మహాబలిపురం(Mahabalipuram) తమిళనాడు రాష్ట్రం కంచి జిల్లాలోని ఒక గ్రామము. కంచి పట్టణానికి 66 కి.మి దూరంలో రాష్ట్ర రాజధాని చెన్నై కి 70 కి.మి దూరం లొ ఉన్నది. మహాబలిపురం వెళ్తున్న దారిమధ్యలోనే మనకి crocodile పార్క్ కనిపిస్తుంది . ఎంట్రన్సు టికెట్ 25 /- ఉంటుంది .
మనం లోపలి ప్రవేశించగానే .. ముందుగా మనకి పాములు , తాబేలులు స్వాగతం పలుకుతాయి. బయట బోర్డు crocodile అని పెట్టి పాములను చూపిస్తున్నాడు ఏమిటి అనుకుంటూ లోపలి నడుస్తూ ఉంటే , ఒక్కొక్కటి మనకి కనిపిస్తూ ఉంటాయి .
ఒక్కసారి ఈ ఫోటోని చూడండి.. కనిపించిందా .. ఏం తింటుందో ? .. వీటికి ఆహారం ఎలా అని అనుకున్నాం .. మేము వెల్లిపోదాం ఇంకా అనుకుంటున్నాం .. వీటికి మాంసపు ముక్కలు వేయడం స్టార్ట్ చేసారు ..
అబ్బే పెద్దగ ఏంలేదు అనుకుంటూ లోపలి వెళ్లేసరికి మనకి పెద్ద మకరమూల గ్యాంగ్ కనిపిస్తుంది.
ఒక్కోసారి మనకి అవి బ్రతికి ఉన్నాయ్ లేదా అన్నట్టు ఇవిగో ఇలాపడుకునే ఉంటాయ్ అవి ..
కాస్త అటు ఇటు నడుస్తూ ఉంటే .. మరొక ఫోటో కూడా తీసాను .. చూడండి.
ఈ ఫోటోని మాత్రం చాల జాగ్రత్తగా చూసి .. బాబోయ్ ఎన్ని ఉన్నాయ్ అనుకోండి
మీకు చెట్ల క్రింద రాళ్ళ లాగా కనిపిస్తున్నాయ్ కదా .. అవి రాళ్ళు కాదు .. చెట్ల నీడ కాదు ..మహాబలిపురం చూద్దాం రండి :
7 వ శతాబ్ధంలో దక్షిణ భారత దేశాన్ని పరిపాలించిన పల్లవ ప్రభువుల రాజ్యానికి ప్రముఖ తీరపట్టణం. మామల్లాపురం అనేది మహబలిపురానికి వున్న మరో పేరు. ఈ పట్టనణానికి అప్పటి పల్లవ ప్రభువైన మామ్మల్ల పేరు మీద కట్ట బడిందని చరిత్రకారులు చెబుతారు. మహాబలిపురానికి ఆ పేరు రావటానికి మరొక కధనం ప్రకారం పూర్వం బలిచక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించటంవల్ల ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది అని స్థానికులు అంటుంటారు. తదనంతర కాలంలోనూ పల్లవుల పరిపాలనా కాలంలోనూ ఈ ప్రాంతం స్వర్ణయుగాన్ని చూసింది. పల్లవులు ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని కొంతకాలం పాలించారు. అప్పుడు కట్టించినవే ఈ శిల్పకళా సంపద. పల్లవులు దీనిని మంచిరేవుపట్నంగా తీర్చిదిద్దారు. దానికోసం ఇక్కడ కొండమీద ఒక లైట్ హౌస్ ని కట్టారు.
It was originally constructed during the 7th century and later it was Narasimha Varman II, (Rajasimha) completed the skilled work in his rule. This is one of the oldest of the south Indian Temples which were structural temples constructed in the nature Dravidian style. This shore temple has gained popularity and tourists gather here because it has been listed among the world heritage sites of the UNESCO. The temple is full of designs made by carvings
మధ్యలోనే ఆగిపోయిన నిర్మాణాలు .....
