Wednesday, 25 January 2012

ఫ్లెమింగో ఫెస్టివల్ (Flemingo Festival)

ఫ్లెమింగో ఫెస్టివల్ & పులికాట్ సరస్సు ....... (Flamingo Festival photos and Pulicat lake photos | India)
ఫ్లెమింగో ఫెస్టివల్ 2012
సూళ్ళూరు పేట, శ్రీ పొట్టి శ్రీ రాములు
నెల్లూరు జిల్లా

శనివారం ఆఫీసు లేకపోవడంతో తీరుబడిగా ఈనాడు పేపర్ చదువుతున్న నాకు ఫ్లెమింగో ఫెస్టివల్ ఈ రోజు రేపు మాత్రమే .. పక్షి ప్రేమికులు అందరు సందర్శిస్తారు ప్రతిసంవత్సరం అనే  వార్తా చదివిన నాలో  నేను మాత్రం పక్షులను ప్రేమించానా  అని సూళ్ళూరు  పేట (నెల్లూరు జిల్లా ) బయలుదేరాను. పులికాట్ సరస్సు అని చిన్నప్పుడు చదువుకున్నాను కాని ఎప్పుడు  చూడలేదు కద ఈ ట్రిప్ లో అది కూడా కవర్ చేద్దాం అని మరింత ఉత్సాహం తో చెన్నై-హైద్రాబాద్ వెళ్ళే ట్రైన్ ఎక్కాను .. ఆ ట్రైన్ ఫస్ట్ స్టాప్  సూళ్ళుర్ పేట కావడం తో మన స్టేజి కోసం ఎదురుచూపులు చూడకుండా ప్రశాంతంగా కూర్చున్నాను .

రెండు రోజులే పక్షులు ఉంటాయ ?
నిజానికి ఆ పక్షులు సెప్టెంబర్ నెలలోనే వస్తాయట, అవి మార్చ్ వరకు ఇక్కడే ఉంటాయ్. అలాని ముందే తెలిస్తే  ప్రశాంతంగా పండగ వెళ్ళిన తరువాత వచ్చేవాణ్ణి కాదా అనుకున్నాను. విషయం ఏమిటంటే వీళ్ళు ప్రతి జనవరి నెలలో ఏదో 3 రోజులు(ఈ సంవత్సరం 2 రోజులే చేశారు) కార్యక్రమాలు నిర్వహించి , నాలాంటి పక్షి ప్రేమికులకు ఆహ్వానిస్తారన్న మాట. . ఇది ఏదో బాగానే ఉంది అనుకున్నాను . సూళ్ళూరు  పేట రైల్వే స్టేషన్ దగ్గరలో పెద్ద గ్రౌండ్ ఉంది ఇది కాలేజీ గ్రౌండ్ అనిచెప్పారు. మనవాళ్ళు ఆ గ్రౌండ్ లో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.


 గ్రౌండ్
ఈ గ్రౌండ్  లో  మనల్ని బాగా ఆకట్టుకొనేది ఉద్యాన శాఖ వారి ఫల మరియు పుష్ప ప్రదర్శన ..


 నిజానికి ఇంత ఖాళిగా ఉండదు .. రాత్రి ఫొటొ తీయడానికి వీలులేక ఉదయాన్నే వెళ్లి .. బ్రతిమిలాడి వారి అనుమతి తీసుకుని ఇలా ఫొటొలు తీశాను.





 వీటిని గమనించారా..? మనవాళ్ళే చక్కగా చెక్కారు, నేను వాటిని ప్లాస్టిక్‌వి  అనుకున్నాను.. 






దీని తరువాత స్థానం మాత్రం .. శ్రీహరి కోట వారిదే .. వారు ఉపగ్రహాలను ఎలా పైకి పంపుతారు.. అవి అక్కడ ఎలా ఉంటాయ్.. ఒకటి ఏమిటి మనం అడగాలే కాని అన్ని వివరంగా చెప్తున్నారు.






పశుసంవర్ధక శాఖ వారు కూడా .. ఇదిగో ఇలా రెడీ అయ్యారు



 ఇంకా చాలా స్టాల్స్లు పెట్టారు అక్కడ ..

ఆ రోజు రాత్రి మాత్రం చాల కాలం తరువాత గోల చేస్తూ ఎంజాయ్ చేశాను..



 చాల కార్యక్రమాలు జరిగాయ్..



 సంగీత దర్శకులు  కోటి గారి కార్యక్రమం ఆ రోజు లేట్ గా స్టార్ట్ అయినప్పటికి అందరు బాగా ఎంజాయ్ చేశారు




 పక్షలు ఎక్కడ ఉంటాయ్ ?
సూళ్ళూరు  పేట (Sulloru peta) బస్సు స్టాండ్ నుంచి 30 నిముషాలు బస్సు లో ప్రయాణిస్తే పక్షులు ఉన్న ప్లేస్ కి మనం వెళ్ళవచ్చు. నాకు ఆహ్వానం అందింది కాబట్టి బస్సు టికెట్ కూడా డబ్బులు తీసుకోలేదు :) . బస్సు  నేలపట్టు (Nelapattu) కి వెళ్తుంది .
బస్సు దిగిన తరువాత 15 నిమిషాల నడిచి లోపాలకి వెళ్ళాలి . అశోకుడు చెప్పినట్టు వెళ్ళేదారిలో రోడ్ కి ఇరువైపులా చెట్లు ఉంటాయ్  





.దారి మద్యలో జింకల పార్క్ కూడా కనిపిస్తుంది. జింకలు ఎక్కువ ఉండవ్ అనుకోండి అది వేరే సంగతి  , మనం చుడవాల్సింది పక్షులను కదా అని మనం వాటిని చూడకుండానే ముందుకు సాగుతాం. 


