Wednesday, 14 November 2012

YUVABHARATH YOUTH

  Yuvabharath YoutH

యువభారత్ 

ది 14-12-12 నాడు యువభారత్ యూత్ ద్వారా మరో మూడు కుటంబాలకు ఆర్ధిక సహాయం చేయడం జరిగింది . ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటి గాద  ..

భర్తను కోల్పోయి 10 రోజులు కూడా గడవక ముందే తండ్రి సమానుడైన మామగారిని కూడా కోల్పోయింది ఈమే . విధి పగపడ్డిందేమో  అన్నట్లుగా ఉంటున్న ఇల్లు కూడా నీడను ఇవ్వకబోగా ఆమె పాలిట భారమై కూర్చుంది . ఇద్దరామ్మిలలో  ఒక్కరిని ఇప్పడికే పుట్టింటికి పంపించి అమ్మగారి ఇంటిదగ్గర చదివిస్తుంది (ఏజ్ 6 స || వ). చిన్నామ్మయిని  తను "ఆయాగా " పనిచేస్తున్నా  శారద విద్యాలయం వారు ఫ్రీ గ చదివిస్తున్నారు ( 4 స|| వ).  యూత్ ద్వారా 1000/- ఇవ్వడం జరిగింది .






స్కూల్ కి వెళ్తున్నా  పిల్లవాడు ఇప్పుడు తండ్రిని కోల్పోయి పనిలోకి వెళ్తున్నాడు . ఇంటి భారం తన భుజాలపై వేస్కుని అమ్మకు అక్కకు నేను ఉన్నాను అని దైర్యం చెప్పాడు నిండా 15 స || వ || కూడా దాటిని ఆ పిల్లవాడు . పనిలోకి వెళ్ళవద్దు అనే అంత  దైర్యం చేయలకాపోయం . 10th క్లాసు ప్రేవైట్ గా కట్టించండి మేము చదువు చెప్తాం  అనే మాట తప్ప ఎం రాలేదు మా నోటివెంట . ఆమె కు 1000/- ఇవ్వడం జరిగింది .



తను నేర్చుకున్నా కుట్టు మిషన్ .. ఇప్పుడు ఆ ఇంటికి జీవనాధారం . పిల్లవాడి పైన గంపేడు  ఆశలు పెట్టుకుని జీవిస్తుంది తను . 7th  క్లాసు చదువుతున్నా  ఆ పిల్లవాడి కి యూత్ ద్వారా చేయగల సహాయం చేస్తాం అని చెప్పడం తో పాటు 1000/- ఇవ్వడం జరిగింది .


(16-8-12 )విరవ లో లోకల్ లో పనిచేసే electrician నాగేశ్వరావు  గారు  ఈ మధ్య కాలం లో కరెంటు స్థంబం పై పనిచేస్తూ ఉండగా .. ఎవరో మెయిన్ ఆన్చేయడం వాళ్ళ  పైనుంచి క్రిందపడిపోయారు .  పాపం ఒక చెయ్యి తొలగించారు  :( . రెండో చెయ్యి పనిచేయదు . ఉన్నట్టు ఉండి ఆ కుటుంబం రోడ్ పై పడిపోయింది .  ఆయనకి ఒక అబ్బాయ్ ఒక అమ్మాయ్ .. ఇప్పుడు పాలిటెక్నిక్ చదువుతున్నాడు వాళ్ళ అబ్బాయ్  . నాగేశ్వరావు గార్కి 5000 /- యూత్ ద్వారా ఇవ్వడం జరిగింది.




కోరుకొండ దుర్గ ప్రసాద్ 10th class చదివిన తరువాత  ఇంటిదగ్గర పరిస్థితి బాగోలేదు అని కూరగాయల మార్కెట్  లో జాయిన్  అయ్యాడు . ఒక సంవత్సరం తరువాత పిఠాపురం govt.Jr  లో జాయిన్ అయ్యాడు M.P.C ఆ సంవత్సరం ఆ కాలేజీ ఫస్ట్ సాదించాడు  . ఇంటర్ రెండవ సంవత్సరం  లో ఉండగా  వాళ్ళ నాన్నగారు మరణించారు .  ఆ అబ్బాయి  కి 5000 /-ఇవ్వడం జరిగింది . ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు 

( 16-08-2013)ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయింది . MAX INFRA(I) LTD , Pranahita chevalla project లో Store Asst గా జాబ్ చేస్తున్నాడు .


 (15-8-2012) 10 వ తరగతిలో 1st , 2nd & 3rd వచ్చిన విద్యార్ధులకి ప్రైజ్ లు ఇవ్వడం జరిగింది .



 ఉచిత హోమియో శిబిరము ఏర్పాటు చేసి   స్వైన్ ప్లూవ్ మందులను పంపిణి చేసాము. 


మాపైన నమ్మకంతో కనీసం ఎప్పుడు చూడకపోయినా వెనకాలే ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తున్న బ్రహ్మ శ్రీ చాగంటి కోటేశ్వరావు గారి శిష్యునకు మా హృదయ పూర్వక ధన్యవాదములు .