ఇక్కడ సముద్రం చాల అందంగా కనిపిస్తున్న .. కెరటాలు మాత్రం దూసుకుని వస్తూ ఉంటాయ్.
నేను అనుకోవడం ఎక్కవలోతుకి వెళ్ళడం మంచిది కాదు.
మీకు మహాబలిపురం రాగానే దృష్టి అంతా వీటిపైనపడుతుంది ..
మన ఇంట్లో పెట్టుకోవడానికి వీలుగా చిన్న చిన్న బుద్ధా విగ్రహాలు , వినాయకుని విగ్రహాలు దొరుకుతాయ్ ..
Pancha Rathas :
బీచ్ దగ్గరనుంచి ఒక కిలోమిటర్ దూరంలో పంచరధాలు ఉంటాయ్ .. చూడటానికి టికెట్ తీసుకోవాలి (10 /- ) .. టికెట్ ఎంట్రన్సు గెట్ దగ్గర కాకుండా .. బయట ఇస్తారు .. వెళ్తున్న దారిలోనే బోర్డు ఉంటుంది .. ఒకవేళ చూడకుండా వెళ్ళిపోయినా .. ఎంట్రన్సు నుంచి దగ్గరే కాబట్టి బయపడనవసరం లేదు .
రధాలు అన్నారు కదా అని వీటికి చేక్రాలు ఉంటాయ్ అనుకోవద్దు .. ఇక్కడ పాండవులతో పాటు ద్రౌపతి కి కుడా రధం ఉంటుంది. అవి వరుసగా ద్రౌపతి ,భీమ ,అర్జున ,ధర్మరాజు , నకులుడు & సహదేవుడు (ఏనుగు ఎదురుకుండా ఉంది కదా అదే ) ఒక రధం ఉంటుంది.
మీరు చూస్తున్నది ద్రౌపతి రధం (Draupadi ratha)
నేను ఏన్ని సార్లు వెళ్ళిన నాకు కొత్తగానే కనిపిస్తాయ్ ఇవి ... నాకు రధాలను చూస్తూ ఉంటే.. ఇవి చేక్కినవి మనవాళ్ళు .. నేను ఇండియన్ ని అని గర్వపడుతుంటాను .. వీటిని చేక్కినవాళ్లు ఈ రోజుల్లో ఉండి
ఉంటే మనకు ఉన్న టెక్నాలజీ కి వాళ్ళు ప్రపంచ వింతల్లో మహాబలిపురం కూడా ఒకటిగా ఉండేలా చేసేవాళ్ళు.
అర్జుని రధం Arjuna Ratha
ద్రౌపతి రధానికి అర్జున రధానికి తేడా కనిపించిందా... వెనకాలే నంది ఉంది చూడండి మళ్ళి ఒకసారి
ఇక్కడ ఏక శిలపై చెక్కిన ఏనుగు , సింహం ,నంది ఉంటాయి ..
భీముడు అని అంటేనే పెద్ద శరీరం ఎలామనకు కనిపిస్తుందో అయన రధం కూడా అలానే ఉంటుంది .. :)
భీముని రధం..Bhima Ratha
ధర్మరాజుగారి రధం ..Dharma raju ratha
రధం ఏదురుగ ఒక రాయి కనిపిస్తుంది చూసారా .. అక్కడ గుర్రాలను చెక్కుదాం అనుకున్నారంటా ఈలోపు యుద్ధం రావడం వాళ్ళ ఇలా రాయిగా మిగిలిపోయింది .. నిజానికి వీటి నిర్మాణాలు పూర్తీ అయివుంటే .. ప్రపంచ వింతల్లో వీటికి చోటు దక్కేదేమో.. ధర్మరాజు గారి రధం వెనకాల మనం అర్ధనారీశ్వర నిర్మాణాన్ని మనం చూడవచ్చు ..
ఇలా మధ్యలో రంద్రాలు చేసి రాయిని పగల కొడతారు ....
