ఒకసారి లుక్ వేసిరండి .ఇంకా ఇక్కడ ఏం దొరుకుతాయ్ అంటే ..

ఈ రెండు ఫోటో లు చేస్తేనే తెలుస్తుంది కదా మీకు ... ఇంకా  మీకు కావాల్సిన bag లు , టిఫిన్ చేయాలన్న మీరు ఇక్కడకి వెళ్ళవచ్చు.
 నేను ఇంకా చెప్తే .. ఆ మార్కెట్ ని ప్రమోట్ చేస్తున్నట్టు ఉంటుందేమో .. ;)

Call Taxi :

ఈ గోల అంత మాకు ఎందుకు call taxi  ఎక్కడ బుక్ చేస్కోవాలో చెప్తే .. మేము  ఆపని లో ఉంటాం  అంటారా? సరే మీరు సెంట్రల్ కి  లోకల్ స్టేషన్ కి మధ్యలో ఒక కాల్ టాక్సీ బూకింగ్ సెంటర్ ఉంది .

మీరు ఇటు వైపు వస్తే .. సెంట్రల్ రైల్వే స్టేషన్ వస్తుంది . ..అటు వైపు వెళ్తే లోకల్ రైల్వే స్టేషన్ వస్తుంది . లోకల్ రైల్వే స్టేషన్ దాటి వెళ్తే మార్కెట్ వస్తుంది .

Bus Stand :

బస్సు స్టాండ్ ఎక్కడా అంటే .. సెంట్రల్ రైల్వే స్టేషన్ (Central Railway Station)  ఎదురుగ అంటే పార్క్ స్టేషన్ (Park Station)  దగ్గరలో ఉంది . సెంట్రల్ రైల్వే స్టేషన్ లోపల కూడా ఒకటి ఉంది . ఏవండోయ్ మీరు బస్సు లో ప్రయాణం ఎక్కువుగా ఉంటుంది అనుకుంటే 50 /- టికెట్ మీరు తీస్కోండి .. ఆ రోజు రాత్రి 12 వరకు మీరు మరేం టికెట్ లేకుండా ప్రయాణించవచ్చు (ఏ.సి . బస్సు లకు ఈ టికెట్  మాత్రం వర్తించదు).

ఎగ్మూరు స్టేషన్ (Egmore )

మీకు చెప్పాకద పార్క్ స్టేషన్ (Park Station) తరువాత స్టాప్ నే ఎగ్మూరు అని .. మీరు పార్క్ స్టేషన్ లో టికెట్ తీస్కుని 3rd  ప్లాట్ఫారం మీదకి వెళ్ళాలి . అక్కడ నుంచి 5 నిమషాల లోపే మీరు ఎగ్మూరు స్టేషన్ కి వెళ్తారు . చెన్నై సెంట్రల్ లో ఐతే లోకల్ స్టేషన్ పక్కనే ఉంది కదా .. ఇక్కడ చెప్పడం నాకు ఈజీ మీకు కూడా ఈజీ నే .. ఎందుకంటే లోకల్ స్టేషన్ అంటూ ప్రత్యేకంగా వేరే ఏమి ఉండదు . 10th ప్లాట్ఫారం నే లోకల్ .
 
 మీరు టికెట్ తీస్కోవాలి అనుకుంటే మీకు ఎదురుగ బిల్డింగ్ కనిపిస్తుంది కదా అక్కడే తీస్కోవాలి,, మీరు బయటకి వెళ్ళాలంటే ఇదిగో ఇలానే వెళ్ళాలి ..  


దూరంగా ఒక అతను నడిచివస్తున్నాడు గమనించార ? మనం అలాగే బయటకి వెళ్ళాలి .. ఇలా  పక్కకి వెళ్లారు అంటే మీరు ప్లాట్ఫారం 5 - 6 కి వెళ్తారు .
 మీకు బయటనుంచి లోకల్ స్టేషన్ ఎంట్రన్సు చూపించన ? రండి ఐతే ..
ఇదిగో ఇదే ఎంట్రన్స్.. మీరు లోపాలకి వెళ్ళేటప్పుడు పక్కకి చూస్తే .. మీకు 
అవును మీకు ఎగ్మూరు స్టేషన్ చూపించలేదు కదా ? మనం ఇప్పుడే గా లోపలనుంచి వచ్చాం .. అందుకే మీకు చూపించడం కుదరలేదు .
మీరు కుడివైపు చివరకి వెళ్తే .. లోకల్ స్టేషన్ ఎంట్రన్స్ వస్తుంది . ఎడమవైపు పార్కింగ్ ప్లేస్ కనుక ఖాలిగా కనిపిస్తుంది .మీకు మెయిన్ ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా .. అక్కడే టికెట్స్  ఇస్తారు కాస్త పక్కకు వెళ్తే Cloakroom కూడా ఉంటుంది .
Egmore Bus Stand :