 పక్షులను చూడటానికి ముందే మనవాళ్ళు మనకోసం వాటర్ పాకెట్ లు సిద్దం చేసి ఉంచుతారు, వీటితో పాటు పక్షులను గురించి వివరిస్తూ ఒక వీడియో డాకుమెంటరీ కూడా చూపిస్తారు. 


మీకు ఇక్కడ  ఒక ఆశ్చర్య కరమైన విషయం  చెప్పాలి అది ఏమిటంటే .. ఈ పక్షులు ఎక్కడో రష్యా నుంచి వస్తాయని  మనకి తెలిసిన విషయమే కాని .. తెలియంది ఏమిటంటే .. అవి ఒకేసారి అన్ని కలిసిరవంటా.. ముందుగా 15 -20 సీనియర్ పక్షులు వచ్చి ఇక్కడ వాతావరణం & ఆహారం ఎలాఉందో చూసి బాగుంటే వెళ్లి మిగతావాటిని కూడా తీసుకుని వస్తాయ్ అంట. 

వచ్చాక చూద్దాం లే అని ముందుకు నడిస్తే 5 నిమషాల  నడిచాక దూరంగా చెరువు లో మొదలు నిటమునిగి కొమ్మలు నిళ్ళపైన ఉన్న చెట్లమిద రకరకాల పక్షులు మనకి కనిపిస్తాయి.

 అవి ఎక్కడ నుంచి వచ్చాయి , అవి ఏమి తింటాయి , అవి ఏ జాతి అని చెప్పడానికి ఎక్కడిక్కడ నాలాంటి యంగ్ కుర్రవాళ్ళు అక్కడే ఉంటారు :) . దూరంగా ఉన్న పక్షులు మీకు కనిపించకపోతే మీరు చూడటానికి వీలుగా ఈ క్రింద ఫోటో లో చూస్తున్నారుగా . .. అవి ఫ్రీగా నే ఇస్తారుమీకు.



సమయం 10 దాటినా తరువాత నుంచి పక్షుల అల్లరి (చప్పుడు) పెరుగుతుంది. చుట్టూ చెట్లమధ్య పక్షుల చేస్తున్న చప్పుడు వింటూ.. చుట్టూ ఉన్న పచ్చటి పోలలమధ్యలోంచి  చల్లటి గాలి వీస్తూ ఉంటె కొత్తప్రదేశాన్ని చూస్తూ. .. చెప్పడం కాన్నా ....

అంత దూరం నుంచి ఈ పక్షులు ఎలావచ్చాయో .. రావడానికి ఎంత కష్టపడి ఉంటాయో కదా .. రష్యా నుంచి ఇక్కడకి రావడం అంటే మాటల .. నేను ఇప్పడికి వచ్చాను వీటిని చూడటానికి అనుకుంటూ ప్రేమగా వాటివైపు చూస్తూ ఉంటే.. ఆ అనుభూతి ఎలా వర్ణిస్తాం.. అనుభవించవల్సిందే..


 పులికాట్ సరస్సు:    Pulicat lake

నేలపట్టు  నుంచి సూళ్ళుర్ పేట బస్సు స్టాండ్ వద్దకు వచ్చి అక్కడ నుంచి 30 నిముషాలు ప్రయాణం చేయాలి . సూళ్ళుర్ పేట నుంచి నేలపట్టు కు ఫ్రీ బస్సు లు ఉన్నాయ్ కాదా , నేలపట్టు లో తిరిగి  అవే బస్సు ఎక్కితే ఏకంగా పులికాట్ వద్దకు తీసుకువెళ్తాయి, ప్రతి సంవత్సరం బస్సు ఛార్జ్ తక్కువ తీసుకునే వాళ్ళు కాని నేను వెళ్ళడం వల్ల కాబోలు ఈ సంవత్సరం అన్ని ఫ్రీ నే :) , నేలపట్టు దగ్గర నాకు పక్షులు ఏమి కనిపించలేదు ,అక్కడ బొట్టింగ్ మాత్రమే . బొట్టింగ్ మాత్రం చాల బాగుంది రామేశ్వరం వెళ్ళిన రోజులు గుర్తుకు వచ్చాయ్ నాకు .  


 మీకు వీలు కుదిరితే నెక్స్ట్ ఇయర్ ఒక రౌండ్ వేసిరండి.
అన్నట్టు సూళ్ళూరు పేటలూ, కోవెలలో "అనేక దేవ దేవతా మూర్తులు
ఒక చెట్టు పైన" సాక్షాత్కరించిన అద్భుత దృశ్యాన్ని,
ఆ తరువు "పవిత్రమైన దేవతా వృక్షము"గా అర్చనలు అందుకుంటూన్నది.
 






****మీ కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తేలియచేయండి ****