వీటిని చూసివస్తున్నా దారిలో కొండపైన లైట్ హౌస్.. కనిపిస్తుంది .. వీటితోపాటు కొండపైన చెక్కిన నిర్మాణాలు కూడా చూడవచ్చు ..
లైట్ హౌస్ పైకి ఎక్కి చూడటానికి 10 /- టికెట్ ఉంటుంది .. అక్కడ నుంచి మహాబలిపురం ఇంచుమించు కనిపిస్తుంది.
మహాబలిపురం లో చూస్తున్నా కోద్ది.. ఎలాంటి విగ్రహాలు రోడ్ పక్కనే ఉంటాయ్.. అక్కడకు వెళ్ళిన వెంటనే వాతావరణం మరీపోతుంది .. మనవాళ్ళ టాలెంట్ చూసి గర్వంగా ఫీల్ అవుతారు ..
బస్సు స్టాండ్ అంటూ ప్రత్యేకంగా ఏమి ఉండదు . మహాబలిపురం ఉన్న టెంపుల్ దగ్గరకు తీసుకుని వెళ్తారు . టెంపుల్ అంటే పైన చూపించిన టెంపుల్ కాదండి .. పైన చూపించిన టెంపుల్ లో పూజలు ఏమిజరగావు . స్వామివారికి పూజలు ఇక్కడ మాత్రమే జరుగుతాయ్ .. లోపల విష్ణుమూర్తి ఉంటారు .. గుడికి వెళ్ళడం మరవకండి .. ఎందుకు చెప్పానో వెళ్ళిన తరువాత మీకే తెలుస్తుంది.
గుడికి ఏదురుగా సముద్రం ఉంటుంది .. మరీ దగ్గరలో కాదు కాస్త నడవాలి .. గుడికి కుడిచేతివైపుకి నడిస్తే పంచరధాలు, వెనకవైపుకి వెళ్తే ఇవిగో ఈ క్రింది చూపిస్తున్న ప్లేస్ కి వెళ్తారు......
చూస్తున్నారా మనవాళ్ళ శిల్పకళ నైపుణ్యం ..!
మన వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో చూడండి.. ఎంతమంది చెక్కి ఉంటారో ..
ఇక్కడ నుంచి ..అదేనండి గుడి వెనకకు వచ్చి రైట్ సైడ్ వెళ్తే పంచరాదాలు వస్తాయ్... ఇలాగా కూడా వెళ్ళవచ్చు..
ఈ క్రింద ఫోటో లో ఏముంది అనేకదా చూస్తున్నారు .. ఈ లోపల లక్ష్మి దేవి మరియు వామనావతారం .. చెక్కిన శిల్పాలు ఉంటాయ్ .. ఇంకా కాస్త పైకి వెళ్తే .. మరిన్ని చూడవచ్చు.
మహాబలిపురం లో కొండను ఎక్కడ కలిగా ఉండలేదు .. ప్లేస్ కనిపిస్తే చాలు మనవాళ్ళు చెక్కడం మొదలు పెట్టేసారు అనిపిస్తుంది చూస్తుంటే..
మేము వెళ్ళినప్పుడు వినాయక చవితి అందువల్లే .. మామిడితోరణలు కట్టారు ..ఏటవాలు కొండపై ఏ ఆధారమూ లేకుండా ఆ కాలమునుండి పడిపోకుండా అలాగే వుంది. ఇది ఒక విచిత్రం.
వీటిని చూసిన తరువాత .. కాస్త ముందుకి వెళ్తే .. త్రిమూర్తులు కూడా కనిపిస్తారు ..