లోకల్ ఎంట్రన్స్ పక్కనే బస్సు స్టాండ్ .. బస్సు స్టాండ్ ఉంది . మీరు కాస్త రోడ్ దాటితే అక్కడ కూడా బస్సు స్టాండ్ ఉంది. ఏ బస్సు ఎక్కాలి అన్నది మీరు వెళ్ళవలసిన ప్లేస్ బట్టి ఉంటుంది కదా . నాకు ఏల తెలుస్తుంది చెప్పండి  :)
Bus Routes :

మీరు Central నుంచి Broadway  వెళ్ళాలంటే : ఎక్కవల్సిన బస్సు నంబర్స్..
11,11G,120,15,153,15B,15B Ext, 15F, 15G, 15L, 17(B,D,E,G,K,M), 18K ,19E, 19G, 20M, 242 ,50, 51D, 7(B,F,H,M), 52,52B, 53(E,P), 71(D,E,H,V)
----
From: Central  -
To: C.M.B.T.
15 (B,F,),27B,M56G
--
From: Central
To: T.Nagar
Take: 10A,11,11A,
---
From: Egmore
To: C.M.B.T. 
Take: 27B
--
మీరు బీచ్(Anna Square) కి వెళ్ళాలంటే ఎగ్మూరు & సెంట్రల్ నుంచి 30 ని. పడుతుంది . నా నెక్స్ట్ పోస్ట్ లో మీకు బీచ్ ని చూపిస్తాను . 
From: Egmore
To: Anna Square (Beach)

Take: 22,27B,29A,40A,M127B,M27E,M29A,29A,40A
---
From: Central
To: Anna Square (Beach)
Take: 27B,M28,M2A
------------------------------------

C.M.B.T
 

మనం చెన్నై కి  బస్సు లో వస్తే  C.M.B.T బస్సు స్టాండ్ కి చేరుకుంటాం .  ఇక్కడున్న పెద్ద బస్సు స్టాండ్ లో C.M.B.T ఒకటి . మన విజయవాడ బస్సు స్టాండ్ తో పోల్చుకుని ఆనందిస్తూ  ఉంటారు .  మీరు అరుణాచలం , కంచి, బెంగళూరు, తిరుపతి , యానం ,.... వెళ్ళాలంటే ఇక్కడ నుంచి బస్సు లు ఉంటాయ్. C.M.B.T బస్సు స్టాండ్ బయట లోకల్ బస్సు స్టాండ్ ఉంటుంది . మీరు అక్కడ నుంచి సెంట్రల్ , ఎగ్మూరు స్టేషన్ లకి వెళ్ళవచ్చు . మీరు C.M.B.T నుంచి ఏ బస్సు ఎక్కలో చెప్పాను కదా పైన ఒకసారి మళ్ళి చూడండి . 

Chennai International Airport:

మీరు Airport కి ట్రైన్ ద్వారా వెళ్ళాలంటే మీరు ఎగ్మూరు లోకల్ స్టేషన్ లేదా పార్క్ స్టేషన్ లో ఎక్కి   Tirusulam Station లో దిగితే అక్కడ నుంచి 1 / 2 కి.మీ. ఉంటుంది .



1. The Ashtalakshmi Temple, Besant Nagar
2. Parthasarathy Temple, Triplicane
3. Kapaleswar Temple, Mylapore,
4. Sri Shirdi Sai Temple, OMR Road
5. Sri Rama Anjaneeya Temple, Nanganallur
6. Sri Puri Jagannath Temple, OMR Road,
7. ISKON Temple, OMR road
8. Nithya Kalyana Perumal, Kovalam


ప్రస్తుతానికి నాకు తెలిసింది ఇదే .. మరింత సమాచారం తెల్సుకుని update చేస్తాను .. ఎమన్నా తప్పుగా రాసిఉంటే చెప్పండి ... మీకు ఈ పోస్ట్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను .. మీరు ఏమంటారు ?
****మీ కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తేలియచేయడం మరిచిపోకండి****

11 comments:

  1. Pratap garu nenu chesina prati post ki miru comment chesi nannu abhinandistunanduku .. thaks andi.

    ReplyDelete
  2. మీరు చక్కటి ప్రయత్నం చేసారు.
    అబినందనలు.

    ReplyDelete
  3. thanq for the Information Great job......:-)

    ReplyDelete
  4. Thanks Raja Chandra..you are the best of the best in virava

    ReplyDelete
  5. good job sir... keep it up..

    ReplyDelete
  6. చాలా చక్కని సమాచారం ఇచ్చారు అభినందనలు

    ReplyDelete
  7. మీ శ్రమ వృధా కాదు అని ఆశిస్తున్నా

    ReplyDelete