మీరు ఇలా స్టార్ట్ చేయండి :
ముందుగా బీచ్ దగ్గర ఉన్న టెంపుల్ ని చూసి అక్కడ ఆటో మిద అయిదు రధాలు ఉన్నచోటికి వెళ్ళండి (ఆటో వాడు 30 అడుగుతాడు .. మనవాళ్ళు పెట్రోల్ రేట్ పెంచకపోతే ) . చూసాక అక్కడనుంచి లైట్ హౌస్ ఇంకా లైట్ హౌస్ దగ్గరలోనే మరికొన్ని నిర్మాణాలు ఉంటాయ్ ... అవికూడా చూసి కొండ క్రిందకు వచ్చేయండి .. దారిలోనే పైన ఫోటోలో ఏనుగు చూసారు కదా .. పంచారధాల దగ్గర ఏనుగు కాదండి .. మరో రెండు ఏనుగులు ఉన్నాయ్ కదా అవిచూసి.. వెన్న ముద్దా కూడా చూసి .. ఎడమ చేతివైపుకు వెళ్తే . వినాయక రధం .. ఇంకా కాస్త పైకి వెళ్తే .. వామనావతారం ఉన్న గుహ .. కాస్త ముందుకు వెళ్తే ,,మరొక గుహ (గుహ అంటే ఏదో అనుకోకండి కొండని కాస్త లోపలి చెక్కినది ) అక్కడ కనక దుర్గ అమ్మవారు కనిపిస్తారు ..అవి చూసి వెనక్కి వచ్చి వెన్న ముద్దా దాటుకుంటూ వెళ్తే .. త్రిమూర్తులు కూడా కనిపిస్తారు (వారి లో బ్రహ్మ ఎవరో , విష్ణు ఎవరో చెప్పండి చూద్దాం ).
చివరిగా బస్సు స్టాప్ దగ్గరకు వచ్చి టెంపుల్ లోపాలకి వెళ్ళండి ,గుడి 4 తరువాత తెరుస్తారు.
అవును నేను ఇంకా తిండి కోసం చెప్పలేదు కదా .. భోజనానికి ఎటువంటి ఇబ్బంది పడనవాసరం లేదండి అన్ని దొరుకుతాయ్.. మీకు కావాల్సిన పూసలు .. రాయితో చెక్కిన శిల్పలు కూడా మీదగ్గరకు వచ్చే కావాలా అని మరీ అడుగుతారు .. ఇంకా చాలు లెండి ఇప్పడికే చాల రాసాను కాదా .. ఇంకా ఉంటాను .. :)
Excellent photos
ReplyDeletenice one...raja. Bhaga explain chesaav.
ReplyDeletepratap garu ... nenu vrasanu andi ... vatini chustu unte.. manaki janaganamana vente ela untundo vatini chustu unte manaki ade feeling kalugutundi andi
ReplyDeleteThanks raja..
ReplyDeletechalabaga baga vivarincharu..
ReplyDeleteరాజ్ గారు చాల సంతోషం అండి మీ అభిప్రాయాన్ని తెలియచేసినందుకు.
ReplyDeleteబాగా రాశారు రాజాచంద్రగారూ. చాలా ఫోటోలు పెట్టారు. బాగున్నాయి.
ReplyDeletepsmlakshmi
tq andi.. lakshmi garu..
Deletemiku nachhinanduku tq. andi. naa blog miku use avutundi ani cheppinanduku chala santoshanga undi.
ReplyDeleteమీ బ్లాగ్ చాలా బాగుంది. మహాబలిపురం అయితే చాలా బాగా వివరించారు.
ReplyDeletekeep going :) :)
tq andi, srinivas gaaru
ReplyDeletemeeru chala vipulanga chupincharu mikrusi hatsoff
ReplyDeleteSRI RAJACHADRAGAARU., MAHABALIPURAM YATRA CHEYINCHINAARU. INTA VIPULAMGAA PHOTOLATO VIVARAARU TELIPINA MIIKU NAA DHANYAVAADAMULU TELUPUTUNNAANU. KATAKAM VEERABHADRA RAO., KAKINADA.
ReplyDeletemeeru chala baga suluvuga andariki ardhamayye vidhamga rasaru sir really u did a good job
ReplyDeleteramachandra your so grete man thankyu very much sir
ReplyDeletechala bavundandi meme swayamga velli chusinattuga undi. chala thanks
ReplyDeleteWow.. this is so amazing.. :)
ReplyDeleteNICE thanks you brother. nenu okka sari ina velthanu.
ReplyDelete